రాజ్‌ తరుణ్‌ ‘ఇద్దరి లోకం ఒకటే’ | Raj Tarun Iddari Lokam Okate Telugu Movie Update | Sakshi
Sakshi News home page

రాజ్‌ తరుణ్‌ ‘ఇద్దరి లోకం ఒకటే’

Nov 30 2019 6:59 PM | Updated on Nov 30 2019 6:59 PM

Raj Tarun Iddari Lokam Okate Telugu Movie Update - Sakshi

రాజ్ తరుణ్-శాలిని పాండే జంటగా, జీ.ఆర్.కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’.  విభిన్న  ప్రేమ కథా చిత్రంగా రాబోతున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే మిక్కి జే మేయర్ సంగీతంలో వచ్చిన ఈ సినిమా పాటలు సూపర్ హిట్ కాగా, తాజాగా విడుదలైన పోస్టర్స్  ఈ సినిమా మీద అంచనాలు రోజు రోజుకి పెంచుతున్నాయి.

అంతే కాదు తక్కువ టైం లో అనుకున్న బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్ తోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారని, భారీ బడ్జెట్ కన్నా కథలో కంటెంట్ ముఖ్యం అనేలా సినిమా రూపొందించారని.. సినిమాపై నమ్మకంతో దిల్ రాజు సినిమాను సొంతంగా రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు లాంటి బిగ్ ప్రొడ్యూసర్ సొంతంగా సినిమా రిలీజ్ చేస్తున్నారంటేనే అర్థం అవుతుంది.. సినిమా ఎంత బాగా వచ్చిందో. దీన్ని బట్టి రాజ్ తరుణ్ ఖాతాలో మరో హిట్ పడడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీగా వున్నారు.  ఈ ప్రేమ కథ మంచి సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి మరి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement