Minister Narayan
-
అమ్మో... నారాయణ!
⇒నారాయణ విద్యా సంస్థల్లో వరుస దుర్ఘటనలు! ⇒క్రమ‘శిక్ష’ణలో రాలిపోతున్న విద్యాకుసుమాలు ⇒తాజాగా కడప విద్యార్థి ఆత్మహత్యాయత్నం ⇒లోపాలు సరిదిద్దుకోని యాజమాన్యం తిరుపతి రూరల్: మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల్లో వరుస దుర్ఘ్గటనలు కలవరపరస్తున్నాయి. క్లాస్‌కు ఆలస్యంగా వస్తున్నాడని....హోంవర్క్ సరిగా చేయలేదని, మార్కులు తక్కువగా వచ్చాయని, ఫీజులు సకాలంలో చెల్లించడం లేదని ..ఇలా వివిధ కారణాలతో వేధింపులెదురవుతున్నాయి. విద్యార్థులు తీవ్ర మానసిక వేదనతో నలిగిపోతున్నారనే ఆరోపణలున్నా యి. ఒత్తిడి..అవమానం భరించలేని కొందరు విద్యార్థులు బడి భవనాలపై నుంచే దూకేస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలే ఈ విషయాన్ని రుజువుచేస్తున్నాయి. కపీలతీర్థం వద్ద ఉన్న విద్యా సంస్థలో ఆలస్యంగా వచ్చాడని ఉపాధ్యాయుడు తిట్టడంతో ఓ విద్యార్థి ఇటీవల నాలుగు అంతస్తుల స్కూల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టడీ అవర్‌లో మార్కులు సరిగా రాలేదని వైస్ ప్రిన్సిపాల్ తిట్టడంతో కాలూరు క్రాస్‌లోని విద్యా సంస్థలో ఈనెల 14వ తేదీన అనంతపురానికి చెందిన సాయిచరణ్నాయక్ రెండు అంతస్తుల స్కూల్ భవనం పైనుంచి దూకి చనిపోయాడు. తాజాగా పరీక్ష సరిగా రాయలేదని మనస్థాపంతో కాలూరు క్రాస్‌లోని విద్యాసంస్థ భవనంపై నుంచి వైఎస్ఆర్ జిల్లా సంబేపల్లికి చెందిన వాసుదేవరెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కార్పొరేట్ కాసుల దాహానికి వీరంతా బలైపోతున్నారు. బిడ్డలను ఉన్నత చదువులను చదివించుకుందామన్న పేద, మధ్య తరగతి తల్లిదండ్రుల ఆశల్ని మొగ్గలోనే చిదిమేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల సంక్షేమం విస్మరించి కాసులే ధ్యేయంగా నడుపుతున్న నారాయణ విద్యా సంస్థలను మూసివేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే కరపత్రాలను పంపిణీ చేశాయి. తిరుపతి నారాయణ స్కూల్లో మొదటి అంతస్తు నుంచి దూకి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పదోతరగతి విద్యార్థి వాసుదేవ రెడ్డి -
నా కొడుకును చంపేశారు..
-
నా కొడుకును చంపేశారు..
• కార్పొరేట్ పాఠశాలల్లో ఎస్టీలు చదువుకోవడమే నేరమా..? • నారాయణ స్కూల్లో మృతి చెందిన విద్యార్థి తండ్రి ఆక్రోశం • స్కూల్ వద్ద విద్యార్థుల ఆందోళన, చితకబాదిన పోలీసులు • ధర్నాకు మద్దతు ప్రకటించిన వైఎస్సార్సీపీ, ఎస్టీ విద్యార్థి సంఘాల నేతలు • ఎస్వీ మెడికల్ కళాశాలలో ముగిసిన పోస్టుమార్టం ‘‘ నాన్నా.. అక్క ఎంబీబీఎస్ చదువుతోంది కదా.. నేను కూడా ఆ కోర్సులోనే చేరుతాను. మంచిడాక్టర్గా పేదలకు సేవలందిస్తాను. అదే నాలక్ష్యం అంటూ నిత్యం మాతో చెప్పేవాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఒక్కగానొక్క కొడుకు ఇలా మమ్మల్ని అర్ధాంతరంగా వదలి కాటికి వెళ్లిపోతాడనుకోలేదే.. ఇంక మాకు దిక్కెవరురా దేవుడా..’’ అంటూ నారాయణ స్కూల్లో మృతి చెందిన కొడుకును చూసి ఆ తండ్రి రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. తిరుపతి క్రైం, మెడికల్: కార్పొరేట్ స్కూళ్లలో విద్యార్థులపై వేధింపుల పరంపర కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే.. మున్సిపల్‌శాఖ> మంత్రి నారాయణకు తిరుపతి రూరల్, శ్రీనివాస మంగాపురం సమీపంలో ‘నారాయణ ఒలంపియాడ్ స్కూల్’ ఉంది. ఈ స్కూల్లో అనంతపురానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మోహన్ కృష్ణ కొడుకు సాయిచరణ్ నాయక్ (16) పదవ తరగతి చదువుతున్నాడు. చదువులో ఎంతో చురుగ్గా ఉండే సాయిచరణ్ ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి అనుమానాస్పదంగా సాయిచరణ్ నాయక్ మృతి చెందడం తల్లిదండ్రులతో పాటు విద్యార్థి లోకాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు అనంతపురం నుంచి హుటాహుటిన తిరుపతికి వచ్చిన ఆ తండ్రికి కళ్లముందు గాయాలతో జీవచ్ఛవంలా పడి ఉన్న కొడుకును చూసి షాక్‌కు గురయ్యాడు. తన బిడ్డను కుల వివక్షతోనే పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ పొట్టన పెట్టుకున్నాడంటూ స్విమ్స్ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగాడు. అంకుల్ మీ అబ్బాయిని మా వైస్ ప్రిన్సిపాల్ అంజిరెడ్డి సార్.. కర్రలు, రాడ్, చెప్పులతో కొట్టాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. రాత్రి ఫోన్లో నా బిడ్డతో మాట్లాడినప్పుడు కూడా నాన్నా నన్ను మా వైస్ ప్రిన్సిపాల్ కర్రలు, రాడ్లతో కొడుతున్నాడు, నావల్ల కావడం లేదు వచ్చి తీసుకెళ్లిపో.. అంటూ రోదించాడని బాధిత తండ్రి విలేకరుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు నారాయణ ఒలంపియాడ్ క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ అంజిరెడ్డి, అతని భార్య ఇద్దరు కలిసి ఒక్కసారిగా తనబిడ్డను చితకబాదినట్టు ఆరోపించారు. ఈ విషయంపై తనకు ఫోన్లో సమాచారం అందించడంతో.. మరోసారి దాడిచేసినట్లు చెప్పారు. తర్వాత రాత్రి 9.15 గంటలకు వైస్ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి మీ బిడ్డ కాలు జారి పడ్డాడు మీరు రండి అని చెప్పినట్టు తెలిపారు. తీరా తిరుపతికి వచ్చి చూస్తే తన బిడ్డ గాయాలతో మృతి చెంది ఉన్నాడని వాపోయారు. విద్యార్థుల ఆగ్రహం.. సహచర విద్యార్థి మృతిపై నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రోడ్డుపై వందలాది మంది విద్యార్థులు బైఠాయించి పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ధర్నాకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి, సురేష్ నాయక్, కిషోర్, నరేంద్ర, హేమంత్, మునికుమార్, ఎస్టీ విద్యార్థి విభాగం నాయకులు అక్కులప్ప నాయక్ మద్దతు పలికారు. వీరిని పోలీసులు ముంద జాగ్రత్తగా అరెస్టు చేసి, ఆపై విడుదల చేశారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మార్ పల్లి పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండళ్ల కాలం లో తిరుపతి నారాయణ కళాశాల, స్కూల్లో వేధింపులు తాళలేక ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. కాగా విద్యార్థి తండ్రి మోహన్‌కృష్ణ గతంలో సినీ హీరో బాలకృష్ణకు గన్‌మన్‌గా కొంతకాలం పనిచేసినట్లు సమాచారం. రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి - వైఎస్సార్సీపీ సాయి చరణ్ నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతప్ప నాయక్, శ్యామల, ఇమామ్, నరేంద్ర, బాలిశెట్టి కిశోర్, లక్ష్మీపతి, పెరుగు బాబూ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్విమ్స్ వద్ద ధర్నా చేశారు. మృతుడికి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నారాయణ విద్యాసంస్థ గుర్తింపు రద్దు చేసి, మంత్రి వర్గం నుంచి నారాయణను బర్తరఫ్ చేయాలన్నారు. వైస్ ప్రిన్సిపాల్ అంజిరెడ్డిపై కేసు నమోదు నారాయణ ఒలంపియాడ్ స్కూల్ వైస్ ప్రిన్సి పాల్ అంజిరెడ్డిపై ఎంఆర్‌పల్లి సీఐ మధు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ మాట్లాడుతూ సాయిచరణ్ నాయక్‌ను కొట్టి, ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు మృతుడి తండ్రి మోహన్‌కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కులం పేరుతో దూషించినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుని అరెస్టు చేస్తామని తెలిపారు. -
డీఈవోకు పదోన్నతి
జాయింట్ డైరెక్టర్‌గా బదిలీ రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యమని మరోసారి రాష్ట్ర మంత్రి పి.నారాయణ రుజువు చేశారు. లీజు పేరుతో కబ్జా చేసిన స్థలాన్ని కూడా వెనక్కితీసుకోకుండా అడ్డుపుల్ల వేయగలిగారు. కబ్జా చేసిన స్థలానికి కాపలాగా నిలబడ్డారు. ఓ కార్పొరేటు విద్యాసంస్థకు మేలు చేకూర్చారు. స్టీల్‌ప్లాంట్ భవిష్యత్ అవసరాలకై నిర్మిస్తున్న కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్–2 (కేబీఆర్–2) డిజైన్‌నే కాదు.. ఏకంగా దిశనే మార్చేశారు. విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డికి పదోన్నతి లభించింది. ఈయనకు ప్రాథమిక విద్యాశాఖ సంయుక్త సంచాలకుని (జేడీ)గా పదోన్నతి కల్పిస్తూ, రాజధాని అమరావతి (ఇబ్రహీంపట్నం)లో నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో డిప్యూటీ డీఈవోగా పనిచేస్తున్న ఆయన 2014 మే 11న డీఈవోగా పదోన్నతిపై విశాఖ వచ్చారు. అప్పట్నుంచి దాదాపు రెండు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఆయన డీఈవోగా విధులు నిర్వహించారు. ఇటీవల కాలంలో ఎక్కువ రోజులు డీఈవోగా పనిచేసింది ఈయనే. తన హయాంలో పదో తరగతిలో మంచి ఫలితాలు రావడానికి కృషి చేశారు. 2014లో 90.86 శాతం, 2015లో 91.76 శాతం, 2016లో 94.70 శాతం పదో తరగతిలో ఫలితాలు సాధించారు. జిల్లా విద్యాశాఖకు చినగదిలిలో రూ.కోటి 35 లక్షలతో ప్రత్యేకంగా భవనం ఏర్పాటుకు కృషి చేశారు. డీఎస్సీ 2014 నియామకాల్లో ఆరోపణలకు తావులేకుండా పూర్తి చేశారు. సోమవారం ఆయన డిప్యూటీ డీఈవో నాగమణికి చార్జి అప్పగించి విధుల నుంచి రిలీవ్ అయ్యారు. మంగళవారం జేడీగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన స్థానంలో ప్రభుత్వం ఇంకా ఎవరినీ నియమించలేదు. -
నారాయణ.. నారాయణ
కార్పొరేటుకే కొమ్ము కాసిన మంత్రి కబ్జా చేసిన స్థలానికి అండ సిఫార్సు చేస్తే.. స్టీల్‌ప్లాంట్ రిజర్వాయర్ డిజైన్ మార్చేశారు.. రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యమని మరోసారి రాష్ట్ర మంత్రి పి.నారాయణ రుజువు చేశారు. లీజు పేరుతో కబ్జా చేసిన స్థలాన్ని కూడా వెనక్కితీసుకోకుండా అడ్డుపుల్ల వేయగలిగారు. కబ్జా చేసిన స్థలానికి కాపలాగా నిలబడ్డారు. ఓ కార్పొరేటు విద్యాసంస్థకు మేలు చేకూర్చారు. స్టీల్‌ప్లాంట్ భవిష్యత్ అవసరాలకై నిర్మిస్తున్న కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్–2 (కేబీఆర్–2) డిజైన్‌నే కాదు.. ఏకంగా దిశనే మార్చేశారు. విశాఖపట్నం : స్టీల్‌ప్లాంట్‌కు ప్రస్తుతం 0.5 టీఎంసీల సామర్థ్యంతో కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. ఈ రిజర్వాయర్ 5 మీటర్ల లోతున 300 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించారు. ప్లాంట్‌ను విస్తరించిన నేపథ్యంలో ఈ రిజర్వాయర్ సామర్థ్యం సరిపోవడం లేదు. 2009లో మహానేత వైఎస్ హయాంలోనే ప్లాంట్ రిజర్వాయర్‌ను విస్తరించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న రిజర్వాయర్‌ను కనీసం ఒక టీఎంసీ సామరŠాథ్యనికి పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం 275 హెక్టార్లలో నిర్మించాలని ప్రతిపాదించారు. అప్పట్లో రూ.250 కోట్లతో అంచనాలు వేశారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదన చాన్నాళ్లు కార్యరూపం దాల్చలేదు. చివరకు అంచనాలు పెరుగుతూ చివరకు రూ.450 కోట్ల రివైజ్డ్ ఎస్టిమేట్స్‌ను 2014లో రూపొందించారు. 2015లో తలెత్తిన నీటి సంక్షోభంతో ఈ ప్రతిపాదనకు కదలిక వచ్చింది. 2016లో టెండర్లు పిలిచింది. సివిల్ పనులకు రూ.350 కోట్లు, మెకానికల్ పనులకు రూ.80 కోట్లతో కోడ్ చేసిన ఎల్అండ్ టీ సంస్థ ఈ టెండర్‌ను కైవసం చేసుకుంది. తొలుత రిజర్వాయర్ నిర్మాణం కోసం లక్షలు ఖర్చు చేసి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను కూడా రూపొందించారు. ఈ డీపీఆర్ ప్రకారం 275 హెక్టార్లలో రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదించారు. సంక్షోభం నాడు పట్టించుకోకుండా.. చరిత్రలో ముందెన్నడు లేని రీతిలో స్టీల్‌ప్లాంట్ గతేడాది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంది. 2015 డిసెంబర్లోనే ఏలేరులో నీటినిల్వలు అడుగంటిపోవడంతో కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో చుక్కనీరులేక ప్లాంట్‌లో సమస్య ఏర్పడింది. ఆ సమయంలో ప్లాంట్‌కు చెందిన స్థలాన్ని క్రీడా మైదానం కోసం ఇవ్వలేదనే సాకుతో సర్కార్ ప్లాంట్ వైపు కన్నెత్తి చూడలేదు. మంత్రి నారాయణ సమక్షంలోనే సీఎం చంద్రబాబు ఏకంగా ప్లాంట్ యాజమాన్యంపై నిప్పులు చెరిగారు. ఆనాడు ప్లాంట్‌కు అనుకూలంగా ఒక్క మాట మాట్లాడని మంత్రి నేడు ఓ కార్పొరేటు విద్యాసంస్థకు చెందిన స్థలం రిజర్వాయర్ విస్తరణలో పోతుంటే ముందుండి అడ్డుకున్నారు. క్రీడాస్థలం పేరిట కలిపేసుకున్నారు.. గతంలో ఇదే ప్రాంతంలో ప్లాంట్‌కు చెందిన స్థలంలో ఆల్ఫా విద్యాసంస్థలకు 20 సెంట్లు కేటాయించారు. దానిని కొన్నాళ్లు నిర్వహించిన ఆ యాజమాన్యం వేరొకరికి అప్పగించింది. అక్కడకు నెమ్మదిగా ప్రవేశించిన కార్పొరేటు విద్యాసంస్థ పాగా వేయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది. దీంతో ఉక్కు యాజమాన్యం ఆ విద్యాసంస్థకు 1.5 ఎకరాల భూమిని కేటాయించారు. తొలుత 33 ఏళ్లకు లీజుకివ్వగా..ఆ తర్వాత ఆ గడువును రాజకీయ పలుకుబడి ద్వారా 99 ఏళ్లకు పొడిగించుకున్నారు. చుట్టూ వేలాది ఎకరాలు ఖాళీగా ఉండడంతో ఎలాంటి పక్కా నిర్మాణాలు చేయబోమని స్పష్టమైన హామీనిచ్చి కొంత భూభాగాన్ని తమ లీజు స్థలంలో కలిపేసుకున్నారు. ఇది సుమారు 3 ఎకరాలకు పైగా ఉంటుందని అంచనా. తాజాగా రిజర్వాయర్ కోసం ప్రతిపాదించిన ప్రాంతంలో కార్పొరేటు విద్యాసంస్థ తమ లీజు స్థలంతో కలిపేసుకున్న క్రీడాస్థలం కూడా ఉంది. ఈ స్థలాన్ని రిజర్వాయర్‌లో కలపాల్సి ఉంది. అయితే కళాశాలకు కేటాయించిన స్థలాన్ని ఖాళీ చేయాలని స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఆ విద్యాసంస్థకు నోటీసులు కూడా జారీ చేసింది రిజర్వాయర్ పక్కన కళాశాల క్షేమమా? మంత్రి నారాయణ పలుకుబడితో రిజర్వాయర్ డిజైన్ మార్చినప్పటికి అక్కడ కళాశాల నిర్వహణ ఎంత వరకు భద్రత అనే అంశంపై చర్చ సాగుతుంది సుమారు 20 మీటర్లు లోతు, 0.5 టీఎంసీ సామర్ధ్యం కలిగిన రిజర్వాయర్ పక్కన ఉన్న భవనం ఎంత సురక్షితం అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి, అందులో కళాశాల నిర్వహిస్తే జరగబోయే పరిణామాలకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలించిన నారాయణ మంత్రాంగం ఏదో విధంగా ఈ స్థలం చేజారకుండా ఉండేందుకు మంత్రి నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. ఆ కార్పొరేటు విద్యాసంస్థకు మేలు చేకూర్చాలన్న తలంపుతో మంత్రి వెంటనే రంగంలోకి దిగారు. కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి అంటూ గతేడాది ప్లాంట్ యాజమాన్యం పలుమార్లు మొత్తుకున్నా పట్టించుకోని ఆయన అదే ప్లాంట్ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా వింటారో లేదోననే అనుమానంతో ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి జాతీయ స్థాయిలో కూడా ఒత్తిడి తెచ్చారు. చేసేది లేక యాజమాన్యం కూడా తలూపింది. ఆగమేఘాల మీద డిజైన్‌ను మార్చేసింది. దీంతో రిజర్వాయర్ దిశను మార్చాల్సి వచ్చింది. విద్యాసంస్థ అధీనంలో ఉన్న స్థలం జోలికి పోకుండా నారాయణ మంత్రాంగం ఫలించింది. -
‘నారాయణ’ కోసమే..
స్కావెంజర్స్ కాలనీ తొలగించి మంత్రి నారాయణ విద్యాసంస్థలు నెలకొల్పే కుట్ర భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ధర్నా ఆ కాలనీవాసుల జోలికొస్తే ప్రాణత్యాగాలకైనా సిద్ధం అక్కడే పట్టాలిచ్చిఇళ్లు నిర్మించి ఇవ్వాలి కార్మికులకు అండగా వైఎస్సార్సీపీ తిరుపతి సిటీ:‘‘దళితులు.. అందులోనూ పేదలే కదా పొమ్మంటే పోతారులే అని పారిశుద్ధ్య కార్మికుల ఇళ్లను ఖాళీ చేయించాలని చూస్తే ఖబడ్దార్’’ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు హెచ్చరించారు. తిరుపతి నగరం నడిబొడ్డున పారిశుద్ధ్య కార్మికులు నివాసాలుంటున్న స్కావెంజర్స్ కాలనీలో ఇళ్లను తొలగించి అక్కడ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థలను నెలకొల్పేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. స్కావెంజర్స్ కాలనీలోని కార్మికుల ఇళ్లను తొలగించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ వరప్రసాదరావు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కార్మికులతో కలిసి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు డంపింగ్ యార్డ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా కరుణాకర రెడ్డి మాట్లాడుతూ 4లక్షలమంది ప్రజలకు సంబంధించిన పారిశుధ్యాన్ని శుభ్రం చేసే కార్మికులు స్కావెంజర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారని చెప్పారు. ఐదున్నర ఎకరాల్లో సమారు 381మంది కార్మికుల కుటుంబాలు గత 60 సంవత్సరాలకు పైబడి నివాసం ఉంటున్నాయని చెప్పారు. మంత్రి నారాయణ ఈ స్థలాన్ని కబ్జా చేసి కాలేజీలను కట్టుకోవడానికి కార్మికులను తరిమిగొట్టే ప్రయత్నానికి పూనుకున్నారని పేర్కొన్నారు. ఇక్కడున్న కార్మికులకు నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికృత మాల వద్ద ఇళ్లు కట్టించి ఇస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం 36మందికి మాత్రమే అక్కడ 10 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో ఇరుకైన ఇళ్లను స్నానాల గదులు, మరుగుదొడ్లు లేకుండా నిర్మిస్తున్నారని తెలిపారు. అక్కడ నిర్మించే ఇళ్లలో ఇస్కా సమావేశానికి హాజరవుతున్న మంత్రి నారాయణ నిద్ర చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 5వ తేదీ లోగా కార్మికులంతా కాలనీని ఖాళీ చేయాలని మంత్రి నారాయణ చెప్పడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మంత్రి బెదిరింపులకు తాము భయపడేదిలేదని హెచ్చరించారు. కోట్లాది రూపాయలు సంపాదించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కట్టబెట్టి ప్రజల అమోదం లేకుండా నారాయణ మంత్రి అయ్యారని ఏద్దేవా కరుణాకర రెడ్డి చేశారు. మంత్రి నారాయణను దళిత, గిరిజనులు పిడికిళ్లు బిగించి తరిమి తరిమి కొడతారని చెప్పారు. కార్మికులకు ఇక్కడే ఇళ్లపట్టాలిచ్చి ఇళ్లు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం చేసేందుకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. న్యాయబద్ధంగా, శాంతియుతంగా తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి పోరాటాలు చేస్తామన్నారు. ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ స్కావెంజర్స్ కాలనీలో నిరుపేద దళిత, గిరిజన, బీసీ కుటుంబాలు నివాసం ఉంటున్నాయని చెప్పారు. ప్రభుత్వం చేతనైతే వెంటనే ప్రస్తుతం వారు ఉన్నచోటే వారందరికీ పట్టాలిచ్చి ఇళ్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అలాగే స్కావెంజర్స్ కాలనీ పేరును మార్పు చేయాలని ఇప్పటికే మున్సిపల్ కమిషనర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ ధర్నాలో పార్టీ నేతలు బోయనపాటి మమత, ఎస్కె.బాబు, పుల్లూరు అమరనాథరెడ్డి, కట్టా గోపీయాదవ్, టి.వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేంద్ర, మునిరామిరెడ్డి, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, గీతా, కుసుమ, సాయి, శ్యామల, శాంతారెడ్డి, నాగిరెడ్డి, మురళీయాదవ్, శివకుమార్, తాళ్లూరి ప్రసాద్, హనుమంత నాయక్, బాలిశెట్టి కిషోర్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. -
సర్వం నారాయణ మంత్రం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి నారాయణదే పెత్తనం కినుక వహించిన జిల్లా మంత్రి బొజ్జల ఎడతెగని పంతాలు, పట్టింపులు తేలని అభ్యర్థిత్వాలు తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో ఇన్చార్జి మంత్రి నారాయణ, జిల్లాకు చెందిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మధ్య విభేదాలు పొడచూపుతున్నాయా? సీట్ల కేటారుుంపులో ఇద్దరూ పట్టింపులకు పోతున్నారా? ఎన్నికల భారాన్ని మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురపాలక మంత్రి నారాయణకు అప్పగించడంతో బొజ్జల కినుక వహించారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నారుు. చిత్తూరు, సాక్షి: తూర్పు రాయలసీమ ఎమ్మె ల్సీ ఎన్నికలకు సంబంధించి సభ్యత్వ నమోదు పూర్తరుుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. వామపక్ష అభ్యర్థులు మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారు. నారాయణే చూసుకుంటారులే.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే అంశంపై జిల్లా టీడీపీలో గందరగోళం నెలకొంది. జిల్లాకు చెందిన మంత్రిని, తనను సంప్రదించకుండా అభ్యర్థుల పేర్లను ఎలా పరిశీలిస్తారంటూ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కినుక వహించారని సమాచారం. ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత సీఎం తనపై ఉంచారని, అందుకే తాను గెలుపు గుర్రాలను ఎంచుకుంటానని మంత్రి నారాయణ అంటున్నారని సమాచారం. కొన్ని రోజుల క్రితం జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం. ఎన్నికల ఏరా ట్లు ఎలా ఉన్నాయని అధిష్ఠానానికి దగ్గరగా మెలిగే ఓ నాయకుడు మంత్రి బొజ్జలను అడగ్గా..’ ఎన్నికలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారాయణ భుజస్కంధాలపై ఉంచారుగా ఆయనే చూసుకుంటారు’లే అని ఎద్దేవా చేసినట్లు ఆ పార్టీ నాయకులే పేర్కొన్నారు. అభ్యర్థిత్వం ఎవరికో ? అభ్యర్థులను ఖరారు చేయడంలో టీడీపీ తర్జనభర్జనలు పడుతోంది. మంత్రుల భేదాభిప్రాయాలు అభ్యర్థుల ఎంపికలో జాప్యానికి కారణమవుతోందని టీడీపీ నా యకులు అంటున్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల అభ్యర్థిత్వాల్లో ఒకటి ’రెడ్డి’ సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఉపాధ్యాయులు, యువతలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటంతో గెలుపు సులభంకాదని పోటీకి అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సాకం నాగరాజు పేరు పరిశీలనలో ఉంది. ఆయన మాత్రం వేచి చూసే ధోరణితో ఉన్నారు. పట్టభద్రుల స్థానానికి రెండు సార్లు పోటీచేసి ఓడిపోరుున దేశారుుశెట్టి హనుమంత రావుకు టికెట్ ఆశిస్తున్నారు. మంత్రి నారాయణ పట్టభద్రుల స్థానానికి తనకు అత్యంత ఆప్తుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సాకం ఒప్పుకోకపోతే పట్టాభిని ఉపాధ్యాయ స్థానానికి, దేశారుు శెట్టిని పట్టభద్రుల స్థానానికి అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది. -
మంత్రి ఓఎస్డీగా చల్లా ఓబులేసు
అనంతపురం న్యూసిటీ: అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేసిన చల్లా ఓబులేసు పురపాలకశాఖ మంత్రి నారాయణ ఓఎస్డీగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం జీఓ 620 విడుదల చేసింది. చల్లా ఓబులేసు ఈ నెల 6వతేదీ నుంచి దీర్ఘకాలిక సెలవులో ఉన్న విషయం విదితమే. మరో నాలుగు రోజుల్లో ఓఎస్డీ బాధ్యతలు చేప ట్టనున్నట్లు చల్లా ఓబులేసు ‘సాక్షి’కి తెలిపారు. -
జనవరి నుంచి ‘ రాజధాని’ పనులు
డిసెంబర్ ఆఖరుకు డిజైన్లు పూర్తి: నారాయణ సాక్షి, అమరావతి బ్యూరో: వచ్చే జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు మున్సిపల్ మంత్రి పి.నారాయణ చెప్పారు. డిసెంబర్ చివరినాటికి డిజైన్లు పూర్తవుతాయన్నారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే వారం నుంచి తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన ప్రారంభం అవుతుందని తెలిపారు. సచివాలయం పరిధిలోని 49 ఎకరాల విస్తీర్ణంలో గ్రీనరీ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఆ పనులను మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. వచ్చే శుక్రవారం నుంచి ఎనిమిది గ్రామాల రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. -
అక్టోబర్‌లో.. తిరుపతి సమరం!
తిరుపతి తుడా : తిరుపతి కార్పొరేషన్‌కు అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు, పురపాలికశాఖా మంత్రి నారాయణ సూచనప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాల యంలో మంగళవారం రాష్ట్రంలోని గ్రేటర్ విశాఖతోపాటు అన్ని మున్సిపల్, కార్పొరేషన్ల కమిషనర్లతో సీఎం, మంత్రి వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో నాలుగేళ్లకు పైగా ఎన్నికలు జరగకుండా పలు సమస్యలతో పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై సుదీర్ఘంగా చర్చిం చినట్లు తెలిసింది. ఆయా మున్సిపాలిటీల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ గ్రేటర్ విశాఖతోపాటు పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఇదేమాట చెప్పడంతో ఎన్నికలు అక్టోబర్‌లో తధ్యమని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక కార్పొరేషన్ అధికారులు ఎన్నికల నగరాకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అన్ని రంగాల్లో వ్యతిరేకత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుతం ఎన్నికల్లో నిర్వహిస్తే అన్నివర్గాల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేసినట్టు సమాచారం. రీజనల్ డెరైక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను విజయవాడకు పిలిపించుకున్న ముఖ్యమంత్రి ప్రధానంగా ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపైనే సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. అధికారులు ఏం చెప్పలేక నీళ్లు నమిలినా.. చివరకు చెప్పక తప్పని పరిస్థితిలో రుణమాఫీలు, నిరుద్యోగభృతి, ఇతర సంక్షేమ పథకాల అమలు తీరుపై జనం మండిపోతున్నారని తెలిపారని సమాచారం. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలతో పాటు, బలిజ, కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెప్పుకొచ్చారని తెలిసింది. అయితే ఎన్నికలు నిర్వహించకుంటే అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయనీ, అందువల్ల ఎన్నికలు పోవాల్సిందేనని చెప్పినట్లు తెలుస్తోంది. -
ఆనం కుటుంబానికి ఆత్మకూరు, నెల్లూరు
► పార్టీ బలపడాలంటే తప్పదని మంత్రి నారాయణ ప్రతిపాదన ► చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ► జిల్లా టీడీపీపై మంత్రి ఆధిపత్యం ► మండిపడుతున్న పార్టీ సీనియర్లు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల బాధ్యతలు ఆనం కుటుంబానికి అప్పగించడానికి తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంది. నెల్లూరురూరల్ నియోజకవర్గం బాధ్యతలు మంత్రి నారాయణకు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రెండు నియోజకవర్గాల మార్పులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బల హీన పరచడం కోసం రెండేళ్లుగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా టీడీపీకి ఉపయోగం లేకుండా పోయింది. మండల, గ్రామ స్థాయి నాయకులను సైతం ప్రలోభాలకు గురి చేసి తమ వైపు తిప్పుకుంటున్నా ఆశించిన ఫలి తం కనిపించడం లేదు. అధికారం చేప ట్టి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పార్టీ ని గాడిన పెట్టలేక పోవడంపై చంద్రబాబు నాయు డు ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. జిల్లాలో పార్టీని పటిష్ట పరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కువ సమయం కేటాయించాలని మంత్రి నారాయణను ఆదేశించారు.ఇందులో భాగంగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నారాయణ తన భుజానికెత్తుకోవడానికి సిద్ధపడ్డారు. ఆత్మకూరుకు రామనారాయణరెడ్డిఆత్మకూరులో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పార్టీని బలంగా తయారు చేయడంలో వెనుక పడుతున్నామని చంద్రబాబు అసహనంగా ఉన్నారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు బాధ్యతలు అప్పగించే ఆలోచనతోనే ఆయన్ను పార్టీలోకి తీసుకున్నారు. ఆత్మకూరు మీద దృష్టి పెట్టి పనిచేయాలని రామనారాయణరెడ్డికి చంద్రబాబు సూచించారు. అయితే రామనారాయణరెడ్డి పెత్తనాన్ని ఆ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ గూటూరు కన్నబాబు వ్యతిరేకిస్తున్నారు. పార్టీకోసం మొదటి నుంచి పనిచేసిన వారికి కాకుండా అవసరాల కోసం పార్టీలు మారిన వారికి బాధ్యతలు ఇస్తే తామెలా పనిచేస్తామని అంతర్గత చర్చల్లో ఆయన తన మనసులోని ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. అధికారికంగా బాధ్యతలు ఇవ్వనందువల్ల రామనారాయణరెడ్డి ఆ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు. నియోజకవర్గంలో తన మద్దతుదారుల వ్యక్తిగత కార్యక్రమాలకు మాత్రం అడపా దడపా హాజరవుతున్నారు. రామనారాయణరెడ్డితో పాటు కాంగ్రెస్ నుంచి టీడీపీలోచేరిన ఆయన మద్దతు దారులు సైతం టీడీపీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదు. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ఇక మూడేళ్లే సమయం ఉన్నందువల్ల పార్టీని బలంగా తయారు చేసుకోవడం కోసం రామనారాయణరెడ్డికి అధికారింకగా బాధ్యతలు అప్పగిద్దామని చంద్రబాబుకు మంత్రి నారాయణ సూచించారని విశ్వసనీయంగా తెలిసింది. త్వరలోనే ఈ పని కానివ్వాలని, ఆలోపు కన్నబాబును కూడా కూర్చోబెట్టి ఇద్దరు కలిసి పనిచేసేలా సర్దుబాటు చేయాలని నారాయణను చంద్రబాబు ఆదేశించారు. -
మా కొంపలు కూల్చొద్దు
మంత్రి వద్ద గోడు వెల్లబోసుకున్న మహిళలు విజయవాడ సెంట్రల్/ పూర్ణానందంపేట : ‘మా కొంపలు కూల్చి రోడ్డున పడేయొద్దయ్యా’ అంటూ పాతరాజ రాజేశ్వరిపేట మహిళలకు మంత్రి పి.నారాయణ వద్ద వాపోయారు. కార్పొరేటర్ అల్లు జయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రిని కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు. ఈ నెలాఖరు లోపు ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా రైల్వే అధికారులు 1,700 మందికి నోటీసులు జారీ చేశారని షేక్ ఖుర్షీదా, వైజయంతిమాల తదితరులు మంత్రి పి.నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. 40 ఏళ్ళుగా అక్కడే ఉంటున్నామన్నారు. ఆస్థలం తమదంటూ నోటీసులు జారీ చేసిన రైల్వే అధికారులు ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారని వివరించారు. ఈ సమస్యను ఎంపీ కేశినేని నాని దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. జక్కంపూడిలో జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల పంపిణీ పూర్తయిపోయిందని, ఇప్పుడు తాము ఉంటున్న ఇళ్లను ఖాళీ చేస్తే రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రైల్వే అధికారులతో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. -
మంత్రి వస్తున్నారంటూ నీరు వృధా
ప్రజలు తాగు నీరు లేక అల్లాడుతుంటే.. మంత్రి పర్యటన పేరిట అధికారులు ఐదు ట్యాంకర్ల నీరు నేలపాలు చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మునిసిపాలిటీలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పురపాలక మంత్రి నారాయణ శుక్రవారం గిద్దలూరులో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మంత్రి పర్యటించే సమయంలో రోడ్డు పై దుమ్ము పైకి లేవకుండా ఉండాలని అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మునిసిపల్ సిబ్బంది ఏకంగా ఐదు ట్యాంకర్ల నీరు రోడ్డు మీద పోశారు. సిబ్బంది చర్యల పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్త చేశారు. ప్రజలకు తాగు నీరు లేక ఇబ్బంది పడుతుంటే ఇదేం పని అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు
శిక్షణ మాత్రమే ఇస్తామని చెప్పాం: మంత్రి నారాయణ సాక్షి, హైదరాబాద్: రాజధానికోసం భూములిచ్చిన రైతులు, కౌలురైతులు, నిర్వాసితుల కుటుంబాలకు ఇంటికొక ఉద్యోగమిస్తామని ఊరూరా తిరిగి చెప్పిన పురపాలక మంత్రి నారాయణ ఇప్పుడు మాటమార్చారు. మంగళవారం అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడుతూ ఇంటికొక ఉద్యోగం ఇస్తామని తాము చెప్పలేదన్నారు. తాము శిక్షణ మాత్రమే ఇస్తామని చెప్పామన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), ఉప్పులేటి కల్పన, కొడాలి వెంకటేశ్వరరావు తదితరులు ప్రశ్నోత్తరాల సమయంలో ఇంటికొక ఉద్యోగంపై ప్రశ్నించారు. మంత్రి సమాధానమిస్తూ... ప్రతి కుటుంబానికి ఉద్యోగం మినహా మిగిలిన అన్నింటినీ సమకూర్చడానికి తాము హామీ ఇచ్చామని చెప్పారు. సీఆర్డీఏ క్లాజులో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పామన్నారు. రాజధాని ప్రాంత రైతులను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెచ్చగొడుతున్నారంటూ ఊగిపోయారు. -
ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు
ఉద్యోగాల కల్పనపై రివర్స్ గేర్ అసెంబ్లీ సాక్షిగా ప్లేటు ఫిరాయించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదంటూ మాట మార్పు నిరుద్యోగుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం మద్దిరాల గ్రామంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో ఉన్న రాజధాని ప్రాంత నిరుద్యోగ యువతతో మాట్లాడుతున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (ఫైల్) విజయవాడ బ్యూరో : రాజధాని యువతకు బోలెడు ఉద్యోగాలిప్పిస్తామని ఊదరగొట్టిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. భూ సమీకరణ సమయంలో ఇంటింటికీ తిరిగి నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామన్న ఆయన ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము చెప్పలేదని సోమవారం నిండు శాసనసభలో చేతులెత్తేశారు. ప్రపంచస్థాయి శిక్షణ అంటూ మాటలు కోటలు దాటేలా ప్రకటనలు చేశారు. నైపుణ్య శిక్షణ, జాబ్‌మేళాల పేరుతో హడావుడి చేశారు. ఇదంతా నిజమేనని నమ్మి ఉన్న ఉద్యోగాలు కూడా వదిలేసుకుని వచ్చిన కొందరు ఇప్పుడు ఏదీ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల నుంచి రాజధాని నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ సూచనల మేరకు పనిచేసిన సీఆర్డీఏ అధికారులు నిరుద్యోగులకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నారు. సీఆర్డీఏను నడిపించే అమాత్యుడు అసెంబ్లీలో చేసిన బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలు నిరుద్యోగుల్లో మరింత ఆగ్రహాన్ని రగిల్చాయి. -
అనుకున్న సమయానికే తాత్కాలిక సచివాలయం
మంత్రి నారాయణ వెల్లడి తుళ్లూరు : ఎల్అండ్టీ సంస్థ, షాపోజీ పల్లోంజి సంస్థలు నిర్విరామంగా శ్రమిస్తూ తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. వెలగపూడిలో జరుగుతున్న సచివాలయ నిర్మాణ పనులను శుక్రవారం నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలిసి ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ అత్యవసరంగా నిర్మించేందుకు గానూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. మూడు నెలల్లో సచివాలయం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఒప్పందం ప్రకారం అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి పనులు పూర్తిచేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఇప్పటికే కొన్ని రోజుల వ్యవధిలోనే భూమి లోపల నిర్మాణాలు పూర్తిచేశారని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంస్థలు పనులను పరిశీలించేందుకు రెండు, మూడురోజులకోసారి వచ్చి వెళ్తున్నాయని, ముఖ్యమంత్రి రావాల్సి ఉండగా, అత్యవసర కారణాలతో రాలేకపోయారన్నారు. మంత్రి వెంట మాజీమంత్రి గల్లా అరుణకుమారి, గ్రంథి చిరంజీవి, బెజవాడ నరేంద్ర, దండమూడి మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
లంక లంకకో రావణుడు
ఆదిలోనే లంక, అసైన్డు భూములపై కన్నేసిన పచ్చ గద్దలు ఆనాడు రావణాసురుడు సీతమ్మను చెరబట్టే ప్రయత్నం చేస్తే.. ఈనాటి రావణాసురులు భూమాతపై కన్నేశారు. కృష్ణా నదిలోని లంకలన్నింటినీ స్వాధీనం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాజధాని భూసమీకరణ పరిధి నుంచి ఏకంగా లంకలను తప్పించేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం ఆ భూములను లాక్కుంటుందంటూ బడుగులను భయపెట్టారు. దళిత పేద రైతులను దిక్కుతోచని దుస్థితిలో కూరుకుపోయేలా చేశారు. ఈ సమయంలో పచ్చ రాబందులు లంకలపై వాలాయి. ఎకరం కనిష్టంగా రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.35 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. అస్మదీయుల భూదోపిడీ ముగిశాక లంక భూములను సమీకరిస్తున్నట్లు.. పరిహారం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. నోటిఫికేషన్లో తప్పించేశారు! రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల పరిధిలో 13 లంకలు ఉన్నాయి. ఈ లంకల్లో 574.93 ఎకరాలు అసైన్డు భూమి కాగా 1,584.24 ఎకరాలు లంక భూమి. మొత్తం 2159.17 ఎకరాలను 1954 నుంచి 1976 వరకూ ప్రభుత్వం దళిత పేద రైతులకు 77 సెంట్ల నుంచి ఎకరం లోపు పంపిణీ చేస్తూ వచ్చింది. ఆ భూములను దళిత పేద రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో భూసమీకరణకు జనవరి 1, 2015న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో పట్టా, అసైన్డు భూములను మాత్రమే సమీకరిస్తున్నట్లు పేర్కొంది. లంక భూముల ప్రస్తావన ఆ ఉత్తర్వుల్లో కన్పించకుండా సీఎం చంద్రబాబునాయుడు చక్రం తిప్పారు. లంకల్లో రాబందులు రాజధాని భూసమీకరణ సమయంలో మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావులు మూణ్నెళ్లపాటు తిష్ట వేసి.. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రధానంగా లంక భూములు ఎంత ఉన్నాయన్నది ఆరా తీశారు. భూసమీకరణ ఉత్తర్వులు, నోటిఫికేషన్లో లంక భూములను చేర్చని వైనాన్ని అనుచరుల వద్ద ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా ఆ భూములను లాక్కుంటుందంటూ వాటి లబ్ధిదారులను బెదరగొట్టాలని సూచించారు. దాంతో 13 గ్రామాల్లోనూ తిష్ట వేసిన మంత్రుల అనుచరులు.. లంక భూములు సాగుచేసుకుంటోన్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి బెదరగొట్టారు. ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటే బతకలేమని ఆందోళన చెందిన లబ్ధిదారులు.. ఆ భూములను తెగనమ్మేయడానికి సిద్ధపడ్డారు. ఇదే అంశాన్ని మంత్రులకు వారి అనుచరులు చేరవేశారు. దాంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్లను రంగంలోకి దించి.. ఒక్కో లంకలో ఒక్కొక్కరు చొప్పున భూములు కొనుగోలు చేశారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం లంకల్లో సీఎం తనయుడు లోకేష్, మంత్రి ప్రత్తి పాటి, తాళ్లాయపాలెం, వెంకట పాలెం లంకల్లో మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, మరో మంత్రి ప్రత్తిపాటి, రాయపూడి లంకల్లో మంత్రి నారాయణ, మందడం, ఉండవల్లి లంకల్లో హిందూపురం ఎమ్మెల్యే, బాలకృష్ణ వియ్యంకుడు భూములను కొనుగోలు చేశారని ఆ లంకలకు చెందిన దళిత పేద రైతులు ‘సాక్షి’కి చెప్పారు. ఒక్క మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాత్రమే తన బినామీ గుమ్మడి సురేష్ పేరుతో 96.4 ఎకరాల లంక భూములను కొనుగోలు చేశారు. ఇందులో వెంకటపాలెం లంకలో 1.01 ఎకరాల కొనుగోలు చేసిన భూమిని మాత్రమే మంగళగిరి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తక్కిన భూములను రిజిస్టర్ చేయడానికి అధికారులు నిరాకరించడంతో.. అగ్రిమెంట్లు చేసుకున్నారు. మిగతా మంత్రులు కూడా లంక భూములను కొనుగోలు చేసినట్లు లబ్ధిదారులతో ఒప్పందాలు మాత్రమే చేసుకోవడం గమనార్హం. దళిత నిరుపేద రైతుల నుంచి లంక భూములు కొన్న పచ్చ గద్దలు.. సంబంధిత రైతుల నుంచి పట్టాదారు పాసుపుస్తకాలు, అసైన్మెంట్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన పత్రాలతోసహా ఆ భూములకు సంబంధించిన అన్ని ఆధారాలను ముందు జాగ్రత్తగా స్వాధీనం చేసుకోవడం గమనార్హం. రూ.2,500 కోట్లకుపైగా దోపిడీ చంద్రబాబు తనయుడు, టీడీపీ నేతలు లంక భూములను కొనుగోలు చేశాక తొలి విడతగా రాయపూడి గ్రామ పరిధిలోని ఆరు లంకల్లో 1093 ఎకరాలు, ఉండవల్లి లంకలో 162.50 ఎకరాల సమీకరణకు డిసెంబరు 6న నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ.. సర్వే నెంబర్లు, రైతుల వారీగా నోటిఫికేషన్ జారీ చేస్తే.. టీడీపీ నేతల భూదోపిడీ అధికారికంగా బహిర్గతమవుతుందనే భయంతో నామమాత్రపు నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. ఇది నిబంధనలకు విరుద్ధమని సీఆర్డీఏ అధికారులే స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం లంక భూముల సమీకరణకు అంగీకరించడంతో ఎకరం భూమి రూ.1.75 కోట్లకుపైగా పలుకుతోంది. లంక భూముల లబ్ధిదారులకు కాకుం డా.. వాటిని కొనుగోలు చేసిన అధికారపార్టీ నేతలకు ప్రయోజనం చేకూరేలా చట్టాన్ని సవరించాలంటూ ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు సీసీఎల్ (భూపరి పాలన కమిషనర్) అధికారులను ఆదేశిం చారు. తద్వారా తన తనయుడు, అస్మదీయులకు రూ.2,500 కోట్లకుపైగా విలువైన లంక భూములపై యాజమా న్య హక్కులు కల్పించి, ప్రయోజనం చేకూర్చడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆంజనేయులు ‘వాటా’ 4.69 ఎకరాలు! రాజధాని ప్రకటనకు ముందే తుళ్లూరు ప్రాంతంలో రాజధాని వస్తుందని తెలుసుకున్న టీడీపీ నేతలు రైతులను మోసగించి తక్కువ ధరలకు భూములు కొట్టేసిన వైనం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేరారు. ఆయన తన కుటుంబ సభ్యుల పేర్లతోపాటు, బినామీ పేర్లతో భారీ ఎత్తున భూములను కొనుగోలు చేశారు. కోర్ క్యాపిటల్‌లోని తుళ్లూరుకు అతి దగ్గరగా ఉండే ఐనవోలు గ్రామంలో 4.69 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సర్వే నెంబరు 77-2లో 2.26 ఎకరాలు, 121-7 లో 0.97 ఎకరాలు, 137-2లో 1.46 ఎకరాలు చొప్పున తన కుమార్తె గోనుగుంట్ల లక్ష్మీసౌజన్య పేరుతో 2014లో రిజిస్టర్ చేయించుకున్నారు. అప్పట్లో ఎకరం రూ. 3.9 లక్షలు చొప్పున 4.69 ఎకరాలను రూ. 18.29 లక్షలకే కొనుగోలు చేశారు. ఐనవోలులో ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 2 కోట్లు ఉన్నట్లు చెబుతున్నారు. అంటే ఏడాది కాలంలో జీవీ ఆంజనేయులు భూములకు 50 రెట్లకుపైగా ధర పెరిగింది. జిల్లాలో ప్రజా రాజధాని నిర్మాణం ప్రజల అదృష్టమని చెప్పే జీవీ రైతుల భూములను అతి తక్కువ ధరకే కొట్టేసి వారికి తీవ్ర అన్యాయం చేయడం ఎంత వరకు సమంజసమో ఆయనే చెప్పాల్సి ఉంది. ధూళిపాళ్ల ఆగలేదు... గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో వాగు పోరంబోకు భూములను కాజేసిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అంతటితో ఆగలేదు. ముందుగానే రాజధాని నిర్మాణం తుళ్లూరులో జరుగబోతుందని తెలుసుకుని కోర్ క్యాపిటల్‌కు అతి దగ్గరగా ఉండే ఐనవోలు గ్రామంలోని సర్వేనెంబరు 69-1లో 0.72 ఎకరాలు, 69-2లో 2.86 ఎకరాల భూమిని తన పెద్దకుమార్తె ధూళిపాళ్ల వీరవైష్ణవి పేరుతో కొనుగోలు చేశారు. ఈ భూమిని 2014లో ఎకరా రూ. 3.80 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంటే మొత్తం 3.58 ఎకరాలను రూ. 13.60 లక్షలకు కొనుగోలు చేయగా, ప్రస్తుతం ఆగ్రామంలో ఎకరం భూమి ధర రూ. 2 కోట్ల వరకు పలుకుతుంది. ఇలా రాజధాని ప్రాంతంలో 50 ఎకరాలకు పైగా బినామీ పేర్లతో ధూళిపాళ్ల నరేంద్ర కొనుగోలు చేసినట్లు సమాచారం. భూములు కొన్నది టీడీపీ నేతలే లంక గ్రామాల్లో ఉండే దళిత పేదల్లో అధిక శాతం మంది నిరక్షరాస్యులే. మా అన్న కూడా 77 సెంట్ల భూమిని అమ్మేశారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో అధికార పార్టీ నేతలు చెప్పిందే నమ్మారు. భూములు లాగేసు కుంటారన్న భయంతో ఎవరికి వారు దక్కిన బేరానికి అమ్మేశారు. మంగళగిరికి చెందిన బ్రహ్మారెడ్డి, విజయవాడకు చెందిన సురేష్‌లు లోకేష్, బాలకృష్ణ, మంత్రులు నారాయణ, దేవినేని ఉమా, ఎంపీ గల్లా జయదేవ్‌లకు బినామీ పేర్లతో మా ఊర్లోనే 150 ఎకరాలకుపైగా భూములు కొని పెట్టారు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కింద లంక, అసైన్డు భూములు తీసుకుంటామని ప్రకటించడంతో ధరలు బాగా పెరిగాయి. - తిరుమనపల్లి ప్రకాశ్, తాళ్లాయపాలెం లంక భయపెట్టి లాక్కున్నారు ప్రభుత్వం ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుం టారని రోజుకో రకంగా గ్రామంలో ప్రచారం జరిగింది. అధికారుల్ని అడిగితే అది ప్రభుత్వం ఇచ్చిందే కదా, అవసరమైతే ఉచితంగా ఇచ్చేయాల్సిందే అన్నారు. ప్రభుత్వం తీసేసుకుంటే రోడ్డున పడిపోతానని భయంతో పొలానికి బేరం పెట్టాను. 90 సెంట్ల భూమిని రూ.16 లక్షలకు అమ్ముకున్నాను. ఇప్పుడా పొలం రూ. 1.50 కోట్ల వరకు పలుకుతోంది. అసైన్ఢ్ భూములపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని మొదటి నుంచి చెప్పకపోవడంతోనే అమ్ముకోవాల్సి వచ్చింది. - నందిగం నాగేంద్రమ్మ,ఉద్దండరాయునిపాలెం. భయంతోనే అమ్మేశా ఎకరం లంక భూమే మా కుటుంబానికి జీవనా ధారం. ప్రభుత్వం ఉత్తినే లాగేసుకుం టుందని టీడీపీ నేతలు లంకలో ప్రచారం చేశారు. ఈలోగా పిల్లకు పెళ్లి కుదిరింది. మంగళగిరికి చెందిన దళారీ బ్రహ్మారెడ్డి ద్వారా ఎకరా రూ.22 లక్షలకు అమ్మేశా. అడ్వాన్సుగా రూ.5 లక్షలు ఇచ్చారు. తక్కిన రూ.17 లక్షలు ల్యాండ్ పూలింగ్ కింద భూమి తీసుకుంటేనే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కింద లంక భూములు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుండటంతో ఎకరం రూ.1.50 కోట్లకుపైగా పలుకుతోంది. టీడీపీ నేతలు భయపెట్టడం వల్ల నేను తక్కువ ధరకే భూమిని అమ్మి.. రూ.1.28 కోట్ల మేర నష్టపోయా. - మందల మేరీబాబు,ఉద్దండరాయునిపాలెం లంక టీడీపీ కార్యకర్తనైన నన్నే మోసం చేశారు నాకు లంకలో 1.40 ఎకరాల భూమి ఉంది. లంక భూములను ప్రభుత్వం ఉత్తినే లాగేసుకుంటుందని మా పార్టీ నేతలు ప్రచారం చేయడంతో భయమేసింది. మొత్తం భూమిని రూ.40 లక్షలకు అమ్మేశా. అడ్వాన్సు కింద రూ.పది లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కింద లంక భూము లు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడం తో ఎకరం రూ.1.50 కోట్లకుపైగా పలుకు తోంది. అధికార పార్టీకి చెందిన పంచాయతీ సభ్యున్నైన నన్నే మోసం చేయడం బాధ కలిగించింది. - సుద్దపల్లి కోటేశ్వరరావు, ఉద్దండరాయునిపాలెం లంక అధికారులూ భయపెట్టారు అసైన్డ్ భూములకు నష్టపరిహారం రాదని సీఆర్డీఏ అధికారులే భయపెట్టారు. ఎవరైనా కొనేవాళ్లుంటే ముందుగానే అమ్మేసుకోమన్నారు. దీంతో భయపడి మూడు ఎకరాల భూమిని రూ.45 లక్షలకు అమ్మాను. ఇప్పుడు ఎకరా రూ. 2 కోట్ల వరకు పలుకుతోంది. అసైన్డ్ భూములపై ప్రభుత్వ విధానాన్ని చెప్పకపోవడం వల్లనే నేను భారీగా నష్టపోయాను. - పులి సుబ్బారావు, ఉద్దండ్రాయునిపాలెం ప్యాకేజీ ఇస్తామంటే అమ్మేవాడిని కాదు ప్రభుత్వం పదేళ్ల కిందట ఎకరం భూమి ఇచ్చింది. అప్పటినుంచి సాగు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఒక రైతు పొలంలో కూలికి వెళ్లినప్పడు అసైన్డ్ భూముల్ని ప్రభుత్వం లాగేసుకుంటుందని మిగిలిన రైతులు చెప్పుకుంటుంటే విన్నాను. ఆలస్యం చేస్తే ఏదో ఒక పద్ధతిలో సీఎం చంద్రబాబు లాగేసుకుంటాడని భయపడి రూ.20 లక్షలకు అమ్మేశాను. ఇప్పుడు ఎంత లేదనుకున్నా రూ.1.50 కోట్లు పలుకుతుంది. అసైన్డ్ ల్యాండ్లకు ప్యాకేజి ముందుగానే ప్రకటించి ఉంటే నేను లాభపడేవాడిని. - మండల ఫిలిప్, ఉద్దండ్రాయునిపాలెం ►13 రాజధాని ప్రాంతంలో లంకల సంఖ్య ఇది. రాయపూడి గ్రామం పరిధిలో ఆరు, లింగాయపాలెం లో ఒకటి, మందడంలో ఒకటి, ఉద్దండరాయుని పాలెంలో ఒకటి, వెంకటపాలెంలో ఒకటి, ఉండవల్లి గ్రామ పరిధిలో రెండు లంకలు ఉన్నాయి. ►2159.17 ఎకరాలు లంకల్లో రైతులు సాగుచేస్తున్న మొత్తం లంక, అసైన్డు భూములు. ఇందులో574.93 ఎకరాలు అసైన్డు.. 1,584.24 ఎకరాలు లంక. ► 2,028 ఎకరాలు రాజధాని ప్రాంతంలోని మొత్తం అసైన్డు భూములు.ఇందులో 1278 ఎకరాల భూమిని 1954లో అసైన్డు చేశారు.తక్కిన 750 ఎకరాల భూమిని పలు దఫాల్లో రైతులకు పంపిణీ చేశారు. ►ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేదలకు ప్రభుత్వం అరెకరం.. ఎకరం చొప్పున వాటిని అసైన్డు చేసింది. ► 3,097 ఎకరాలు మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బినామీ పేర్లతో తక్కువ ధరలకే కొన్న మొత్తం లంక, అసైన్డు భూములు -
కబ్జా చక్రవర్తి లింగమనేని (సీఎంగారికి వెరీక్లోజ్)
⇒‘సాక్షి’ వద్ద పేదలిచ్చిన డాక్యుమెంట్లు.. ⇒ఎస్టేట్‌లో పేదల భూములు స్వాహా.. ⇒ 300 ఎకరాల కబ్జా భూములు.. ⇒వాటి విలువ రూ. 1,500 కోట్లు పైనే... ⇒సమీకరణ నుంచి ఎస్టేట్‌కు మినహాయింపు ⇒ కొద్ది దూరంలో ఆగిపోయిన రాజధాని సరిహద్దు ఎవరీ లింగమనేని?... జస్ట్ ఎయిర్ కోస్టా విమానాలకు బాస్ మాత్రమేనా..? కాదు. చట్టాన్ని ఎగతాళి చేస్తూ, కృష్ణా నదిని కూడా కబ్జా చేసి ప్యాలెస్ లాంటి భవంతి కట్టుకున్న ‘పనిమంతుడు’ మాత్రమే కాదు. ఆ భవంతిని తన ఇష్టదైవం లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి సమర్పించుకున్న భక్త ‘హనుమంతుడు’ మాత్రమే కాదు.... కోస్తాంధ్రలోని రెండు ప్రధాన పట్టణాలయిన విజయవాడ - గుంటూరుల నట్టనడుమ మూడు వందల ఎకరాల విలువైన భూమిని అవలీలగా చెరబట్టిన కబ్జా కాలకేయుడు కూడా. కబ్జా చేసుకున్న భూమికి సరిహద్దు గోడను కూడా నిర్మించుకున్న సమర్ధుడు. ఎంత సమర్ధుడంటే.. భూ సమీకరణ చట్టం ఆయన సరిహద్దు గోడదాకా వచ్చి వంగి సలామ్ కొట్టి పక్కకు తిరిగి వెళ్లింది... రాజధాని అమరావతిలో ‘బాబు’ల బినామీ భూ బాగోతాలు కోకొల్లలుగా బైటపడుతున్నాయి. లింగమనేని రమేష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య ఉన్న బంధాన్ని రుజువుచేసే మరో పక్కా ఆధారం గురువారం ‘సాక్షి’కి లభించింది. ఈ ఆధారం ‘సాక్షి’ తవ్వితీసింది కాదు. పేదలు స్వయంగా వచ్చి ‘సాక్షి’ చేతికి అందించింది. పేదల భూములను లింగమనేని కలిపేసుకున్నారని తెలిపే ఆధారాలవి. భూ సమీకరణ విషయంలో బినా మీలైతే ఒకరకంగా.. బడుగు రైతులైతే మరో రకంగా బాబు వ్యవహరించారనేందుకు అనేక ఆధారాలు న్నాయి. మూడు పంటలు పండే పేదల భూములను బలవంతంగా సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం లింగమనేని వంటివారిని మాత్రం ‘దయ’తో వదిలేసింది. నిడమర్రు సమీపంలోని లింగమనేని ఎస్టేట్‌ను రాజధాని భూ సమీకరణనుంచి తప్పిం చడం... ప్రతిఫలంగా లింగమనేనివారు ముఖ్య మంత్రికి కృష్ణానదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను నజరానాగా సమర్పించడం మనకు తెలిసిన విషయాలే. ఈ ఎస్టేట్‌లో 300 ఎకరాల పేదల భూములు కలిపేసుకున్న విషయం తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా లింగమనేని విషయంలో చంద్రబాబు ఉదారంగా వ్యవహరిం చారు. ఆ వివరాలు చూద్దామా.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలో సుమారు 300 ఎకరాల్లో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. వీటిని 1937వ సంవత్సరంలో గుర్తించిన బాంబేకు చెందిన అసోసియేట్స్ సిమెంట్స్ కంపెనీ లిమిటెడ్ (ఏసీసీ) యాజమాన్యం ఈ భూములను రైతుల దగ్గర నుంచి 99 ఏళ్ళ లీజు విధానంలో సేకరించింది. అప్పట్లో ఏసీసీ సిమెంట్స్ ఎండీ డబ్ల్యూహెచ్ బెన్నిట్స్ తరఫున కూర్మరాజు గోపాలస్వామి రైతులందరి భూములు కేవలం విక్రయ కాంట్రాక్ట్ మాత్రమే తీసుకుంటున్నట్లు రైతులకు అగ్రిమెంట్ (ఒప్పంద పత్రం) రాసిచ్చారు. సిమెంట్ కంపెనీ యాజమాన్యం సున్నపురాయి నిక్షేపాలు తవ్వడం ఆపివేసిన పక్షంలో.. లీజు కాలం వరకూ ఈ భూముల్లో పంటలు వేసుకునేందుకు రైతులకు హక్కు కల్పించారు. లీజు గడువు ముగిసిన తరువాత ఆ భూములు వాటి యజమానులైన రైతుల స్వాధీనంలోకి వచ్చేలా విక్రయ కాంట్రాక్ట్ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే అసలు మతలబు ఇక్కడే జరిగింది. లీజు గడువుకు ముందే ఏసీసీ లిమిటెడ్ ఈ భూముల్లో తవ్వకాలు నిలిపివేసి సిమెంట్ కంపెనీని తరలిపోయింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే.. పేదల భూములను ఆక్రమించిన లింగమనేని.. చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే అనేక చర్యలు తీసుకున్నారు. రైతులను మభ్యపెట్టి, మాయచేసి, బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. అనంతరం ఆ స్టాంప్ పేపర్లలో తమకు నచ్చినట్లు రాసుకుని ముఖ్యమంత్రి అండతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సహకారంతో రూ.1500 కోట్ల విలువ చేసే భూముల్ని తన వశం చేసుకున్నారు. రాజధాని ప్రాంతం ప్రకటనకు కొద్ది రోజుల ముందే లింగమనేని ఈ 300 ఎకరాల విలువైన భూములను ఓ ఎస్టేట్ మాదిరిగా మార్చారు. భద్రతా సిబ్బంది, సీసీ కెమెరాలు, ఎక్కడికక్కడ చెక్‌పోస్టులతో పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఎస్టేట్ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ఎకరం రూ.ఐదు కోట్ల వర కూ పలుకుతోంది. కాజ గ్రామానికి చెందిన కొంత మంది రైతుల వద్ద ఇంకా లీజు అగ్రిమెంట్లు ఉండటంతో లింగమనేని కబ్జా భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ భూముల పక్కనే ‘చినబాబు’ కొట్టేసిన అగ్రిగోల్డ్ హాయ్‌ల్యాండ్ కూడా ఉండటం గమనార్హం. లీజుకు ఇచ్చిన తమ భూములు ఎక్కడు న్నాయో తెలుసుకునేందుకు కాజ గ్రామస్తులు ప్రయత్నించగా, లింగమనేని ఎస్టేట్‌లో ఉన్నట్లు తేలింది. పేదల వద్ద పక్కా ఆధారాలు... లింగమనేని ఎస్టేట్స్ యాజమాన్యం అధీనంలో ఉన్న భూముల్లో తమ భూములు కూడా ఉన్నాయని, వాటికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బాధిత రైతులు తెలిపారు. అయితే తమ భూములను చూసేందుకు కూడా వీలు లేకుండా ప్రై వేట్ సైన్యాన్ని పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు. సీఎం చంద్రబాబు అండదండలు ఉండటం వల్లే లింగమనేని ఎస్టేట్స్ వైపు కన్నెత్తి చూసేందుకు అటు రెవెన్యూ.. ఇటు పోలీసు అధికారులు సాహసించడం లేదు. సర్వే నెంబరు 191, 192, 226 ఇలా అనేక సర్వే నెంబర్లలో ఉన్న 300 ఎకరాల భూమిని లింగమనేని యాజమాన్యం కొట్టేసిందని బాధితుల కథనం. రాజధాని దురాక్రమణపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో బాధితులు తమ వద్ద ఉన్న విక్రయ డాక్యుమెంట్ల ఆధారాలతో ‘సాక్షి’ ప్రతినిధులను ఆశ్రయించడంతో లింగమనేని గ‘లీజు’ దందా వెలుగులోకి వచ్చింది. -
భూప్రకంపనలు
⇒ సంచలనం సృష్టిస్త్తున్న ‘సాక్షి’ కథనాలు ⇒ ఎక్కడ చూసినా ‘రాజధాని దురాక్రమణ’పైనే చర్చ ⇒ రాజకీయ, అధికారవర్గాల్లోనూ కలకలం ⇒ ఎవరి బండారం బయటపడుతుందోనని గుబులు ⇒ మంత్రులు, టీడీపీ నేతల భూ బాగోతంపై జనాగ్రహం ⇒ కడుపులు కొట్టి భూములు మింగారని ఆందోళన ⇒ అన్యాయం చేసిన వారి పాపం ఊరికే పోదని శాపనార్థాలు ఊళ్లల్లో తిరుగుతూ హడావుడి చేసిన మంత్రి నారాయణ మూడు వేల ఎకరాలు కొనేశాడా..! ఓ రైతు ఆశ్చర్యం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చెప్పి ప్రపంచ స్థాయి భూ కుంభకోణానికి తెరతీశారా..! మరొకరి అనుమానం ‘సాక్షి’లో సాక్ష్యాధారాలతో సహా వచ్చాయిగా ఇంకా సందేహమెందుకు..? ఇంకొకరి సమర్థన రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా టీడీపీ దురాక్రమణ’పైనే చర్చ మంగళగిరి, తుళ్లూరు, అమరావతి మండలాల్లో ఈ కథనాలు ప్రకంపనలు సృష్టించాయి. దురాక్రమణలో టీడీపీ నేతల నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో రేపటి కథనాల్లో ఎవరి బండారం బయటపడుతుందోనని అధికార పార్టీ నేతలు గుబులు చెందుతున్నారు. భూముల క్రయ విక్రయాల్లో అధికార పార్టీ నేతలకు సహకరించిన రియల్ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో నేతలకు సహకరించిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పక్కా సాక్ష్యాధారాలతో ప్రచురితం అవుతున్న కథనాలపై పోలీస్, ఇంటిలిజెన్స్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ విచారణకు దిగారు. కడుపు కొట్టారంటూ కూలీల ఆవేదన.. రాజధాని పేరుతో రాజకీయ వ్యాపారం చేస్తున్నారని రైతులు, కూలీలు ప్రభుత్వ తీరును ఎండగడుతు న్నారు. ముఖ్యమంత్రి కుటుంబం, మంత్రులు, టీడీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు లాక్కుని రాజధాని కడతారనుకుంటే వాటిని స్వాధీనం చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. వ్యవసాయం లేకుండా పోయి నానా బాధలు పడుతున్నామని రైతులు, పనులు లేకుండా రోడ్డున పడ్డామని కూలీలు ఆందోళన చెందుతున్నారు. భూములు లాక్కుని తమ కడుపులు కొట్టారని వెంకటపాలెం రైతు పి.శేఖర్ ఆవేదనగా చెప్పాడు. రాజధాని పేరుతో తమ ప్రాంతాన్ని సర్వ నాశనం చేశారని, టీడీపీ తమను నట్టేట ముంచిందని తాళ్లాయపాలెంలో ఏసోబు అనే కార్మికుడు ఆవేదనగా చెప్పాడు. ఉంచుకుంటే ఏమీ మిగలదని చెప్పడంతో చాలా తక్కువ రేటుకు తన భూమి అమ్మేశానని మందడం గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు తెలిపాడు. తమకు అన్యాయం చేసిన వాళ్ల పాపం ఊరికే పోదని శాపనార్ధాలు పెడుతున్నారు. కొమ్మాలపాటి కుచ్చుటోపీపై తీవ్ర చర్చ... పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నిర్వహిస్తున్న అభినందన హౌసింగ్ సంస్థ రాజధాని గ్రామమైన యర్రబాలెంలో 42 ఎకరాలు కొనుగోలు చేసి వాయిదాల పద్ధతిలో ప్లాట్లు విక్రయించింది. రాజధాని ప్రకటన తర్వాత కొందరు ఖాతాదారులకు ఇక్కడ కాకుండా వేరేవెంచర్లలో ప్లాట్లు కేటాయించింది. మరి కొందరికి నగదు తిరిగి చెల్లించింది. ఇంకా 500కు పైగా ఖాతాదారులు తమకు అక్కడే ప్లాట్లు కేటాయించాలని తిరుగుతుండగా అనుమతులు రావంటూ భయపెట్టి, ఆ భూములను భూ సమీకరణకు కూడా ఇవ్వకుండా మెగా సిటీ నిర్మాణం కోసం ప్లాన్ చేస్తున్నారని వచ్చిన కథనం ఖాతాదారు ల్లో ఆగ్రహాన్ని రగిల్చినట్లు సమాచారం. దీంతో కొందరు ఖాతాదారులు కలిసి సంఘంగా ఏర్పడి తమకు ప్లాట్లు అక్కడే కేటాయించే విధంగా సంస్థపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు ఓ ఖాతాదారుడు తెలిపారు. ఖాతాదారుల్లో ఉలికిపాటు.. రాజధాని భూ దురాక్రమణ కథనాల్లో భాగంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని రామ కృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్లో 194 ఎకరాల్లో 54 ఎకరాలు అసైన్డు భూములున్నాయని రావడం యాజమాన్యంతో పాటు అధికార వర్గాల్లోనూ ఆందోళన రేకెత్తించింది. కొందరు ఖాతాదారులు తాము కొనుగోలు చేసిన ప్లాట్లలో ఏవైనా అసైన్డు భూములు ఉన్నాయా.. అని ఆరాలు తీయడం ప్రారంభించారు. దీనిపై యాజమాన్యం ముందు జాగ్రత్తగా వచ్చిన వినియోగదారులను విజయవాడ కార్యాలయానికి పిలిపించి, ఆందోళన చెందాల్సిన పనిలేదని నచ్చజెప్పి పంపినట్లు సమాచారం. -
అక్కడ భూములు కొన్నది నిజమే: పయ్యావుల
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూములు కొన్నది వాస్తవమేనని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అంగీకరించారు. 'సాక్షి' కథనంపై స్పందించిన ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ బినామీ పేరుతో కాదని, తన కొడుకు పేరుతోనే భూములు కొన్నానని తెలిపారు. కాగా కోర్ కేపిటల్లోని తుళ్లూరుకు అతి దగ్గరగా ఉండే అయినవోలు గ్రామంలో పయ్యావుల 4.09 ఎకరాలు కొనుగోలు చేశారు. సర్వే నెంబరు 48/3లో 2.13ఎకరాలు, సర్వే నెంబరు 49/3లో 1.96 ఎకరాలు కలిపి మొత్తం 4.09 ఎకరాల భూమిని 2014 అక్టోబరు 13న కేశవ్ పెద్దకుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎకరం 3.7 లక్షల చొప్పున 4.09 ఎకరాలను 12.27లక్షల రూపాయలకే కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ అయినవోలులో ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరా రూ.2కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఏడాది వ్యవధిలో పయ్యావుల భూములకు 50 రెట్లకు పైగా ధర పలుకుతోంది. మరోవైపు రైతుల వద్ద భూములు కొంటే తప్పేంటని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అన్నారు. రాజధానిలో ఎంతోకొంత భూమి ఉండాలని ఎవరైనా కోరుకుంటారని, 2,3 ఎకరాలు కొనుక్కోలేని పరిస్థితిలో తాము ఉన్నామా అని ఎదురు ప్రశ్నించారు. కాగా నంబూరులో సర్వే నెంబరు 274లోని 3.89 ఎకరాల వాగు పోరంబోకు భూమిని తన సమీప బంధువు దేవర పుల్లయ్య పేరుతో సొంతం చేసుకోవడానికి ధూళిపాళ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రెవిన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి రెండుమూడు చేతులు మార్చినట్లుగా చూపి డాక్యుమెంట్ నెంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. -
ఓ చిరుద్యోగి 30 ఎకరాలు కొనగలడా?
0.25, 0.32, 0.45, 0.87, 1.5... ఏమిటీ అంకెలనుకుంటున్నారా..? ► ఓ కాలేజీలో కరెంటు మరమ్మతు పనులు చూసే మునిశంకర్ అనే చిరుద్యోగి పేరున ఉన్న పొలం బిట్లు ఇవి. బిట్లు బిట్లుగా రాజధాని గ్రామాల్లో ఈయన పేరున దాదాపు 30 ఎకరాల పొలం ఉంది. ఎకరా రూ. 3 కోట్లు చొప్పున 30 ఎకరాలంటే రూ. 90 కోట్లవుతుంది కదా... ఓ చిరుద్యోగి అన్ని కోట్లతో కొనగలడా? ► రాపూరు సాంబశివరావు అనే మరో వ్యక్తి పేరుతో కూడా రాజధానిలో బిట్లు బిట్లుగా 29 ఎకరాలకు పైగా భూములున్నాయి. పోతూరి ప్రమీల అనే మహిళ పేరుతో 15 ఎకరాలున్నాయి. ► మునిశంకర్ మంత్రి నారాయణకు వరసకు బావమరిది.. సాంబశివరావు సొంత బావమరిది... కాగా ప్రమీల మంత్రిగారి సన్నిహితురాలు.. ► వీరెవరికీ కోట్లు పోసి కొనే శక్తి లేదు. వీరంతా మంత్రిగారి బినామీలని మీకీపాటికే అర్థమైఉండాలి. ► మంత్రిగారి బినామీలు కాబట్టే వారి పేరుతో ఎకరాలకు ఎకరాలు రిజిస్టరయ్యాయి. ►రాజధాని భూ సమీకరణలో ముఖ్యభూమిక పోషించిన మంత్రి పి.నారాయణ ఇలా 29 గ్రామాల్లోనూ దాదాపు 3,129 ఎకరాల విలువైన వ్యవసాయ భూములను, నివేశన స్థలాలను కొనుగోలు చేశారు. బిట్టుబిట్టుగా భూములన్నీ తన కాలేజీల్లో పనిచేసే ఉద్యోగుల పేర్లమీద, దూరపు బంధువుల పేర్లమీద ఆయన కొనుగోలు చేశారు... ఇక రాజధాని ప్రకటనకు ముందే రైతుల వద్ద భూములు కొన్న నారాయణ వారితో ఒప్పందాలు చేసుకుని వారి పేరుతోనే సమీకరణకు భూములిప్పించారు.. పరిహారం మాత్రం ఆయన ఖాతాకు చేరబోతున్నది. అలా వచ్చే పరిహారం విలువే రూ. 400 కోట్ల వరకు ఉంటుందని అంచనా..! 425 కోట్ల రూపాయలు హాయ్‌ల్యాండ్ కొట్టేశారు.. ►ప్రభుత్వ ‘పెద్ద’ కన్నుపడిందంటే అది కైంకర్యమే... ►రూ. 425 కోట్ల విలువైన 85.13 ఎకరాల హాయ్‌ల్యాండ్‌పై ‘బాబు’లు కన్నేశారు. ►రూపాయి రూపాయి కూడబెట్టి డిపాజిట్లు కట్టిన 32 లక్షల మంది ఖాతాదారులకు రూ. 6,850 కోట్ల మేర శఠగోపం పెట్టిన అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని కేసుల నుంచి తప్పిస్తామని, అందుకు ప్రతిఫలంగా హాయ్‌ల్యాండ్ ఇవ్వాలని బేరంపెట్టారు. ►బేరం కుదిరింది.. హాయ్‌ల్యాండ్ ‘చినబాబు’ సొంతమైంది.. ►రాజధాని పేరుతో భారీ దోపిడీ చేసిన ప్రభుత్వ పెద్దలు అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదనడానికి హాయ్‌ల్యాండ్ భూములే ఉదాహరణ. 17.3 ఎకరాలు పీఏ పేరుతో కొన్నది ►అతను ఓ ప్రముఖుడి వ్యక్తిగత సహాయకుడు... ►పీఏకి ఎంత జీతం వస్తుంది..? మహా అయితే రూ. 15 వేలు.. ►ఆ పీఏ రాజధానిలో ఏకంగా 17.3 ఎకరాలు కొనేశాడు. ►ఎకరం రేటెంతో తెలుసా? రూ. 1.50 కోట్లు. అంటే మొత్తం రూ. 25.95 కోట్లు ►అంటే బినామీ అని అర్థం కావడం లేదూ..? చిత్రమేమంటే ఆ పీఏ పేరున ఓ సంస్థ ఉందండోయ్... ►ఆ ప్రముఖుడెవరంటే.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణ.. పీఏ పేరు నాగప్రసాద్. 210 కోట్ల రూపాయలు తప్పించుకున్న ‘వెంచర్’ ► ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే.. కొమ్మాలపాటి శ్రీధర్ ► రాజధాని ప్రకటించగానే తన రియల్ ఎస్టేట్ వెంచర్లో రిజిస్ట్రేషన్లు ఆపేశారు.. ► నెలనెలా వాయిదాలు కట్టిన దాదాపు 3వేల మంది లబోదిబోమంటున్నారు.. ► మొత్తం 42 ఎకరాల్లో ఆ వెంచర్ ఉంది. ‘చినబాబు’ చెప్పడంతో దానిని సమీకరణ నుంచి తప్పించారు.. ► ఫలితంగా ఆ వెంచర్లో ‘చినబాబు’కు వాటాలందినట్లు పక్కా సమాచారం.. ► ఆ భూమి విలువ ఇపుడు రూ.210 కోట్లు... 53 ఎకరాలు పోరంబోకు భూముల కబ్జా ► అది ఊరందరికీ తెలిసిన వాగు పోరంబోకు భూమి.. ►రాజధాని ప్రకటనతో ఎమ్మెల్యే కన్ను దానిపై పడింది.. ►బంధువు పేరుతో డాక్యుమెంట్లు సృష్టించారు. ఆయన ఇంకొకరికి అమ్మినట్లు.. వారు మరొకరికి అమ్మినట్లు పత్రాలు పుట్టుకొచ్చాయి. అలా లింక్ డాక్యుమెంట్లకు ఊపిరి పోశారు. ►చివరకు బంధువు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేశారు. ►అలా 3.89 ఎకరాల పోరంబోకు భూమి కాస్తా పక్కా రిజిస్ట్రేషన్ భూమిగా మారిపోయింది. ►ఇది ఎమ్మెల్యే ధూళిపాళ్ల ‘పోరంబోకు భూమి’ కథ. ఇది కాక ఒక్క పెదకాకాని మండలంలోనే 50 ఎకరాల వరకు పోరంబోకు భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఉప్పందిన వెంటనే నాలుగెకరాలు దొరికాయి.. ► రాజధాని తుళ్లూరు దగ్గర వస్తుందని అధికారపార్టీ ముఖ్యులకు మాత్రమే తెలుసు.. ► కానీ నాగార్జున వర్సిటీ దగ్గర అని కొన్నాళ్లు..నూజివీడు దగ్గర అని కొన్నాళ్లు... ప్రచారం చేశారు.. ► ఈలోగా తుళ్లూరు సమీపంలో భూములను కారుచౌకగా కొనేశారు.. అందినవారికి అందినంత... ► టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు తుళ్లూరు మండలం అయినవోలులో అలా 4.09 ఎకరాలు దొరికాయి. ► ఎకరా రూ.3.7 లక్షల చొప్పున 4.09 ఎకరాలను ఆయన రూ. 12 లక్షలకే కొట్టేశారు. ► ఇపుడు ఆ భూమి విలువ దాదాపు రూ. 7 కోట్లు పలుకుతోంది... పచ్చి మోసం.. దగా ఇది రైతుల మాట... భయపడి అమ్ముకున్నాం సాక్షిలో ప్రచురితమైన భూ దురాక్రమణ కథనం చదివాం. అన్నీ వాస్తవాలే. ఎందుకంటే భూ సమీకరణ తొలి రోజుల్లో సమీకరణకు ఇవ్వకుంటే, బలవంతంగా భూసేకరణ జరుపుతామని, ఎకరాకు రూ. 20 లక్షలు రావని ప్రభుత్వ పెద్దలు భయాందోళనలకు గురి చేయడంతో గత్యంతరం లేక అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పట్లో ఎకరా తక్కువ రేటుకే అమ్ముకున్నాం. ఇప్పుడు రూ. 1.40 కోట్లకు చే రింది. - కొమ్మారెడ్డి పిచ్చిరెడ్డి, నిడమర్రు, మంగళగిరి మండలం ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించింది రాజధాని ప్రకటన నాటి నుంచి ప్రభుత్వం రైతుల పట్ల మోసపూరితంగానే వ్యవహరించింది. భూములు ఇవ్వనంతకాలం బెదిరించి, భయపెట్టి రైతులను అమ్ముకునే విధంగా చేశారు. తక్కువ ధరలకే ప్రభుత్వ పెద్దలు, మంత్రులు కొనుగోలు చేసి భూ సమీకరణ పూర్తయిందని రైతులను ఆందోళనకు గురి చేసి మిగిలిన రైతులను సైతం భూములను అమ్ముకునేలా చేశారు. దీంతో రైతులు నష్టపోగా కొనుగోలు చేసిన వారు లబ్ధి పొందారు. - కొప్పోలు వెంకటేశ్వర్లు, బేతపూడి, మంగళగిరి మండలం నాటకాలాడుతున్నారు బుధవారం సాక్షిలో ప్రచురితమైన భూ దందా కథనాలు నూరుశాతం నిజం. రాజధాని నిర్ణయం జరుగకముందు ఇక్కడి ప్రాంతానికి వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతులను భయబ్రాంతులకు గురి చేసి భూములను కొన్నారు. ఇప్పుడు మాత్రం మాటతప్పి నాటకాలు ఆడుతున్నారు. ఆర్థికంగా మేము చాలా నష్టపోయాం. భూములు కొనుగోలు చేసిన నేతల భాగోతాలపై విచారణ జరపాలి. - జొన్నా శివశంకర్, ఉండవల్లి, తాడేపల్లి మండలం ఇష్టం లేకపోయినా ఒప్పించారు ఏడాది పొడవునా మూడు పంటలూ పండే భూములు మావి. సమీకరణకు ఇచ్చేందుకు మాకు ఇష్టం లేకపోయినా ప్రభుత్వం, అధికారులు భయపెట్టడం కారణంగానే అమ్ముకోవాల్సి వచ్చింది. తక్కువ ధరలకే కొనుగోలు చేసిన వారు భూ సమీకరణకు ఇచ్చి మమ్మల్ని మోసగించారు. - బేతపూడి సాంబయ్య, నిడమర్రు, మంగళగిరి మండలం. అసైన్డ్‌కు పరిహారం లేదన్నారు! అసైన్డ్ భూములకు ప్యాకేజీ విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేసింది. తీరా అసైన్డు రైతులు తక్కువ ధరలకు భూములు అమ్ముకోగానే ప్యాకేజీ ప్రకటించింది. దీంతో మేము తీవ్రంగా నష్టపోయాం. 83 సెంట్ల భూమిని కేవలం రూ. 39 లక్షలకు అమ్ముకున్నా. ఇప్పుడు మార్కెట్ ధర ప్రకారం రూ. 1.20 కోట్ల వరకు పలుకుతోంది. తలుచుకుంటే ముద్ద కూడా దిగడం లేదు. - రావూరి ప్రభుదాస్, కురగల్లు, మంగళగిరి మండలం ఆందోళనతోనే అమ్ముకున్నాం భూ సమీకరణ విధానం ద్వారా భూములు తీసుకున్న ప్రభుత్వం భవిష్యత్తులో కౌలు పరిహారం చెల్లిస్తుందో, లేదో అనే ఆందోళనతో తక్కువకే భూమి అమ్ముకోవాల్సి వచ్చింది. ఆరు నెలల క్రితం అరెకరా రూ. 18 లక్షలకు అమ్ముకున్నా. ప్రస్తుతం ఆ భూమి ధర రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు పలుకుతోంది. జరిగిన నష్టాన్ని తలచుకుంటేనే బాధ వేస్తోంది. - చెంచు రామారావు, కురగల్లు, మంగళగిరి మండలం నేతల మాటలతో మోసపోయాం రాయపూడిలో నేను ఎకరా రూ. 40లక్షలతో భూములు కొనుగోలు చేశాను. ల్యాండ్ పూలింగ్ పరిధిలో వున్న ఈ పొలం రోడ్డు విస్తరణ కింద పోవడం ఖాయమని అధికార పార్టీ నేతలు భయపెట్టారు. పైగా నేను కొనుగోలు చేసిన రూ. 40 లక్షలకే కొంటామన్నారు. రెండవ సారి రూ. 35లక్షలకే అడిగారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనుచరులే ఇక్కడ భూముల ధరలు నిర్ణయించారు. దీంతో నష్టపోవాల్సి వచ్చింది. - దాసరి ఆంజనేయులు, ఉండవల్లి, తాడేపల్లి మండలం రేట్లు తగ్గించి కొన్నారు రాజధాని ప్రకటనకు ముందు ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో ఎకరం రూ. 5 కోట్లుండగా రాజధాని ప్రకటించాక టీడీపీ నేతలు అపోహలు సృష్టించారు. రైతులు అవసరమై పొలం అమ్ముదామనుకుంటే ఎకరాకు కోటి కంటే ఎక్కువ పలకలేదు. బినామీ పేర్లతో ఎక్కువ భూములు కొనుగోలు చేశారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాల నుకుంటున్నాం. - మేకా ప్రభాకరరెడ్డి, పెనుమాక, తాడేపల్లి మండలం -
బిట్టు బిట్టుకో బినామి
⇒ పెద్దల ‘భూ’మాయకు ఆధారాలెన్నో.. ⇒ ఓ చిరుద్యోగి 30 ఎకరాలు కొనగలడా..? 15 ఎకరాలు కొన్న ప్రమీల ఎవరు? ⇒ బావమరిది పేరుతో 29 ఎకరాలు కొన్నదెవరు? ⇒ నారాయణ భూ దందాలో పాత్రధారులెందరో... ⇒ రూ. 425 కోట్ల హాయ్‌ల్యాండ్‌ను కొట్టేసిన ‘చినబాబు’ ⇒ పీఏ పేరుతో 17.3 ఎకరాలు కొన్న కోడెల కుమారుడు ⇒ వాగు పోరంబోకును బంధువు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించిన ధూళిపాళ్ల ⇒ సమీకరణ నుంచి ఎమ్మెల్యే ‘వెంచర్’ తప్పించినందుకు ‘చినబాబు’కు వాటాలు ⇒ రాజధాని ఉప్పందుకున్న పయ్యావుల కేశవ్ కొన్నది 4.09 ఎకరాలు.. రాజధాని ‘భూమాయ’లు ఒకటో రెండో కాదు. తవ్విన కొద్దీ బైటపడుతున్నాయి. రకరకాల మాయోపాయాలతో రాజధాని రైతన్న పొట్టగొట్టి వేల ఎకరాలను కాజేసిన పెద్దల ‘ఘన’కార్యాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పచ్చదండు ఆడిన వికృత క్రీడకు వేలమంది రైతులు బలైపోయారు. రాజధాని ఎక్కడ అనే దానిపై గందరగోళం సృష్టించడంతో అమాయక రైతులు అయినకాడికి భూములు అమ్మేసుకున్నారు. రైతులను మోసగించి కారుచౌకగా కొట్టేసిన భూములు ఇపుడు పెద్దలకు కోట్లు కురిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆడిన ‘బినామీ’ నాటకాలు చూస్తే మనకు కళ్లు తిరగడం ఖాయం.. ► రాజధానిగా ప్రకటించనున్న ప్రాంతంలో మంత్రి నారాయణ బిట్లు బిట్లుగా దొరికినచోట దొరికినట్లు భూములు కొనేశారు. అరెకరం, 45 సెంట్లు, 87 సెంట్లు ఇలా ముక్క దొరికితే చాలు కారుచౌకగా స్వాహా చేశారు. పనివాళ్లు, బంధువులు, ఉద్యోగులు ఇలా అందరి పేర్లను వాడేసుకున్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోనూ మంత్రిగారు బినామీ పేర్లతో పాగా వేశారు. మంత్రిగారి దూకుడు, పనితనం గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని వ్యవహారాలన్నీ దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యతలను ఆయన భుజస్కం ధాలపైనే పెట్టేశారు. అలా మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ రాజధానిలో ఆయనే పెద్దదిక్కు అయ్యారు. ► స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు తన వ్యక్తిగత కార్యదర్శి పేరుతో 17.3 ఎకరాలు కొన్నారు.. ► ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రచౌదరి రూ. 5 కోట్ల విలువైన వాగు పోరంబోకును కబ్జాచేసి బంధువు పేర రిజిస్ట్రేషన్ చేయించారు.. ► రైతుల భూములు బలవంతంగా లాక్కున్న పెద్దలు.. అధికారపార్టీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ రియల్ఎస్టేట్ వెంచర్‌ను పూలింగ్ నుంచి తప్పించేశారు. ► రాజధాని ఎక్కడ వస్తుందో ముందే ఉప్పందుకున్న ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్... తన కుమారుడి పేరుతో భూములు కొన్నారు... ►ఆ ఇంద్రుడి రాజధాని అమరావతి.. ‘అమృతం’, ‘ఐరావతం’ ‘పారిజాతం’ నిలయం.. కాగా ఈ చంద్రుడి రాజధాని అమరావతి ‘బినామీలు’, భూబకాసురులు, దొంగ జీపీఏలు, రైతుల పొట్టగొట్టి కారుచౌకగా కాజేసిన వేల ఎకరాల రిజిస్ట్రేషన్ పత్రాల వలయం... నారాయణ.. నారాయణ! • కొనుగోలు 3,129 ఎకరాలు • చెల్లించినది 432 కోట్లు • ప్రస్తుత విలువ 10,000 కోట్లకు పైగా... రాజధాని భూసమీకరణలో ప్రధాన భూమిక పోషించిన పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ.. భూదందాలోనూ ముందున్నారు. రెండేళ్ల కిందటి వరకు విద్యాసంస్థల అధిపతిగానే తెలిసిన నారాయణ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీగా నిధులందించారనీ, అందుకు ప్రతిఫలంగానే ఎమ్మెల్సీ, మంత్రి పదవీ అందుకున్నారనేది జగమెరిగిన సత్యం. అది నిజమేనన్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ మంత్రిని కాదని రాజధాని ప్రాంతంలో భూసమీకరణ బాధ్యతలను తన ప్రధాన బినామీ నారాయణకే అప్పగించారు. భూసమీకరణలో భాగంగా ఆయన రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లోనూ మకాం వేసి.. విస్తృతంగా పర్యటించారు, గ్రామ సభలు నిర్వహించారు. ఈ క్రమంలోనే టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల ద్వారా అసైన్డు, లంక భూముల రైతులను గుర్తించి, వారి ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. అసైన్డు, లంక భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందంటూ తన అనుచరులతో విస్తృతంగా ప్రచారం చేయించారు. ఆందోళన చెందుతున్న దళిత రైతుల వద్దకు తన ప్రతినిధులతో బేరసారాలు సాగించారు. ఎకరం కనిష్టంగా రూ.పది లక్షల నుంచి గరిష్టంగా రూ.15 లక్షల చొప్పున 3,129 ఎకరాలు బినామీల పేరుతో కొనుగోలు చేశారు. ఈ ప్రాంతంలో కమతాలు చిన్న చిన్నవి కావడంతో కనిష్టంగా 0.25 ఎకరాల నుంచి గరిష్టంగా 1.5 ఎకరాల వరకూ బిట్లు బిట్లుగా కొనుగోలు చేశారు. 3,129 ఎకరాలు కొనుగోలు భూముల కొనుగోలులో నారాయణ తన తెలివిని జాగ్రత్తగా ఉపయోగించారు. భూమిని విక్రయించిన రైతులకు అడ్వాన్సు కింద రూ.రెండు లక్షలు ముట్టజెప్పి.. తన బినామీల పేర్లతో రహస్య అగ్రిమెంట్లు చేయించుకున్నారు. అసైన్డు, లంక భూముల సమీకరణకు ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఆ భూములపై కొనుగోలుదారులకు హక్కులు కూడా కల్పించడానికి కసరత్తు చేస్తోన్న నేపథ్యంలో తక్కిన మొత్తాన్ని కూడా తనకు భూమిని అమ్మిన వారికి ముట్టజెప్పేశారు. ఆ రైతుల నుంచి జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) తన బినామీల పేర్లపై చేయించుకున్నారు. సమీప బంధువులు, నారాయణ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పేరు మీద ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించారు. భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు బయటకు పొక్కకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, రిప్రజెంటేటివ్ విధానాన్ని అనుసరించారు. దీనితో భూమిని విక్రయించిన రైతు కొనుగోలుదారుణ్ణి ప్రత్యక్షంగా చూడకుండానే రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. బినామీల పేరుతో భారీ కొనుగోళ్లు... మంత్రి నారాయణ బినామీ వ్యవహారానికి ఆకుల మునిశంకర్, రావూరు సాంబశివరావు, పొత్తూరి ప్రమీల తదితరుల భూముల కొనుగోళ్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెల్లూరుకు చెందిన మునిశంకర్ కోర్ కేపిటల్‌కు అతి సమీపంలో ఉన్న మందడం గ్రామంలో సర్వే నెంబరు 126లో నూతక్కి నరసింహనాయుడుకు చెందిన 1.50 ఎకరాల భూమిని రూ.2.25 కోట్లు చెల్లించి 1.50 ఎకరాలు కొన్నాడని గ్రామస్తులు తెలిపారు. కానీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఎకరం ధర రూ.6 లక్షలు ఉండగా.. మార్కెట్ విలువను కేవలం రూ.తొమ్మిది లక్షలుగా చూపించారు. అలాగే లింగాయపాలెంలో సర్వే నెంబరు 109/1లో బోడిపూడి వెంకటరమణ నుంచి 0.56 ఎకరాలు, మందడంలో సర్వే నెంబరు 15/1లో బోరుగడ్డ రాంప్రకాష్ నుంచి 0.37 ఎకరాలు, లింగాయపాలెంలో సర్వే నెంబరు 140/ఏలో కొత్తపల్లి రాధారాణి నుంచి 0.45 ఎకరాలు, సర్వే నెంబరు 188లో కొండెపాటి వెంకాయమ్మ నుంచి 0.28 ఎకరాలు, రాయపూడిలో సర్వే నెంబర్లు 119/ఏ, 119/ఎఫ్లలో షేక్ హస్రఫ్ ఉన్నీసా తదితరుల నుంచి 0.75 ఎకరాలు, సర్వే నెంబరు 354/1ఏ, 354/1బీలలో లంబు వెంకటేశ్వర్లు తదితరుల నుంచి 0.87 ఎకరాలు, సర్వే నెంబరు 360/1లో వెలగలేటి రమాదేవి నుంచి 0.25 ఎకరాలు ఇలా బిట్లు బిట్లుగా ఆకుల మునిశంకర్ 30 ఎకరాలకుపైగా కొనుగోలు చేశారు. మంత్రి నారాయణకు స్వయానా బావమరిది రావూరు సాంబశివరావు తుళ్లూరు మండలం మందడంలో సర్వే నెంబరు 465/3బీలో 0.32 ఎకరాలు.. బిట్లు బిట్లుగా 29 ఎకరాలకుపైగా భూమిని కొనుగోలు చేశారు. మంత్రికి సన్నిహితురాలైన పోతూరి ప్రమీల తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో సర్వే నెంబరు 51/బీ, 51/సీల్లో 0.98 ఎకరాలు, సర్వే నెంబరు 95/సీలో 0.45 ఎకరాలు, లింగాయపాలెంలో 157/2లో 0.9 ఎకరాలు, సర్వే నెంబరు 118/ఏలో 0.5 ఎకరాలు, మందడంలో సర్వే నెంబరు 26/1లో 0.88 ఎకరాలు ఇలా బిట్లు బిట్లుగా 15 ఎకరాలకుపైగా కొనుగోలు చేశారు. ఆర్థిక స్థోమత రీత్యా రావూరు సాంబశివరావు, పోతూరు ప్రమీలకు కోట్లాది రూపాయలు వెచ్చించి పదుల ఎకరాల్లో భూమి కొనుగోలు చేసే తాహతులేదని చెబుతున్నారు. వీరే కాక, ఇలాంటి చాలామంది బంధువులు, సన్నిహితుల పేరుతో నారాయణ రాజధాని గ్రామాల్లో 3,129 ఎకరాల భూములను కొనుగోలు చేసినట్లు రాజధాని వ్యవహారాలను అతి సమీపం నుంచి పర్యవేక్షించే ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. 400 ఎకరాలు ఖాయం... తుళ్లూరు మండలం బోరుపాలెం ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాదు. కాబట్టి నారాయణ ఆ గ్రామంలో అసైన్డు భూములపై ప్రధానంగా దృష్టి సారించారు. ఒక్క బోరుపాలెంలోనే 50 ఎకరాల అసైన్డు భూమిని కొనుగోలు చేశారు. తుళ్లూరు మండలం రాయపూడి లంకల్లోని సర్వే నెంబరు 250 నుంచి 400 వరకూ వివిధ సర్వే నెంబర్ల పరిధిలోని మరో 50 ఎకరాలపైగా భూమిని కొనుగోలు చేశారు. బోరుపాలెం, రాయపూడి గ్రామాలకు చెందిన తోకల పేతురు, తోకల అంకులు, మెండెం నాగేశ్వరరావు, మెండెం కోటేశ్వరరావు, బుల్లెద్దుల చిన్నప్ప, వలపర్ల రామయ్య, లాలాది ఆదేయ్య, లాలాది సుందరరావు అనే రైతులు తమ భూములను మంత్రి నారాయణకు విక్రయించామని.. ఆ భూములకు సంబంధించిన పత్రాలన్నీ వారికే అప్పగించామని ‘సాక్షి’తో చెప్పారు. భూసమీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. రాజధాని గ్రామాల్లో ఎక్కడ భూములు ఉన్నా.. ఒకే ప్రాంతంలో ఇంటి ప్లాట్లు, వాణిజ్య స్థలం కేటాయించేలా దరఖాస్తు చేసుకుంటే ఆ మేరకు ఇచ్చేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వెనుక మంత్రి నారాయణ హస్తం ఉందని సమాచారం. అలా రాజధాని నగరంలో మంత్రి నారాయణ కోరుకున్న ప్రాంతం లో ఇంటి ప్లాట్లు, వాణిజ్య ప్లాట్ల రూపంలో 400 ఎకరాల భూమి దక్కనుందని ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. మంత్రి నారాయణ బినామీల్లో మచ్చుకు ముగ్గురు ఆవుల మునిశంకర్ మంత్రి నారాయణకు దూరపు బంధువు. వరుసకు బావమరిది అవుతారు. నాలుగేళ్లపాటు నెల్లూరులో వీఆర్సీ కాలేజీలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేశారు. నారాయణ మంత్రి పదవి చేపట్టిన నాలుగు నెలల తర్వాత తన మెడికల్ కాలేజీలో విద్యుత్ మరమ్మతుల బాధ్యతలను మునిశంకర్‌కు అప్పగించారు. అయితే అతని వేతనానికి సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని.. మునిశంకర్‌కు అవసరమైనప్పుడు మంత్రి నారాయణ వద్ద కొంత మొత్తం తీసుకుంటుంటారని ఆ కాలేజీ వర్గాలు తెలిపాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మునిశంకర్ నారాయణ మెడికల్ కాలేజీకి సమీపంలోని ప్రైవేటు అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. రాజధాని ప్రాంతంలో కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేసే స్థోమత మునిశంకర్‌కు ఉంటుందా? రాపూరు సాంబశివరావు మంత్రి నారాయణకు స్వయాన బావమరిది. మంత్రి నారాయణకు చేదోడువాదోడుగా వ్యవహరిస్తుంటారు. ఆయనకు సంబంధించిన వ్యవహారాలను సాంబశివరావే చక్కదిద్దుతుంటారు. రాపూరు సాంబశివరావు పేరు మంత్రి నారాయణ భారీ ఎత్తున ఆస్తులు కూడగట్టినట్లు నెల్లూరు వాసులు చెబుతున్నారు. ఇదే రీతిలో రాజధాని ప్రాంతంలోనూ ఆయన పేరుతో భూములు కొన్నారు. పొత్తూరి ప్రమీల మంత్రి నారాయణకు సన్నిహితురాలు. కర్ణాటక, తమిళనాడుల్లో నారాయణ కాలేజీల వ్యవహారాలను ఆమె పర్యవేక్షిస్తుంటారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రమీల ఆదాయం అంతంత మాత్రమే. సాధారణ కుటుంబానికి చెందిన ప్రమీలకు కోట్లాది రూపాయలు వెచ్చించి రాజధానిలో భూములు కొనుగోలు చేసే ఆర్థికస్థోమత ఉంటుందంటారా? రామకృష్ణార్పణం • రియల్ వెంచర్ 179.54 ఎకరాలు • అసైన్డ్ భూములు 54 ఎకరాలు రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కవడంతో అక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో రియల్ వెంచర్ వేసిన సంస్థనుంచి భారీగా ముడుపులు అందుకున్న సర్కారు పెద్దలు అక్రమాన్ని సక్రమం చేసేశారు. వివరాల్లోకి వెళితే... రాజధాని ప్రాంతానికి అత్యంత సమీపంలో పెదకాకాని మండలం నంబూరు గ్రామ పరిధిలో కోల్‌కత-చెన్నై జాతీయ రహదారి పక్కనే, నాగార్జున విశ్వవిద్యాలయం వెనుక రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సుమారు 179.54 ఎకరాల్లో ప్లాట్లు, విల్లాలు, అపార్టుమెంట్లు నిర్మించడానికి ప్రణాళిక రచించింది. కాజా గ్రామం లోని సర్వే నెంబర్లు 78 నుంచి 107 వరకు 94 ఎకరాలను రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేయగా మిగతా 76 ఎకరాలను నంబూరు గ్రామానికి చెందిన దళిత, పేద రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందులో సుమారు 54 ఎకరాలకుపైగా అసైన్డ్ భూ ములు ఉన్నాయి. ఈ భూములను రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేకపోయినా పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, అధికారులకు భారీగా ముడుపులు చెల్లించి సంస్థ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్టర్ అయిన భూముల్లో లే అవుట్లు వేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో వీజీటీఎం నుంచి అనుమతి లభించింది. భారీ ప్రచారం, మార్కెటింగ్ సిబ్బంది సహకారంతో అనతికాలంలోనే స్థలాలు, విల్లాల విక్రయానికి తెర తీసింది. చినబాబుకు భారీ వాటాలు రాజధాని ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భూముల్లో అసైన్డ్ భూములున్నాయనీ, ఆ భూమిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటామంటూ యాజమాన్యాన్ని బెదిరించారు. ఆ తర్వాత ఓ కేంద్ర మంత్రి మధ్య వర్తిత్వంతో రాయబేరాలు కుదరడంతో.. రియల్ దందాకు ప్రభుత్వ పెద్దలు దన్నుగా నిలిచారు. దీంతో ఆ వెంచర్లో చదరపు గజం రూ. 4 వేలకు ప్రారంభించి పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా రూ. 25 వేల వరకు విక్రయిస్తూ సంస్థ సొమ్ము చేసుకుం టోంది. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమను మోసం చేసి అసైన్డు భూములు కొనుగోలు చేసిందని నంబూరుకు చెందిన డేవిడ్ ఆధ్వర్యంలో దళిత పేద రైతులు గుంటూరు జిల్లా అధికార యం త్రాంగానికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వ్యవహారంలో చినబాబుకు భారీ ఎత్తున వాటాలు దక్కడంవల్లే గుంటూరు జిల్లా కలెక్టరు విచారణను అటకెక్కించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మంగళగిరి తహశీల్దార్ విజయలక్ష్మిని ‘సాక్షి’ వివరణ కోరగా కాలువలు పోరంబోకు భూములు ఉన్నట్టుగా గుర్తించామని చెప్పడం గమనార్హం. పయ్యావుల వాలారు! • కొనుగోలు 4.09 ఎకరాలు • చెల్లించినది 12.27 లక్షలు • ప్రస్తుత విలువ 8 కోట్లు ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నాయకులు రాజధాని ప్రాంత రైతులను మోసగించి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారనడానికి టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ భూముల కొనుగోళ్లే మరో ఉదాహరణ. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మిస్తానంటూ ఆర్భాటంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఎక్కడ నిర్మిస్తారో స్పష్టంగా చెప్పకుండా ముచ్చటగా మూడు పేర్లు ప్రజలను గందరగోళానికి గురిచేశారు. కానీ తన అనుయాయులకు మాత్రం రాజధాని ప్రాంతం విషయంలో ముందుగానే స్పష్టతనిచ్చారు. ఇంకేం అనంతపురానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ రాజధాని ప్రాంతంలో వాలిపోయారు. ఎక్కడ భూములు తక్కువ ధరకు లభిస్తాయో, ఏ భూములు కొంటే ఎక్కువ లాభం చేసుకోవచ్చో దగ్గరగా పరిశీలించారు. కోర్ కేపిటల్ లోని తుళ్లూరుకు అతి దగ్గరగా ఉండే అయినవోలు గ్రామంలో 4.09 ఎకరాలు కొనుగోలు చేశారు. సర్వే నెంబరు 48/3లో 2.13ఎకరాలు, సర్వే నెంబరు 49/3లో 1.96 ఎకరాలు కలిపి మొత్తం 4.09 ఎకరాల భూమిని 2014 అక్టోబరు 13న కేశవ్ పెద్దకుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎకరం 3.7 లక్షల చొప్పున 4.09 ఎకరాలను 12.27లక్షల రూపాయలకే కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కానీ అయినవోలులో ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరా రూ.2కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఏడాది వ్యవధిలో పయ్యావుల భూములకు 50 రెట్లకు పైగా ధర పలుకుతోంది. ప్రజారాజధాని నిర్మిస్తున్నామని, ప్రజల మద్దతు ఓర్వలేకనే ప్రతిపక్షం ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు గుప్పిస్తోందని పదేపదే గగ్గోలు పెట్టే పయ్యావుల కేశవ్ మరి రైతుల భూములను మభ్యపెట్టి కొని వారికి అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమో ఆయనే చెప్పాలి. ధూళిపాళ్ల ‘పోరంబోకు’ కథ! • అనధికారికంగా కొట్టేసింది 50 ఎకరాలు • రిజిస్ట్రేషన్ చేయించుకుంది 3.89 ఎకరాలు రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల భూకబ్జాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. చివరకు వాగు, డొంక, చెరువు పోరంబోకు భూములను సైతం వదలడం లేదు. కన్పించిన భూమినంతా కబ్జా చేసి.. రెవెన్యూ రికార్డులను తిరగరాయించి బినామీ పేర్లతో సొంతం చేసుకుంటున్నారు. ఇందుకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అనుచరుల తీరే తార్కాణం. రాజధాని ప్రకటనతో కోల్‌కత-చెన్నై జాతీయ రహదారి సమీపంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని వాగు పోరంబోకు భూములపై ఎమ్మెల్యే నరేంద్రకుమార్ కన్ను పడింది. ఒత్తిళ్లతో రిజిస్ట్రేషన్ నంబూరులో సర్వే నెంబరు 274లోని 3.89 ఎకరాల వాగు పోరంబోకు భూమిని తన సమీప బంధువు దేవర పుల్లయ్య పేరుతో సొంతం చేసుకోవడానికి ధూళిపాళ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రెవిన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి రెండుమూడు చేతులు మార్చినట్లుగా చూపి డాక్యుమెంట్ నెంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. మొదటగా పుల్లయ్య కొడుకు సాంబశివరావు తన భూమిగా దీన్ని చిత్రీకరించి ఉప్పుటూరి కిరణ్‌కుమార్, అడుసుమల్లి రవికిరణ్, వెన్నా పెద అచ్చిరెడ్డిలకు జీపీ(జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) రిజిస్ట్రేషన్లు చేశారు. దీంతో లింకు డాక్యుమెంట్లు పుట్టించారు. ఆ తరువాత ఈ ముగ్గురితో సాంబశివరావు తండ్రి దేవర పుల్లయ్యకు విక్రయించినట్లు సృష్టించారు. ఎమ్మెల్యే ధూళిపాళ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు సర్వే నంబరు 274ను 274/బి6, బి7, బి8 సబ్ డివిజన్లుగా విభజించి దేవర పుల్లయ్య పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ సుమారుగా రూ. 5 కోట్ల వరకూ ఉంటుంది. మొత్తం 50 ఎకరాల పోరంబోకు కబ్జా ఈ భూమిని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్న ఎమ్మెల్యే తన అనుచరులతో ఆ భూమిలో బోర్లు వేసి, సాగుచేసేందుకు సమాయత్తమవుతున్నారు. బోరు వేసేందుకు అనుమతులు ఇవ్వాలంటూ వీఆర్వోకు ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చారని తెలిసింది. ఈ భూమి వాగు పోరంబోకు అని గ్రామ ప్రజలందరికీ తెలిసినా ఏం చేయలేని నిస్సహాయ స్థితి వారిది. అడ్డుతగిలితే తప్పుడు కేసులు పెట్టించడం, లేదా దాడులు చేయించడం వంటివి చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఒక్క పెదకాకాని మండలంలో ఎమ్మెల్యే అనుచరులు సుమారు 50 ఎకరాల వాగు పోరంబోకు భూములు కబ్జా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొమ్మాలపాటి కుచ్చుటోపీ! • కొనుగోలు 42 ఎకరాలు • చెల్లించినది రూ. 1.26 కోట్లు • ప్రస్తుత విలువ: రూ. 210 కోట్లు రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి.. టీడీపీ ప్రజా ప్రతినిధుల రౌడీయిజానికి ఇదో తార్కాణం. ఏడేళ్ల కిందట మంగళగిరికి సమీపంలో నెలసరి కంతులపై మూడువేల మందికి విక్రయించిన భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్ నిరాకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఆయన వినియోగదారులకు టోపీ పెట్టారు. ప్లాట్లు ఇచ్చేది లేదంటూ బెదిరిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా అధినేతపై ఒత్తిడి తెచ్చి రూ.210 కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని భూసమీకరణ నుంచి తప్పించారు. ప్రతిఫలంగా చినబాబుకు భారీ ఎత్తున వాటాలు అందినట్లు సమాచారం. సభ్యులకు కుచ్చుటోపీ గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విజయవాడ, గుంటూరు కేంద్రాలుగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్లను వేసి వాయిదాల పద్ధతిలో ప్లాట్లను విక్రయిస్తూ వస్తున్నారు. అదే సంస్థ యర్రబాలెంలో అమరావతి టౌన్‌షిప్‌ను ఆనుకుని సర్వే నంబర్ 485 నుంచి 500 వరకు 42 ఎకరాలు కొనుగోలు చేసింది. సభ్యుడిగా చేరేందుకే రూ.25 వేల వంతున చెల్లించి, తదుపరి వాయిదాలు చెల్లించారు. 2009లో ప్లాట్ల విక్రయాలు ప్రారంభించిన సంస్థ 2012 నాటికే సభ్యుల నుంచి పూర్తి వాయిదాలను వసూలు చేసింది. ఒక్కనెల వాయిదా కట్టకపోయినా డిఫాల్టరుగా మార్చి మెజారిటీ సభ్యులకు శఠగోపం పెట్టారు. పూర్తిగా డబ్బు కట్టిన వారికి కూడా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇంతలో యర్రబాలెం గ్రామం సైతం భూ సమీకరణలోకి చేరడంతో వెంచర్‌కు అనుమతులు నిలిచిపోయాయి. దీంతో పూర్తిగా నగదు చెల్లించిన సభ్యులు సంస్థను సంప్రదించగా అధికార పార్టీ అండ ఉండడంతో సభ్యులకు నయానోభయానో విషయం బయటకు పొక్కకుండా కొంతమందికి వేరే వెంచర్లో ప్లాట్లను కేటాయిస్తామంటూ నమ్మబలికి.. ఆ తర్వాత మొండిచేయి చూపారు. ఈ విధంగా ఒక్క యర్రబాలెం వెంచర్‌లోనే సంస్థ సుమారు రూ.15 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిందని తెలిసింది. సమీకరణ నుంచి తప్పించేశారు.. యర్రబాలెం గ్రామంలో అధిక శాతం మంది రైతులను బెదిరించి భూములు లాక్కోవడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. కానీ.. అభినందన రియల్ ఎస్టేట్ వెంచర్‌కు చెందిన 42 ఎకరాల భూములను భూ సమీకరణకు ఇవ్వకపోగా.. డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్‌లో సైతం వదిలేసింది. సీఎం చంద్రబాబునాయుడు ఒత్తిడే ఇందుకు కారణమని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ భూములకు అన్ని మినహాయింపులు ఇచ్చి.. రాజధానిలో మెగా సిటీ రూపొందించడానికి ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది. తుది మాస్టర్ ప్లాన్ విడుదలైన వెంటనే రాజధానిలో తొలి ప్రైవేటు రియల్ మెగా సిటీని ప్రకటించేందుకు సంస్థ సిద్ధమవుతుండగా, అందుకు సీఆర్డీఏ నుంచి అనుమతులు ఇప్పించేందుకు చినబాబు చక్రం తిప్పుతున్నారు. ఆ మేరకు ఆ వెంచర్లో చినబాబు వాటాలు పొందినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇదే అంశంపై సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ లలితకుమారి వివరణ కోరగా... 485 నుంచి 500 సర్వే నంబర్ల వరకు 42 ఎకరాలు భూసమీకరణలోనే ఉన్నాయన్నారు. అయితే ఇప్పటివరకు ఆ భూములను సమీకరణకు ఇవ్వలేదన్న అంశాన్ని ఉన్నతాధికారులకు తెలిపామంటూ దాటవేశారు. ఇదే విషయంపై సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌ను సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించారు. కోడెల తనయుడా? మజాకా? • కొనుగోలు 17.3 ఎకరాలు • చెల్లించినది రూ. 93 లక్షలు • ప్రస్తుత విలువ 18.4 కోట్లు రాజధాని ప్రాంతంలో భూములను కొల్లగొట్టడంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణ రూటే సపరేటు. వివాదాస్పదమైన భూములను గుర్తించడం.. అధికార బలాన్ని ఉపయోగించి వాటిని తక్కువ ధరలకే సొంతం చేసుకోవడంలో ఆయనది అందెవేసిన చేయి అని సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. రాజధానిపై ప్రకటన వెలువడిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రధాన రాజధానికి సమీపంలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో భూములను సొంతం చేసుకోవడా నికి కోడెల శివరామకృష్ణ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గ పరిధిలోని వివాదాస్పదమైన భూములను గుర్తించడం.. వివాదం ఎవరి మధ్య నడుస్తుందో తెలుసుకోవడం.. అందులో ఒక వర్గాన్ని కోడెల శివరామకృష్ణ వద్దకు తీసుకెళ్లడమే ప్రత్యేక బృందాల బాధ్యత. తన వద్దకు వచ్చిన వారిని బతిమాలో బెదిరించో.. నయానో భయానో తక్కువ ధరలకు వివాదాస్పదమైన భూములు కొనుగోలు చేసి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వాటిని తన బినామీల పేర్లతో కొట్టేయడం రివాజుగా మారింది. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో సర్వే నెంబర్లు 167-1ఏ, 167-1సీ, 168-1, 168-3లో 17.3 ఎకరాల భూమి ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తోంది. ఇది పసిగట్టిన కోడెల శివరామకృష్ణ ఒకరిని తన వద్దకు పిలిపించుకుని.. తన వ్యక్తిగత సహాయకుడు గుత్తా నాగప్రసాద్ మేనేజింగ్ పార్ట్నర్గా వ్యవహరిస్తున్న శశి ఇన్ఫ్రా పేరుతో ఎకరం రూ.ఎనిమిది లక్షల చొప్పున కొనుగోలు చేశారు. వాస్తవంగా ఆ ప్రాంతం ఎకరం రూ.1.50 కోట్లకుపైగా పలుకుతోండటం గమనార్హం. కోడెల తనయుడి వ్యవహారంపై ఇదే వివాదంతో సంబంధం ఉన్న మరో వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ.. అదేమీ పట్టని రెవెన్యూ యంత్రాంగం ఆ భూమిని గుత్తా నాగప్రసాద్‌కు కట్టబెట్టేసింది. కోడెల శివరామకృష్ణ ఇదే పద్ధతిలో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీ ఎత్తున భూములు కొట్టేసినట్లు ఆ నియోజకవర్గాల ప్రజలు చెబుతున్నారు. ఎవరీ గుత్తా నాగప్రసాద్? గుత్తా నాగ ప్రసాద్ సొంతూరు ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పోలూరు. సాధారణ కుటుంబానికి చెందిన నాగ ప్రసాద్ బీటెక్ (సివిల్ ఇంజనీరింగ్) చదువుకున్నారు. కోడెల పెద్ద కుమారుడు సత్యనారాయణ ప్రమాదం మరణించినపుడు నాగప్రసాద్‌కు ఆ కుటుంబంతో సన్నిహిత బంధం ఏర్పడింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ కోడెల వ్యవహరించే సమయంలో నాగ ప్రసాద్‌ను తన వద్దకు పిలిపించుకున్నారు. ఆసుపత్రిలో కాంట్రాక్టు పనులను నాగ ప్రసాద్‌తో చేయించేవారని సమాచారం. కేడెల క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత నాగప్రసాద్ ఆయన వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నారు. కోడెల స్పీకర్ పదవిని చేపట్టిన తరువాత ఆయన తనయుడు కోడెల శివరామ కృష్ణకు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తూనే.. గుంటూరు లో హోండా షోరూంలో ప్రైవేటు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. చిలుకలూరిపేటలో అద్దె ఇంట్లో నివాసముంటున్న నాగ ప్రసాద్.. కోడల తరఫున సత్తెనపల్లి, నరసరావుపేట నియో జకవర్గాల్లో పనులు చక్కబెడుతుంటారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాగ ప్రసాద్‌కు కోట్లాది రూపాయలు వెచ్చించి.. భూములు కొనుగోలు చేసే స్థోమత ఉంటుందా? హాయ్‌ల్యాండ్.. హాంఫట్! బేరం కుదిరింది.. రూ.425 కోట్ల విలువైన ‘అగ్రిగోల్డ్’ భూములు చినబాబు వశమయ్యాయి రాజధాని పేరుతో భారీ దోపిడీకి తెరలేపిన ప్రభుత్వ పెద్దలు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదనడానికి హాయ్‌ల్యాండ్ భూములే ఉదాహరణ. కోల్‌కోత-చెన్నై జాతీయ రహదారిపై మంగళగిరి మండలం చినకాకానిలో 85.13 ఎకరాల భూమిని అగ్రిగోల్డ్ కొనుగోలు చేసి హాయ్ ల్యాండ్ పేరుతో అభివృద్ధి చేసింది. ఎకరం రూ.4 నుంచి రూ.4.50 కోట్ల వరకూ పలికే ఈ భూమిపై ప్రభుత్వ పెద్దల కళ్లు పడ్డాయి. ఆ భూములను కొట్టేయాలన్న మందస్తు ఎత్తుగడలో భాగంగా.. వాటిని రాజధాని భూసమీకరణ నుంచి తప్పించారు. తనకు సన్నిహితుడైన ఓ పోలీసు ఉన్నతాధికారిని ప్రభుత్వ పెద్ద రంగంలోకి దించారు. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న భూములు అప్పగిస్తే కేసుల నుంచి తప్పిస్తామంటూ అగ్రిగోల్డ్ యజమానులకు రాయబారం పంపారు. అప్పటికే పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయిన అగ్రిగోల్డ్ యాజమాన్యం అందుకు అంగీకరించడంతో కేసుల నుంచి తప్పించేందుకు 32 లక్షల మంది డిపాజిట్‌దారుల ప్రయోజనాలను ప్రభుత్వ పెద్ద పణంగా పెట్టారు. టీడీపీ అధికారం చేపట్టి 21 నెలలైనా అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేయలేదు. ప్రతిఫలంగా రూ.425 కోట్ల విలువైన హాయ్ ల్యాండ్‌ను చినబాబు కొట్టేశారు. హైకోర్టు ఆదేశించినా సీఐడీ విచారణను ఓ కొలిక్కి తేలేకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ పెద్ద ఒత్తిళ్లేనన్నది పోలీసు వర్గాల అభిప్రాయం. క్విడ్ ప్రోకో అంటే ఇదీ అని టీడీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తోండటం గమనార్హం. హైకోర్టు ఆగ్రహించినా... అగ్రిగోల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, కర్ణాటక, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 32 లక్షల ఖాతాదారుల నుంచి సుమారు రూ.6850 కోట్లను డిపాజిట్లను ఈ సంస్ధ సేకరించింది. ఆ డబ్బులతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసింది. గడువు తీరిపోయినా అధిక శాతం మంది డిపాజిట్‌దారులకు నగదు చెల్లించకపోవడం వివాదాస్పదంగా మారింది. దాంతో ఏడు రాష్ట్రాలతోపాటూ మన రాష్ట్రంలోనూ 2014 నవంబర్ నుంచి ఖాతాదారులు, ఏజెంట్లు ఆందోళనలకు దిగారు. అగ్రిగోల్డ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఆగస్టు, 2015లో హైకోర్టులో బాధితులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ఎక్కడ సీబీఐ విచారణకు ఆదేశిస్తుందోనని ఆందోళన చెందిన ప్రభుత్వ కీలక నేత.. తన చెప్పుచేతల్లో ఉండే సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ హడావుడిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన మొత్తం సుమారు 16 వేల ఎకరాల భూమికి సంబంధించి కొనుగోళ్లూ, అమ్మకాలు స్థంభించిపోయాయి. సీఐడీ దర్యాప్తు నత్తనడకన సాగుతోండటంతో ఆగస్టు, 2015లో ఉమ్మడి హైకోర్టు జోక్యం చేసుకుంది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులు, ఆ సంస్థ, అనుబంధసంస్థల్లో ఉన్న డెరైక్టర్లు, భాగస్వాముల వివరాలు, వారి ఆస్తులు వివరాలు అందజేయాలని దర్యాప్తు సంస్థను అదేశించింది. ఒకానొక సందర్భంలో దర్యాప్తు తీరు ఎంత మాత్రం సంతృప్తికరంగా లేదని, దర్యాప్తు అధికారిని మార్చాలని, లేని పక్షంలో తామే అందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. అనుమతి లేకుండా ఆస్తులు విక్రయించేందుకు ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణిస్తామని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని హెచ్చరించింది. పక్షం రోజుల క్రితం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంలో ఎట్టకేలకు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేశారు. కానీ.. కేసు విచారణను నీరుగార్చుతూ వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారు. రూ.200 కోట్ల విలువైన హాయ్ ల్యాండ్ కోసం 32 లక్షల మంది మదుపుదారుల ప్రయోజనాలను పణంగా పెట్టడంపై టీడీపీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అగ్రిగోల్డ్ భూముల క్రయ విక్రయాలు నిలిచిపోయినా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అగ్రిగోల్డ్‌కు చెందిన 14 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడం గమనార్హం. -
స్మార్ట్ సిటీగా నెల్లూరు
ఆస్ట్రేలియా కాన్సులేట్ బృందంతో మంత్రి నారాయణ చర్చలు విజయవాడ బ్యూరో : నెల్లూరు నగరాన్ని స్మార్ట్ నగరంగా అభివృద్ధి చేసేందుకు ఆ స్ట్రేలియా ప్రభుత్వం ముందుకొచ్చినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ చెప్పారు. చెన్నయ్‌లోని ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సీన్ కెల్లీ బృందంతో ఆయన మంగళవారం సీఆర్డీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారాయణ నెల్లూరు నగరం ప్రత్యేకతలను వారికి వివరించారు. సముద్రానికి దగ్గరగా ఉండడం, కృష్ణపట్నరం పోర్టు, సమీపంలోనే చెన్నయ్ ఎయిర్‌పోర్టు ఉండడం, కావాల్సినంత భూమి కూడా అందుబాటులో ఉండడం వల్ల ఈ నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని తెలిపారు. ఇందుకు ఆస్ట్రేలియా బృందం సమ్మతించింది. తిరుపతి నగరాన్ని కూడా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారు. వీటితోపాటు రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో మాస్టర్‌ప్లాన్, సిటీ ప్లానులు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉత్తమ నమూనాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు మున్సిపల్ శాఖ, ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం అంగీకరించాయి. విద్య, పర్యాటకం ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో తాము ఏపీకి మద్ధతు ఇస్తామని కెల్లీ తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియా బృందాన్ని నారాయణ ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి పరిచయం చేసి వివరాలు తెలిపారు. -
రెండు స్మార్ట్‌సిటీలు మన అదృష్టం
మంత్రి నారాయణ విజయవాడ బ్యూరో: ఐదేళ్లలో అభివృద్ధి చేసేలా దేశంలో 92 స్మార్ట్ సిటీలు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీలో మూడు నగరాలకే అవకాశం ఇచ్చిందని అప్పట్లో బాధపడ్డానని, ఇప్పుడు తొలి దశలోని 20 స్మార్ట్ సిటీల్లో ఏపీకి రెండు ఇవ్వడం ఆనందంగా ఉందని మంత్రి నారాయణ చెప్పారు. విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో మూడు స్మార్ట్ సిటీలను ఎంపికచేయగా తొలిదశలో తిరుపతిని మినహాయించి విశాఖ, కాకినాడలను అభివృద్ధి చేయనున్నట్టు గురువారం కేంద్రంప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని అన్నారు. విశాఖలో 1,620 ఎకరాల్లో విస్తరించిన రుషికొండ, ఆర్కే బీచ్, కైలాసగిరి ప్రాంతాల్లో రూ.1,602 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కాకినాడలో 1,375 ఎకరాల్లో విస్తరించిన గాంధీనగర్, రామారావుపేట, రామకృష్ణారావుపేట, సూర్యారావుపేట, ఎల్వీన్పేట, మెయిన్‌రోడ్డు, బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్, పోర్టు, కచేరినగర్, ఏటిమొగ, వెంకటేశ్వరకాలనీలను రూ.1,993 కోట్లతో అభివృద్ధి చేస్తారన్నారు. వీటి అభివృద్ధికి కేంద్రం రూ.500, రాష్ట్రం రూ.500కోట్లు కేటాయిస్తుందని, మిగిలిన మొత్తాన్ని ప్రైయివేటు, పబ్లిక్ పార్టనర్షిప్(పీపీపీ) పద్దతిలో సమకూర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన రెండు స్మార్ట్ సిటీలతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలను స్మార్ట్ సిటీలుగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. మూడు నెలల్లో వాటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించాలని సీఎం చెప్పారన్నారు. -
కనిపించని నారాయణ
వినిపించని అభివృద్ధి పారాయణ పూటకో నజరానాతో రాజధాని గ్రామాలలో హడావుడి పని పూర్తయ్యాక పత్తాలేని వైనం విడుదలకు నోచని గ్రామాలకు ప్రకటించిన సాయం భూ సమీకరణ వేగంగా పూర్తి చేయడానికి మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ అనేక గిమ్మిక్కులు చేశారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా రాజధాని గ్రామాల్లో పర్యటించారు. మీతోనే.. నేను అంటూ ప్రజలతో మమేకమయ్యారు. చెట్ల కింద భోజనాలు చేశారు. సమీకరణకు సహకరించిన నేతలు, గ్రామస్తులను సత్కరించారు. వారి నుంచి తానూ సత్కారాలు పొందారు. గుర్రమెక్కి ఊరేగారు. భూ సమీకరణ ముందుగా పూర్తి చేసిన గ్రామాలకు నజరానాలు {పకటించారు. ఇంత హడావుడి చేసిన మంత్రి భూ సమీకరణ కార్యక్రమం పూర్తయిన తరువాత ఒట్టు తీసి గట్టుమీద పెట్టిన రీతిలో వ్యవహరించారు. అమరావతి శంకుస్థాపన తరువాత రాజధానివైపు కన్నెత్తి చూడటం లేదు. -సాక్షి ప్రతినిధి, గుంటూరు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూ సమీకరణ నోటిఫికేషన్‌ను మొదట్లో అన్ని గ్రామాల రైతులు పూర్తిగా వ్యతిరేకించారు. ఈ విధానంపై అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం టీడీపీ గ్రామాలను ఎంచుకుంది. మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అక్కడి టీడీపీ నేతలు, కార్యకర్తలను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనా విధానంపై అవగాహన కలిగించారు. రైతుల నుంచి భూ సమీకరణకు వ్యతిరేకత లేకుండా చూసే బాధ్యతను స్థానిక నేతలకు అప్పగించారు. తొలుత తుళ్ళూరు మండలంలోని టీడీపీ అనుకూల గ్రామాలను ఎంచుకున్నారు. ముఖ్యంగా నేలపాడు, ఐనవోలు, శాఖమూరు, తుళ్ళూరు, దొండపాడు, బోరుపాలెం, అబ్బురాజుపాలెం తదితర గ్రామాల రైతులను మంత్రి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్‌కుమార్‌లు ఎక్కువగా కలిశారు. ఉత్సాహపరిచి.. ఆనక నీరుగార్చి.. మంత్రి నారాయణ రాజధాని గ్రామాల్లో రేయింబవళ్లు పర్యటించారు. గ్రామాల్లోని వార్డు స్థాయి నాయకుడిని కూడా కలిసి భూ సమీకరణ కార్యక్రమానికి మనమంతా సహకరించాలి... ప్రపంచం మెచ్చే రాజధానిని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్న సీఎం చంద్రబాబుకు మనమంతా అండగా ఉందాం..రాజధాని నిర్మాణంతో మనమూ.. పెరుగుదాం అంటూ వారిని ఉత్సాహ పరిచారు. భూ సమీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన గ్రామాలకు నజరానాలు ప్రకటించారు. ఒకో గ్రామానికి రూ.30 లక్షలను ప్రభుత్వం నుంచి సహాయంగా ఇప్పిస్తానని, డ్రైనేజి, రక్షిత మంచినీటి సరఫరా, వీధిలైట్ల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎల్ఈడీ బల్బులు వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. అధికారులతో యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనలు తయారు చేయించారు. దీనితో తుళ్ళూరు మండల పరిధిలోని నేలపాడు, ఐనవోలు గ్రామాలు 99 శాతం భూములను రెండు నెలల్లోపే భూ సమీకరణకు అందించాయి. మిగిలిన గ్రామాలు అటు ఇటుగా భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చేశాయి. నాయకుల్లో అసహనం.. భూ సమీకరణ పూర్తయి నాలుగు నెలలు గడిచినా మంత్రి నారాయణ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రతిపాదనలన్నీ అటకెక్కాయి. ముందుగా భూములు ఇచ్చిన గ్రామాలకు మంత్రి ప్రకటించిన రూ.30 లక్షల సహాయం ఇంకా విడుదలకాలేదు. ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి. రాజధానిలోని అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీ కొన్ని గ్రామాల్లోనే అమలు పరిచారు. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలు ఏ దశలో ఉన్నాయో తెలి యని పరిస్థితి. దీనికితోడు నిత్యం రాజధాని గ్రామాల ప్రజలతో మమేకం అయిన నారాయణ శంకుస్థాపన తరువాత అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిణామాలకు భూములు ఇచ్చిన రైతులు కలవరం చెందుతుంటే, పచ్చని పంటలు పండే మాగాణి భూముల్లో పెరిగిన పిచ్చి మొక్కల్ని చూసి టీడీపీ నేతలు తప్పుచేశామనే భావనతో మధనపడుతున్నారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల : తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో రాష్ట్ర మంత్రి నారాయణ, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి, చిత్తూరు జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, రాజ మండ్రి మేయర్ రజని శేషసాయి, న్యూఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ జాయింట్ సెక్రటరీ కైలాష్ చం ద్ సామారియా ఉన్నారు. వీరు కుటుంబ సభ్యులతో కలసి ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. ఆలయాధికారులు ప్రత్యేక దర్శ న ఏర్పాట్లు చేసి, లడ్డూప్రసాదాలు అందజేశారు. -
కృష్ణా, పెన్నాలను అనుసంధానం చేస్తా
♦ డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించి వడ్డీ మాఫీ ♦ నెల్లూరు జిల్లా పొదలకూరు బహిరంగసభలో సీఎం చంద్రబాబు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ కుమార్తె వివాహమహోత్సవానికి విచ్చేసిన సందర్భంగా సీఎం శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పొదలకూరు సమీపంలో రూ.62 కోట్లతో కండలేరు ఎడమకాల్వ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జెడ్పీ ఉన్నతపాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. నీటిని ఎలా వాడుకోవాలో త్వరలోనే ‘వైట్‌పేపర్’ను విడుదల చేస్తామని తెలిపారు. కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తే నెల్లూరు జిల్లాకు కరువనే సమస్యే ఉండదన్నారు. కారిడార్‌గా కృష్ణపట్నం కృష్ణపట్నం పోర్టును ఒక గొప్ప కారిడార్‌గా తీసుకురానున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. క్రిబ్కో, కంటైనర్ కేంద్రం, మానసిక వికలాంగుల కేంద్రం, జాతీయ కామధేను, తుపాను కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీతోపాటు ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్రంతో సంప్రదిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. డెఫిసిట్ కింద కేంద్రం డబ్బులు ఇవ్వాల్సి ఉందన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.1,500 కోట్ల వడ్డీమాఫీ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించి రూ.1,500 కోట్ల వడ్డీని మాఫీ చేసినట్లు సీఎం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీల కోసం 50 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. మంత్రులు దేవినేని ఉమ, శిద్దా రాఘవరావు, ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ రైతులను ప్రధాని మోదీ దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం..
మంత్రి నారాయణ తుళ్లూరు : రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన 29 గ్రామాల ైరె తులను దేశ ప్రధాని నరేంద్రమోడీ దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని పురపాలకశాఖ మంత్రి నారాయణ చెప్పారు. శంకుస్థాపన ప్రాంతమైన ఉందడ్రాయునిపాలెంలో సభ ఏర్పాట్లను, శంకుస్థాపన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 3,60,000 చదరపు అడుగుల్లో వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం పిలుపు మేరకు మన ఊరు-మన మట్టి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం నుంచి రైతులు మట్టి, నీరు తీసుకువస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాలకు సంబంధించిన నదుల నుంచి నీరు, మట్టి తీసుకువస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ కాంతిలాల్ దండే, కృష్ణ జిల్లా కలెక్టర్ బాబు, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తదితరులున్నారు. -
రాజధానిలో 8 ప్రత్యేక నగరాలు
-
రాజధానిలో 8 ప్రత్యేక నగరాలు
5టీఎంసీల స్టోరేజీకి ప్రకాశం బ్యారేజీ పెంపు గన్నవరం విమానాశ్రయంలో 16 పార్కింగ్ స్టాండ్లు సీఆర్డీఏ సమీక్షలో చంద్రబాబు విజయవాడ బ్యూరో: రాజధానిలో నాలెడ్జ్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్, జస్టిస్‌తోపాటు మరో నాలుగు నగరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. బుధవారం రాజధాని వ్యవహారాలపై తన క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అధికారులతో సమీక్షించారు. ఈ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. సమీక్ష ముఖ్యాంశాలు ఇవీ.. రాజధానిలో 8 నగరాల ఏర్పాటు ప్రతిపాదనలకు కన్సల్టెన్సీలను నియమించుకోవాలి.{పస్తుతం 3టీఎంసీలున్న ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యాన్ని 5టీఎంసీలకు పెంచేందుకు పరిశీలించాలి. అక్టోబర్ 22న రాజధాని శంకుస్థాపనకు జపాన్ వాణిజ్య శాఖా మంత్రి రానున్నారు. రాజధాని ప్రాంతంలో 19,679 మంది కూలీలకుగాను 13,600 మందికి రూ.2,500 పెన్షన్ ఇస్తున్నారు. మిగిలిన వారికి త్వరలో ఇచ్చేయాలి. మాస్టర్‌ప్లాన్‌కు డ్రాఫ్ట్‌ను రూపొందించాలి. ఈ పనిని 30రోజుల్లో పూర్తి చేయాలి. గన్నవరం విమానాశ్రయంలో విమాన పార్కింగ్ స్టాండ్లను 16కు విస్తరించాలి. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా జాతీయ రహదారికి వెళ్లేందుకు ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలి. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూసమీకరణను పూర్తి చేయాలి. {బిడ్జి ఇంటర్నేషనల్ అకాడమీస్(బీఐఏ) ఏపీని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వామి కావడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సంస్థ సహ వ్యవస్థాపకురాలు, చీఫ్ స్ట్రేటజీ అధికారి షన్నన్‌మే బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు.{పభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల తరలింపును వేగవంతం చేయాలి. జవహర్‌రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీదే ఈ బాధ్యత. రాజధాని శంకుస్థాపన పైలాన్ ఏపీ ఆకాంక్షలకనుగుణంగా ఉండాలి. దీన్ని భవిష్యత్తులో పార్కుగా మార్చేలా చూడాలి. ఆకస్మిక తనిఖీలు చేస్తా : సీఎం అన్ని పట్టణాలు, నగరాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం జరిగిన మున్సిపల్ కమిషనర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి అన్ని నగరాలు, పట్టణాల్లో బహిరంగ మరుగుదొడ్లు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.దేశంలోని టాప్-100 మున్సిపాల్టీల్లో రాష్ట్రం నుంచి ఒక్క మున్సిపాల్టీకి చోటు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంను కలిసిన జపాన్ బృందం రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటామని జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్(జేబీఐసీ), జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. ఈమేరకు వారు బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్‌ను ప్రాధాన్యత రంగాలకు.. కీలక రంగాల్లో ఏర్పడే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి విశ్లేషించే ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్‌ను ప్రాధాన్యత రంగాలకు వర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి ఐటీ, కమ్యూనికేషన్ శాఖ సమీక్షలో మాట్లాడారు. -
మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : కడప నారాయణ కళాశాలలో ఈనెల 17న నందిని, మనీషా అనే విద్యార్థినులు మృతి చెందడంపై న్యాయ విచారణ జరిపించాలని,మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు శనివారం కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, అంజద్‌బాషా, నగర మేయర్ సురేష్‌బాబు తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే ఐఎస్ఎఫ్, ఆర్ఎస్యూ, ఆర్ఎస్ఎఫ్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. సీపీఎం నగర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి సుబ్బరాయుడులు విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నందిని, మనీషాల మృతిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని, అవి హత్యలా? ఆత్మహత్యలా? అన్న విషయాన్ని న్యాయ విచారణ ద్వారా నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడంతోపాటు ఆయన విద్యా సంస్థల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీలో తల్లిదండ్రులనుగానీ, విద్యార్థి సంఘాలనుగానీ ఎందుకు చేర్చలేదో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
7 నుంచి ఏపీ మున్సిపల్ కార్మికుల సమ్మె
మంత్రి మమ్మల్ని అవమానించారు: కార్మిక సంఘాలు హైదరాబాద్: ఏపీ మున్సిపల్ కార్మికులు ఈ నెల 7వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె బాట పట్టనున్నారు. తమ డిమాండ్లపై చర్చల పేరుతో ప్రభుత్వం పలుమార్లు ఆహ్వానించి, అవమానించిందని ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. పదేపదే చర్చల కోసం పిలిచిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తమను తీవ్రంగా అవమానించారని ఆరోపించింది. -
జూన్‌లో తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు
ఆస్తి పన్ను చెల్లించకపోతే ఏ ఒక్కరినీ వదలం మున్సిపల్ శాఖమంత్రి నారాయణ వెల్లడి తిరుపతి కార్పొరేషన్: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈ ఏడాది జూన్ లేదా జూలైలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గురువారం తిరుపతి కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి న మంత్రి కమిషనర్ వినయ్‌చంద్ ఆధ్వర్యంలో వివిధవిభాగాల అధికారులతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా స్మార్ట్ సిటీ ఏర్పాటుకు అనుసరించాల్సిన పద్ధతులు, స్వచ్ఛ తిరుపతి, కార్పొరేషన్లో అమలుచేస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వివరాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జపాన్ తరహాలో సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఇందుకు ఏడాదిన్నర సమయం పడుతుందని చెప్పారు. పుంగనూరులో ఆస్తి పన్ను చెల్లింపులో అపశ్రుతి చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌తో విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. మున్సిపాల్టిల్లో ఏమేరకు సేవలు అందిస్తున్నామో అదే స్థాయిలో పన్నులు కూడా వసూలు చేస్తామన్నారు. పన్నులు చెల్లించకపోతే ఏ ఒక్కరినీ వదిలేది లేదన్నారు. అవసరమైతే బకాయిదారుల వివరాలను వెబ్సైట్లలో పెడతామన్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత ఉందని, ఈనేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వారి సేవలను ఉపయోగించుకుంటామన్నారు .మంత్రితో పాటు తిరుపతి ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ, కమిషనర్ వినయ్‌చంద్ పాల్గొన్నారు. రైతులకు పరిహారం చెల్లించేందుకు సిద్ధం రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములను అందించిన రైతులకు పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం 7వేల చదరపు అడుగుల స్థలం అవసరమైందన్నారు. జూన్ చివరకుడిజైన్ పూర్తిచేస్తామన్నారు. ఢిల్లీ కన్నా మంచి రాజధాని కట్టాలన్నది లక్ష్యం అన్నారు. రైతులకు చెల్లించాల్సిన పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వారిని పిలిపించి సర్వే చేసిన ఆధారంగా పరిహారం ఇస్తామన్నారు. ఇప్పటికే 5వేల ఎకరాలకు సంబంధించి డీడీలను సిద్ధం చేశామని స్పష్టంచేశారు. -
మంత్రి కళాశాలపై సమాచారం ఇవ్వడం లేదు..
ఆర్టీఐ సమావేశాలు నిర్వహించడం లేదు సమాచారం అడిగినందుకు కుల సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు అడిగితే ముఖ్యమంత్రికి చెప్పుకోమంటున్నారు ఆర్టీఐ కమిషనర్‌కు ఫిర్యాదుల వెల్లువ తిరుపతి కార్పొరేషన్ రాష్ట్ర మంత్రి నారాయణకు సం బంధించిన కళాశాలల గురించి సమాచా రం అడిగితే ఇవ్వడం లేదని సీపీఎం జయచంద్ర రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ పి.విజయబాబుకు ఫిర్యాదు చేశా రు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, వైఎస్ఆర్ సమావేశ మం దిరంలో రాయలసీమ పరిధిలోని సమాచార హక్కు చట్టం కింద కేసులను విచారించారు. పలువురు నేరుగా కమిషనర్ వద్దకు చేరుకుని ఆర్టీఐ ద్వారా తమకు సమాచారం అందడం లేదంటూ ఫిర్యా దు చేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.జయచంద్ర మాట్లాడుతూ గిరిజన, వెనుకబడిన తరగతుల స్కాలర్షిప్స్, ఫీజు రీయంబర్స్మెంట్ వివరాలు ఇవ్వాలని నవంబర్‌లో కలెక్టరేట్ కార్యాల యంలో దరఖాస్తు చేసానన్నారు. రెండు నెలలు అవుతున్నా ఇంతవరకు సమాచారం ఇవ్వకపోగా ఉపయోగం లేని సమాచారం ఇస్తూ అవినీతి ని ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ బాలుర, బాలికల డిగ్రీ కళాశాలలో సమాచారం కోరితే 46 రోజులు గడుస్తున్నా ఇవ్వడం లేదన్నా రు. రెవెన్యూ పరమైన సమాచారం ఇవ్వ డం లేదని, దీనికి భాద్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ స్పందిస్తూ మీకు సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుల సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు.. తిరుపతిలో తనకు బట్రాజు (బిసి-డి) కుల సర్టిఫికెట్ ఇవ్వకుండా అవమాని స్తున్నారంటూ లేపాక్షి ఈశ్వర్‌రాజు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. గతం లో పీలేరులో రెవెన్యూ పరమైన సమాచారం అడిగితే ఇవ్వనందుకు ఆర్టీఐ కమిషన్‌కు ఫిర్యాదు చేశానని, దాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతి రూరల్ తహవీల్దార్ యుగంధర్ సర్టిఫికెట్ ఇవ్వ డం లేదని ఆరోపించారు. పైగా సిఎంకు చెప్పుకో, జేడీ లక్ష్మీనారాయణకు చెప్పు కో అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఫలితంగా తన పిల్ల లు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆటంకం కలిగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సంబంధం లేని సమాచారం ఇస్తున్నారు గతంలో ఆర్టిఐ కమిషనర్ తాంతియాకుమారి నిర్వహించిన విచారణ, జరిమా నా విధింపు, జారీ చేసిన నోటీసుల వివరాలను ఆర్టిఐ సెక్షన్ 4(1)బి కింద సమాచారం అడిగితే సంబంధం లేని సమాచారం ఇచ్చారంటూ సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు భాస్కర్ ఫిర్యాదు చేశారు. కమిషనరే స్వయంగా సమాచారం ఇవ్వాలని ఆదేశించినా జిల్లాలో ఆదేశాలు అమలు చేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
నవ సారథులు
ఎట్టకేలకు కీలక పోస్టుల భర్తీ జేసీగా జె.నివాస్ జీవీఎంసీ కమిషనర్‌గా ప్రవీణ్‌కుమార్ వుడా వీసీగా బాబూరావు నాయుడు ఏపీఈపీడీసీఎల్ సీఎండీగా ముత్యాలరాజు విశాఖపట్నం :ఇన్చార్జిల పాలనకు ఎట్టకేలకు తెరపడింది. కొత్త అధికారులు బుధవారం నియమితులయ్యారు. జిల్లాలోని కొందరు ఐఏఎస్‌లకు స్థానచలనం కలిగించిన ప్రభుత్వం మరికొందరిని కొత్తగా కేటాయించింది. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ కమిషనర్‌తో పాటు వుడా వైస్ చైర్మన్ పోస్టులు సుమారు ఏడాదిగా ఖాళీగా ఉన్నాయి. రెండ్రోజుల క్రితం ఐఏఎస్‌ల పంపకాలు పూర్తికావడంతో ఖాళీగా ఉన్న ఈ రెండు పోస్టులతో పాటు కీలకమైన జేసీ, ఐటీడీఏ పీవోలతో పాటు ఏపీఈపీడీసీఎల్ సీఎండీలకు స్థానచలనం కలిగించారు. వారి స్థానంలో కొత్తవారిని ప్రభుత్వం నియమించింది. కలెక్టర్ ఎన్.యువరాజ్‌కు కూడా బదిలీ తప్పదన్న వార్తలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో బ్రేకు పడింది. జాయింట్ కలెక్టర్‌గా తమిళనాడు రాష్ట్రానికి చెందిన జే.నివాస్‌ను నియమించారు. ఆదిలాబాద్ ఐటీడీఏ పీవోగా పని చేస్తున్న ఈయన్ను ఏపీకి కేటాయించారు. తెలంగాణా ప్రభుత్వం రిలీవ్ చేయడంతో ఈయన్ని జేసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధిక గిరిజన జనాభా ఉన్న విశాఖలో ఐటీడీఏ పీవో పోస్టు కీలకమైంది. ఈ పోస్టులో ఇంతకాలం ఉన్న ఐఏఎస్ అధికారి వినయ్‌చంద్‌ను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈయన స్థానంలో ఎం.హరినారాయణను నియమించింది. ఈయన్ను కూడా తెలంగాణ నుంచి ఏపీకి కేటాయించారు. సివిల్స్‌లో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచిన రేవు ముత్యాల రాజును ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీగా నియమించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న శేషగిరిబాబు కీలకమైన కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. గతంలో జిల్లాలో డీఆర్డీఏ పీడీగా పనిచేసిన టి.బాబూరావు నాయుడును వుడా వైస్ చైర్మన్‌గా నియమించారు. నెగ్గిన ‘గంటా’ పంతం జేసీ ప్రవీణ్‌కుమార్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి ప్రస్తుతం ఇన్చార్జి బాధ్యతలను నిర్వర్తిస్తున్న జీవీఎంసీకి పూర్తి స్థాయి కమిషనర్‌గా నియమించారు. ఈ విషయంలో రాష్ర్టమంత్రి గంటా శ్రీనివాసరావు పంతం నెగ్గించుకున్నారు. హుద్‌హుద్ తుఫాన్ ముందే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ అయినప్పటికీ ఆ జిల్లా ప్రజాప్రతినిధుల వ్యతిరేకతతో జిల్లాలో కొనసాగుతున్న జేసీని కమిషనర్‌గా నియమించాలని గంటా తన వియ్యంకుడు మున్సిపల్ శాఖామంత్రి నారాయణ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఏడాదిగా ఖాళీగా ఉన్న జీవీఎంసీ కమిషనర్, వుడా వైస్ చైర్మన్ పోస్టుల భర్తీతో ఇన్చార్జిల పాలనకు కూడా పూర్తిగా తెర పడినట్టయింది. పోలీస్ కమిషనర్ పోస్టును కూడా భర్తీ చేస్తే జిల్లా పాలన పూర్తి స్థాయిలో గాడిలో పడనుంది. -
అద్భుత ద్వీపం
► భవానీద్వీపానికి సింగపూర్ బృందం కితాబు ► ఏటా పెరుగుతున్న ఆదాయం ► అయినా.. అభివృద్ధి శూన్యం ► ఇప్పటికైనా స్పందించాలి మరి.. ‘ఇటువంటి ద్వీపాన్ని మా వద్ద కృత్రిమంగా నిర్మించాం. ఇక్కడ సహజసిద్ధంగా ఉంది. కృష్ణానదిలో ఉన్న ఈ ద్వీపాన్ని చూస్తే ఆశ్చర్యమేస్తోంది.’ ..ఇవి ఎవరో సాధారణ వ్యక్తులు అన్న మాటలు కావు. కొత్త రాజధానిని ఏరియల్ సర్వే చేసేందుకు వచ్చిన సింగపూర్ బృందం బుధవారం మునిసిపల్ మంత్రి నారాయణ వద్ద చెప్పిన మాటలు. అంతగా విదేశీయులను సైతం ఆకట్టుకున్న భవానీద్వీపం అభివృద్ధిలో మాత్రం అధఃపాతాళంలోనే ఉంది. ఏటా పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నా.. లక్షల్లో ఆదాయం వస్తున్నా.. ద్వీపంలో అదనపు సౌకర్యాల కల్పనపై దృష్టిసారించే వారే కరువయ్యూరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాజధాని నిర్మాణంతో పాటు భవానీద్వీపాన్ని కూడా అభివృద్ధి చేయూలని పర్యాటకులు కోరుతున్నారు. విజయవాడ : చుట్టూ పచ్చటి పచ్చికబయళ్లు.. కృష్ణమ్మ పరవళ్లు.. ప్రశాంతమైన వాతావరణంతో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన అద్భుతమైన పర్యాటక ప్రాంతం భవానీద్వీపం. 133 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే, ఇందులో కేవలం 25 ఎకరాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఉపయోగించుకుంటోంది. నాలుగు ట్రీ రిస్టార్ట్స్, 14 డీలక్స్ కాటేజీలు, రెండు కాన్ఫరెన్స్ హాళ్లు, రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. చిన్నారుల కోసం సాహస క్రీడలు, రోప్గేమ్స్ అదనపు ఆకర్షణ. వీటికితోడు కృష్ణానదిలో విహారానికి బోధిసిరి, కృష్ణవేణి, అమర్పాలి, భవానీ బోట్లతో పాటు స్పీడ్, జట్‌స్కీ బోట్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటి వల్లే ఇటీవల ముగిసిన కార్తీకమాసంలో భవానీద్వీపం ద్వారా ఏపీటీడీసీకి సుమారు రూ.30 లక్షల ఆదాయం వచ్చింది. గత ఏడాది రూ.19 లక్షలు రాగా, ఈ ఏడాది మరో రూ.11 లక్షలు ఎక్కువ రావడం విశేషం. అభివృద్ధి సంగతేంటి? విదేశీయులను సైతం ఆకట్టుకున్న భవానీద్వీపం ఎంతమేరకు అభివృద్ధి చెందిందనేది పర్యాటకుల ప్రశ్న. సింగపూర్ బృందం, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తే అద్భుత పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దవచ్చని వారు పేర్కొంటున్నారు. రాజధాని నిర్మాణంతో పాటు ద్వీపం అభివృద్ధిపైనా దృష్టి సారించాలని కోరుతున్నారు. అభివృద్ధికి ఐదు మార్గాలు.. 1 . కేరళలోని అలప్పీ సరస్సులో వెయ్యి హౌస్ బోట్లు ఉంటాయి. ఇటువంటి హౌస్ బోట్లను కృష్ణానదిలో కూడా ఏర్పాటుచేస్తే పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. ఈ బోట్లలోనే ఒకటి రెండు రోజులు గడిపేందుకు కావాల్సిన సౌకర్యాలూ ఉంటాయి 2 . భవానీ ద్వీపంలో డిస్నీల్యాండ్ తరహాలో వాటర్ గేమ్స్ ఏర్పాటు చేయాలి. స్విమ్మింగ్‌పూల్స్ కూడా సిద్ధంచేస్తే సమ్మర్లో పర్యాట కులను ఆకట్టుకోవచ్చు. 3 విదేశీ పర్యాటకుల్ని ఆకట్టుకునేలా భవానీ ద్వీపంలో వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్‌ను అందుబాటులోకి తేవాలి. నిష్ణాతులైన చెఫ్‌లతో వీటిని తయూరుచేరుుస్తే బాగుంటుంది. అలాగే, పర్యాటకులు షాపింగ్ చేసుకునేందుకు వీలుగా హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించాలి. 4 దుర్గగుడికి-భవానీద్వీపానికి అనుసంధానం ఏర్పాటు చేయాలి. దీనివల్ల గుడికి, ద్వీపానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. దుర్గగుడి నుంచి బరం పార్కుకు రోప్‌వే, అక్కడి నుంచి భవానీ ద్వీపానికి బోటింగ్ సౌకర్యం కల్పించాలి. 5. సందర్శకులు జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను చూసేలా ద్వీపం నుంచి టూరిస్టు బస్సు సౌకర్యం కల్పించాలి. ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తే భవానీ ద్వీపానికి పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
‘మహా’కుదుపు
చీఫ్ ఇంజనీర్‌గా దుర్గా ప్రసాద్ బాధ్యతల స్వీకరణ మరో ముగ్గురు జోనల్ కమిషనర్లకు బదిలీ కొత్తగా ముగ్గురు జాయింట్ కమిషనర్లు రాక విశాఖపట్నం సిటీ: జీవీఎంసీలో ఉన్నపలాన జరిగిన ఉన్నతాధికారుల బదిలీ ఓ కుదుపు కుదిపింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అధికారులను ఒకేసారిగా కదిలించడం విస్మయపరిచింది. ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలియడంతో మహా విశాఖ కార్యాలయంలో ‘బదిలీ‘ జ్వరం సోకింది. పురపాలక శాఖా మంత్రి నారాయణ సింగపూర్ పర్యటన నుంచి 15వ తేదీన రాగానే మరింతమంది అధికారుల సీట్లు కదులుతాయనే ప్రచారం ఊపందుకుంది. చాలాకాలంగా సీట్లకు అంటిపెట్టుకున్న మహామహులకే బదిలీ కావడంతో వారిని నమ్ముకున్నవారికి ఏంచేయాలో ఇప్పుడు పాలుపోవడంలేదు. ఈ నెల 15, 16 తేదీల్లో మరికొందరికి బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయని ప్రచారం జరుగుతోంది. మాతృ సంస్థలకు జోనల్ కమిషనర్లు.. {Vేటర్ పరిధిలోని కొందరు జోనల్ కమిషనర్లు మాతృ శాఖలకు వెళ్లిపోనున్నారు. ఇప్పటికే ఉత్తర్వులు సిద్ధంగా వున్నట్టు తెలిసింది. వీరి స్థానాలను మున్సిపాల్టీలకు చెందిన వారితో భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. దీనివల్ల ఆరుగురు జోన్లకు నలుగురు కొత్తవారొచ్చే అవకాశముంది. రెండో జోన్‌కు జోనల్ కమిషనర్ పోస్టు ఖాళీగా వుంది. అదనపు కమిషనర్ జీవీవీఎస్ మూర్తి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.మూడో జోన్‌కు మున్సిపల్ స్కూల్ డ్రిల్ మాస్టర్ డాక్టర్ వై. శ్రీనివాస్‌రావు జోనల్ కమిషనర్‌గా వున్నారు. తాజా మార్పుల్లో ఆయన మళ్లీ పాఠశాల విభాగానికి వెళ్లిపోనున్నారు. అయిదో జోన్‌కు పర్యాటక శాఖకు చెందిన ఎ. శ్రీనివాస్ జోనల్కమిషనర్గా వున్నారు. ఈయన మాతృశాఖకు మారిపోవచ్చని అంటున్నారు.ఆరో జోన్‌కు సహకార రంగానికి చెందిన బి. సన్యాసినాయుడు జోనల్ కమిషనర్‌గా వున్నారు. ఈయన త్వరలో మాతృశాఖకు బదిలీ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఖాళీగా వున్న మూడు జాయింట్ కమిషనర్ పోస్టులు, ఓ కార్యదర్శి పోస్టు కూడా జరగనుంది. చీఫ్ ఇంజనీర్‌గా దుర్గాప్రసాద్..! ముఖ్య ఇంజనీర్‌గా ఎన్. దుర్గాప్రసాద్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ప్రజారోగ్య శాఖలో చీఫ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఈయన గతంలో అదే శాఖలో కార్యనిర్వాహక ఇంజనీర్‌గా విశాఖలోనే సేవలందించారు. ఇప్పటి వరకూ జీవీఎంసీ ముఖ్య ఇంజనీర్‌గా పని చేసిన బి. జయరామిరెడ్డికి బదిలీ అయ్యింది. ఏడున్నరేళ్లుగా ఇదే పోస్టులో వున్న ఈయన్ను ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. అలాగే తాగు నీటి విభాగ సూపరింటెండెంగ్ ఇంజనీర్ డి. మరియన్నకు గుంటూరు నగర పాలక సంస్థకు బదిలీ చేశారు. ఈయన స్థానంలో విజయవాడ మున్సిపల్ కార్పొరే షన్ నుంచి ఎస్ఈగా వున్న టి. మోజెస్‌ను నియమించింది. మోజెస్ కుమార్ గతంలో ఇక్కడే పని చేశారు.