ఫ్లాప్‌ హీరోకి చాన్స్‌ ఇస్తున్నాడు! | Raj Tarun Next Movie With Director Krishna Reddy | Sakshi
Sakshi News home page

ఫ్లాప్‌ హీరోకి చాన్స్‌ ఇస్తున్నాడు!

Published Tue, Mar 5 2019 1:31 PM | Last Updated on Tue, Mar 5 2019 5:55 PM

Raj Tarun Next Movie With Director Krishna Reddy - Sakshi

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్‌ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ తరువాత ఆ ఫాం కంటిన్యూ చేయలేకపోయాడు. ఇటీవల ఈ యంగ్ హీరో చేసిన సినిమాలన్ని బోల్తా పడటంతో కెరీర్‌ కష్టాల్లో పడింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజ్‌ తరుణ్‌ తరువాత మరో సినిమాతో రెడీ అవుతున్నాడు.

రాజ్‌ తరుణ్ చివరి చిత్రం లవర్‌ సినిమాను నిర్మించిన దిల్‌ రాజు ఈ యంగ్ హీరో మరో ఛాన్స్‌ ఇస్తున్నాడు. సుధీర్‌ బాబు హీరోగా ఆడు మగాడ్రా బుజ్జి సినిమాను తెరకెక్కించిన కృష్ణ రెడ్డి దర్శకత్వంలో రాజ్‌ తరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు నీది నాది ఒకటే లోకం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. మరి ఈ సినిమాతో అయిన రాజ్‌ తరుణ్‌కు సక్సెస్‌ దక్కుతుందేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement