
తక్కువ బడ్జెట్‌లో సినిమాను తీసి.. సంక్రాంతి బరిలో దింపి.. ఊహించని విజయాన్ని అందుకున్నారు దిల్ రాజు. గతేడాదిలో నిర్మించిన సినిమాలన్నీ బోల్తా కొట్టగా.. ఈ ఏడాది మాత్రం ప్రారంభంలోనే ‘ఎఫ్2’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను కొట్టారు. ఇకపై దిల్ రాజు చిన్న సినిమాలనే ఎక్కువగా నిర్మించాలనుకుంటున్నారని సమాచారం.
‘కుమారి 21ఎఫ్’ తరువాత ఆ స్థాయి హిట్ కొట్టలేక రాజ్‌తరుణ్ వెనుకబడిపోయాడు. ఈ హీరో సినిమాలు ఎప్పుడు వస్తున్నాయి.. ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియని పరిస్థితి. గతేడాది దిల్ రాజు నిర్మాతగా.. రాజ్ తరుణ్ హీరోగా ‘లవర్’ సినిమా వచ్చింది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఫేమ్ కృష్ణారెడ్డి చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన దిల్ రాజు ఈ మూవీలో హీరోగా రాజ్ తరుణ్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్‌కు సక్సెస్ లభిస్తుందో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment