ఆశీర్వదించి గెలిపించండి : ఎడ్మ
మాడ్గుల, న్యూస్‌లైన్: రైతులకు ఏ కష్టమొచ్చినా ముందుండి అండగా ఉంటానని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డిఅన్నారు. మాడ్గుల మండలంలోని నాగిళ్ల, కాట్రాంతండా, కొర్రతండా, గుడితండా, అన్నెబోయిన్‌పల్లి, అప్పారెడ్డిపల్లి, దోడ్లపహాడ్ గ్రామాల్లో శనివారం ఎడ్మ ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. స్థానికులు ఆయనను బ్యాండుమేళాలతో ఘనస్వాగతం పలికారు. తనను రెండు సార్లు మ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నీతి నిజాయితీతో పని చేశానని, రైతుల కరెంట్ కష్టాలు చూసి అత్యధికంగా సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయించి లోవోల్టేజీ సమస్యలను పూర్తిగా తగ్గించి రైతులకు తోడ్పాటు అందించానన్నారు.
జిల్లాలో 152 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారంలో ఉన్న వారు ఏ ఒక్కరిని ఆదుకోలేదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న ప్రతీ కుటుంబానికి తాము ఆర్థిక సహాయం అందించామని ఎడ్మ గుర్తు చేశారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో పేదల పొట్ట కొట్టారని, వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చాక ప్రతీపేదవాడి కన్నీళ్ళను తుడిచేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.బాబు వ్యవసాయం దండగ అంటే దాన్ని పండగలా మార్చిన ఘనత వైఎస్‌దేనన్నారు. హైద్రాబాద్‌లో ఉండి రూ.కోట్లు సంపాదించి స్థానిక సమస్యలపై ఎలాంటి అవగాహన లేని నేతలు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారన్నారు. నీ తి నిజాయితీతో ఎళ్లవేళలా తాను అండగా ఉంటాననీ...ఫ్యాను గుర్తుకు ఓటేసి తనను మరోసారి ఆశీర్వదించాలని కిష్టారెడ్డి వి/్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ వెంకటయ్యగౌ డ్, నాయకులు సత్తయ్యగౌడ్, రంజిత్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, వెంకట్‌నారాయణగౌడ్, ఆరోగ్యరెడ్డి, విక్రం, యాదగిరిగౌడ్, మర్రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
భారీగా చేరికలు..
కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలుగ్రామాల యువకులు, వివిధ వర్గాల వారు శనివారం ఎడ్మ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరి ఆయన తరఫున సుశిక్షుతులైన సైనికుల్లా పనిచేస్తామని ప్రతిన చేశారు. వారికి సాదరంగా పార్టీలోకి కిష్టారెడ్డి ఆహ్వానించారు. తన గెలుపునకు వారు గట్టి కృషిచేయాలని కోరారు. మహానేత వైఎస్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
రైతులకోసమే నేనున్నా
Published Sun, Apr 27 2014 3:59 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement