ఆ రైతులను ప్రధాని మోదీ దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం.. | The farmers try to take the Prime Minister to the Prime Minister .. | Sakshi
Sakshi News home page

ఆ రైతులను ప్రధాని మోదీ దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం..

Published Tue, Oct 13 2015 12:51 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

ఆ రైతులను ప్రధాని మోదీ దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం.. - Sakshi

ఆ రైతులను ప్రధాని మోదీ దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం..

మంత్రి నారాయణ
 
తుళ్లూరు : రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన 29 గ్రామాల ైరె తులను దేశ ప్రధాని నరేంద్రమోడీ దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని పురపాలకశాఖ మంత్రి నారాయణ చెప్పారు. శంకుస్థాపన ప్రాంతమైన ఉందడ్రాయునిపాలెంలో సభ ఏర్పాట్లను, శంకుస్థాపన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 3,60,000 చదరపు అడుగుల్లో వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం పిలుపు మేరకు మన ఊరు-మన మట్టి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం నుంచి రైతులు మట్టి, నీరు తీసుకువస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాలకు సంబంధించిన నదుల నుంచి నీరు, మట్టి తీసుకువస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ కాంతిలాల్ దండే, కృష్ణ జిల్లా కలెక్టర్ బాబు, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ తదితరులున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement