
డీఈవోకు పదోన్నతి
రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యమని మరోసారి రాష్ట్ర మంత్రి పి.నారాయణ రుజువు చేశారు
జాయింట్ డైరెక్టర్‌గా బదిలీ
రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యమని మరోసారి రాష్ట్ర మంత్రి పి.నారాయణ రుజువు చేశారు. లీజు పేరుతో కబ్జా చేసిన స్థలాన్ని కూడా వెనక్కితీసుకోకుండా అడ్డుపుల్ల వేయగలిగారు. కబ్జా చేసిన స్థలానికి కాపలాగా నిలబడ్డారు. ఓ కార్పొరేటు విద్యాసంస్థకు మేలు చేకూర్చారు. స్టీల్‌ప్లాంట్ భవిష్యత్ అవసరాలకై నిర్మిస్తున్న కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్–2 (కేబీఆర్–2) డిజైన్‌నే కాదు.. ఏకంగా దిశనే మార్చేశారు.
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డికి పదోన్నతి లభించింది. ఈయనకు ప్రాథమిక విద్యాశాఖ సంయుక్త సంచాలకుని (జేడీ)గా పదోన్నతి కల్పిస్తూ, రాజధాని అమరావతి (ఇబ్రహీంపట్నం)లో నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో డిప్యూటీ డీఈవోగా పనిచేస్తున్న ఆయన 2014 మే 11న డీఈవోగా పదోన్నతిపై విశాఖ వచ్చారు. అప్పట్నుంచి దాదాపు రెండు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఆయన డీఈవోగా విధులు నిర్వహించారు. ఇటీవల కాలంలో ఎక్కువ రోజులు డీఈవోగా పనిచేసింది ఈయనే. తన హయాంలో పదో తరగతిలో మంచి ఫలితాలు రావడానికి కృషి చేశారు.
2014లో 90.86 శాతం, 2015లో 91.76 శాతం, 2016లో 94.70 శాతం పదో తరగతిలో ఫలితాలు సాధించారు. జిల్లా విద్యాశాఖకు చినగదిలిలో రూ.కోటి 35 లక్షలతో ప్రత్యేకంగా భవనం ఏర్పాటుకు కృషి చేశారు. డీఎస్సీ 2014 నియామకాల్లో ఆరోపణలకు తావులేకుండా పూర్తి చేశారు. సోమవారం ఆయన డిప్యూటీ డీఈవో నాగమణికి చార్జి అప్పగించి విధుల నుంచి రిలీవ్ అయ్యారు. మంగళవారం జేడీగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన స్థానంలో ప్రభుత్వం ఇంకా ఎవరినీ నియమించలేదు.