
మంత్రి ఓఎస్‌డీగా చల్లా ఓబులేసు
అనంతపురం న్యూసిటీ: అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేసిన చల్లా ఓబులేసు పురపాలకశాఖ మంత్రి నారాయణ ఓఎస్‌డీగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం జీఓ 620 విడుదల చేసింది. చల్లా ఓబులేసు ఈ నెల 6వతేదీ నుంచి దీర్ఘకాలిక సెలవులో ఉన్న విషయం విదితమే. మరో నాలుగు రోజుల్లో ఓఎస్‌డీ బాధ్యతలు చేప ట్టనున్నట్లు చల్లా ఓబులేసు ‘సాక్షి’కి తెలిపారు.