Capital structure
-
రాజధాని నిర్మాణం సుదీర్ఘ ప్రక్రియ
సాక్షి, అమరావతి: అభివృద్ధి చెందిన నగరాలు, రాజధానులు అన్నిరకాలుగా అభివృద్ధి సాధించి ఆ స్థాయికి రావడానికి కనీసం 40–50 సంవత్సరాలు పట్టిందని, రాజధాని నగర నిర్మాణం అన్నది ఎంతో సమయం తీసుకునే సుదీర్ఘ ప్రక్రియ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లను తగిన మౌలిక వ సతులు కల్పించి అప్పగించడానికి ఐదేళ్ల సమయం పడుతుందని వివరించింది. అందువల్ల రాజధాని నగర నిర్మాణం విషయంలో నిర్దేశించిన కాల పరిమితులన్నింటినీ తొలగించడమో లేదా తీర్పులో విధించిన గడువు పెంచడమో చేయాలని హైకోర్టును అభ్యర్థించింది. అంతేకాక రాజధాని నగరానికి మాత్రమే పరిమితమవుతూ మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి, ఏపీ సీఆర్డీఏకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును మరోసారి కోరింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రాజధాని వ్యవహారంలో ఇటీవల హైకోర్టు తీర్పునిస్తూ.. రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీ ఆర్డీఏను ఆదేశించిన విషయం తెలిసిందే. రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆ దేశించింది. ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన య జమానులకు ప్లాట్లను అన్ని మౌలిక వసతులతో నివాస యోగ్యమైన రీతిలో మూడు నెలల్లో అప్పగించాలని కూడా ఆదేశించింది. రాజధాని అభివృద్ధికి సంబంధించిన పురోగతితో ఎప్పటికప్పుడు అఫిడవిట్లు వేయాలని ప్రభుత్వాన్ని, సీఆర్డీఏను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం, సీఆర్డీఏ తరఫున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. అందులో ఇంకా ఏ విషయాలు పొందుపరిచారంటే.. దశల వారీగా ప్లాట్లు అప్పగిస్తాం ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు 63,452 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. ఇందులో 21,567 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు 41,885 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశాం. భూసేకరణ వివా దం వల్ల 3,289 ప్లాట్లను కేటాయించడం గానీ, రిజి స్టర్ చేయడం గానీ చేయలేదు. 1.4.2022 నాటికి 17,357 ప్లాట్లు రిజిస్ట్రేషన్‌కు అర్హమైనవి. ఇందులో 709 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశాం. మిలిగిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ నిమిత్తం రైతులకు నోటీసులిచ్చాం. మౌలిక సదుపాయాల కల్పన ఆధారంగా ప్లాట్లను దశలవారీగా రైతులకు అప్పగిస్తాం. పనులను వేగవంతం చేసేందుకు సీఆర్డీఏ ఎప్పటికప్పుడు సంబంధిత సంస్థలు, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. ఇప్పటివరకు మూడు సమావేశాలు నిర్వహించాం. నిధుల సమీకరణ నిమిత్తం బ్యాంకర్లతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాం. రాజధాని అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు అవసరం కాబట్టి, అంత పెద్ద మొత్తాన్ని ఒక బ్యాంక్ ఇవ్వడం సాధ్యం కాదని, బ్యాంకుల కన్సార్టియం ఏర్పాటు అవసరం ఉందని బ్యాంకర్లు చెప్పారు. సవరించిన మోడల్‌తో రూ.3,500 కోట్లకు తాజాగా ప్రతిపాదనలు పంపాలని బ్యాంకర్లు కోరారు. తగిన సమయంలో బ్యాంకర్లతో తదుపరి సమావేశం ఉంటుంది నిర్మాణాల గడువును పొడిగించాం అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధుల సమీకరణ కోసం భూములను, ప్లాట్లను వేలం వేయడానికి సీఆర్డీఏ ప్రయత్నిస్తోంది. ఎస్టేట్ విభాగం ఖాళీ స్థలాలను గుర్తించే పనిలో ఉంది. నవులూరు అమరావతి టౌన్షిప్లో 331 ప్లాట్లను వేలం వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్లాట్ల వేలం ద్వారా రూ.330 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నాం. రూ.33.51 కోట్లతో హైకోర్టు అదనపు భవనం నిర్మాణం జరుగుతుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీసు అధికారుల నివాస సముదాయాలను పూర్తి చేసేందుకు ఎన్సీసీ సంస్థకు 30.11.2022 వరకు గడువును పొడిగించాం. 18 టవర్లలోని 432 అపార్ట్మెంట్ యూనిట్ల పనులు కొనసాగుతున్నాయి. రాజధాని నగర నిర్మాణంలో భాగంగా దొండపాడు సమీపంలోని 14.5 కిలోమీటర్ల మేర 4 లేన్ల రోడ్ నిర్మాణ పనులను ఎన్సీసీ మొదలు పెట్టింది. ఇప్పటివరకు రూ.175.87 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. మిగిలిన పనులు డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఇరుకుగా ఉన్న కరకట్ట సింగిల్ రోడ్డును డబుల్ లైన్ రోడ్డుగా విస్తరిస్తున్నాం. -
రాజధాని చందాలు.. ఇటుకలు ఏమయ్యాయి..?
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నిర్మిస్తామని పిల్లల నుంచి వసూలు చేసిన చందాలు, ఇటుకలు ఏమయ్యాయని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగాం సురేష్ చంద్రబాబును ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం మాటున టీడీపీ భారీ భూకుంభకోణం చేసిందని ఆయన విమర్శించారు. రాజధాని మాటున బాబు బినామీలు భారీగా భూములు కొనుగోలు చేశారన్నారు. న్యూఢిల్లీలో బుధవారం నందిగాం సురేష్ మీడియాతో మాట్లాడారు. తాత్కాలిక భవన నిర్మాణాలతో ఎక్కువ కమీషన్లు తీసుకోవచ్చని చంద్రబాబు భావించి అడ్డగోలుగా దోచుకున్నారని, అలాంటి అమరావతిలో మళ్లీ ఏ ముఖం పెట్టుకొని పరేడ్ చేస్తారని ప్రశ్నించారు. పర్మినెంట్ అంటే లెక్కలు చూపించాల్సి వస్తుందని తమ్ముళ్ల భయంతో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారన్నారు. రాజధాని ప్రాంతంలో రెండే రెండు బిల్డింగ్లు కట్టారని, ఒకటి హైకోర్టు, తాత్కాలిక సచివాలయమన్నారు. చిన్న వర్షం కురిస్తే చాలు కారుతుందని, పెంకులు లేచిపోతున్నాయన్నారు. చంద్రబాబు రాజధానిని సర్వనాశనం చేశారన్నారు. భూములు కబ్జా చేశారని మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. శంకుస్థాపనకు లక్షల ఇటుకలు ఇచ్చారని, ఆ ఇటుకలు ఏమయ్యాయో తెలియదన్నారు. విద్యార్థులతో రూ.10 చొప్పున చందాలు వసూలు చేశారని, ఆ డబ్బులు ఏం చేశారో అర్థం కావడం లేదన్నారు. టీడీపీ నేతలు ఇప్పుడేమో రూ.9 వేల కోట్లు రాజధానికి ఖర్చు చేశామని చెబుతున్నారు. ఆ డబ్బులకు మాత్రం లెక్క చెప్పడం లేదన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవమంతా కూడా కుట్రలు, మోసాలే అన్నారు. చంద్రబాబు అమరావతిలో పరేడ్ చేసేందుకు అనర్హులు అన్నారు. ఇష్టానుసారంగా పాలన చేసి ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరించి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందించాలని సూచించారు. రాజధాని ఎలా నిర్మించాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుసని అన్నారు. మీలాంటి వ్యక్తితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ జగన్ విషయంలో ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఏమీ చేయలేరన్నారు. వైఎస్ జగన్‌పై నమ్మకంతో ప్రజలు 151 సీట్లు ఇచ్చారన్నారు. చంద్రబాబు లేనిపోని ఆరోపణలు మాని, ప్రజలకు మేలు జరిగే విధంగా పని చేయాలని సూచించారు. దళితులకు ప్యాకేజీ ఇచ్చే విషయంలో 1400 గజాలు ఇచ్చారని, మీ బినామీల భూములు కొనుగోలు చేసిన తరువాత ఫూలింగ్ విధానం నుంచి తప్పించారన్నారు. చంద్రబాబుకు వయసు పెరిగే కొద్ది చాదస్తం పెరుగుతుందని దుయ్యబట్టారు. చంద్రబాబు మాటల మాంత్రికుడని, మాటలతోనే ప్రజలను భ్రమల్లోకి నెట్టారన్నారు. ఆయన అమరావతిలో చేసింది ఏమీ లేదన్నారు. బోండా ఉమా అసెంబ్లీలో ఎలా మాట్లాడారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఆయన అమరావతిలో ఏమీ చూడలేదని, చంద్రబాబుకు బ్యాండ్ మేళం ఊదాలి కాబట్టి ఉమా మాట్లాడుతున్నారన్నారు. రాజధాని విషయంలో బాబులాగా మాటలు చెప్పకుండా చేతల్లో చూపిస్తామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని కచ్చితంగా చేపడుతుందని, అయితే చంద్రబాబు మాదిరిగా వేల కోట్లు వృథా చేయమని స్పష్టం చేశారు. -
రాజధాని ముసుగులో అక్రమాలు
మంగళగిరి: రాజధాని పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అక్రమాలను ప్రపంచానికి తెలియనీయకుండా కొన్ని మీడియా సంస్థలు లేనిపోని వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాజధాని ముసుగులో చంద్రబాబు చేసిన అవినీతి అక్రమాలను బయటకు తెలిసేలా మీడియా వ్యవహరించాలని హితవు పలికారు. రాజధాని పేరుతో చంద్రబాబు అతని బినామీలు, అప్పటి మంత్రులు, టీడీపీ నాయకులు కోట్లాది రూపాయల విలువైన భూములను కొట్టేయడంతో పాటు కోట్లాది రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే బుధవారం విలేకరులతో మాట్లాడారు. తుళ్లూరు ప్రాంతం కట్టడాలకు పనికిరాదని, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని శివరామకృష్ణ కమిటీ తేల్చిచెప్పినా చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఎంపిక చేశారన్నారు. అప్పట్లోనే తాను అసెంబ్లీ సాక్షిగా మంగళగిరి ప్రాంతమైతే కట్టడాల ఖర్చు తగ్గుతుందని, అంతేగాక వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని చెప్పానని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణానికి మంగళగిరి ప్రాంతం అనువుగా ఉంటుందని, అక్కడ నిర్మాణాలు కొనసాగిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. అయినా రాజధానిని తరలిస్తున్నారని ఎవరు చెప్పారని ప్రశి్నంచారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. ‘రాజధాని అమరావతి అంటూ గోబెల్స్ ప్రచారం నిర్వహించిన చంద్రబాబు రాజధాని ప్రాంతంలో సొంతిల్లు కట్టుకున్నారా? అసలు రాజధానిలో చంద్రబాబుకు అడ్రసు ఎక్కడ ఉంది?’ అంటూ దుయ్యబట్టారు. తమ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత ఇల్లు నిరి్మంచుకోవడంతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని గుర్తు చేశారు. -
పోలవరం, రాజధాని నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపాం
సాక్షి, విశాఖపట్నం: అవినీతి జరిగిందనే పోలవరం, రాజధాని నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేశామని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. అభివృద్ధి ఆగిపోయిందని ప్రతిపక్షం వాదించడంలో అర్థం లేదని చెప్పారు. విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ప్రాజెక్టుల్లో 150 శాతం వరకు అంచనాలు పెంచి టెండర్లు వేయించి చంద్రబాబు లబ్ధి పొందారన్నారు. ఈ తప్పులను సరిదిద్దుతున్నామని, తర్వాత అభివృద్ధి పనులు కొనసాగుతాయన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక లోటు మిగిల్చిందని ధ్వజమెత్తారు. దీన్ని అధిగమించి బడ్జెట్లో అన్ని వర్గాల వారి సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులు కేటాయించారని గుర్తు చేశారు. అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు, జీవీఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. నగరంలో ఉన్న వార్డులను పునఃపరిశీలిస్తామన్నారు. మొదట జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రానున్నాయని, తర్వాత కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు, అనంతరం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పారు. పార్టీ ప్రయోజనాలే ముఖ్యం పార్టీలో మనస్పర్థల కారణంగానే శ్రీకాకుళం జిల్లాలో రెండు, విశాఖ జిల్లాలో నాలుగు స్థానాలు ఓడిపోయామని విజయసాయిరెడ్డి అన్నారు. ఈసారి అటువంటి తప్పులు పునరావృతం కాకూడదని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని వివరించారు. పార్టీ గెలుపునకు అవసరమైనవారు ఏ పార్టీ నుంచి వచ్చినా తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో సమన్వయకర్తలు వద్దని చెప్పినా పార్టీ కోసం తప్పదని స్పష్టం చేశారు. పార్టీలోకి వచ్చే ఇతర పార్టీ నేతల గురించి విచారణ చేపట్టాకే పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఈ నెల 10న ప్రారంభిస్తున్నామన్నారు. పార్టీలో ఏవైనా అసంతృప్తి ఉన్నా.. సమస్యలున్నా ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. పోస్టల్ ద్వారా కూడా సమస్యలు, ఫిర్యాదులు పంపవచ్చన్నారు. కాగా.. విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లతోపాటు వివిధ పార్టీల నేతలు విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నా«థ్, గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజ్, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఫైబర్ గ్రిడ్’లో పైసా వసూల్
సాక్షి, అమరావతి బ్యూరో: ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో ప్రభుత్వ పెద్దలు పైసలు పిండుకుంటున్నారు. రూ.1,500 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టు తమ అస్మదీయ సంస్థకు తప్ప ఇతరులకు దక్కకుండా పెద్ద స్కెచ్చే వేశారు. మొత్తం ప్రాజెక్టు విలువలో సగం.. అంటే రూ.765 కోట్ల మేర కమీషన్లు కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు రెండో దశ కాంట్రాక్టును ఇతర సంస్థలు దక్కించుకోకుండా ప్రభుత్వ పెద్దలు సాగించిన కుట్రలను గమనిస్తే.. ఇంత నీచానికి ఒడిగడుతారా అని ఛీ కొట్టక తప్పదు. టెండర్ అర్హత నిబంధనల్లో 11 సార్లు మార్పులు చేశారు, బిడ్లు దాఖలు చేయడానికి ఒక్కటంటే ఒక్కరోజే గడువు ఇచ్చారు. ఇలాంటి చోద్యం ఇంకెక్కడా ఉండదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో 55 వేల కిలోమీటర్ల మేర వేయనున్న ఫైబర్ గ్రిడ్ రెండో దశ కాంట్రాక్టును ఏకపక్షంగా అస్మదీయ సంస్థకే కట్టబెట్టాలని ప్రభుత్వ పెద్దలు కొన్ని నెలల క్రితమే నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రతిపాదించిన ఆ కాంట్రాక్టును కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ అడ్డుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మొదట షాక్ తగిలింది. మరోసారి టెండర్లు పిలవాల్సి వచ్చింది. ఈసారి ముఖ్యనేత సూచనలతో ఏపీఎస్ఎఫ్ఎల్ పకడ్బందీగా వ్యవహరిం చింది. కేవలం ఒక్కరోజు గడువుతో కాంట్రాక్టును ఏకపక్షంగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై అక్కసు ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టు కోసం తొలుత 7 సంస్థలు టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేశాయి. ఇండియా టెలికాం ఇండస్ట్రీస్(ఐటీఐ), టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో ఉన్నాయి. దాంతో ప్రభుత్వ పెద్దలు దొంగాట ప్రారంభించారు. ప్రాజెక్టు కాలపరిమితిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించడం ద్వారా ఇతర సంస్థలు తామంతట తామే వెనక్కి వెళ్లేలా చేయాలని భావించారు. టెండర్లు ఖరారు చేసేనాటికి టెలికాం స్టాండర్డ్ ఎలిజిబిలిటీ సెంటర్(టీఎస్ఈసీ) సర్టిఫికెట్ సమర్పించకపోతే ఎర్నెస్టు మనీ డిపాజిట్(ఈఎండీ) రూ.5 కోట్లు జప్తు చేస్తామన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ జోక్యం చేసుకున్న తర్వాత ఆ సంస్థల టెక్నికల్ బిడ్లను అనుమతించాల్సి వచ్చింది. కానీ, ప్రభుత్వ పెద్దలు మాత్రం తమ పంతం వీడలేదు ‘ఒక్క రోజు’ మంత్రాంగం ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా టెండర్ అర్హత నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ వచ్చారు. ఫైబర్ గ్రిడ్ రెండో దశ టెండర్ల ప్రక్రియలో ఏకంగా 11 సవరణల ద్వారా 20 అదనపు నిబంధనలను చేర్చడం విస్మయపరుస్తోంది. ఆ సవరణలన్నీ ప్రభుత్వ పెద్దల అస్మదీయ సంస్థలకు అనుకూలంగా ఉండడం గమనార్హం. టెండర్ల దాఖలుకు గడువు తేదీ ఈ ఏడాది నవంబర్ 1 కాగా... చివరిదైన 11వ సవరణను పేర్కొంటూ అక్టోబరు 28న టెండర్ నిబంధనలను నిర్ణయించారు. ఆ రోజు ఆదివారం కావడంతో అక్టోబరు 29న అధికారికంగా వెబ్సైట్లో అప్లోడ్ చేసి సవరణను అక్టోబరు 30న విడుదల చేశారు. కానీ, సవరించిన నిబంధనలకు అనుగుణంగా బిడ్ల దాఖలుకు గడువును పొడిగించకపోవడం గమనార్హం. నవంబరు 1 నాటికి టెండర్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. సాంకేతికంగా మూడు రోజులు గడువు ఉన్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి ఒక్కరోజు మాత్రమే గడువు ఇచ్చారు. దాంతో సవరించిన నిబంధనల మేరకు 4 కన్సార్టియం సంస్థలు బిడ్లు దాఖలు చేయలేకపోయాయి. కేవలం మూడు సంస్థలే బిడ్లు దాఖలు చేయడం గమనార్హం. ప్రభుత్వ పెద్దలకు బాగా కావాల్సిన ఆ సంస్థలకు ముందే సమాచారం ఉన్నందున ఒక్కరోజులోనే సవరించిన నిబంధనలకు అనుగుణంగా బిడ్లు దాఖలు చేయగలిగాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు డమ్మీ... అస్మదీయ సంస్థకే టెండర్! టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని చెప్పేందుకు మూడు కన్సార్టియం సంస్థలను అనుమతించారు. కానీ, వాటిలో రెండు సంస్థలు నామమాత్రంగానే పోటీలో ఉన్నాయి. వాటిలో ఓ సంస్థకు రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భారీ కాంట్రాక్టులు కట్టబెట్టారు. మరో సంస్థకు కూడా పలు సాఫ్ట్వేర్ కాంట్రాక్టులు ఇచ్చారు. ముఖ్యనేత బినామీ సంస్థకు మార్గం సుగమం చేస్తూ ఆ రెండు సంస్థలు ఫైబర్ గ్రిడ్ టెండర్లో ఎక్కువ ధర కోట్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో ముఖ్యనేత బినామీగా ఉంటూ ఏపీఎస్ఎఫ్ఎల్లో చక్రం తిప్పుతున్న ఓ కీలక వ్యక్తి ఆధీనంలోని సంస్థకే ఫైబర్ గ్రిడ్ టెండర్ కట్టబెట్టడానికి రంగం సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. రూ.1,500 కోట్ల కాంట్రాక్టును మూడు ప్యాకేజీలుగా విభజించి, ఆ సంస్థకు దారాదత్తం చేసేందుకు పన్నిన కుట్ర దాదాపు విజయవంతమైంది. కాగా, ప్రభుత్వ పెద్దల కుతంత్రంపై టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్(టీసీఐఎల్) కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. టెండర్ నిబంధనల సవరణలో మతలబు ఫైబర్ గ్రిడ్ టెండర్లో పాల్గొనేందుకు బిడ్ దాఖలు చేసే సంస్థలు భారతదేశంలో 24/7 సేవలు అందించే సొంత సర్వీసింగ్ సెంటర్, టోల్‌ఫ్రీ సెంటర్ ఉండాలి. 100 మంది సొంత సాంకేతిక నిపుణులతో ఈ సెంటర్ ఉండాలని నిబంధన విధించారు. కానీ, తరువాత ఆ అర్హత నిబంధనల్లో మార్పులు చేశారు. దీనిప్రకారం.. కనీసం 100 మందితో 24/7 సేవలందించే సర్వీసింగ్ సెంటర్, టోల్‌ఫ్రీ సెంటర్ ఉండాలి. దాంతోపాటు సొంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్అండ్డీ) సెంటర్ ఆంధ్రప్రదేశ్‌లో ఉండాలని షరతు విధించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్అండ్డీ సెంటర్లు ఉండవు. తద్వారా ఆ సంస్థలను పోటీ నుంచి తప్పించడానికే నిబంధనలను మార్చినట్లు స్పష్టమవుతోంది. టెండర్ దక్కించుకునే సంస్థలు ఏర్పాటు చేయాల్సిన రూటర్ల సామర్థ్యాన్ని కూడా అమాంతంగా పెంచేశారు. మొదట టెండర్లలో రూటర్లు 20 లక్షల ఎంఏసీ సామర్థ్యంతో 20 లక్షల ఐపీవీ4 యూనికాస్ట్ రౌట్లు, 10 లక్షల ఐపీవీ 6 రౌట్లు, 16 వేల మల్టీకాస్ట్ రౌట్లు కలిగి ఉండాలని చెప్పారు. కానీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తప్పించేందుకు రూటర్ల సామర్థ్యాన్ని పెంచేశారు. రూటర్లు 40 లక్షల ఎంఏసీ సామర్థ్యంతోపాటు 30 లక్షల ఐపీవీ 4 యూనికాస్ట్ రౌట్లు, 15 లక్షల ఐపీవీ 6 రౌట్లు, 50 వేల మల్టీకాస్ట్ రౌట్లు కలిగి ఉండాలని నిబంధన విధించడం గమనార్హం. అంతేకాదు రూటర్ ఎస్ఆర్, ఎస్ఆర్–టీఈ, ఎస్ఆర్వీ 6, టిల్ఫా, బీజీపీఎల్ఎస్ ఉపకరణాలకు అనుగుణంగా ఉండాలని కొత్త నిబంధన విధించారు. -
ఏపీ రాజధానిలో సర్కారు భూగుట్టు..
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని నిర్మాణం ముసుగులో ప్రభుత్వ పెద్దలు సాగించిన భూదోపిడీ అధికారికంగా బట్టబయలైంది. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల సన్నిహితుల రియల్ ఎస్టేట్ సంస్థలపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారుల దాడులతో మొత్తం అవినీతి బాగోతం వెలుగు చూసింది. 6,000 ఎకరాల్లో అక్రమంగా రూ.8,000 కోట్ల విలువైన లావాదేవీలు సాగించారని మొదటి దశ దాడుల్లో ఐటీ శాఖ నిర్ధారించింది. ఆ భూముల ప్రస్తుత విలువ ఏకంగా రూ.30,000 కోట్లని అంచనా వేయడం గమనార్హం. నూతన రాజధాని నగరాన్ని ఎక్కడ నిర్మిస్తారన్న దానిపై అస్మదీయులకు ముందుగానే లీకులు... బినామీ పెట్టుబడిదారులతో రియల్ ఎస్టేట్ సంస్థలు... బ్యాంకుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా రుణాలు... రాజధాని ప్రాంతంలో తక్కువ ధరకే భూముల కొనుగోలు... ఇదీ ప్రభుత్వ పెద్దల దోపిడీ విధానం. దీనిపై సీబీఐ, ఆర్బీఐ, ఈడీ, డీఆర్ఐలకు కూడా ఐటీ శాఖ సమచారం ఇవ్వడంతో ప్రభుత్వ పెద్దల్లో గుబులు మొదలైనట్లు సమాచారం. భూసేకరణ నుంచి వారికి మినహాయింపు 2014లో అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం నూతన రాజధానిపై దొంగాటకు తెరతీసింది. ఏలూరు, నూజివీడు, రాజమండ్రి... ఇలా పలు ప్రాంతాలను రాజధానిగా ఎంపిక చేసే అవకాశాలున్నాయని ఉద్దేశపూర్వకంగా లీకులిచ్చింది. కానీ, అప్పటికే గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల పరిధిలో నూతన రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ముందుగానే తమ బినామీలు, సన్నిహితులకు ప్రభుత్వ పెద్దలు ఉప్పందించారు. దాంతో అక్కడ తక్కువ ధరకే వేలాది ఎకరాలను కొనేశారు. అనంతరం బినామీలు, సన్నిహితుల భూములను మినహాయిస్తూ రాజధాని నిర్మాణానికి భూసమీకరణ ప్రక్రియ చేపట్టారు. బినామీ పెట్టుబడిదారులు రాజధాని ముసుగులో ప్రభుత్వ పెద్దలు చేసిన రియల్ ఎస్టేట్ దందా తీరును ఐటీ అధికారులు గుర్తించారు. 2014లో అధికారంలోకి రాగానే ముఖ్యనేత, ఆయన సన్నిహితుల అప్పటికప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలను ఏర్పాటు చేశారు. అనంతరం ఆ సంస్థలకు బ్యాంకుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా భారీగా రుణాలు తీసుకున్నారు. అమరావతి ప్రాంతంలో తక్కువ ధరకు రైతుల నుంచి భారీగా భూములు కొనుగోలు చేశారు. రాజధానిగా ఆ ప్రాంతాన్ని ప్రకటించడంతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రాజధాని ముసుగులో ప్రభుత్వ పెద్దల అవినీతి దందాకు మచ్చు తునకగా ఐటీ అధికారులు చెబుతున్న ఓ ఉదంతం ఇలా ఉంది... గుంటూరు జిల్లాలో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న కీలక నాయకుడు ప్రభుత్వ ముఖ్యనేతకు అత్యంత సన్నిహితుడు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లలో జిల్లాలో పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకున్నాడు. అందుకే అధికారంలోకి రాగానే ఆయనకు ఆ జిల్లాలో పెద్దపీట వేశారు. ఆ కీలక నేత కుటుంబం ఓ రియల్ ఎస్టేట్ సంస్థను నెలకొల్పింది. ఆ నేత కుమారుడు, కుమార్తెలను అందులో డైరెక్టర్లుగా నియమిం చారు. అంతేకాదు కొందరు సన్నిహితులు తమ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు చూపించారు. తమ పరపతిని ఉపయోగించి ఆ రియల్ ఎస్టేట్ సంస్థ పేరిట బ్యాంకుల నుంచి రూ.224 కోట్ల రుణాలు తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకులు ఆ సంస్థకు రుణాలు మంజూరు చేయడం గమనార్హం. దేశంలో కృత్రిమ రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్న 19 ప్రాంతాలను రిజర్వ్‌బ్యాంక్ గుర్తించింది. వాటిలో కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా ఉన్నాయి. ఆ 19 ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ సంస్థలకు రుణాలు పెద్దగా ఇవ్వొద్దని రిజర్వ్ బ్యాంక్ కచ్చితంగా చెప్పింది. కానీ, దీనికి విరుద్ధంగా గుంటూరు జిల్లా కీలక నేత కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థకు బ్యాంకులు రూ.224 కోట్ల రుణాలు మంజూ రు చేయడం గమనార్హం. ఓ ప్రధాన బ్యాంకుకు చెందిన గుంటూరు శాఖ, మరో ప్రభుత్వ రంగ బ్యాం కుకు చెందిన గుంటూరు, విజయవాడ శాఖలు, వివాదాస్పద వ్యవహారాలకు పేరుగాంచిన మరో ప్రైవేటు బ్యాంకు నుంచి ఈ రుణాలు తీసుకున్నారు. అంతేకాదు ఆ కీలక నేత కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడిదారులంతా బినామీలేనని సమాచారం. ఆ సంస్థ ఇచ్చిన ఐటీ రిటర్నుల్లో ఉన్న పెట్టుబడిదారులెవరూ సంబంధిత చిరునామాల్లో లేరని ఐటీ శాఖ గుర్తిం చింది. కీలక నేత కుటుంబమే నల్లధనాన్ని బినామీ వ్యక్తుల పేరిట ఆ రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టుబడిగా పెట్టినట్లు స్పష్టమైందని ఓ అధికారి చెప్పారు. సీబీఐ, ఈడీ, డీఆర్ఐలకు సమాచారం ప్రభుత్వ పెద్దల సన్నిహితుల రియల్ ఎస్టేట్ సంస్థలపై జరిపిన దాడుల్లో గుర్తించిన సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్(ఈడీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ), ఆర్బీఐలకు చేరవేసింది. నిబంధనలను ఉల్లంఘించిన బ్యాంకుల ఉన్నతాధికారులపై ఆర్బీఐ త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ ఉన్నతాధికారులను సీబీఐ అదుపులోకి తీసుకు ని విచారించనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో కేసు నమోదు చేసి విచారించే అవకాశాలున్నాయని, దాంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఐటీ అధికారులు అం టున్నారు. ఇక ఈ కేసులో మనీల్యాండరింగ్, అక్రమ ఆర్థిక లావాదేవీలు తదితర నేరాలు ఇమిడి ఉన్నా యి. అందువల్ల ఈ కేసు ఈడీ, డీఆర్ఐల పరిధిలోకి కూడా వస్తుంది. అందుకే తాము ముందుగానే ఆర్బీఐ, సీబీఐతోపాటు ఈడీ, డీఆర్ఐలకు అధికారికంగా సమాచారమిచ్చామని ఐటీ అధికారులు పేర్కొంటున్నారు. సీబీఐకి అడ్డుచక్రం అందుకేనా? రాజధాని ముసుగులో తాము చేసిన అవినీతి బట్టబయలు కావడంతో ప్రభుత్వ పెద్దల్లో కలవరం మొదలైంది. కేంద్ర దర్యాప్తుస సంస్థ(సీబీఐ) రంగంలోకి దిగితే తమ పుట్టి మునగడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. అందుకే ముందస్తు చర్యగానే రాష్ట్రంలో సీబీఐ దాడులు నిర్వహించడానికి వీల్లేకుండా అనుమతిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు అక్రమాలకు సహకరించిన బ్యాంకు అధికారులపై ఢిల్లీలో కేసు నమోదు చేసి, మొత్తం ప్రభుత్వ పెద్దల అవినీతిని బహిర్గతం చేయడానికి సీబీఐ రంగం సిద్ధం చేస్తోందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. 6,000 ఎకరాలు... విలువ రూ.30,000 కోట్లు రాజధాని ఎంపిక ప్రక్రియ ముసుగులో ప్రభుత్వ పెద్దలు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఐటీ శాఖ తేల్చింది. ఇటీవల ప్రభుత్వ పెద్దల సన్నిహితులైన రియల్టర్లు, బడాబాబులపై జరిపిన దాడుల్లో ఈ వాస్తవాలను గర్తించింది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో సంచలనాత్మక విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. 2014లో అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా 6,000 ఎకరాల్లో రూ.8,000 కోట్ల మేర లావాదేవీలు జరిపినట్లు అధికారులు లెక్కతేల్చారు. ప్రభుత్వ ముఖ్యనేతతో సహా ఆయన బినామీలు, సన్నిహితులు కొల్లగొట్టిన ఆ 6,000 ఎకరాల ప్రస్తుత విలువ రూ.30,000 కోట్ల వరకు ఉండటం ఐటీ వర్గాలనే విస్మయ పరుస్తోంది. మొదటి దశ దాడుల్లో భారీస్థాయిలో అవినీతి బాగోతం బయటపడగా, తదుపరి దశల్లో దాడులు నిర్వహిస్తే మరిన్ని వ్యవహారాలు బహిర్గతమవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 50,000 ఎకరాల్లో ప్రభుత్వ పెద్దలు భూదందాకు పాల్పడ్డారు. వాటిపైనా ఐటీ శాఖ దృష్టి సారిస్తే దేశంలోనే సంచలన అవినీతి బాగోతం వెలుగు చూడటం ఖాయమని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
అసలు కంటే కొసరు మిన్న!
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని నిర్మాణం పేరిట ప్రభుత్వ పెద్దలు స్వార్థమే పరమావధిగా సాగిస్తున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. రాజధానిలో బహుళ ప్రయోజన క్రీడా కేంద్రం(స్పోర్ట్స్ హబ్) నిర్మాణానికి గాను ప్రైవేట్ సంస్థలపై భారీగా రాయితీల వర్షం కురిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పర్యాటక ప్రాజెక్టుల విధానం ప్రకారం.. పెట్టుబడి వ్యయంలో రాయితీలు 20 శాతానికి మించకూడదు. క్రీడా కేంద్రం నిర్మాణం విషయంలో ఈ నిబంధనను ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. పెట్టుబడికి రెట్టింపు రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. స్పోర్ట్స్ హబ్ నిర్మాణానికి పలుమార్లు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను ఆహ్వానించినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని, అందువల్లే నిర్మాణ సంస్థలను ఆకర్శించడానికి ఎక్కువ రాయితీలను ఇవ్వాల్సి వస్తోందంటూ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) సాకులు చెబుతోంది. ప్రైవేట్ డెవలపర్లకు విచ్చలవిడిగా రాయితీలు ఇవ్వడం వెనుక లోగుట్టు ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మౌలిక వసతులు లేకుండానే క్రీడా ప్రాంగణమా? రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక వసతులు కల్పించకుండానే అంతర్జాతీయ స్థాయిలో బహుళ ప్రయోజన క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండదని, అందువల్లే నిర్మాణ సంస్థలు ముందుకు రాలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. తొలుత కనీస మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అయితే, రాజధానిలో అంతర్జాతీయ స్థాయిలో బహుళ ప్రయోజన క్రీడా మైదానాన్ని ఇప్పుడే నిర్మించి తీరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ డెవలపర్ పెట్టే పెట్టుబడికి రెట్టింపు రాయితీ ఇచ్చేందుకు సైతం సిద్ధపడింది. డెవలపర్ రూ.242 కోట్లు పెట్టుబడిగా పెడితే, రాయితీల రూపంలో ప్రభుత్వం రూ.484 కోట్లు ఇవ్వనుంది. ఈ క్రీడా ప్రాంగణం నిర్మాణానికి రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ల సమీపంలోనే 20 ఎకరాలను కేటాయించనుంది. ఇందులో 11 ఎకరాల్లో క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తారు. మిగిలిన 9 ఎకరాలను స్థిరాస్తి వ్యాపారం చేసుకోవడానికి డెవలపర్‌కు కేటాయిస్తారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో స్పోర్ట్ హబ్ నిర్మిస్తారు. ఈ క్రీడా కేంద్రం నిర్మాణానికి రూ.175 కోట్ల వ్యయం అవుతుందని తొలుత అంచనా వేయగా, ఇప్పుడు భారీగా రాయితీలను ప్రతిపాదించిన తరువాత నిర్మాణ వ్యయాన్ని రూ.242 కోట్లకు పెంచేశారు. ఎస్‌జీఎస్టీతోపాటు విద్యుత్ తదితర రంగాల్లో 35 ఏళ్లపాటు రాయితీల రూపంలో ప్రభుత్వం రూ.484 కోట్లు ఇవ్వనుంది. క్రీడా కేంద్రాన్ని వినియోగించే వారి నుంచి యూజర్ చార్జీలు వసూలు చేస్తారు. ప్రైవేట్ డెవలపర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు స్వీకరించడానికి నోటీసులను జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది. -
రాజధాని బాండ్లు రాష్ట్రానికి గుదిబండ!
సాక్షి, అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చాలా ప్రమాదకరమైన పంథాలో వెళుతున్నారని, రాజధాని బాండ్లు రాష్ట్ర భవిష్యత్తుకు గుదిబండగా మారుతాయని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హెచ్చరించారు. రాజధాని నిర్మాణానికి ప్రజల నుంచి బాండ్ల రూపంలో నిధులు సేకరించనున్నట్లు సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వాణిజ్యపరంగా చూస్తూ మెగా రాజధాని నిర్మాణం విజయవంతమైన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవని, బ్యాంకు వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీకి నిధులు సేకరిస్తే అది చివరికి రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందన్నారు. బ్రెజిల్ దేశంలో మౌలిక వనరులన్నీ సమీకరించి రాజధానిని నిర్మిస్తే చివరికి అది ఆర్థిక సంక్షోభానికి దారితీసి దేశాన్ని మిలటరీ హస్తగతం చేసుకుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదే విధంగా పెట్రోలియం డాలర్లతో ఇబ్బడిముబ్బడిగా వచ్చిన నిధులతో మలేసియా, నైజీరియా వంటి దేశాలు రాజధాని నగరాలు నిర్మిస్తే.. ఆ నిధులను ఇతర అవసరాలకు వినియోగించే ఉంటే మరింత అభివృద్ధి చెందేవారన్న విమర్శలను పెద్ద ఎత్తున ఎదుర్కొన్నాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మూడు పెద్ద నగరాలున్నాయని, ఇప్పుడు రాజధాని పేరుతో మరో మెగా సిటీ అవసరం లేదని, పరిపాలన రాజధాని నిర్మిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ శివరామకృష్ణ.. మెగా రాజధాని నిర్మాణం వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఏ విధంగా దెబ్బతింటుందన్న విషయాన్ని విపులంగా హిందూ పత్రికలో వ్యాసాన్ని రాశారని, ఇప్పటిౖకైనా సీఎం ఈ మానియా నుంచి బయటకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆత్మగౌరవం పేరుతో రెచ్చగొట్టొద్దు.. తాము ఇచ్చిన నిధులకు కేంద్రం లెక్కా పత్రాలు అడగడంతో ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిందంటూ సీఎం బుధవారం అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఐవైఆర్ తప్పుపట్టారు. కాగ్ అనేది కేవలం అకౌంటింగ్ సంస్థ మాత్రమేనని, ఎన్నికల హామీ అయిన రుణ మాఫీ వ్యయాన్ని కూడా లోటు కింద భర్తీ చేయాలంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లు వస్తాయి కాబట్టి కేంద్రం తిరస్కరించిందన్నారు. కేంద్రం ఇతర పథకాలు, ప్రాజెక్టులకు ఇచ్చిన నిధులకు మాత్రమే యూసీలను అడుగుతుందని, ఆ నిధులు సరిగా వినియోగమయ్యాయా లేక వేరే పథకాలకు మళ్లించారా అని తెలుసుకున్న తర్వాతనే మిగిలిన నిధులు విడుదల చేస్తారన్నారు. యూసీలను ఆత్మగౌరవంతో ముడిపెట్టి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడం తగదన్నారు. -
రైతులను భయపెట్టి భూములు లాక్కున్నారు
సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ నిర్మాణం విషయంలో ప్రజల అభ్యంతరాలు, ఆందోళనను పరిగణనలోకి తీసుకోకుండా నిధుల మంజూరులో ముందడుగు వేయొద్దని ప్రముఖ సామాజికవేత్తలు, మేధావులు, నిపుణులు ప్రపంచ బ్యాంకును కోరారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకుకు తాజాగా రాసిన లేఖపై మేధా పాట్కర్, మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, గోల్డ్‌మేన్ పురస్కార గ్రహీత ప్రఫుల్ల సమంత్ర, శాస్త్రవేత్త బాబూరావుతోపాటు 46 మంది సంతకాలు చేశారు. రాజధాని నిర్మాణం పేరిట రైతులను భయపెట్టి వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుందని ఆక్షేపించారు. ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు అమరావతిలో పర్యటించిన తర్వాత సమర్పించిన నివేదికను బ్యాంకు వెబ్సైట్లో పెట్టినట్లే పెట్టి వెనక్కి తీసుకోవడాన్ని లేఖలో ప్రస్తావించారు. రాజధాని నిర్మాణం కోసం బలవంతపు భూసేకరణ, రైతులను భయభ్రాంతులకు గురిచేయడం, ప్రజలను సంప్రదించకుండానే విధివిధానాలు రూపొందించడం, ఆహార భద్రతకు ముప్పు, సారవంతమైన భూములు కోల్పోవడం.. తదితర అంశాల్లో లోతైన విచారణ అవసరమని తనిఖీ బృందం నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన, పర్యావరణానికి, ప్రజల జీవనోపాధికి హాని కలిగించే అంశాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం నివేదిక ద్వారా తేటతెల్లమైందని పేర్కొన్నారు. తనిఖీ బృందం నివేదికను బ్యాంకు డైరెక్టర్లు సమీక్షించకముందే పొరపాటున వెబ్సైట్లో పెట్టామని, తర్వాత ఉపసంహరించామని పత్రికా ప్రకటన విడుదల చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని వెల్లడించారు. -
రాజధాని ఇంకెంత దూరం?
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం అంతుచిక్కని స్వప్నంగా మారింది. నవ నగరాలు, ఐకానిక్ టవర్లు, ఐకానిక్ బ్రిడ్జీలు, వాటర్ చానళ్లు, ఎనిమిది వరుసల రహదారులు, గోల్ఫ్ కోర్సులతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ రాజధానుల అధ్యయనం కోసం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు పలు దేశాల్లో పర్యటించారు. స్థూపాకృతి, వజ్రాకృతి, ఈఫిల్ టవర్ వంటి రకరకాల గ్రాఫిక్ డిజైన్లు పలు దఫాలుగా విడుదల చేశారు. అత్యద్భుత నిర్మాణాలు, అంతర్జాతీయ స్థాయి రహదారులంటూ ప్రభుత్వం పదే పదే చేస్తున్న ప్రకటనలతో వాటిని కళ్లారా చూసేందుకు ఆసక్తిగా వచ్చిన వారికి మాత్రం తీవ్ర నిరాశే మిగులుతోంది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం తప్ప రాజధాని ప్రాంతం మొత్తంలో మరే నిర్మాణమూ కనిపించడంలేదు. పచ్చని పంటపొలాలు ఎండిపోయి పిచ్చిమొక్కలతో కనిపిస్తున్నాయి. రాజధాని నిర్మాణ ప్రక్రియను ప్రారంభించి మూడేళ్లయినా, అమరావతి నగరానికి శంకుస్థాపన చేసి ఆదివారానికి రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఒక్క నిర్మాణం మొదలవ్వకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖరారు కాని డిజైన్లు ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నగరం డిజైన్ల బాధ్యతను మొదట జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్‌కి అప్పగించారు. ఆ సంస్థ అందించిన డిజైన్లు అద్భుతమంటూ ఆకాశానికెత్తి, ఆ తర్వాత ఆ డిజైన్లు బాగోలేవంటూ మకిని తొలగించారు. ఆ తర్వాత లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ ఐదారుసార్లు డిజైన్లు రూపొందించినా ముఖ్యమంత్రికి నచ్చలేదు. చివరకు ఫోస్టర్ సంస్థకు సలహాలిచ్చి డిజైన్లు రూపొందించే బాధ్యతను బాహుబలి దర్శకుడు రాజమౌళికి అప్పగించారు. ఆ డిజైన్లు ఎప్పుడు వస్తాయో, అమరావతి నిర్మాణం ఎప్పటికి సాకారమవుతుందో అంతుచిక్కడం లేదు. శంకుస్థాపనలతోనే సరి... ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా అంతర్జాతీయ నగరం, అద్భుత నిర్మాణాలంటూ రెండేళ్ల క్రితం శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీతో పాటు దేశ, విదేశీ ప్రముఖుల సమక్షంలో చెప్పిన మాటలనే ఇప్పటికీ తిప్పి తిప్పి వల్లెవేస్తోంది. పవిత్రత కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, నగరాలు, దేశంలోని పుణ్య క్షేత్రాలు, నదుల నుంచి మట్టి, నీరు తెచ్చి శంకుస్థాపన జరిగే చోట వాటిని ఉంచి హడావుడి చేసినా అవేవీ ఇప్పుడు అక్కడ కనిపించడం లేదు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం జరిగిన ఏడాది తర్వాత లింగాయపాలెం వద్ద కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు (ప్రస్తుత ఉపరాష్ట్రపతి), అరుణ్ జైట్లీలతో రాజధాని పరిపాలనా నగరానికి శంకుస్థాపన చేయించారు. ఇప్పటికీ అక్కడ ఒక్క ఇటుక కూడా ఉపయోగించిన దాఖలాలు లేవు. రోడ్ల కోసం ఎర్రబాలెంలో, స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం తాళ్లాయపాలెంలో సీఎం చంద్రబాబు స్వయంగా శంకుస్థాపనలు చేసిన ప్రదేశాలన్నీ పిచ్చి మొక్కలతో నిండి కనిపిస్తున్నాయి. డెడ్‌లైన్ ప్రకటించినా.. రాజధాని నిర్మాణ పనులు ఈ సంవత్సరం జులైలో ప్రారంభించి 2018 డిసెంబర్‌కల్లా నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం కొద్ది నెలల క్రితం డెడ్‌లైన్ ప్రకటించింది. సచివాలయం నిర్మాణాన్ని మే 10న, అసెంబ్లీని జూలై 20న, హైకోర్టు నిర్మాణాన్ని ఆగస్టు 17న మొదలు పెట్టి 2018 కల్లా పూర్తి చేస్తామని షెడ్యూల్ విడుదల చేసింది. కానీ ఇప్పటివరకూ డిజైన్లే ఖరారు కాకపోతే నిర్మాణాలు పూర్తయ్యేదెప్పుడని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నిధులకు లెక్కల్లేవు... రాజధాని నిర్మాణంకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1500 కోట్లు విడుదల చేసింది. అయితే వాటిని ఎలా వినియోగించారనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పలేదు. కేంద్రం విడుదల చేసిన నిధులను అసెంబ్లీ, సచివాలయం, కార్యాలయాల్లాంటి శాశ్వత నిర్మాణాలకు వెచ్చించి ఉంటే వాటిని చూపి మరిన్ని నిధులను కేంద్రాన్ని అడిగే అవకాశం ఉండేది. కానీ ఒక్క తాత్కాలిక సచివాలయానికే రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం పక్కాగా లెక్కలు చూపే పరిస్థితిలో లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని మరిన్ని నిధులు అడిగే ధైర్యం చేయలేకపోతోందని సీనియర్ ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అక్టోబర్ 22, 2015... - ప్రధాని చేతుల మీదుగా తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన - విజయదశమి రోజున శంకుస్థాపన చేశామని, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామన్న సీఎం - రాష్ట్రంలోని 16 వేల గ్రామాల్లోని మట్టి, నీరు, దేశంలోని పుణ్యక్షేత్రాలు, పవిత్ర స్థలాల నుంచి మట్టి, పుణ్య నదుల నుంచి నీరు సేకరణ - యమునా నది నుంచి నీరు, పార్లమెంటు నుంచి మట్టి తెచ్చి చంద్రబాబుకు ఇచ్చిన ప్రధాని మోదీ అక్టోబర్ 22, 2017... - బీడు భూమిగా పనికి రాకుండా ఉన్నశంకుస్థాపన చేసిన ప్రాంతం - పుణ్యక్షేత్రాలు, పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టి జాడ లేదు - ఒక్క నిర్మాణమూ చేపట్టని ప్రభుత్వం - ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తున్నామని తాజాగా దుబాయ్ పర్యటనలో సీఎం ప్రకటన ఒక భూమిపూజ... నాలుగు శంకుస్థాపనలు - 06–06–2015 : మందడంలో రాజధానికి భూమిపూజ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు - 22–10–2015 : ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన - 25–06–2016 : సీడ్ యాక్సెస్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు - 28–10–2016 : పరిపాలనా నగరానికి లింగాయపాలెం వద్ద శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, ముఖ్యమంత్రి చంద్రబాబు - 29–03–2017 : ఎర్రబాలెంలో రాజధాని ప్రాధాన్యతా రోడ్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన -
160 ఎకరాల్లో అసెంబ్లీ భవనం
- 8 నుంచి 10 అంతస్తుల్లో సచివాలయం - రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరంలో ప్రధాన ఆకర్షణగా నిలిచేలా అసెంబ్లీ భవనాన్ని 160 ఎకరాల్లో నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో 140 ఎకరాలను కేవలం జల, హరిత అవసరాల కోసమే వినియోగిస్తారు. ఈ మేరకు పరిపాలనా నగరం డిజైన్లలో పలు మార్పులు చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రి చంద్రబాబు కు తెలియజేశారు. తుది మార్పుల ప్రకారం సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవనాలను ఉత్తర దిశగా కొంచెం ముందుకు జరిపినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణంపై బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిజైన్ల గురించి సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ వివరించారు. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకూ లండన్‌లో పరిపాలనా నగరం డిజైన్లపై జరిగిన వర్క్‌షాపులో పాల్గొన్నామని పేర్కొన్నారు. ప్రధానంగా అసెంబ్లీ నిర్మాణం, ప్రజా రవాణా, జల వనరులపై నార్మన్ ఫోస్టర్ సంస్థ బృందంతో చర్చించినట్లు చెప్పారు. క్రిస్‌బెర్గ్ నేతృత్వంలో 90 శాతం డిజైన్ల రూపకల్పన పూర్తయిందని, ఈ నెల 22న నార్మన్ ఫోస్టర్ బృందం డిజైన్లు ఇస్తుందని వెల్లడించారు. వాటిపై ఏవైనా సలహాలు, సూచనలు ఇస్తే వాటి ఆధారంగా తుది డిజైన్లు అందిస్తారని తెలిపారు. అమరావతిలో ఎలక్ట్రికల్ కార్లు రాజధానిలో సచివాలయ భవనం 8 నుంచి 10 అంతస్తుల్లో కనీసం ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని శ్రీధర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ... అంతర్జాతీయ నగరాల్లో డ్రైవర్ లేని ఎలక్ట్రికల్ కార్లు నడుస్తాయని, అమరావతిలోనూ అలాంటి కార్లు ఉంటాయని చెప్పారు. సౌర విద్యుత్‌పై అంతర్జాతీయ సదస్సు సౌర విద్యుత్ నిల్వ వ్యవస్థను ఏర్పాటు కు గాను అత్యున్నత సాంకేతిక పద్ధతులను తెలుసుకునేందుకు త్వరలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని యోచిస్తునట్లు సీఎం మాట్లాడుతూ చెప్పారు. -
రాజధానికి కుచ్చుటోపి
►రూ.1,061 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం ►అరకొర నిధులతో రాజధాని ప్రాజెక్టులెలా? అమరావతి: ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తాం అంటూ నిత్యం ఊదరగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం దానికి నామమాత్రపు నిధులు కూడా విదల్చలేదు. రూ.వేల కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయిస్తూ చివరికి అందులో పది శాతం కూడా కేటాయించకపోవడం గమనార్హం. అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు రూ.1,061 కోట్లు మాత్రమే కేటాయించారు. అవి ఏ మూలకూ సరిపోవని స్వయంగా ఆర్థిక మంత్రే తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం మాట అటుంచితే కనీసం భూములిచ్చిన రైతులకు కౌలు, పేదలకు పెన్షన్లు, లేఔట్ల రూపకల్పన వంటి వాటికి సైతం ఈ నిధులు సరిపోవు. అమరావతి రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు కోసం రూ.500 కోట్లు కేటాయించారు. ఇవికాకుండా భవిష్యత్తు అవసరాల నిధి కోసం రూ.169 కోట్లు, భూసమీకరణ పథకానికి రూ.247 కోట్లు, పెన్షన్లకు రూ.70.5 కోట్ల కేటాయింపులు చేశారు. అమరావతి ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లు కేటాయించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకే ప్రతిఏటా రూ.140 కోట్ల కౌలు చెల్లించాల్సి ఉంది. 20 గ్రామాల్లో రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల లేఔట్ల నిర్మాణానికే రూ.200 కోట్లకుపైగా ఖర్చు కానుంది. రాజధాని పరిధిలో ఉన్న గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు భారీ స్థాయిలో నిధులు అవసరం. వివిధ ప్రాజెక్టుల కోసం నియమించుకున్న కన్సల్టెన్సీలకు రూ.50 కోట్లకుపైగానే చెల్లించాల్సి ఉంది. నిర్మాణంలో ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డుకు రూ.400 కోట్లు, టెండర్లు ఖరారైన కీలకమైన ఏడు ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లకు రూ.2,000 కోట్లు కావాలనిఇటీవలే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ పరిపాలనా నగరం డిజైన్లు తయారు చేసిన లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ కంపెనీకి రూ.67 కోట్లు చెల్లించాల్సి ఉండగా, దాని నిర్మాణానికి రూ.3,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. హైదరాబాద్ రహదారికి రాజధానిని అనుసంధానం చేస్తూ కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్ బ్రిడ్జికి రూ.800 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇవికాకుండా భవనాల డిజైన్లు, వాటి నిర్మాణానికి భారీగా నిధులు కావాలని సీఆర్డీఏ ప్రతిపాదనలు తయారు చేసింది. వీటితోపాటు మిగిలిన రాజధాని ప్రాజెక్టులు, అక్కడి పనుల కోసం మొత్తం రూ.41,235 కోట్లు కావాలని, అందులో ఈ ఒక్క సంవత్సరమే రూ.5,468 కోట్లు అవసరమని సీఆర్డీఏ ఒక నోట్ తయారు చేసింది. రూ.వేల కోట్లు అవసరమైన రాజధానికి బడ్జెట్లో ప్రభుత్వం మొండిచేయి చూపడంపై సీఆర్డీఏ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ►అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టును కూడా ఇందులోనే కలిపి రూ.100 కోట్లు కేటాయించారు. ► ఆర్భాటంగా స్మార్ట్ నగరాలను ప్రకటించినా వాటికి కేవలం రూ.150 కోట్లే కేటాయించారు. ►పట్టణాల్లో సౌకర్యాల మెరుగు కోసం గొప్పగా చెబుతున్న అమృత్ పథకానికి రూ.197.72 కోట్లు విదిల్చారు. ►మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మురికివాడల అభివృద్ధి పథకమైన వెలుగు ప్రాజెక్టుకు ఈసారి కేటాయింపులు తగ్గించారు. రూ.2,691 కోట్లు ఇచ్చారు. ► జాతీయ పట్టణ జీవనధార్ మిషన్‌కు రూ.16 కోట్లు కేటాయించారు. ► చిన్న, మధ్య తరహా పట్టణాల అభివృద్ధికి అసలు కేటాయింపులే లేవు. ►మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మడ)కి చాలా తక్కువగా కేవలం రూ.50 కోట్లు విదిల్చారు. ► మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో జీతాలు, ఇతర అలవెన్సులకు రూ.909 కోట్లు కేటాయించారు. ►మున్సిపల్ పాఠశాలల్లో ప్రాథమికమైన వసతుల కల్పనకు అసలు నిధులే ఇవ్వలేదు. -
చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా
రాజధాని నిర్మాణం ఈనెల 22న పరిపాలన నగరం డిజైన్లు ఖరారు సీఆర్డీఏ సమీక్షలో సీఎం సాక్షి, అమరావతి: ఆంధ్రుల చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా రాజధాని పరిపాలన నగరాన్ని నిర్మించాలని సీఎం చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఈనెల 22న లండన్‌కు చెందిన మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్స్ తుది డిజైన్లను సమర్పిస్తారని.. అదే రోజున డిజైన్లను ఖరారు చేయాలని సూచించారు. గురువారం వెలగపూడిలోని సచివాలయంలో సీఆర్డీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిపాలన నగరంలో నిర్మించే భవనాల డిజైన్లు అత్యుత్తమంగా ఉండాలని సూచించారు. దీనికోసం కన్సల్టెంట్లు, అధికారులు కలసి పనిచేయాలని ఆదేశించారు. డిజైన్లను పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌కు అప్పగించారు. వచ్చే ఏడాదికి ఆర్థిక నగరం అందమైన ఆర్థిక నగరంగా 2018 నాటికి అమరావతిని తీర్చిదిద్దుతామని, దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ భవనాల నిర్మాణ షెడ్యూల్‌ను ప్రకటించారు. అసెంబ్లీని జీ ప్లస్ 3 విధానంలో నిర్మిస్తామని, 2018 అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. హైకోర్టును జీ ప్లస్4లో విధానంలో నిర్మిస్తామని, 2019 ఏప్రిల్ కల్లా పూర్తి చేస్తామన్నారు. -
ఆ రెండు దేశాలను మనోళ్లు నాశనం చేస్తారు
-
ఆ రెండు దేశాలను మనోళ్లు నాశనం చేస్తారు
సింగపూర్, అమెరికాలనూ నాశనం చేస్తారంటూ వ్యాఖ్యలు ఎన్ఆర్ఐలపై చంద్రబాబు ధ్వజం స్వదేశానికి రాగానే సామాజిక కోణం విస్మరిస్తున్నారు స్వేచ్ఛను అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు నారావారిపల్లెలో సీఎం సంక్రాంతి సంబరాలు తిరుపతి రూరల్/ చంద్రగిరి: ‘‘పనిమీద అంకితభావం ఉండదు.. నిర్లక్ష్యం ఎక్కువ.. సామాజిక కోణాలు పట్టించుకోరు.. అక్కడ వ్యవస్థలు పటిష్టంగా ఉండబట్టి సరిపోయింది. లేకుంటే మనోళ్లు సింగపూర్, అమెరికాలను సైతం నాశనం చేస్తారు..’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవాస భారతీయులపై ధ్వజమెత్తారు. విదేశాల్లో వ్యవస్థల వల్ల నిబద్దతతో ఉండే ఎన్ఆర్ఐలు, స్వదేశంలోకి రాగానే సామాజిక కోణం విçస్మరించి విపరీతమైన స్వేచ్ఛను అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. అమ్మను, జన్మభూమిని విస్మరించకుండా సేవలు అందించాలని కోరారు. సంక్రాంతి పురస్కరించుకుని చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం నారావారిపల్లెకు వచ్చిన ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మన దేశంలో వ్యవస్థలు సరిగా లేవని, బాగుపడేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని అన్నారు. ఈ ఏడాది అమ్మను, ఆంధ్రాను మరవద్దని విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ పశువులకు హాస్టళ్లు కట్టిస్తామని, ప్రయోగాత్మకంగా తొలుత నారావారిపల్లెలోనే దీనిని ప్రారంభిస్తామని తెలిపారు. ‘గతంలో ఎక్కువ పనిచేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయని అధికారులను పరుగులు పెట్టించా.. కానీ అది తప్పు అని తెలుసుకున్నా. చేసే పని ఎంతైనా తృప్తిగా చేస్తేనే ఫలితాలు వస్తాయి అని గుర్తించా. అందుకే నచ్చిన పనిని ఆనందంగా చేయాలని ఇప్పుడు పిలుపునిస్తున్నా’ అని చంద్రబాబు చెప్పారు. దావోస్‌కు చంద్రబాబు పయనం సాక్షి,, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం రాత్రి దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన సోమవారం స్విస్ ఇండియా చాంబర్స్ ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారు. 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. కన్సల్టెంట్లను నియమించండి రాజధాని నిర్మాణం, అభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సాంకేతికతను వినియోగించుకునేందుకు వీలుగా అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లను నియమించుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని వ్యవహారాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఆర్డీఏ, ఏడీసీ విభాగాలకు అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లను నియమించు కోవాలన్నారు. సంక్రాంతి సంబరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లెలో కుటుంబసభ్యులతో కలసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు. శనివారం ఉదయం సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, తమ్ముడి కుమారుడు నారా రోహిత్ తదితరులతో కలసి నాగాల మ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
అక్రమాలు అనంతం
నిజనిజాలు తేల్చకుండా ప్లాట్ల కేటాయింపునకు నోటిఫికేషన్ సాక్షిలో వచ్చిన వాటిలో కొన్ని పేర్ల తొలగింపు మిగిలినవి రాలేదు కదా అంటూ బుకాయింపు కుమిలిపోతున్న అనంతవరం బాధితులు పట్టించుకోని సీఆర్డీఏ అధికారులు రాజధాని గ్రామం అనంతవరంలో అక్రమాల నిగ్గుతేల్చకుండానే ప్లాట్ల కేటాయింపునకు సీఆర్డీఏ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో భూములను మాయం చేసి రాయించుకున్నవారు... భూమి లేకపోయినా ఉన్నట్లు రికార్డులు సృష్టించుకున్నవారు మాత్రం దర్జాగా తిరుగుతుంటే.. భూములు పోగొట్టుకున్న బాధితులు మాత్రం లోలోన కుమిలిపోతున్నారు. మాయమైన తమ భూముల పరిస్థితి గురించి సీఆర్డీఏ అధికారుల వద్ద మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. అమరావతి బ్యూరో : రాజధాని నిర్మాణం కోసం దేశానికి అన్నం పెట్టే రైతుల భూములను లాక్కున్న ప్రభుత్వం వారికి జరుగుతున్న అన్యాయంపై నోరెత్తడం లేదు. అధికార పార్టీ నేతల జేబులు నింపే విషయంలో వారికి పూర్తి మద్దతు ఇస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో రైతులకు చెందిన భూములు సెంట్ల రూపంలో మాయమైన బాగోతంపై సాక్షి వరుస కథనాలు ఇచ్చిన విషయం తెలిసిందే. గత నెల 16న ‘రాజధాని గ్రామాల్లో అవినీతి సెంటు’ శీర్షికన వచ్చిన కథనంలో ప్రచురించిన పేర్లలో కొందరివి మాత్రం సరిచేశారు. పత్రికలో రాని పేర్లకు సంబంధించి ఏ ఒక్కరివీ సరిచేయలేదు. అదేమని అడిగితే.. ‘సాక్షిలో వచ్చినవి అవే కదా’ అంటూ సీఆర్డీఏ అధికారులు సమాధానం ఇస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపట్ల వివక్ష రాజధాని కోసం భూములు వదులుకున్న రైతులకు ప్రభుత్వం ఎంత చేసినా రుణం తీరదని ముఖ్యమంత్రి పదేపదే చెబుతూనే ఉన్నారు. మరోవైపు అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రం మరింత రెచ్చిపోతున్నారు. వారికి సీఆర్డీఏ, రెవెన్యూ, పోలీసు శాఖలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రశ్నించిన వారిపై పార్టీ శ్రేణులు దౌర్జన్యానికి దిగుతున్నారు. ఒక్క అనంతవరంలో ఇంత పెద్దఎత్తున భూ కుంభకోణం జరిగితే... అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతల పేర్లు పత్రికలో వచ్చినా.. లెక్కచేయకుండా స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అనంతవరం గ్రామానికి చెందిన వందలాది మంది రైతుల భూములు తారుమారైన విషయాన్ని సాక్షి ఆధారాలతో వెలుగులోకి తెచ్చినా... సీఆర్డీఏ అధికారులు వాటిని సరిచేయకుండా ప్లాట్ల కేటాయింపునకు నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక మర్మం దాగి ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జనచైతన్యయాత్రల పేరుతో గ్రామాల్లోకి వెళ్తుండడం గమనార్హం. రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ రికార్డుల తారుమారు, భూమి లేకపోయినవారికి, ఉన్న మరికొందరికి అనూహ్యంగా రికార్డుల్లో అదనంగా నమోదైన భూముల వివరాలు ఇలా ఉన్నాయి... -
నిధులివ్వలేం: చంద్రబాబు
- అమరావతిలో భూగర్భ విద్యుత్తు వ్యవస్థపై సీఎం రూ.1,500 కోట్లు - కేటాయించలేమని స్పష్టీకరణ సాక్షి, అమరావతి బ్యూరో: అమరావతిలో అత్యాధునిక భూగర్భ విద్యుత్తు సరఫరా వ్యవస్థపై ప్రభుత్వం చేతులెత్తేసింది. అందుకు రూ.1,500 కోట్లు కేటాయించలేమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పేశారు. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించమని ట్రాన్స్‌కోకు సూచించారు. ఇప్పట్లో రాజధానికి డెవలపర్లు వచ్చే అవకాశాలు లేవని కూడా ఆయన వ్యాఖ్యానించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమరావతి కోసం ప్రభుత్వం సమీకరించిన 33 వేల ఎకరాల మీదుగా ఎనిమిది ట్రాన్స్‌కో హెచ్‌టీ విద్యుత్తు లైన్లు వెళ్తున్నాయి. రాజధాని నిర్మాణానికి అనుకూలంగా ఆ లైన్లను తొలగించి డెవలపర్లకు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. అందుకు అత్యాధునిక రీతిలో భూగర్భ విద్యుత్తు కేబుల్ వ్యవస్థను ఏర్పాటుకు సీఎం ఆమోదించడంతో ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయడానికి ట్రాన్స్‌కో ప్రాథమిక సన్నాహాల్లో నిమగ్నమైంది. కానీ ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ట్రాన్స్‌కోకు సీఎం షాక్ ఇచ్చారు. భూగర్భ విద్యుత్తు వ్యవస్థ కోసం రూ.1,500కోట్లు ప్రభుత్వం కేటాయించలేదని తేల్చేశారు. బాబు వ్యాఖ్యలతో ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు షాక్ తిన్నారు. భూగర్భ విద్యుత్తు పనులు పూర్తికావడానికి రెండేళ్లు పడుతుంది. అంటే అప్పటికి రాజధాని డెవలపర్ల ఎంపిక పూర్తి చేసి పనులు ప్రారంభించే అవకాశాలు లేవని స్పష్టమైంది. రైతుల నుంచి సమీకరించిన 33 వేల ఎకరాల్లో రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి రాజధాని నిర్మాణం కోసం డెవలపర్లకు ఇస్తామన్నది ప్రభుత్వ విధానం. ప్రస్తుతం భూగర్భ విద్యుత్తు వ్యవస్థకు రూ.1,500 కోట్లే కేటాయించలేమని ప్రభుత్వం చెబుతోంది. ఆ లెక్కన మౌలిక సదుపాయాలకు రూ.5,500 కోట్లు కేటాయించడం కూడా అసాధ్యంగానే కనిపిస్తోంది. -
అస్థానా తరహాలో అమరావతి
- రాజధాని నిర్మాణంలో మార్పులు - వాణిజ్య, సర్కారు జోన్లో గృహ సముదాయాలు - కజికిస్థాన్ పర్యటన అనంతరం సీఎం ఆలోచనలు సాక్షి, హైదరాబాద్ : కజకిస్తాన్ రాజధాని అస్థానా తరహాలో ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఏ రంగానికి కేటాయించిన జోన్లో ఆ నిర్మాణాలే జరగాలనే నిబంధనల్లో కొంతమేర సడలింపులు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ జోన్లో ఇతర కార్యకలాపాలకు అనుమతించకూడదని ఇప్పటివరకూ భావించారు. అలా చేయడం వల్ల ప్రభుత్వ కార్యాలయాల సమయం ముగిసిన తరువాత ఆ ప్రాంతంలో జన సంచారం లేకపోవడమే కాకుండా ఎలాంటి కార్యకలాపాలకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల జోన్ పరిధిలో కొంతభాగం గృహ సముదాయాలకు అనుమతించాలని, అలాగే మరికొంత భాగంలో వాణిజ్య సముదాయాలకు అనుమతించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే వాణిజ్య జోన్లో ఇతర కార్యకలాపాలకు, నివాసాలకు అనుమతించకూడదనే ఆలోచనను మార్చుకుం టున్నట్లు వెల్లడించారు. వాణిజ్య జోన్‌లోనూ నివాస సముదాయాలకు కొంతమేర అనుమతించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భూగర్భ పార్కింగ్ వసతి అస్థానాలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ఒక భవనం నుంచి మరో భవనానికి నడిచి వెళ్లేందుకు కారిడార్లు ఉన్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. అమరావతిలోకూడా ఇదే తరహా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. అక్కడ అంతా భూగర్భ పార్కింగేనని ఇలాంటి ఏర్పాటే ఉండాలని సీఎం యోచిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టపక్కల పూల వనాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. -
విదేశీ రాజధానే..
స్విస్ చాలెంజ్ పద్ధతిని రద్దు చేయాలి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు విజయవాడ(గాంధీనగర్) : ప్రజారాజధాని నిర్మాణం చేపడతామని చెప్పిన సీఎం చంద్రబాబు చివరికి అమరావతిని ప్రైవేటు, కార్పొరేట్, విదేశీ రాజధానిగా మార్చేశారని పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు విమర్శించాయి. హనుమంతరాయ గ్రంథాలయంలో ‘ రాజధాని- విదేశీ కంపెనీలు- స్విస్ చాలెంజ్ ’ అనే అంశంపై రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి వడ్డేశోభనాద్రీశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవినేని నెహ్రూ, సీపీఎం రాష్ర్ట కార్యదర్శి పి.మధు, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. సీపీఎం రాజధాని ప్రాంత కమిటీ కన్వీనర్ సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ చీకటి ఒప్పందాల్లో భాగంగానే స్విస్‌చాలెంజ్ పేరుతో సింగపూర్ కన్సార్టియంకు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నారన్నారు. ఉచితంగా మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నారంటూ చెప్పిన చంద్రబాబు కోట్లాది రూపాయలు, వం దలాది ఎకరాల భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టారన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ ఐదేళ్ల కాలపరిమితితో వచ్చిన చంద్రబాబు అహం కార పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. కేల్కర్ కమిటీ వద్దని చెప్పిన స్విస్‌చాలెంజ్ విధానంలో నిర్మాణ చేపడితే ప్రజాస్వామ్యానికి, రైతులకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సత్తా జిల్లా నాయకుడు భానుప్రసాద్ మాట్లాడుతూ దేశప్రజలను అవమానించే రీతిలో చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కేఎల్ రావు ఈ దేశంలో పుట్టిన గొప్ప ఇంజినీర్లు అన్న విషయం చంద్రబాబు మర్చిపోయారన్నారు. ఎంసీపీఐ రాష్ర్ట నాయకుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి నష్టదాయకమైన విధానాలు అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. రాజధాని ప్రాంత రైతు అనుమోలు గాంధీ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో దొంగతనంగా సామాజిక ప్రభావాన్ని అంచనా సర్వే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలో 80 శాతానికి పైగా వరద ముంపునకు గురవుతుందన్నారు. కొండవీటి వాగును లిప్ట్ చేస్తామనడం అసంబద్దమన్నారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకుడు హరినాథ్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.గంగాధర్, సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, ఉండవల్లి రైతు శివకుమార్, కొలనుకొండ శివాజీ, పోతిన వెంకటరామారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పోలారి ప్రసాద్ ప్రసంగించారు. -
ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక కుంభకోణం
రాజధాని సెంటిమెంట్‌ను దోపిడీగా మార్చుకున్న చంద్రబాబు: సీఆర్ సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక కుంభకోణంగా మారి చరిత్రకెక్కనుందని శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. శనివారం ఇందిర భవన్లో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా గౌతం, ఉపాధ్యక్షుడు సూర్యానాయక్‌లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని సెంటిమెంట్ వెనుక లక్షల కోట్ల దోపిడీ దాగి ఉందని, అందులో భాగంగానే సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలను చేసుకున్నారన్నారు. సింగపూర్ కంపెనీలతో ప్రభుత్వం చేసుకున్న స్విస్ చాలెంజ్ ఒప్పందాలను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబుకు రహస్య ఎజెండా లేకపోతే గ్లోబల్ టెండర్లను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ఎంపిక చేసుకున్న కంపెనీలకు మాత్రమే అవకాశం వచ్చే విధంగా క్విడ్‌ప్రోకో అనుసరిస్తూ చంద్రబాబు చారిత్రక తప్పిదం చేస్తున్నారన్నారు. -
సింగపూర్ గుప్పెట్లో రాజధాని
- స్విస్ చాలెంజ్ విధానంలో మెజారిటీ వాటా ఆ దేశ కంపెనీలకే - రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణంలో సింగపూర్ కంపెనీలకే పెద్దపీట వేస్తూ రూపొందించిన స్విస్ చాలెంజ్ విధానానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. భూముల బదలాయింపు, వాటాలతోపాటు ఆ దేశ కంపెనీలు విధించిన షరతులన్నింటికీ దాదాపు అంగీకరించింది. తొలి విడతగా సీడ్ రాజధానిలో ఉచితంగా లేదా నామమాత్రపు ధరకు 50 ఎకరాలు, మొత్తంగా 1,691 ఎకరాలు సింగపూర్ కన్సార్టియంకు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రాజెక్టులో మెజారిటీ వాటా, భూములివ్వడంతోపాటు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన సౌకర్యాలు ప్రభుత్వ శాఖలే సమకూర్చనున్నాయి. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీలో ప్రభుత్వం రాజధాని భూముల కేటాయింపుపై నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్, మంత్రులు యనమల, నారాయణ, పల్లె రఘునాథ్‌రెడ్డితో కలిసి సీఎం చంద్రబాబు మీడియాకు వివరించారు. ప్రభుత్వం ఆమోదించిన స్విస్ చాలెంజ్‌ని సింగపూర్ కన్సార్టియం స్థాయిలో ఉన్న ఏ కంపెనీలైనా చాలెంజ్ చేసి తమ ప్రతిపాదనలు ఇవ్వొచ్చని, అంతే తప్ప రోడ్డుపైన పోయే కంపెనీలకు అవకాశం ఉండదన్నారు. 45 రోజుల గడువులోపు ఎవరూ చాలెంజ్ చేయకపోతే మళ్లీ వచ్చే మంత్రివర్గ భేటీలో సింగపూర్ కన్సార్టియంకే ప్రాజెక్టు అప్పగించి పనులు మొదలుపెట్టిస్తామన్నారు. స్విస్ చాలెంజ్‌లో సింగపూర్‌కు... రాజధాని నిర్మాణంలో పాలుపంచుకునేందుకు సింగపూర్‌కి చెందిన అసెండాస్-సిన్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్ కంపెనీల కన్సార్టియం 2015 అక్టోబర్‌లో ప్రతిపాదనలు ఇచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. వాటిపై చర్చించేందుకు హైపవర్ కమిటీని నియమించామని, పలు దఫాలు చర్చించాక స్విస్ చాలెంజ్ విధానం కింద వారి ప్రతిపాదనలను ఆమోదించామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి ముందుకు రావాలని జపాన్, బ్రిటన్ దేశాలను కోరినా వారు ఇంకా పరిశీలన దశలోనే ఉన్నారని తెలిపారు. దీంతో సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనలపై ముందుకెళ్లాలని నిర్ణయించామన్నారు. కన్సార్టియంగా ఏర్పడిన కంపెనీల్లో సింగపూర్ ప్రభుత్వానికి 74.5 శాతం వాటా ఉందని తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం తరఫున ఈ కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమరావతి డెవలప్మెంట్ కంపెనీ (ఏడీసీ) (మొన్నటివరకూ సీసీడీఎంసీ)లు కలిసి పనిచేస్తాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులో ఏడీసీకి 42 శాతం వాటా, సింగపూర్ కన్సార్టియంకు 58 శాతం ఉంటుందని తెలిపారు. సీడ్ రాజధానిలో 1,691 ఎకరాలను ప్రభుత్వం ఏడీసీకి ఇస్తుందని, కంపెనీ తన భాగస్వామిగా ఉన్న సింగపూర్ కన్సార్టియంతో కలిసి దాన్ని అభివృద్ధి చేస్తుందని వివరించారు. తొలి విడతగా 50 ఎకరాలను ఉచితంగా లేదా నామమాత్రపు ధరకు ఇస్తామని, రెండో విడతలో ఎకరం నాలుగు కోట్లు చొప్పున 200 ఎకరాలను ఇస్తామన్నారు. ఆ తర్వాత మార్కెట్ విలువను మూడో విడత మిగిలిన భూమిని వారికి అప్పగిస్తామన్నారు. వ్యతిరేకంగా వార్తలు రాసినా, చూపినా కేసులు పెట్టండి సాక్షి, హైదరాబాద్: తమకు వ్యతిరేకంగా పత్రికలు వార్తలు రాసినా, టీవీచానళ్లలో కథనాలు ప్రసారం చేసినా వారిని భయభ్రాంతులకు గురిచేసే రీతిలో కేసులు పెట్టాలనే ఆలోచనలో రాష్ట్రప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించినట్టు, మంత్రులెవ్వరూ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దని కోరినట్టు తెలిసింది. ఇప్పటినుంచే భయపెట్టకపోతే ప్రతి విషయాన్నీ కొన్నిపత్రికలు, టీవీ చానళ్లు భూతద్దంలో చూపుతాయని, చిన్న తప్పుల్నీ ఎత్తిచూపే అవకాశముందని, ప్రజలకు అన్ని విషయాలు తెలిస్తే భవిష్యత్తులో పార్టీకి, ప్రభుత్వానికే ప్రమాదకరంగా పరిణమించే వీలుందని కేబినెట్ భేటీలో సీఎం అన్నట్టు సమాచారం. ఉల్లంఘన జరగలేదు... రాజధాని నిర్మాణం ఒప్పందంలో ఎక్కడా చిన్న ఉల్లంఘన కూడా జరగలేదని సీఎం స్పష్టంచేశారు. ఈ వ్యవహారంలో సీఎస్ సంతకం పెట్టలేదని కొందరు ఆరోపణలు చేస్తున్నారని... సీఆర్డీఏ చైర్మన్ హోదాలో మొదట ఈ ప్రతిపాదనలను తాను పరిశీలించానని, ఆ తర్వాత సీఎస్ నేతృత్వంలోని మౌలిక వసతుల కమిటీకి ఫైల్ పంపామని.. అక్కడి నుంచి సంబంధిత శాఖలకు వెళ్లి తిరిగి కేబినెట్లో మళ్లీ తన వద్దకొచ్చిందన్నారు. న్యాయశాఖ అభిప్రాయం తీసుకుని నిబంధనల ప్రకారమే చేశామని చెప్పారు. ప్రభుత్వం ఆమోదించిన స్విస్ చాలెంజ్‌ని సింగపూర్ కన్సార్టియం స్థాయిలో ఉన్న ఏ కంపెనీలైనా చాలెంజ్ చేసి తమ ప్రతిపాదనలు ఇవ్వొచ్చని, అంతే తప్ప రోడ్డుపైన పోయే కంపెనీలకు అవకాశం ఉండదన్నారు. ఈ ప్రక్రియకు 45 రోజుల సమయం ఉంటుందని.. అప్పటికి ఎవరూ చాలెంజ్ చేయకపోతే మళ్లీ వచ్చే మంత్రివర్గ సమావేశంలో సింగపూర్ కన్సార్టియంకే ప్రాజెక్టు అప్పగించి పనులు మొదలుపెట్టిస్తామని తెలిపారు. సింగపూర్ కన్సార్టియం తరఫున మేనేజింగ్ కంపెనీని ఏర్పాటుచేసుకుంటారని, రాబోయే రోజుల్లో స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటుచేసినా ఏడీసీ కిందే ఉంటాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రెవెన్యూ శాఖ స్టాంప్ డ్యూటీ తగ్గిస్తుందని తెలిపారు. ఇరిగేషన్ పరిధిలోని కృష్ణానది కరకట్ట పునర్నిర్మాణం బాధ్యత కూడా సింగపూర్ వాళ్లదేనన్నారు. మైనింగ్ శాఖ క్యూబిక్ మీటరు రూ.500 చొప్పున ఈ ప్రాజెక్టుకి ఇసుక సరఫరా చేస్తుందని, రవాణా శాఖ అవసరమైన రహదారుల వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని, విద్యుత్ శాఖ విద్యుత్‌ను సరఫరా చేస్తుందని, ప్రజారోగ్యం, పారిశుధ్యం, భద్రత చర్యలతోపాటు ఇతర సౌకర్యాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ శాఖలే చూస్తాయని ఆయన చెప్పారు. -
ప్లాట్లు...పాట్లు
► రాజధాని రైతుల్లో గందరగోళం ► కేటాయింపులపై స్పష్టత కరువు ► కాగితాల్లోనే పంపిణీ !? ► నేటి నుంచి భూముల రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు రాజధాని ప్రాంత రైతుల్లో గందరగోళం నెలకొంది. ప్లాట్ల కేటాయింపుపై ప్రభుత్వ యంత్రాంగానికీ స్పష్టత లేదు. ఈనెల చివరినాటికి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ విషయంపై రైతులు మాత్రం ఏ ఆప్షన్లు తీసుకోవాలో అర్థం కాక తలలుపట్టుకుంటున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటే.. ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఒకపక్క ప్లాట్ల కేటాయింపులు ఆలస్యం అవుతుంటే.. రాజధాని ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్లపై సర్కారు ఆంక్షలు విధించింది. శుక్రవారం నుంచి ఎన్ఓసీ లేకుండా రిజిస్ట్రేషన్లూ జరపరాదని అధికారులకు ఆదేశాలిచ్చింది. సాక్షి, అమరావతి : రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాలకు చెందిన 22 వేల మంది రైతులు 32 వేల ఎకరాల భూములను భూసమీకరణ పథకం కింద ఇచ్చారు. వారికి తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్ల విషయంలో అటు రైతుల్లో.. అటు అధికారుల్లో గందరగోళం నెలకొనడంతో ప్లాట్ల కేటాయింపు వాయిదా పడుతూ వచ్చింది. గత నెలలో ప్లాట్ల కేటాయింపు విధానాన్ని ప్రకటించి జాయింట్, సింగిల్ ప్లాట్ల కోసం ఆప్షన్లు ఇవ్వాలని రైతులను కోరినా పెద్దగా స్పందించలేదు. గడువు ముగిసే నాటికి 22 వేల మందికి గాను కేవలం 6,992 మంది రైతులు ఆప్షన్లు ఇచ్చారు. మిగిలినవారు ఆప్షన్లకు దూరంగా ఉండిపోయారు. భూములు తీసుకున్న రైతులకు డిసెంబర్లోనే ప్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పింది. ఆ తరువాత సంక్రాంతికని పేర్కొంది. అదీ కాకపోయేసరికి మార్చిలో ఇస్తామని తెలిపింది. మరికొద్దిరోజుల తరువాత ఏప్రిల్, ఆ తరువాత మే నెలలో అని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ప్రస్తుతం జూన్ అన్నారు. ఈ నెలలోనూ పది రోజులు గడచిపోయాయి. అయినా ప్లాట్ల కేటాయింపులో స్పష్టత లేదు. ఈనెల చివరి నాటికి నోటిఫికేషన్ ఇస్తామని అధికారులు చెపుతున్నారు. అది కూడా తుళ్లూరు మండలం నేలపాడు గ్రామానికి సంబంధించిన రైతులకు మాత్రమే ప్లాట్లకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగితాల్లోనే ప్లాట్లు నేలపాడులో రైతులకు చూపెట్టబోయే ప్లాట్లు కాగితాల్లో మాత్రమే ఉంటాయి. క్షేత్రస్థాయిలో ఆ భూములు ఎక్కడొస్తాయనేది ఎవ్వరికీ తెలియదు. దగ్గరగా రావొచ్చు.. దూరంగా ఇవ్వొచ్చు. ఈ విషయాలపై స్పష్టత లేదని తెలుస్తోంది. ప్లాట్ల కేటాయింపు విషయంలో మొదట్లో అధికారులు జాయింట్ ప్లాట్ల విషయాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో గందరగోళం నెలకొంది. దీంతో ప్లాట్ల కేటాయింపునకే బ్రేక్ పడింది. పెద్దల కోసం ఇలాంటి ప్రతిపాదనలు తెచ్చి ప్లాట్ల పంపిణీ మొత్తాన్ని గందరగోళంగా మార్చేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు ప్లాట్ల కేటాయింపులోఆప్షన్లను తెరపైకి తెచ్చారు. దీనిపై అధికారులు పదేపదే ఒత్తిడి తెచ్చినా రైతులు స్పందించకపోవటం గమనార్హం. రైతులిచ్చిన భూములను ప్రభుత్వం ఖాళీగా వదిలేసింది. నిబంధనల ప్రకారం అయితే రైతులు ఇచ్చిన భూములను చదును చేసి లేఅవుట్లు వేయాల్సి ఉంది. ఆ దిశగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. భూములను చదును చేసే ప్రక్రియను కాంట్రాక్టర్లకు కట్టబెట్టినా ఫలితం కనిపించలేదు. చదును పనులు పూర్తయితే తప్ప లేఅవుట్లుగా మార్చి రైతులకిచ్చే పరిస్థితి లేదు. అర్థంకాని ఆప్షన్లు... రైతుల్లో అయోమయం ప్లాట్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వం నాలుగు ఆప్షన్లు ప్రకటించినట్లు తెలిసింది. అందులో సుమారు 200 గజాలు ఇచ్చిన వారికి జీ+2, 200 నుంచి వెయ్యి గజాలలోపు వారికి జీ+3, వెయ్యి నుంచి రెండువేలలోపు గజాలు ఇచ్చిన వారికి జీ+7, 2 వేల నుంచి 5 వేల లోపు ఇచ్చిన వారికి జీ+11 అని ప్రకటించినట్లు తెలిసింది. వీటిలో ఏ ఆప్షన్లు తీసుకోవాలో రైతులకు అర్థంకాని పరిస్థితి నెల కొంది. ఒకవేళ ఏదో ఒక ఆప్షన్ తీసుకుంటే రాబోయే రోజుల్లో నష్టపోయే ప్రమాదం ఉందనే ఆలోచనతో రైతులు వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్లు చేయరాదని ఆదేశాలిచ్చింది. 29 గ్రామాల పరిధిలో భూములకు సంబంధించి ఎటువంటి లావాదేవీలూ జరపరాదని రిజిస్ట్రేషన్ అధికారులకు గట్టిగా ఉత్తర్వులిచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి రైతులను బలిపశువులను చేయటం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పాపం పోలీసు!
► రాజధాని నేపథ్యంలో తీవ్రమైన పని ఒత్తిడి ► నిత్యం వీఐపీల పర్యటనలు, ఎక్కడో చోట ఆందోళనలు ► గుంటూరులో ఊహించని రీతిలో పెరిగిన ట్రాఫిక్ ► అమలులోకి రాని వారాంతపు సెలవు ప్రకటన ► సిబ్బందిని పెంచకపోగా, ఉన్న పోస్టుల్లో పలు ఖాళీలు ► నిలిచిపోయిన కొత్త పోలీస్స్టేషన్ల ప్రతిపాదనలు నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న పోలీసులు రాజధాని పుణ్యమా అంటూ ప్రస్తుతం పరుగులు తీయాల్సి వస్తోంది. సుమారు ఏడాదిన్నర కాలం నుంచి జిల్లాకు చెందిన పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పని చేయాల్సి వస్తుందంటే అతిశయోక్తి కాదు. పెరిగిన పనిభారంతో రేయింబవళ్లు ఉక్కిరిబిక్కిరికి లోనై సతమతమవుతున్నారు. పోలీసు ఉద్యోగమంటేనే కత్తిమీద సాములా మారిన పరిస్థితి రాజధానిలో నెలకొంది. ఓ వైపు పెరిగిన నేరాల సంఖ్య, మరో వైపు ప్రముఖుల భద్రత కోసం క్షణం తీరిక లేకుండా డ్యూటీలు చేస్తున్నారు. కుటుంబం, వ్యక్తిగత జీవితంపై సైతం శ్రద్ధ కనబర్చే అవకాశం రాజధాని పోలీసులకు లేకుండా పోయింది. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా వారు మానసికంగా కుంగిపోతున్నారు. - సాక్షి, గుంటూరు సాక్షి, గుంటూరు : రాజధాని నిర్మాణ నేపథ్యంలో జిల్లా పోలీసుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రధానంగా గుంటూరు నగరానికి పెరిగిన వీవీఐపీల తాకిడి, కలెక్టరేట్ వద్ద ప్రజా సమస్యలపై ఆందోళనలు, అనూహ్యంగా పెరిగిన నేరాలతో పోలీసులకు గతం కంటే పనిభారం అమాంతం గా పెరిగిపోయింది. రోజూ ప్రముఖుల రక్షణకోసం ఎండనక, వాననక తిరగాల్సి వస్తోంది. సీఎం రెస్ట్ హౌస్ వద్ద రోజుకొకరు చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ ఏ సంఘటన చోటుచేసుకున్నా అటువైపు పరిగెత్తాల్సి వస్తోంది. నగరంలో ఊహించని విధంగా పెరిగిన ట్రాఫిక్‌ను కట్టడి చేయాలంటే తలకుమిం చిన భారంగా మారుతోంది.ఇలా పోలీసు కష్టాలను చూసి అయ్యే పాపం అని జాలి చూపే వారే ఎక్కువ మంది ఉన్నారు. రాజధాని ప్రకటించినప్పటి నుంచే... రాజధాని నిర్మాణం ప్రకటించినప్పటి నుంచి గుంటూరు రూరల్, అర్బన్ జిల్లా పోలీసులకు పనిభారం ఎక్కువైంది. అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బందిపైనే ఈ శ్రమంతా పడుతోంది. వారాంతపు సెలవులు ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ సిబ్బంది కొరతతో అది ఆచరణకు నోచుకోలేదు. 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఎర్రటి ఎండలో సీఎం రెస్ట్ హౌస్ వద్ద, తాత్కాలిక రాజధాని నిర్మాణ ప్రాంతం వద్ద, వారికి కేటాయించిన పలు ప్రాంతాల్లో బందోబస్తులో విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. గుంటూరు అర్బన్ పరిధిలో 36 ఎస్.ఐ. పోస్టులు, ఎనిమిది హెడ్ కానిస్టేబుల్, 11 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెరిగిన పనిభారానికి తోడు సిబ్బందిని పెంచకపోగా, ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయకపోవడంతో ఆ పని భారమంతా పోలీసులపైనే పడుతోంది. రోజురోజుకు పెరిగిపోతోన్న భూ వివాదాలు, దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్‌లు వంటి నేరాలు పోలీసు అధికారులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అటకెక్కిన కొత్తపోలీసు స్టేషన్ల ప్రతిపాదన అర్బన్ జిల్లాతోపాటు, రూరల్ జిల్లాలోని కొన్ని పోలీసు స్టేషన్లతో కలిపి ప్రత్యేక పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలని గతంలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. అయితే గుంటూరు, విజయవాడలను కలిపి సీఆర్డీఏ ప్రాంతం మొత్తాన్ని గ్రేటర్ అమరావతి పోలీసు కమిషనరేట్‌గా చేయాలని కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు పట్టుబట్టడంతో దీనిపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి పోలీసు కష్టాలను తీర్చాలంటూ పలువురు కోరుతున్నారు. -
భూములిచ్చిన రైతులతో సర్కారు చెలగాటం
► ఇళ్లు కూడా తొలగించి, ఊరి నుంచి పంపేసే యత్నం ► మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజం ► బాధితులకు అండగా ఉంటామని భరోసా యర్రబాలెం (తాడేపల్లి రూరల్): రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులతో ఇక పనేముంది అన్నట్టు మన రాష్ట్ర మంత్రులు వ్యవహరిస్తున్నారని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. యర్రబాలెం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న బాధితులతో ఆదివారం మాజీ సర్పంచ్ పలగాని తాతారావు నివాసంలో ఎమ్మెల్యే ఆర్కే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘భూములు ఇచ్చారు..వారి ఇళ్లను కూడా తొలగిస్తే రాజధాని ప్రాంతం నుంచి వెళ్లిపోతారన్న ఉద్దేశ్యంతోనే మీ నివాసాలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధానిలో భూములు తీసుకునేంతవరకు అనయ్య, తమ్ముడు, బావ అంటూ... మీ ఇళ్ల చుట్టూ తిరిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక మీకు కనిపించరు... ఎందుకంటే రాజధాని ప్రాంతంలో రైతుల భూములతో వారు వ్యాపారం చేయాలంటే మిమ్ముల్ని గ్రామాల్లో లేకుండా చేయాలి. అప్పుడు మాత్రమే వారు స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఉంటుంది’ అన్నారు. భూములు తీసుకునేటప్పుడు గ్రామ కంఠాల జోలికి రానన్న మంత్రి నారాయణ, గ్రామంలో సగం ఇళ్లు పోతుంటే ఎందుకు మాట్లాడడంలేదని ఆర్కే ప్రశ్నించారు. ‘30 వంకర్లు ఉన్న రోడ్డును మలుపులు లేకుండా నిర్మాణం చేయాలనుకుంటున్నారు. ప్రత్యామ్నాయంగా ఎర్రబాలెం చెరువు దగ్గర నుంచి పొగాకు కంపెనీ వరకు పంట పొలాలను కలుపుకుంటూ 60 అడుగుల రోడ్డు ఉంది. దాని నిర్మాణం చేపడితే రైతులు తమ నివాసాలను కోల్పోకుండా సంతోషంగా ఉంటారు కదా!’ అన్నారు. మంత్రు లు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటిస్తే రైతులు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో రాజధానిలోని 29 గ్రామాల్లో కనబడకుండా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. నివాస గృహాలు కోల్పోతున్న వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో న్యాయం పోరాటం చేస్తామని ఆర్కే భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మంగళగిరి, దుగ్గిరాల ఎంపీపీలు పచ్చల రత్నకుమారి, రజనీకాంత్, వైఎస్సార్సీపీ మంగళగిరి మండల అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, యర్రబాలెం గ్రామ అధ్యక్షుడు సుధా బుజ్జి, ఎంపీటీసీ సభ్యులు సుధా హనుమాయమ్మ, పలగాని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరిని అడగాలి... 30 వంకర్లు ఉన్న రోడ్డును విస్తరణ చేస్తే గ్రామం సగం రోడ్లకే పోతు ంది. మార్కింగ్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే సీఆర్డీఏ కార్యాలయంలో అడగాలని సమాధానం ఇస్తున్నారు. రెవెన్యూ కార్యాలయంలో అడిగితే తమకు తెలియదని వ్యాఖ్యానిస్తున్నారు. మరి మేమెవరిని అడగాలి? - పలగాని కోటేశ్వరరావు మేమెక్కడ ఉండాలి... రాజధాని రోడ్ల పేరుతో పేదల ఇళ్లు తొలగిస్తే మేమెక్కడ నివాసం ఉండా లి? తిన్నా తినకపోయినా సొంత ఇంటిలో నివాసం ఉంటే అడిగే వారే ఉండరు. ఆ ఇల్లే నాకు జీవనోపాధి. దానిలో హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇప్పుడు నా గతేంకాను? - సూర్యనారాయణ -
ప్రజల వెంటే వైఎస్సార్ సీపీ
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి (తాడేపల్లి రూరల్) : పేద ప్రజల వెంటే వైఎస్సార్ సీపీ ఉంటుందని, వారికి ఏ కష్టం వచ్చినా ముందుండి పోరాడుతుందని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రత్తిపాడు వెళ్తున్న జగన్‌ను పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కనకదుర్గమ్మ వారధి వద్ద కలిశారు. పుష్కరాలు, రాజధాని పేరుతో పేదలకు జరుగుతున్న అన్యాయం గురించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయనకు వివరించారు. తాడేపల్లి మునిసిపాలిటీలో పేదల ఇళ్ల తొలగింపు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఇళ్లు కోల్పోతున్న మహిళలతో జగన్ మాట్లాడారు. ఏళ్ల తరబడి పన్నులు చెల్లిస్తున్న వారి ఇళ్లు ఎలా తొలగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్‌కు వినతి పత్రం అందజేసిన వారిలో తాడేపల్లి ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి, మంగళగిరి ఎంపీపీ పచ్చల రత్నకుమారి, యువజన నాయకులు మున్నంతి వివేకానందరెడ్డి, మంగళగిరి మండల అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, సంపూర్ణ పార్వతి, ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు ముదిగొండ ప్రకాష్, బాలసాని అనిల్, పట్టణ కార్యదర్శి ఎండీ గోరేబాబు, బీసీ సెల్ నాయకులు ఓలేటి రాము, కేళి వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు మాచర్ల అబ్బు, కాటాబత్తుల నిర్మల, దర్శి విజయశ్రీ ఉన్నారు. -
విదేశీ మంత్రం.. అంతా కుతంత్రం!
రాజధాని నుంచి స్వరాజ్యమైదానం వరకు సర్కారు ‘మంత్రాం’గం రాజధాని నిర్మాణం జపాన్ చేతికి విజయవాడ స్క్వేర్ పేరుతో డ్రాగన్ పాగా చివరకు పుష్కర ఘాట్లు కూడా చైనా కంపెనీకే విస్తుపోతున్న రాజధాని ప్రాంత వాసులు వ్యాపారం కోసం వచ్చి మన సంపదను కొల్లగొట్టుకుపోయి.. మనల్ని బానిసలుగా చేసి చిత్రహింసలకు గురిచేసిన తెల్లదొరలను పడమర దారి పట్టించడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది. ప్రస్తుత పాలకుల తీరుతో మరోమారు వ్యాపారం కోసం పలు దేశాలు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కన్నేశాయి. ఇక్కడ జరిగే ప్రతి అభివృద్ధిలోనూ వారు పెట్టుబడుల రూపంలో పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రాజధానితో మొదలైన విదేశీ మంత్రం చివరకు స్వాతంత్య్ర పోరాటంలో కీలకభూమిక పోషించిన స్వరాజ్యమైదానాన్ని పరాయివారికి కట్టబెట్టే వరకు వెళ్లింది. విజయవాడ బ్యూరో : చంద్రబాబు గత పాలనలో అంతా హైటెక్ నామస్మరణం చేస్తే ఇప్పుడు విదేశీ తంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. రాజధాని మాస్టర్‌ప్లాన్ నుంచి రాష్ట్రంలో ఏ చిన్న కార్యక్రమం చేపట్టాలన్నా అంతా విదేశీ కార్పొరేట్ శక్తుల చేతుల్లోనే పెడుతున్నారు. పైకి చూడటానికి ఇదేదో అభివృద్ధి, అద్భుతంగా కనిపించినా.. రానున్న కాలంలో కోట్ల విలువైన భూములు, సంస్థలపై విదేశీ పెత్తనం పెరిగిపోవడంతో పాటు వాటిలో సేవలు పొందాలంటే మనం నేరుగా పన్నులు చెల్లించాల్సిన దుస్థితి దాపురిస్తుంది. ఇలాగే వదిలేస్తే క్రమంగా విదేశీ కార్పొరేట్ల కబంధహస్తాల్లో చిక్కి మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన అగత్యం వచ్చినా ఆశ్చర్యం లేదు. సింగపూర్ అన్నారు.. జపాన్‌కు కట్టబెడుతున్నారు.. అమరావతి రాజధానిని సింగపూర్ ప్రభుత్వం అద్భుతంగా నిర్మించనుందని చంద్రబాబు సర్కారు ఏడాది పాటు ఊదరగొట్టింది. గ్రాఫిక్స్‌తో రూపొందించిన చిత్రాలను విడుదల చేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సింగపూర్‌తో ‘డీల్’ కుదరలేదేమో.. చివరకు నిర్మాణ బాధ్యతలు జపాన్‌కు అప్పగించే ప్రయత్నాలకు తెరలేచింది. సింగపూర్ ప్రభుత్వం అమరావతి మాస్టర్‌ప్లాన్ ఉచితంగా ఇస్తున్నట్టు తొలుత ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అటు తరువాత అందుకు కోట్లాది రూపాయలు పారితోషికంగా చెల్లించింది. అమరావతి రాజధాని నిర్మాణం సింగపూర్ ప్రభుత్వం చేపడుతుందని ఒకసారి, అటు తరువాత సింగపూర్‌లోని సంస్థ అని మరోసారి ప్రకటనలు చేసిన ప్రభుత్వం వారు పెట్టిన షరతులతో చేతులెత్తేసి జపాన్ వైపు దృష్టిపెట్టింది. ఇటీవల జపాన్‌కు చెందిన మాకీ సంస్థ అమరావతి భవనాల డిజైన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జపాన్‌కు చెందిన మాకీ సంస్థ టోక్యో నగరం మాదిరిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమావేశంలో జపాన్ వాణిజ్య మంత్రి టాకాగి నాయకత్వంలోని 80 మందితో కూడిన ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. భవిష్యత్‌లో టోక్యో నుంచి నేరుగా అమరావతికి వచ్చేలా విమాన సర్వీసు ఏర్పాటు చేయాలని, ఇది వారికి రెండో రాజధానిగా భావించాలని ముఖ్యమంత్రి చెప్పడం గమనార్హం. స్వరాజ్య మైదాన్ అప్పగింతపై సర్వత్రా నిరసనలు... స్వాతంత్య్ర పోరాటంలో కీలకభూమిక పోషించిన స్వరాజ్యమైదానం (పీడబ్ల్యూడీ గ్రౌండ్)ను డ్రాగన్ (చైనా)కు అప్పగించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పేరుతో నగర నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మకమైన విశాల స్థలాన్ని విదేశీ సంస్థకు కట్టబెట్టడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్వరాజ్య మైదానంలో విజయవాడ స్క్వేర్ నమూనాలను చైనాకు చెందిన జీఐఐసీ సంస్థ రూపొందించిన నమూనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. రూ.135 కోట్ల ఖర్చుతో నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్, ఎంటర్టైన్మెంట్ గేమ్స్, ఎగ్జిబిషన్లు, భవనాలు, పార్కింగ్ ఏరియా నిర్మాణాలను చైనా సంస్థకే కట్టబెట్టే ప్రయత్నాల వెనుక ఏం జరిగిందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. స్క్వేర్ నిర్మాణంలో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడబోదని అధికారులు ప్రకటించడం వెనుక అసలు ఆంతర్యం ఇదే. అంటే చైనా సంస్థకు అప్పనంగా భూమి ఇచ్చి పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపట్టి దానిపై ఆదాయం ఆ సంస్థ వసూలు చేసుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు. దీంతో నగర నడిబొడ్డున ఇదో విహార కేంద్రంగా తీర్చిదిద్దినప్పటికీ పర్యాటకులపై ట్యాక్స్ రూపంలో బాదుడు తప్పదు. గతం కంటే రెండున్నర రెట్లు అధికంగా స్థలం ఉంటుందని అధికారులు చెబుతున్న మాటలు ఇప్పుడు జనాన్ని మభ్యపెట్టడానికే అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్కర ఘాట్లకూ చైనా నిపుణులే.. ‘నవ్విపోదురు గాక నాకేటి..’ అన్నట్టు ఉంది ప్రభుత్వ యంత్రాంగం తీరు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి సరిపడే డిజైన్లు ఇచ్చే సామర్థ్యం ఉన్న ఇంజనీర్లు, నిపుణులు రాష్ట్రంలో లేరని తేల్చేసిన సర్కారు కనీసం పుష్కర ఘాట్లను నిర్మించే నైపుణ్యం కూడా మనకు లేదని చెప్పకనే చెప్పింది. కృష్ణా పుష్కరాల్లో అద్భుతమైన ఘాట్లు, నిర్మాణాలు చేపట్టే పేరుతో పలు పనులను చైనాకు చెందిన జీఐఐసీ సంస్థకు అప్పగించడం గమనార్హం. 10 మీటర్ల వెడల్పు, నాలుగు అడుగుల లోతుతో స్నానఘాట్ల నిర్మాణం, ఇతర కట్టడాలకు చైనా సంస్థకు ప్రాధాన్యం ఇవ్వడం చూస్తే స్వదేశీ పరిజ్ఞానం, నైపుణ్యంపై పాలకులకు కనీస నమ్మకం లేదనే విషయం స్పష్టమవుతోంది. -
చుక్కలు చూపుతున్నారు!
► సర్కారు తీరుపై రాజధాని రైతుల మండిపాటు ► ప్లాట్లపై ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్ ► మరో వైపు ఆప్షన్లు ఇచ్చేందుకు మూడో విడత గడువు పొడిగింపు ► ఈ నెల 25 వరకు అవకాశం.. అయినా సిద్ధంగా లేని రైతులు ► కౌలు చెల్లింపులోనూ జాప్యం రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్లాట్ల కేటాయింపులో ప్రభుత్వ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై రైతులోకం మండిపడుతోంది. తమ అనుమానాలపై రైతులు అడుగుతున్న ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. అవగాహన సదస్సుల వల్ల ఒరిగేందేమీ లేదని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం కోసం మూడు మండలాల్లోని 29 గ్రామాల్లో 33 వేల ఎకరాల సాగు భూమిని ప్రభుత్వం సేకరించింది. అన్నదాతలను మభ్యపెట్టి భూములు తీసుకున్న ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. రెండో ఏడాది కౌలు చెల్లించే విషయంలోనూ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై రైతులు మండిపడుతున్నారు. ప్లాట్ల కేటాయింపులో ఆప్షన్లు ఇచ్చేందుకు రైతులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. మూడో విడత ఈ నెల 25 వరకు గడువు ఇచ్చినా రైతులు సంతృప్తికరంగా లేరు. ప్లాట్లను ఎంపిక చేసుకునే విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరవేసేందుకు అధికారులు ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడంపై రైతులు ధ్వజమెత్తుతున్నారు. సీఆర్డీఏ నిర్దేశించిన ప్లాట్లలో ఎలాంటి వాటిని ఎంపిక చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో అధికారులు సదస్సులు నిర్వహించినప్పటికీ రైతుల సందేహాలను తీర్చలేకపోయారు. రెండు మార్లు గడువు పొడిగించినా రైతులు అప్షన్లు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో చేసేదిలేక మూడో సారీ ఆప్షన్లు ఇచ్చేందుకు గడువు పొడిగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ తీవ్ర జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కౌలు మంజూరులోనూ జాప్యం.... సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కౌలు పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. మొదటి ఏడాది మాత్రం కౌలు చెల్లించింది. రెండో సంవత్సరం కౌలు ఏప్రిల్ నెలలో చెల్లించాల్సి ఉన్నప్పటీకి ఇంత వరకు మంజూరు చేయకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కౌలు బకాయిల కోసం రైతులు సీఆర్డీఏ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పిల్లల ఫీజులు, ఇతర అవసరాలకు డబ్బు సకాలంలో అందకపోవడంతో ఎటూ పాలుపోక విచారం వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇచ్చి తప్పు చేశామని మదనపడుతున్నారు. భూములు తీసుకొనే ముందు రైతులకు ఇచ్చిన హామీలకు, ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి పొంతన కుదరడం లేదన్న చర్చ రైతుల్లో సాగుతోంది. ఆప్షన్లు ఇవ్వాల్సిన వారు.... మొత్తం రైతులు : 25,100 9.18ఏ దరఖాస్తులు ఇచ్చినవారు: 3,388 9.18బి దరఖాస్తులు ఇచ్చినవారు: 1,155 చెల్లించాల్సిన కౌలు : రైతులు.... 20,166 జరీబు భూములకు ఎకరాకు : రూ 55,000 మెట్ట రైతులకు ఎకరాకు : రూ 33,000 చెల్లించాల్సిన మొత్తం : రూ 142 కోట్లు -
రైతుల సొమ్ము రాజధాని పాలు
సొమ్మొకరిది.. సోకొకరిది.. అన్న చందంగా ఉంది కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి (విజయ డెయిరీ) పెద్దల తీరు. సంస్థకు వచ్చిన లాభాల్లో రైతులకు చెల్లించే పాల సేకరణ ధర అర్ధ రూపాయి పెంచాలని కోరినా అంగీకరించని పాలకవర్గం రాజధాని నిర్మాణం కోసం మరో రూ.5 కోట్లు విరాళం సమర్పించింది. గతంలో ఇచ్చిన రూ.5.80 కోట్లకు ఈ మొత్తం అదనం. పాలకవర్గంలో ముఖ్యులు టీడీపీకి చెందినవారు కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పాడి రైతులు విమర్శిస్తున్నారు. సాక్షి, విజయవాడ : నూతనంగా నిర్మిస్తున్న రాజధానికి విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునివ్వడంతో కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గంలో కొంతమంది ఎక్కువగా స్పందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తొలి విడత రూ.2 కోట్లు, మరోసారి రూ.2 కోట్లు, పాల సహకార సంఘాల నుంచి రూ.1.80 కోట్లు వసూలు చేసి మొత్తం రూ.5.80 కోట్లు రాజధానికి విరాళంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఇది చాలదన్నట్టు తాజాగా మరో రూ.5 కోట్లు ఇచ్చారు. నిబంధనలకు నీళ్లొదిలి... వాస్తవంగా విరాళం ఇవ్వాలంటే యూనియన్ బోర్డులో ముందుగా ఆమోదం పొందాలి. ఆ తరువాత దానిని జనరల్ బాడీలో ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకోవాలి. అయితే రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇస్తున్న విషయం బోర్డు సమావేశంలో కాకుండా గత నెల 18న జరిగిన జనరల్ బాడీలో ప్రవేశపెట్టారు. జనరల్ బాడీ మీటింగ్‌లోనూ చాకచక్యంగా వ్యవహరించారు. సమావేశం జరిగే హాలులోకి వెళ్లాలంటే బయట ఉన్న రిజిస్టర్లో పాల సహకార సంఘాల అధ్యక్షులు సంతకం చేయాలి. ఈ సంతకాలనే అడ్డుపెట్టుకుని రూ.5 కోట్ల విరాళం ఇచ్చేందుకు జరనల్ బాడీ ఆమోదించినట్లు మినిట్స్‌లో రాసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమావేశంలో ఏం జరిగిందంటే... జిల్లాలో 427 పాల సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల ద్వారా జిల్లాలోని రైతుల నుంచి లక్షా 70 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. 427 సంఘాల అధ్యక్షులకు జనరల్ బాడీలో ఓటు వేసే హక్కు, రైతుల సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. జనల్బాడీలో పాల్గొన్న సహకార సంఘాల అధ్యక్షుల్లో కొంతమంది రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించారని, గతంలో రూ.5.80 కోట్లు ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారని సమాచారం. తాము వ్యతిరేకిస్తున్నట్లు మినిట్స్‌లో నమోదు చేయాలంటూ 11 సంఘాల అధ్యక్షులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొని జనరల్‌బాడీ సమావేశం వాయిదా పడింది. మినిట్స్‌లో మాత్రం రూ.5 కోట్ల విరాళానికి ఆమోదం లభించినట్లు రాసేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు అర్ధ రూపాయి పెంచమంటే... ఎండలు తీవ్రంగా ఉండి నీటిఎద్దడి ఏర్పడటంతో గ్రామాల్లో నీరు, పచ్చగడ్డి, ఎండుగడ్డి లభించక పాడి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాల దిగుబడి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో యూనియన్ లీటర్ పాలకు చెల్లిస్తున్న ధర రూ.58ని రూ.60కి పెంచాలని రైతులు కోరారు. గత నెల 18న జరిగిన జనరల్‌బాడీలో రెండు రూపాయలు కాకపోయినా రైతుల కోరిక మేరకు కనీసం అర్ధ రూపాయి పెంచాలని అన్ని సంఘాల అధ్యక్షులు పట్టుబట్టారు. దీనిని పాలకవర్గంలో ముఖ్యులు, అధికారులు తోసిపుచ్చారు. తరువాత సొసైటీలకు బోసస్ ఇస్తామని సర్దిచెప్పారు. వాస్తవంగా బోసస్ ఇవ్వడం వల్ల సహకార సంఘానికి, పాల రేటు పెంచితే రైతులకు ఉపయోగమని పాలసంఘాల అధ్యక్షులు చెబుతున్నారు. తెర వెనుక కథ ఇదీ యూనియన్ పాలకవర్గానికి వచ్చే సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. యూనియన్ పాలకవర్గమంతా అధికార తెలుగుదేశం పార్టీ నేతల చేతుల్లోనే ఉంది. యూనియన్ కీలక పదవుల్లో ఉన్నవారు ముఖ్యమంత్రిని ఆకర్షించి తిరిగి తమ పదవులను కాపాడుకునేందుకు రూ.11 కోట్ల విరాళాలు ఇచ్చారని విజయ డెయిరీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రైతులకు తక్షణం బోసస్ ఇవ్వకుండా ఆగస్టులో ప్రకటించి తద్వారా రైతుల ప్రాపకం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. రైతుల కష్టం నుంచి వచ్చిన సొమ్మును రాజధానికి ధారాదత్తం చేయడంపై రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు... ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇవ్వడం వెనుక పెద్ద పథకమే ఉందని యూనియన్‌లోని కొంతమంది సభ్యులు ఆరోపిస్తున్నారు. పాల డెయిరీలో సుదీర్ఘకాలం పాతుకుపోయి కీలకమైన పోస్టులో ఉన్న ఒక ముఖ్య నేత తిరిగి ఆ పదవి పొం దేందుకు ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. దీంతో పాటు ఆయన మనుమడికి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ)లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రెండు అంశాల్లోనూ లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రికి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారని కోర్టుకు వెళ్లొచ్చు రాజధానికి విరాళం ఇవ్వటాన్ని 12 మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. రైతుల డబ్బేమీ ఇవ్వలేదు. రైతుల వాటా రైతులకు పంచేస్తున్నాం. యూనియన్‌కు వచ్చే నగదులోనే ఇస్తున్నాం. ఇప్పటికే రూ.200 కోట్లు రైతులకు బోనస్ రూపంలో చెల్లిస్తున్నాం. మిగిలిన డెయిరీలతో పోలిస్తే మేమే రైతులకు ఎక్కువ ధర ఇస్తున్నాం. అంతా చట్టప్రకారమే చేస్తున్నాం. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చు. - మండవ జానకిరామయ్య, చైర్మన్, కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి -
ఇలాగైతే రాజధానిని మీరు చూడలేరు.. మేము చూడలేం
కృష్ణాయపాలెం(మంగళగిరి): ‘సీఆర్డీఏ అధికారులిచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా..భూములను మీ చేతిలో పెట్టి మేము అడుక్కోవాలా..13 జిల్లాల ప్రజల కోసం 29 గ్రామాల రైతులను బలి పశువులను చేస్తారా..రెండేళ్లలో రాజధాని నిర్మాణం కోసం రైతుల వద్ద భూములు తీసుకోవడం తప్ప ఇంకేమైనా సాధించారా..ఇలాగైతే రాజధానిని మీరు చూడలేరు..మేము చూడలేము..ఇదే విధంగా రైతులను మభ్యపెడుతూ కాలయాపన చేస్తే భవిష్యత్తులో సీఆర్డీఏ అధికారులు గ్రామాల్లో తిరగలేరు’ అంటూ రైతులు హెచ్చరించడంతో సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. మండలంలోని కృష్ణాయపాలెం పంచాయతీ కార్యాలయం శనివారం వద్ద సీఆర్డీఏ అధికారులు ప్లాట్లు కేటాయింపుపై నిర్వహించిన అవగాహన సదస్సులో రైతులు నిరసన తెలిపారు. రైతులు రాజధాని భూసమీకరణ ప్రారంభించక ముందు ఎకరా మూడు కోట్లు అమ్మారని, తమ గ్రామాన్నీ అర్బన్ సెమీలో చేర్చాలని చెప్పినా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. అడిషనల్ జేసీ చెన్నకేశవులు అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకిచ్చే నివాస, వాణిజ్య స్థలాల్లో నిర్మాణాలకు ఇస్టానుసారం నిబంధనలు విధిస్తారా అంటూ ధ్వజమెత్తారు. ‘మా భూముల్లో గజం ఎక్కువుంటే కొనుగోలు చేస్తారా..మాకు నిర్మాణాలకు నిబంధనలకు అనుగుణంగా పది గజాలు కావాల్సి వస్తే మాత్రం అమ్మరా’ అని ప్రశ్నించారు. దీంతో అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతూ అన్ని సమస్యలను ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సమావేశం ముగించారు. సమావేశంలో ప్లానింగ్ డెరైక్టర్ నాగేశ్వరావు, డిప్యూటి కలెక్టర్ ధనుంజయ ,తహశీల్దార్లు, సిబ్బంది, రైతులు నరసింహారావు, వెంకట్రావు, అనీల్, నగేష్, వెంకటరమణ, గోపాలరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
జలరవాణాకు టెండర్లు
► 66 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్ పనులు ► రెండు దశల్లో చేయాలని నిర్ణయం ► రాజధాని నిర్మాణానికి ఉపయుక్తం సాక్షి, విజయవాడ : ప్రకాశం బ్యారేజీ ఎగువన, పులిచింతల ప్రాజెక్టు దిగువన జల రవాణాకు టెండర్లు ఖరారు చేసే ప్రక్రియకు ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) అధికారులు చర్యలు చేపట్టారు. కాకినాడ నుంచి పాండిచేరి వరకు జలరవాణాకు కావాల్సిన భూసేకరణలో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ఈ దిశగా ఈ ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణానదిలో రెండు దశల్లో డ్రెడ్జింగ్ చేసేందుకు ఇటీవల టెండర్లు పిలిచారు. మే 16లోగా టెండర్లు దాఖలు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. ఏడాదంతా సమృద్ధిగా నీరు కాకినాడ నుంచి పాండిచేరి వరకు జల రవాణా చేయాలంటే కాల్వల్లోనూ నీరు ఉండాలి. పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజీ ఎగువన 365 రోజులు నీరు సమృద్ధిగా ఉండటంతో ఇక్కడ పనులు ప్రారంభిస్తున్నారు. నేవిగేషన్ పనులతో పాటు రేవులు నిర్మాణం చేపట్టి త్వరలోనే జల రవాణా ప్రారంభించాలని భావిస్తున్నారు. రాజధాని పనులు ప్రారంభమైతే జలరవాణా ఎంతోగానో ఉపయోగ పడుతుంది. రోడ్డు రవాణాతో పోల్చితే నాలుగో వంతు రేటు జల రవాణాకు ఖర్చవుతుంది. జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అక్కడ నుంచి రాజధాని ప్రాంతానికి సిమెంట్‌ను రోడ్డు మార్గంలో కాకుండా జలరవాణా ద్వారా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పర్యావరణ కాలుష్యంతోపాటు ఖర్చులు తగ్గుతాయి. జాతీయ రహదారి ఇక్కడకు దగ్గరగా ఉండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ఇతర నిర్మాణ పరికరాలు కార్గొ బోట్ల ద్వారా తుళ్లూరు చేర్చే అవకాశం ఉంటుంది. రాజధానిలో భారీ నిర్మాణాలు ప్రారంభమైనప్పుడు గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, పెర్రి తదితర నగర శివారు గ్రామాల నుంచి వందల సంఖ్యలో కూలీలు వెళ్లాలి. వీరిని కృష్ణానదిలో పాసింజర్ బోట్ల ద్వారా తుళ్లూరు ప్రాంతానికి చేర్చవచ్చు. దీంతో సమయం కలిసి రావడంతోపాటు జలరవాణా ద్వారా ఆదాయం సమకూరుతుంది. డ్రెడ్జింగ్‌తో వచ్చే ఇసుక రాజధాని నిర్మాణానికి వినియోగం విజయవాడ నుంచి పులిచింతల వరకు 83 కిలోమీటర్లు కృష్ణానది విస్తరించి ఉంది. ఇందులో కొంత భాగం తెలంగాణలో ఉన్నందున విజయవాడ సమీపంలోని హరిచంద్రాపురం నుంచి ముత్యాల వరకు 66 కిలోమీటర్ల మేర జల రవాణాకు కావాల్సిన డ్రెడ్జింగ్ పనులు రెండు దశల్లో చేపట్టనున్నారు. హరిచంద్రాపురం నుంచి చామర్రు వరకు 37 కిలోమీటర్ల మేర పూడిక తీసేందుకు రూ. 35.91 కోట్లు వెచ్చించనున్నారు. చామర్రు నుంచి ముత్యాల వరకు 29 కిలోమీమీటర్ల మేర రూ. 33.85 కోట్లతో పూడిక తీయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్లు పిలిచారు. డ్రెడ్జింగ్‌లో వచ్చే ఇసుకను రాజధాని నిర్మాణానికి ఉపయోగిస్తారు. దీంతో కృష్ణానదిలో నీటి నిల్వ పరిమాణం పెరుగుతుంది. తక్కువ నీటిలోనూ బోట్లు ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని జలవనరుల శాఖాధికారులు చెబుతున్నారు. -
కేంద్రాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు
రైలుపేట (గుంటూరు): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ఏ రాష్ట్రానికీ ఇవ్వని ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చి అధిక శాతం నిధులు ఇస్తున్నా.. మోడీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా రాష్ట్ర నేతలు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కె.కోటేశ్వరరావు చెప్పారు. గురువారం గుంటూరు అరండల్‌పేటలోని బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని నిర్మాణంలో భాగంగా రాజ్‌భవన్, అసెంబ్లీ, ఇతర భవన నిర్మాణాల కోసం గత ఏడాది కేంద్రం రూ.500 కోట్లు ఇస్తే.. వాటిలో ఒక్క పైసా ఖర్చు పెట్టలేదని వెల్లడించారు. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ల అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు ఇస్తే వాటిల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. పార్టీని 2019 కల్లా పూర్తి స్థాయిలో విస్తరింపచేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రం రాష్ట్రానికి ఏ పథకానికి నిధులు మంజూరు చేసిందో ఆ పథకాలకే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గుంటూరు నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నేరేళ్ల మాధవరావు, అప్పిశెట్టి రంగా, బోరుగడ్డ బుల్లిబాబు, మాధవరెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు పూర్తి సహకారం
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కలిగిరి : గ్రామాల్లో అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తామని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. కలిగిరి పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు, స్థానిక సర్పంచ్ పాలూరి మాల్యాద్రిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమానికి ఎంపీ మేకపాటి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి మాట్లాడారు. రాష్ట్రంలో పాలన సజావుగా లేదని, జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు సంక్షేమ పథకాలు అందడంలేదని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకోవడంతో ఆయన ప్రతిష్టకే భంగం కలుగుతుందన్నారు. రాజధాని నిర్మాణం చేపడతామంటూ కొంత మంది భూములను దక్కించుకుంటున్నారని తాను సున్నితంగా విమర్శలు చేశాన ని, దీంతో తనపై ఓ చానల్లో అసత్య కథనాలను ప్రసారం చేసి తనపై విషం చిమ్మారని ఆరోపించారు. మర్రిపాడు మండలం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని, తన సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆన్ని గ్రామాలకు మౌలిక వసతులను కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. తామెప్పుడూ వాస్తవాలనే మాట్లాడతామని చెప్పారు. దివంగత సీఎం వైఎస్సార్ పుణ్యమాని ఉత్తరకాలువ మంజూరైందని, ఈ ప్రాంతానికి ఉత్తర కాలువ ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రజలకు న్యాయం చేయడంలో సీఎం చంద్రబాబు విఫలమవుతున్నారని మండిపడ్డారు. సర్పంచ్ మాల్యాద్రిరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీలో రూ.50 లక్షలకు పైగా నిధులతో సిమెంట్ రోడ్లు, రక్షిత మంచినీటి పథకాలు, తదితర అభివృద్ధి పనులను చేపట్టడాన్ని అభినందించారు. పారిశుధ్య మెరుగునకు ట్రాక్టర్, ట్రక్కును తన నిధుల నుంచి అందజేశానని వివరించారు. అనంతరం రాఘవేంద్రరెడ్డి మాట్లాడారు. జెడ్పీ నిధుల నుంచి రూ.మూడు కోట్లతో ఉదయగిరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను చేపట్టానన్నారు. కలిగిరి మండలానికి సంబంధించి రూ.45 లక్షలను పాఠశాల, వసతి గృహాలు, గ్రామాల్లో తాగునీటి సమస్యలకు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ నోటి శ్రీనివాసులురెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెలుగోటి మధు, ఉప సర్పంచ్ మోటుపల్లి వెంకటలక్ష్మి, స్థానిక నాయకులు బొల్లినేని వెంకటసత్యనారాయణ, బాపతి చెన్నారెడ్డి, అంకిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని నిర్మాణం పేరుతో దోపిడి
ఎమ్మెల్యే వై. ఐజయ్య పగిడ్యాల: రాజధాని నిర్మాణం పేరుతో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల భూములను కారుచౌకగా బినామీ పేర్లతో కొనుగోలు చేసి రాష్ట్రాన్ని దోపిడి చేస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య విమర్శించారు.శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ కుంభకోణానికి పాల్పడిన అవినీతి మంత్రులను ప్రశ్నించకుండా నిజాలను వెలుగులోకి తెచ్చిన సాక్షిపై అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. వైఎస్సార్ సీపీని వీడిని తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడుతుందన్నారు. వారిని అనర్హులుగా గుర్తించాలని ఎన్నికల కమిషన్‌కు పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని ఇక్కడ కూడా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరుతామన్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రమాదేవి, డీలర్ నారాయణ, దేవన్న తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు దేవుడు కాదు
నెల్లూరు, సిటీ: ఇచ్చిన హామీలను అన్నింటిని ఒకేసారి నెరవేర్చడానికి సీఎం చంద్రబాబునాయుడు దేవుడు కాదని, క్రమంగా నెరవేరుస్తారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఏసీ సెంటర్లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. విజయవాడలో రాజధాని నిర్మాణం జరిగితే పరిశ్రమలు వస్తాయన్నారు. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బర్నాబాస్, చక్రవర్తి, కేవీ రాఘవరెడ్డి, రాజేష్, ప్రేమ్, ముజీర్, పేరారెడ్డి, చిన్ని శేఖర్, మునాఫ్, ముజావీర్, శివ, మదన్, తదితరులు పాల్గొన్నారు. -
ఎక్స్‌ప్రెస్ హైవేలపై హైరానా!
రోడ్ల నిర్మాణానికి ఊళ్లను ఖాళీ చేయం తేల్చిచెబుతున్న రాజధాని ప్రాంత ప్రజలు రెట్టింపు పరిహారం ఇస్తామంటూ మంత్రుల హామీ రాజధాని ప్రాంత ప్రజలతో భేటీ కావాలని సీఎం నిర్ణయం! విజయవాడ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చే వరకు గ్రామాల జోలికి వెళ్లేది లేదని నమ్మించారు. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ హైవేల పేరిట ఇళ్లను పెకలించి గ్రామాలనే ఖాళీ చేయించే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. నమ్మించి నట్టేట ముంచిన రాష్ట్ర సర్కారు తీరుపై రాజధాని గ్రామాల ప్రజలు రగిలిపోతున్నారు. వారిని మభ్యపెట్టేందుకు మంత్రులు బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. ప్రభుత్వమే రాజధాని ప్రాంత గ్రామాల ప్రజల బతుకులను రోడ్డుపాలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ హైవేలు, రహదారుల కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భూములివ్వని గ్రామాల మధ్య నుంచి హైవేలను ప్రతిపాదించడంతో ఊళ్లకు ఊళ్లే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 200 అడుగుల వెడల్పుతో 18 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ హైవేతోపాటు 165 అడుగుల వెడల్పుతో డౌన్‌టౌన్, రహదారులు, 80 అడుగుల వెడల్పుతో రోడ్లను ప్రతిపాదించారు. రాజధానిలోని ఎక్స్‌ప్రెస్ హైవేకు మిగిలిన రోడ్లను అనుసంధానం చేస్తారు. నిరాశ్రయులను చేస్తారా? ప్రతీ గ్రామంలో కనీసం మూడు నుంచి నాలుగు రోడ్లను ప్రతిపాదించడంతో ఊళ్లను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ల్యాండ్ పూలింగ్ను ప్రతిఘటించిన ఉండవల్లి, కృష్ణాయపాలెం, నౌలూరు, నిడమర్రు గ్రామాలతోపాటు అసలు రాజధాని ప్రాంతంలో లేని తాడేపల్లి గ్రామానికి కూడా నష్టం వాటిల్లనుంది. కృష్ణాయపాలెం గ్రామకంఠం కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. యర్రబాలెం, ఐనవోలు, వెలగపూడి, తుళ్లూరు, రాయపూడి గ్రామాలకు రోడ్ల దెబ్బ తప్పదు. ఇప్పటికే భూములు లాగేసుకున్న ప్రభుత్వ రోడ్ల నిర్మాణం పేరిట తమను నిరాశ్రయులను చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. డిజైన్ల మార్పునకు సీఎం ససేమిరా రాజధానిలో ప్రతిపాదిత రోడ్ల పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని, కొన్ని రోడ్ల డిజైన్లు మారిస్తే బాగుంటుందనే మంత్రుల సూచనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ససేమిరా అన్నారు. రోడ్ల ప్రతిపాదనలపై రాజధాని ప్రాంత ప్రజలతో త్వరలో భేటీ కావాలని ఆయన నిర్ణయంచినట్లు సమాచారం. మంత్రుల బుజ్జగింపులు రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి ఇళ్ల తొలగింపు, స్థల సేకరణ విషయంలో ప్రజలను బుజ్జగించేందుకు మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, ఐనవోలు గ్రామాల్లో పర్యటించిన మంత్రులు ప్రజల నిరసనలపై నీళ్లు చల్లే ప్రయత్నాలు చేశారు. ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ కంటే రెట్టింపు ప్యాకేజీ ఇస్తామని, ఇల్లుకు ఇల్లు, స్థలానికి స్థలం ఇచ్చేలా చూస్తామని మంత్రులు హామీలిస్తున్నారు. ఇప్పటికే సాగు భూములు వదులుకున్నామని, ఇళ్లను కూడా వదులుకోవాలంటే అందుకు సిద్ధంగాలేమని రాజధాని ప్రాంత వాసులు తెగేసి చెబుతున్నారు. -
రాజధాని అఖండ జ్యోతి మళ్లీ కొండెక్కింది
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ సంకల్పానికి స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంకల్ప జ్యోతి మంగళవారం మళ్లీ కొండెక్కింది. సంకల్ప జ్యోతి పుట్టు పూర్వోత్తరాలను పరిశీలిస్తే.. అమరావతి శంకుస్థాపనకు రెండు రోజుల ముందు గత ఏడాది అక్టోబరు 20వ తేదీన రాజధాని నిర్మాణ పనులకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగాలని మంత్రి మాణిక్యాలరావు, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌లు అమరావతిలోని అమరేశ్వరాలయంలో అఖండ దీపం వెలగించి, ఆ జ్యోతిని నవ్యాంధ్ర నూతన రాజధాని శంకుస్థాపన ప్రదేశం ఉద్దండరాయునిపాలెం తీసుకువచ్చారు. రాజధాని శంకుస్థాపన తరువాత సంకల్పజ్యోతి నిర్వహణ ఖర్చు పెరిగిపోవడంతో అదే జ్యోతిని మళ్లీ క్రీడాకారులతో నవంబరు 21వ తేదీన అమరావతి అమరేశ్వరాలయానికి చేర్చారు. రాజధాని నిర్మాణం 50 శాతం పూర్తయ్యే వరకు ఈ సంకల్ప జ్యోతిని వెలిగించే ఉంచుతామని, అమరేశ్వరాలయంలో వచ్చే శివరాత్రి వరకు ఉంచి, తరువాత కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి అలయంలో ఉంచుతామని అనాడు దేవాదాయశాఖ, క్రీడాభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం వెలిగి ఉండాల్సిన అఖండ జ్యోతి గతంలో ఒకసారి కొండెక్కగా మళ్లీ ఇప్పుడు కొండెక్కడంలో దేవాలయ సిబ్బంది నిర్లక్ష్యం బయట పడింది. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దేవాలయ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అమెరికాను ఇక్కడే చూపిస్తాం...
సీఆర్డీఏ డీసీ రఘునాథరెడ్డి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కౌలు రూపంలో ఏడాదికి రూ.50 వేలు చొప్పున చెల్లిస్తున్నామని, రైతులు రాజధానికి మరింతగా సహకరిస్తే అమెరికాను ఇక్కడే చూపిస్తామని సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ జి. రఘునాథరెడ్డి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. భూములు లేని మూడు వేలకు పైగా రైతులకు, రైతు కూలీలకు నెలనెలా రూ.2,500 పింఛన్లు చెల్లిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పకుండా పింఛను అందేలా కృషి చేస్తానన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం గ్రామం నుంచి 160 మీటర్ల వెడల్పున రెండు ఎక్స్‌ప్రెస్ రహదారులు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. అయితే ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తరువాత మాత్రమే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఒక వేళ ఇళ్లను తొలగించాల్సి వస్తే మెరుగైన ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పచ్చల రత్నకుమారి, జెడ్పీటీసీ ఆకుల జయసత్య, ఎంపీటీసీ సభ్యులు మొగిలి లీలావతి, షేక్ హన్నన్, మార్కెట్ చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి, వైస్ చైర్మన్ మన్నెం రమేష్, మండల ప్రత్యేకాధికారి ఎంజే నిర్మల, డెరైక్టర్ ల్యాండ్స్ బి. చెన్నకేశవులు, తహశీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో పద్మావతి, ఈవోఆర్డీ రవికుమార్‌లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అమరావతా.. భ్రమరావతి నిర్మాణమా?
వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి కంకిపాడు : అమరావతి రాజధాని నిర్మాణమా? లేక భ్రమరావతి నిర్మాణమా? ప్రత్యేక హోదా సంజీవనా, కాదా? ప్రజలకు తేల్చి చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు ప్రధాన సెంటరులో కొవ్వొత్తులు, దీపాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ పుష్కర ప్రచారం, రాజధాని నిర్మాణం ప్రచారం పేరుతో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఓ వైపు నిధులు లేవంటూ సంక్షేమ పథకాల అమలులో కోత విధిస్తున్న ప్రభుత్వం నిధులు ఎందుకు దుర్వినియోగం చేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో అమాయక రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించి చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజధాని శంకుస్థాపన సభలో పీఎం మోదీపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని హితవుపలికారు. బద్ధ శత్రువులు కలిశారు.. రాజధాని నిర్మాణం వంకతో నిన్నటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్న చంద్రబాబు, కేసీఆర్‌లు కలిసిపోయారని సారథి వ్యాఖ్యానించారు. రైతులు సాగునీటికి ఇబ్బందులు పడ్డా, విద్యార్థులు తెలంగాణ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అవస్థలు పడ్డా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. టీ ప్రభుత్వంతో చర్చిం చేందుకు చొరవ చూపలేదన్నారు. రాజధాని పేరుతో ఏకాంత చర్చలు జరపటంలో ఆంతర్యం ఏమిటో వివరించాలన్నారు. -
ఆ రైతులను ప్రధాని మోదీ దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం..
మంత్రి నారాయణ తుళ్లూరు : రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన 29 గ్రామాల ైరె తులను దేశ ప్రధాని నరేంద్రమోడీ దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని పురపాలకశాఖ మంత్రి నారాయణ చెప్పారు. శంకుస్థాపన ప్రాంతమైన ఉందడ్రాయునిపాలెంలో సభ ఏర్పాట్లను, శంకుస్థాపన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 3,60,000 చదరపు అడుగుల్లో వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం పిలుపు మేరకు మన ఊరు-మన మట్టి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం నుంచి రైతులు మట్టి, నీరు తీసుకువస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాలకు సంబంధించిన నదుల నుంచి నీరు, మట్టి తీసుకువస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ కాంతిలాల్ దండే, కృష్ణ జిల్లా కలెక్టర్ బాబు, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తదితరులున్నారు. -
ఆ భూములతో వ్యాపారం చేస్తాం
-
ఆ భూములతో వ్యాపారం చేస్తాం
సీఆర్డీఏ సమీక్షలో సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణానికి ముందుకొచ్చే సింగపూర్, జపాన్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని వ్యాపారం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రైతుల నుంచి సేకరించిన భూమిని ప్రైవేటు కంపెనీలకు అభివృద్ధికిచ్చి వారితో కలిసి తాము కూడా పెట్టుబడులు పెట్టి లాభాలు అర్జిస్తామన్నారు. ఇందుకోసం అమరావతి డెవలప్మెంట్ కంపెనీని ఏర్పాటు చేస్తామన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పెట్టుబడులు ఎంత పెట్టాలి, ఏ నిష్పత్తిలో వ్యాపారం చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. సింగపూర్ ప్రభుత్వ కంపెనీలు ఇలా టౌన్‌షిప్‌లు కట్టి లాభాలు సాధించాయని, సింగపూర్‌లోని తమాసిన్ కంపెనీ ఇదే తరహాలో ఏడు లక్షల కోట్ల టర్నోవర్ సాధించిందని తెలిపారు. రాజధాని కోసం రైతులు ఇప్పటికే 33 వేల ఎకరాలు ఇచ్చారని, ఈ ప్రాంతంలోనే మరో 50 వేల ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేయిస్తామని చెప్పారు ఈ 83 వేల ఎకరాలను ప్రైవేటు కంపెనీలకు అభివృద్ధికిచ్చి, అందులో తాము పెట్టుబడులు పెడతామన్నారు. వచ్చే లాభాలను పంచుకుంటామని, రియల్ ఎస్టేట్ కంపెనీలాగే పనిచేస్తామని తెలిపారు.2018 నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను భూసేకరణ ద్వారా తీసుకోవడానికి డబ్బు లేదన్నారు. పండుగలా శంకుస్థాపన రాజధాని శంకుస్థాపన కార్యక్రమం దసరా పండుగలా జరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన సీఆర్డీఏ కమిటీతో సమీక్ష నిర్వహించారు. శంకుస్థాపనకు ప్రధాని వస్తానని మాటిచ్చినట్లు చెప్పారు. శంకుస్థాపనకు అన్ని గ్రామాల సర్పంచ్‌లు తమ గ్రామంలోని కొంత మట్టి తెచ్చి అమరావతి మట్టిలో కలిపి భావోద్వేగం నింపాలన్నారు. అవగాహన ఒప్పందాలు ఖరారు ఇంధన రంగంలో ఉజ్వల భవితకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే కాకినా డ డీప్ సీ వాటర్ పోర్టులో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విజ యవాడ గేట్ వే హోటల్లో సీఎం సమక్షంలో ఏపీ గ్యాస్ డెవలప్మెం ట్ కార్పొరేషన్ , గెయి ల్, షెల్, ఇంజీ కంపెనీలు రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.రానున్న 13నెలల్లో కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు గ్యాస్ పైప్‌లైన్ నిర్మిస్తామని బాబు హామీ ఇచ్చారు. -
రాజధాని శంకుస్థాపనా ప్రైవేటుకే !
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణాన్ని విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం చివరకు దాని శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణ సైతం ప్రైవేటు ఏజెన్సీలకే అప్పగించనుంది. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) ఈవెంట్ ఏజెన్సీల కోసం టెండర్లు పిలిచింది. ఈ కార్యక్రమాన్ని తానే నిర్వహిస్తే సాధారణంగా ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌గా దీన్ని నిర్వహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 22న రాజధాని శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీతోపాటు సింగపూర్ ప్రధాని, జపాన్ వాణిజ్య శాఖా మంత్రిని ఈ కార్యక్రమానికి తీసుకువస్తోంది. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఆ స్థాయిని శంకుస్థాపనలోనే చూపించాలని ఆత్రుత పడుతోంది. వెంకటపాలెంలో 50 ఎకరాల్లో నిర్వహణ సీడ్‌క్యాపిటల్ ప్రాంతంలోని వెంకటపాలెంలో 50 ఎకరాలను కార్యక్రమం కోసం సిద్ధం చేస్తున్నారు. వంద మంది కూర్చునే వేదిక, వెయ్యి మంది విశిష్ట అతిథులు, 50 వేల మంది ప్రజలతో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు. అక్టోబర్ 1 నుంచే ప్రచారం : శంకుస్థాపన ప్రచారాన్ని అక్టోబర్ 1 నుంచే మొదలు పెట్టనున్నారు. పత్రికలు, టీవీలతోపాటు సోషల్ మీడియాలోనూ దీనిపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్, విజయవాడ అవసరమైతే ఢిల్లీలో ఈ ప్రమోషనల్ ఆడియో, వీడియోలను ప్రదర్శిస్తారు. ఇందు కోసం రూ. 50 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే సీఆర్డీఏ ఉన్నతాధికారులు పలు అంతర్జాతీయ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలతో సంప్రదించినట్లు సమాచారం. -
విమానాశ్రయాలపేరుతో భూదందా
-
విమానాశ్రయాలపేరుతో భూదందా
కార్పొరేట్లకు అనుకూలంగా వైమానిక విధానం సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం పేరుతో వేలాది ఎకరాల పంటభూములు లాక్కొని రైతుల పొట్టగొట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల పేరుతో సరికొత్త భూదందాకు తెరలేపింది.నిరుపేదల భూములను లాక్కొని ప్రైవేటు కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టడానికి రంగం సిద్ధం చేసింది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలలకే అంతర్జాతీయ విమానాశ్రయాల కోసమంటూ వైమానిక విధానాన్ని రూపొందించింది. ఇందుకోసం వేల ఎకరాలు సేకరిస్తామని ఒకసారి, సమీకరిస్తామని మరోసారి చెప్పుకుంటూ వచ్చింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో భూ సేకరణ ఆర్డినెన్స్‌పై కేంద్రం వెనక్కి తగ్గినా... చంద్రబాబు ప్రభుత్వం మాత్రం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల పేరుతో విజయనగరం జిల్లా భోగాపురంలో 5,311 ఎకరాలు, చిత్తూరుజిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో 1,398 ఎకరాలు, కర్నూలుజిల్లా ఓర్వకల్లు, నెల్లూరుజిల్లా దగదర్తిలో 3,407 ఎకరాలు పేదల భూములు కాజేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే భూసేకరణ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగుస్తున్న చివరిరోజు ఆగస్టు 31వ తేదీన ఆఘమేఘాలపై భోగాపురం ఎయిర్‌పోర్టుకు 5,311 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవన్నీ చిన్న, సన్నకార రైతుల భూములే కావడం గమనార్హం. కార్పొరేట్లకే ప్రయోజనాలు...: రాష్ట్ర ప్రభుత్వం వైమానిక విధానం పేరుతో విడుదల చేసిన విధానపత్రం పూర్తిగా కార్పొరేట్ సంస్థల ప్రయోజకారిగానే ఉంది. ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడానికి పేదల నుంచి భూములు లాక్కుని, అవసరమైన కేంద్ర అనుమతులన్నీ ప్రభుత్వమే ఇప్పిస్తుంది. అన్నీ సమకూరాక భూములన్నీ బిడ్డర్‌కు అప్పగిస్తుంది. ఇక బిడ్డర్దే పెత్తనం. ప్రభుత్వ పెద్దలు తమకు నచ్చిన, ముడుపులు ఇచ్చినవారికే ఈ ప్రాజెక్టుకు కట్టబెట్టడానికి బిడ్డర్‌ను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కట్టబెట్టబోతోంది. అది జపాన్‌కు చెందిన సంస్థ కావచ్చు. సింగపూర్ బిడ్డరయినా కావచ్చు. అందుకు వీలుగానే విధాన పత్రాన్ని జాగ్రత్తగా రూపొందించారు. గుజరాత్ వైమానిక విధానంలోనూ ఇంత దారుణ పరిస్థితి లేదు. ఆ రాష్ట్రంలో వైమానిక విద్య లేదా సంబంధిత కార్యకలాపాలకు వాడే భూమిని ఆయా సంస్థలకు శాశ్వతంగా బదలాయించకుండా గరిష్టంగా 35 ఏళ్లు వినియోగించుకునే హక్కు మాత్రమే ఇచ్చారు. ‘ఎ’ కేటగిరి అయితే నెలకు రూ.లక్ష రుసుముతోపాటు లాభంలో 12శాతం వాటా... ‘బి’ కేటగిరి అయితే రూ.35 వేల రుసుముతోపాటు లాభంలో ఆరు శాతం ప్రభుత్వపరం చేయాలనే నిబంధన విధించారు. ఈ రేటును ఐదేళ్లకోసారి పెంచుతామని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విమానయాన సంస్థలు నిర్వహించే సర్వీసులపైనా షరతులు పెట్టా రు.అంతకు తగ్గితే రాయితీలు కత్తిరిస్తామని, జరిమానా వేస్తామన్నారు. కానీ చంద్రబాబు సర్కారు వీటి జోలికే పోలేదు ... పైగా ఎక్కడాలేని రాయితీలకు సిద్ధపడింది. అయాచితంగా భూమి అప్పగింత... :భూసేకరణ జరపడానికి, విమానాశ్రయాలకు అవసరమైన అనుమతులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంస్థ (స్పెషల్ పర్సస్ వెహికిల్-ఎస్పీవీ)ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ అధికారులే ఇందులో సభ్యులుగా ఉన్నా, ప్రైవేటు సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు. నిజానికి భూముల సేకరణ పూర్తయిన తర్వాత ఎస్పీవీ ఊసే ఉండదు. సేకరించిన భూములను విమాన నిర్మాణ సంస్థ (ప్రైవేటు సంస్థ)కు అప్పగిస్తారు. (ఆ విషయాన్ని పేరా 26లో పేర్కొన్నారు) * బిడ్డర్ చేతికి పెత్తనం వచ్చాక ప్రభుత్వం ఓ మైనార్టీ భాగస్వామిగా మిగిలిపోతుంది.సర్కారు వాటాపై ప్రైవేటు సంస్థతో చర్చించి, నిర్మాణం పూర్తయ్యాక నిర్థారిస్తామన్న క్లాజ్‌ను మాత్రం చేర్చారు. హాఇక్కడే తిరకాసు కన్పిస్తోంది. రైతు నుంచి భూమి తీసుకునేప్పుడు దాని విలువ తక్కువ. అభివృద్ధి చేశాక కొన్ని వందల రెట్లు పెరుగుతుంది. అయినప్పటికీ మార్కెట్ విలువ ప్రకారం కాకుండా, పుస్తకం రేటు ప్రకారమే ప్రభు త్వ వాటాను చెల్లించవచ్చని ప్రభుత్వం విధాన పత్రంలో పేర్కొంది. నిర్మాణ సంస్థకు ప్రజల సొత్తును నిలువునా దోచిపెడుతున్నారనడానికి ఈ నిబంధన ఓ ఉదాహరణ.హా ఒక్కపైసా స్టాంపు డ్యూటీ కూడా తీసుకోకుండానే ఎయిర్‌పోర్టు నిర్మాణ సంస్థకు ఆ భూములను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అన్ని రకాల పన్నులను మినహాయిస్తుంది. విద్యుత్ సుంకాన్ని, స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన ఆస్తి పన్నులను నిర్మాణ సంస్థ తరపున ప్రభుత్వమే చెల్లిస్తుంది. (పేరా 36లో ఉంది). కార్పొరేట్ సంస్థల పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించడమంటేనే అందులోని ఎవరి ప్రయోజనాలున్నాయో తెలుస్తోంది. * నిర్మాణ సంస్థకు ఆశించిన రీతిలో ప్రతిఫలం రాకపోయినా ప్రజల సొమ్మును దానికి అప్పగించేలా నిబంధనలు పొందుపరిచింది. (పేరా 15 ఎఫ్). వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) పేరుతో రూ.ఐదు కోట్లు రెడీగా ఉంచింది. అదీ చాలకపోతే అదనపు రాయితీలు కూడా ఇస్తామని (పేరా 31) భరోసా ఇచ్చింది. సాధారణంగా ప్రాజెక్టులకు ఏవైనా అడ్డంకులు ఎదురైతే ఇలాంటి ఏర్పాటు చేస్తారు. కానీ ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ల జేబులు నింపడానికే ఎక్కడా లేని ప్రేమ చూపింది. * ఎయిర్‌పోర్టు ప్రభావిత ప్రాంతాలన్నీ నిర్మాణ సంస్థ ఇష్టం. పారిశ్రామిక పార్కులు, విమానయాన సంబంధిత సంస్థల స్థాపన, రిక్రియేషన్ క్లబ్‌లు, సెజ్‌లు ఏవైనా స్థాపించుకునే అధికారాలు (పేరా 17లో) కట్టబెట్టింది. కొన్నింటిని బిడ్డర్ కనుసన్నల్లో విమానాశ్రయ నగరాలుగా అభివృద్ధి చేసేందుకు ధారాదత్తం చేస్తామంది. బజారున పడేయద్దు భోగాపురం: ఎయిర్‌పోర్టుకు తమ భూములను ఇచ్చేది లేదని భోగాపురం ప్రాంత ప్రజలు పునరుద్ఘాటించారు. భూములు లాక్కొని తమ బతుకులు బజారుపాలు చేయొద్దని కోరుతూ విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారు పెద్ద ఎత్తున తహసీల్దార్‌కు విజ్ఞప్తులు అందజేశారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు వివిధ గ్రామాల నుంచి ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రజలు భారీ సంఖ్యలో చేరుకుని వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసి, నినాదాలు చేశారు. -
రాజధానికి సహకరించాలి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు, పార్టీలు రాజధాని నిర్మాణానికి సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. అనుకూల వాతావరణం లేకపోతే ఇన్నాళ్లూ పడిన శ్రమ వృథా అవుతుందని, పెట్టుబడులు రావని చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన సీఆర్డీఏ అథారిటీ తొలి సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. కొత్త రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి చైనా, జపాన్, జర్మనీ, సింగపూర్ వంటి పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. తాను ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులకోసం ప్రయత్నిస్తుంటే వాళ్లు ప్రజల్ని రెచ్చగొట్టి రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారని ప్రతిపక్షాలను విమర్శించారు. అలజడులు సృష్టిస్తే పెట్టుబడిదారులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌ల ఎంపిక స్విస్ చాలెంజ్ విధానంలో జరుపుతున్నట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో కాన్సెప్ట్ సిటీల నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు, న్యాయ విశ్వ విద్యాలయం ఒకేచోట ఏర్పాటుచేసి అక్కడే ప్రపంచానికి అవుట్సోర్సింగ్ అందించే లీగల్ సర్వీసెస్‌ను కూడా అందుబాటులో ఉండేలా జస్టిస్ సిటీ నిర్మాణం చేపడతామన్నారు. నెలరోజుల్లోపు అటవీ భూముల క్లియరెన్స్ పూర్తి చేయాలని సూచించారు. అవసరమైతే తాను కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు. పచ్చదనమే లక్ష్యం: సీఎం రాష్ట్రంలో 23 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 40 శాతానికి తీసుకెళ్లే లక్ష్యంతో అందరూ పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా సీఆర్డీఏ పరిధిలోని అటవీ ప్రాం తంలో విత్తనాలు జల్లే కార్యక్రమాన్ని శుక్రవారమిక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం జెండా ఊపి ప్రారంభించారు. రాజధానిలో కొత్త పరిశ్రమలు: మిశ్రా రాజధాని అమరావతి రీజియన్‌లో ఎనర్జీ, రవాణా, అర్బన్‌డెవలప్‌మెంట్, ఎలక్ట్రిసిటీ సెక్టార్లకు చెందిన పలు పరిశ్రమల స్థాపనకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పరిశ్రమల శాఖ డెరైక్టర్ మిశ్రా తెలిపారు. -
‘రాజధాని’ నిర్మాణంలో భాగస్వాములవుతాం
బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ అలిస్టర్ విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణంలో తమ దేశానికి చెందిన సంస్థలు, నిపుణులను కూడా భాగస్వాములుగా చేసుకోవాలని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ అండ్రూ మెక్ అలిస్టర్ కోరారు. మంగళవారం సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ శ్రీకాంత్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై శ్రీకాంత్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భూసమీకరణ విధానంలో 32 వేల ఎకరాల భూమిని సేకరించామని, రాజధాని నిర్మాణంలో స్థానికుల భాగస్వామ్యం ఉందని వివరించారు. రాజధాని నమూనా బాగుందని చెప్పిన అలిస్టర్.. యునెటైడ్ కింగ్డమ్ సంస్థల భాగస్వామ్యం కూడా ఉంటే బాగుంటుందన్నారు. ఇందుకు శ్రీకాంత్ సానుకూలత వ్యక్తం చేసి ఆహ్వానం పలికారు. అనంతరం అలిస్టర్ బృందం తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు ప్రాంతాలను పరిశీలించింది. -
సింగపూర్ కంపెనీలకే పెత్తనం!
రాజధానిలో భూములిస్తాం.. భవనాలు నిర్మించండి కంపెనీలను తీసుకురండి.. ఉద్యోగాలివ్వండి స్థలాలు విక్రయించుకోండి.. లీజుకు ఇచ్చుకోండి సింగపూర్ ప్రభుత్వానికి చంద్రబాబు ఆహ్వానం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ వ్యవహారం సామాన్యులకు అర్థం కాని మాయాజాలంలా ఉంది. ఇందులో మొత్తం పెత్తనాన్ని సింగపూర్ కంపెనీలకే ప్రభుత్వం కట్టబెట్టనుంది. రాజధాని ప్రాంతంలో నిర్మించిన భవనాల్లోని స్థలాన్ని విక్రయించుకొనే అధికారం సింగపూర్ సంస్థలకే దక్కనుంది. రాజధాని నిర్మాణం చేపట్టాలంటూ సింగపూర్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. సింగపూర్ ప్రభుత్వం తరపున రాజధాని నిర్మాణానికి దరఖాస్తు చేయాల్సిందిగా ఆ దేశ వాణిజ్య మంత్రి ఈశ్వరన్‌ను మంగళవారం కోరారు. నూతన రాజధానిలో భూములు ఇస్తామని, నిర్మాణాలు చేపట్టడంతోపాటు ఆ నిర్మాణాల్లోకి పెట్టుబడులు పెట్టే కంపెనీలను తీసుకురావాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వాన్ని కోరారు.కంపెనీలను తీసుకురావడంతో పాటు ఉద్యోగాలను కల్పించాలని సీఎం సూచించారు. ప్రాథమిక చర్చల్లో వాటా అంశం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ తరహాలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ (ఏపీఐఐసీ లేదా సీఆర్డీఏ), సింగపూర్ ప్రభుత్వ కంపెనీలు సంయుక్తంగా నూతన రాజధాని నిర్మాణం చేపట్టనున్నారు. హైటెక్ సిటీ నిర్మాణాన్ని ఎల్అండ్టీ సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. ఇందులో ఎల్అండ్టీకి 89 శాతం, ఏపీఐఐసీకి 11 శాతం వాటాను చంద్రబాబు సర్కారు కేటాయించింది. ఎల్అండ్టీకి లాభాలు వస్తేనే ఏపీఐఐసీకి 11 శాతం మేర పంపిణీ చేయాలని అప్పట్లో నిర్ణయించారు. హైటెక్ సిటీలోని స్పేస్‌ను కంపెనీలకు ఎల్‌అండ్‌టీయే విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం చేసిన విషయం తెలిసిందే. ఏపీ రాజధాని నిర్మాణానికి ఆ విధానాన్నే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేస్తారు. సింగపూర్‌కు చెందిన కంపెనీనే మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేయనున్నారు. తరువాత ఆ కంపెనీయే సింగపూర్‌కు చెందిన నిర్మాణ సంస్థలను తీసుకురానుంది. మాస్టర్ డెవలపర్‌తో ఎల్అండ్టీ తరహాలోనే ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఎవరికి ఎంత వాటా అనే అంశం ఇంకా ప్రాథమిక చర్చల్లోనే ఉందని, దీనిపై ఒక నిర్ణయానికి రాలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిర్మాణం పూర్తి చేసిన తరువాత ఆ భవనాల్లోకి సంస్థలను తీసుకొచ్చే బాధ్యతను సింగపూర్ కంపెనీలకే అప్పగిస్తారని వెల్లడించారు. భవనాల్లోని స్థలాలను కంపెనీలకు విక్రయించడం లేదా 99 ఏళ్లకు లీజుకు ఇచ్చే అధికారం సింగపూర్‌కు చెందిన మాస్టర్ డెవలపర్‌కే ఉంటుందని స్పష్టం చేశారు. రాజధానిలో ఏది ఎక్కడ? అనే వివరాలను సింగపూర్ కంపెనీలు ఇవ్వాల్సి ఉంది. నూతన రాజధాని ప్రాంతంలో ఏ నిర్మాణాలను ఎక్కడ చేపట్టాలనే వివరాలతో కూడిన డేటాను సింగపూర్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందని ఉన్నతాధికారులు చెప్పారు. ఆ వివరాలు వచ్చిన తరువాత రాజధాని ప్రాంత మాస్టర్ ప్రణాళికను నోటిఫై చేయాల్సి ఉందని తెలిపారు. రాజధాని ప్రాంత మాస్టర్ ప్రణాళికకు రూపకల్పన చేసిన సంస్థలు స్విస్ చాలెంజ్‌లో పాల్గొనకూడదనే నిబంధన ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వాన్ని దరఖాస్తు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినట్లు వివరించాయి. -
నోట్లు-వెన్నుపోట్లు...ఇవే బాబు అస్త్రాలు
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ధ్వజం గుంటూరు : రాష్ట్ర విభజన జరిగిన ఏడాది తర్వాత సెక్షన్ 8 గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి కేంద్ర సాయం వంటివేవీ గుర్తుకు రాకపోవటం విడ్డూరంగా ఉందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇంత హడావుడిగా ఆయన దిల్లీ వెళ్లి మకాం వేసింది తన పదవిని కాపాడుకొనేందుకేనని ప్రజలందరికీ అర్థమైందన్నారు. ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి తనవైపు తిప్పుకొన్నారని, అధికారం కోసం గడ్డి తినేందుకైనా సిద్ధపడే బాబు ఏసీబీ వలలో చిక్కుకునే సరికి రాష్ట్రానికే ప్రమాదం ముంచుకొచ్చినట్లు గగ్గోలు పెడుతు న్నారన్నారు. ఆయన వద్ద నోట్లు-వెన్నుపోట్లు అనే రెండే అస్త్రాలున్నాయి, అంతటి అవినీతిపరుడు, స్వార్థపరుడు మరెవరూ ఉండరని స్వయంగా ఎన్టీఆర్ చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నామినేటెడ్ ఎమ్మె ల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన గొంతు నీదా కాదా, బేరసారాలకు రేవంత్‌రెడ్డిని పంపావా లేదా, ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంతో నీకు సంబంధం ఉందా లేదా...ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8, గవర్నర్‌కు అధికారాలు అంటూ వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయమంటూ మొట్టమొదట లేఖ ఇచ్చిన బాబు ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రుల భద్రతకు ముప్పు తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్దోషి అయితే సీబీఐ విచారణ కోరాలని, రాజీనామా చేసి చట్టానికి లొంగిపోవాలని ఆర్కే సూచించారు. గవర్నర్ స్పందించి శాసనసభను రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఆర్కే డిమాండ్ చేశారు. -
అపనమ్మకంతోనే విపక్షాన్ని తిడుతున్నారు
చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ ధ్వజం టీడీపీ నేతలు తమను తాము పొగుడుకోవడానికే మహానాడు పరిమితమైందని ఎద్దేవా హైదరాబాద్ : తన ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చే యలేనన్న అపనమ్మకంతోనే సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్ని విషయాల్లో చంద్రబాబు వ్యవహరించే తీరునే రాజధాని విషయంలోనూ ఊహాజనిత మాటలతో ప్రజల్ని మోసం చేయడంతప్ప ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద రాజధాని నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు. రాజధాని పేరుతో రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కుని సింగపూర్ కంపెనీలకు వాటిని తాకట్టు పెట్టాలన్న బాబు ప్రభుత్వ ప్రయత్నాలపట్లే తమ పార్టీ తొలినుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. ఈ విషయంలో ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. అధికారంలో ఉన్న పార్టీ మహానాడులాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే.. సాధారణంగా రాబోయే ఏడాది, రెండేళ్లలో ఆ పార్టీ ప్రజలకు చేసే కార్యక్రమాలపై భవిష్యత్ ఎజెండాను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తుందని, కానీ మహానాడు జరుగుతున్న తీరును చూస్తే తమను తాము పొగుడుకోవడానికే పరిమితమైందని తప్పుపట్టారు. చంద్రబాబు వారసుడి ఎంపికకు మహానాడును ఉపయోగించుకుంటున్నారేతప్ప ప్రజల అంశాలపై ఇందులో చర్చలు లేవని జ్యోతుల దుయ్యబట్టారు. -
ఔను.. ప్రైవేటు రాజధానే
రాజధాని నిర్మాణం కేవలం 2 వేల ఎకరాల్లోనే 5,200 ఎకరాలు 99 ఏళ్లపాటు ప్రైవేటు సంస్థలకు లీజుకు కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకే 34 వేల ఎకరాలు సేకరణ మాస్టర్ డెవలపర్‌గా రహస్యంగా సింగపూర్ బిడ్ దాఖలు స్విస్ చాలెంజ్ పేరుతో పనులు కట్టబెట్టనున్న సర్కారు టీడీపీ మహానాడు తీర్మానంలో వెల్లడైన నిజాలు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని పేరుతో రైతులనుంచి పచ్చని పొలాలు బలవంతంగా గుంజుకుంది కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకేనని స్పష్టమైంది. ప్రజారాజధాని పేరుతో ‘ప్రైవేటు’ రాజధాని రాబోతోందని వెల్లడైంది. మాస్టర్‌ప్లాన్‌ను సింగపూర్ ఉచితంగా రూపొందించడం అబద్ధమేననీ... మాస్టర్ డెవలపర్‌గా పనులు కట్టబెట్టడమే తెరవెనుక విషయమనీ తెలిసిపోయింది. రాజధాని నిర్మించేది మాత్రం కేవలం రెండువేల ఎకరాల్లోనేననీ... అంతకు రెండింతల భూమి 5,200 ఎకరాలు సింగపూరు కార్పొరేటు సంస్థలకు కట్టబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమనీ బట్టబయలైంది. అంతర్జాతీయ స్థాయి రాజధాని, 21వ శతాబ్దపు రాజధాని అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినవన్నీ మాయమాటలేనని... ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చడమే ఆయన అసలు లక్ష్యమనీ వెల్లడైంది. ఆ మాత్రం దానికి 34 వేల ఎకరాల పంటపొలాలను నాశనం చేయడమెందుకని మీరు ప్రశ్నిస్తే... రాజధాని నిర్మాణానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రంకెలేస్తారు. అలాంటివారికి పుట్టగతులుండవని శాపనార్థాలూ పెడతారు. కానీ ‘ప్రపంచస్థాయి నగరంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం’ పేరుతో తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆమోదించిన తీర్మానంలోకి వెళితే చంద్రబాబు ‘మనసులోని మాట’ తెలిసిపోతుంది. భూ సమీకరణ పేరుతో రైతుకు ద్రోహం ‘అమరావతి’ నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులనుంచి అడ్డగోలుగా 34 వేల ఎకరాలు సేకరించిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణానికి అన్ని వేల ఎకరాలు ఎందుకని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే... ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలన్న విజన్‌తో తాము ముందుకుపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు బుకాయించారు. రాజధాని నిర్మాణానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని విమర్శించారు. కానీ నూతన రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలకు రెండువేల ఎకరాలు సరిపోతుందని మహానాడులో ఆమోదించిన తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు. రైతుల నుంచి సమీకరించిన 34 వేల ఎకరాల్లో రోడ్లు, పార్కులు, సామాజిక సదుపాయాలకు కేటాయించగా మిగిలేది 7,200 ఎకరాలు మాత్రమేనని తెలిపారు. అయితే అందులో రెండువేల ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాలకోసం ఉపయోగించి మిగిలిన 5,200 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చేస్తారట. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల కోసం ప్రైవేటు సంస్థలకు భూములను 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు (జీవో నంబర్-110) జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జీవో ఆధారంగానే రాజధాని నగరంలో 5,200 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టబోతున్నారు. రాజధానిలో వాణిజ్య సముదాయాలు, ఇతర కార్యకలాపాల కోసం ఈ భూమిని కేటాయించాల్సిన అవసరముందని టీడీపీ తీర్మానంలో పేర్కొన్నారు. అంటే కార్పొరేటు సంస్థలకు మేలు చేసేందుకే ప్రభుత్వం భూసమీకరణ పేరిట పచ్చని పంటపొలాలను లాక్కొందన్నమాట. రాజధాని ప్రాంతంలో భూములు కావాలంటే ప్రైవేటు సంస్థలే కొనుగోలు చేసుకోవచ్చు. కానీ రైతులకు అధిక ధరలు చెల్లించాల్సి ఉంటుంది. అలాకాకుండా ప్రభుత్వం చవకగా భూములను సమీకరించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం వెనుక పెద్ద మతలబే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు దక్కాల్సిన సొమ్మును తాము దక్కించుకునేందుకే సర్కారు పెద్దలు భూసమీకరణ తతంగం నడిపించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 34,000 ఎకరాలు రాజధాని పేరుతో ప్రభుత్వం సేకరించిన భూమి 2,000 ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాలకు సరిపోయే భూమి 5,200 ఎకరాలు 99 ఏళ్ల పాటు ప్రభుత్వం సింగపూర్ కార్పొరేట్లకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించిన భూమి రహస్యంగా రంగంలోకి మాస్టర్ డెవలపర్ సింగపూర్ వాణిజ్య మంత్రి ఎస్.ఈశ్వరన్ నాలుగు రోజుల కిందట హైదరాబాద్ వచ్చి రాజధాని రెండో విడత మాస్టర్ ప్లాన్ అందజేసిన సంగతి తెలిసిందే. ఆ రోజుకు కూడా మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయలేదని, స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఉన్నట్టుండి మహానాడులో చేసిన తీర్మానంలో... మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ బిడ్ దాఖలు చేసినట్టు పేర్కొన్నారు. మాస్టర్ డెవలపర్‌గా ఏ ప్రాతిపదికన, ఎలాంటి నియమ నిబంధల ప్రకారం బిడ్ దాఖలు చేశారో, ఆ బిడ్‌లో ఏమేం కోట్ చేశారో ప్రభుత్వం రహస్యంగా ఉంచడం... సింగపూర్ బిడ్ దాఖలు చేసిందనీ, త్వరలోనే స్విస్ చాలెంజ్ విధానంలో త్వరలోనే మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేస్తామని మహానాడు తీర్మానంలో పొందుపరచడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీటికి తోడు సీఆర్డీఏ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడానికి జపాన్ ముందుకొచ్చిందని కూడా ఆ తీర్మానంలో పేర్కొన్నారు. సీఆర్డీఏ పరిధిలో అంటే రాజధాని కోర్ ఏరియా కాకుండా దాని బయట జపాన్ సంస్థలు వస్తాయని స్పష్టమవుతోంది. అలాగే రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి నిధుల సేకరణకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఆ తీర్మానంలో పేర్కొన్నారు. రాజధాని అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1500 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు కూడా అందులో వివరించారు. రాజధాని నిర్మాణం పూర్తిగా ప్రభుత్వ వ్యవహారం. ప్రభుత్వపరంగా పారదర్శకంగా జరగాల్సిన ఇలాంటి విషయాలను తెలుగుదేశం పార్టీ మహానాడులో బహిర్గతపరచడం పలు అనుమానాలకు తావిస్తోంది. ‘సాక్షి’ చెప్పిందే నిజమైంది. ‘ప్రైవేట్’ రాజధాని శీర్షికతో సాక్షి ప్రచురించిన వార్త అక్షరసత్యమని టీడీపీ మహానాడు సాక్షిగా వెల్లడైంది. రాజధానికోసం రైతులనుంచి సేకరించిన పంటపొలాల్లో వేల ఎకరాలు ప్రైవేటు కంపెనీలకు 99 ఏళ్లు ధారాదత్తం చేయనుందన్న వాస్తవం నిజమైంది. 5,200 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టనున్నట్లు మహానాడు తీర్మానాల్లో పేర్కొన్నారు. -
నవ నిర్మాణానికి తొలి అడుగు
వచ్చే నెలలో వారం రోజులు నగరంలోనే ముఖ్యమంత్రి ‘నవ నిర్మాణ దీక్ష’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రభుత్వ కార్యాలయాల తరలింపులో నిమగ్నం చంద్రబాబు క్యాంపు కార్యాలయం సిద్ధం విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సన్నాహాలు ఆరంభమయ్యాయి. ఇందులో భాగంగానే వచ్చే నెలలో ప్రభుత్వం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పడి వచ్చేనెల మొదటి వారానికి సంవత్సరం గడుస్తుంది. ఈ సంవత్సరంలో ఏం చేశాం.. ఏం చేయబోతున్నామనే వివరాలు విజయవాడ లేదా గుంటూరును వేదికగా చేసుకుని ప్రజలకు చెప్పాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారుల్లో హడావుడి మొదలైంది. మూడో తేదీ నుంచి ‘నవ నిర్మాణ దీక్ష’ రాష్ట్ర విభజన జరిగిన జూన్ రెండో తేదీనే స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కార్యాలయానికి కావాల్సిన హంగులన్నీ రెడీ అయ్యాయి. ‘నవ నిర్మాణ దీక్ష’ పేరుతో వచ్చేనెల మొదటి వారంలో అంటే.. జూన్ మూడు నుంచి ఎని మిదో తేదీ వరకు వారం రోజులు సీఎం విజయవాడ కేంద్రంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. మూడు నుంచి ఏడో తేదీ వరకు నవ నిర్మాణ దీక్షలు చేస్తారు. ఈ దీక్షల ద్వారా తాము చేసినవన్నీ మంత్రులు, అధికారులు ప్రజలకు చెప్పుకొనే ప్రయత్నం చేస్తారు. ఎనిమిదిన బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సభను విజయవాడలోనే నిర్వహించాలని కొందరు చెబుతుండగా, మరికొందరు రాజధాని నిర్మాణం చేపట్టబోయే ప్రాంతంలో ఏర్పాటుచేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. ఈ కార్యక్రమాలు సజావుగా సాగాలంటే పోలీసుల పని తీరుకు మరింత పదును పెట్టాల్సి ఉంటుంది. ఈ పనిలోనే పోలీస్ కమిషనర్ నిమగ్నమయ్యారు. రెండో తేదీన సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభిస్తే అందుకు సంబంధించి బందోబస్తుకు తాము సిద్ధంగా ఉన్నామని సీపీ మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రాష్ట్ర కార్యాలయాల ఏర్పాటుపై కసరత్తు రాష్ట్ర కార్యాలయాల ఏర్పాటు బాధ్యతను మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడికి అప్పగించారు. కలెక్టర్లతో ఇప్పటికే నారాయణ ఎన్నోసార్లు ఈ విషయాలపై మాట్లాడారు. గన్నవరంలోని మేథ టవర్‌లో ఎన్ని కార్యాలయాలు ఏర్పాటు చేయవచ్చో ఆలోచిస్తున్నారు. బందర్ రోడ్డులోని గోకరాజు టూరిజం టవర్‌లో కూడా ఎన్ని కార్యాలయాలు ఏర్పాటుచేస్తే బాగుంటుందనే అంశపై చర్చ జరుగుతోంది. వీటిపై కలెక్టర్ ఒకటి రెండు రోజుల్లో మంత్రులకు తగు నివేదికలు సమర్పించే అవకాశం ఉంది. టూరిజం, మత్స్య పాలసీపైనే దృష్టి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల్లో టూరిజం, మత్స్య పాలసీ ముఖ్యమైనవి. ఈ రెండు పాలసీలు జిల్లా ప్రజలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి. టూరిజం కేంద్రంగా ఇప్పటికే విజయవాడ చాలావరకు అభివృద్ధి చెందింది. పీపీపీ పద్ధతుల్లో పలు సంస్థలకు టూరిజంలో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిషరీష్ పాలసీలో మత్స్యకారులకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తారు. సముద్రంలో వేట నిషేధించిన మూడు నెలలూ.. నెలకు రూ.4వేల వంతున సాయాన్ని మత్స్యకారులకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అదేకాకుండా, అధునాతన పరికరాలు కూడా వారికి ఇస్తారు. చేపలు పట్టుకునేందుకు, పెంచుకునేందుకు ముందుగా వారికి అవకాశాలు ఇచ్చిన తరువాతే ఇతరులకు ఇస్తారు. పీపీపీ పద్ధతిలో మత్స్య పరిశ్రమలు స్థాపించే వారికి రాయితీలు ఇస్తారు. ముఖ్యంగా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల జిల్లాలో ఎక్కువ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చే అవకాశం ఉంది. ఎగుమతులు కూడా ఎక్కువగా జరుగుతాయి. కృష్ణానదిలో చేపలు పెంపకం, పట్టుకోవడం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సముద్రంలో ఇక ప్రత్యేకంగా చెప్పేది లేదని, మత్స్యకారులు ఏది మంచి అనుకుంటే అది చేయవచ్చనని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. -
‘అన్నపూర్ణ’కు అప్రతిష్ట
ఆంధ్రప్రదేశ్ ► రాజధానికి భూ సమీకరణపై ఏపీ సీఎం చంద్రబాబుకు ఉద్యమకారుడు అన్నాహజారే ఘాటు లేఖ ► రెండు మూడు పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మిస్తారా? ► ఇది దేశ ఆహారభద్రతకు పెను ముప్పుగా పరిణమించదా? ► ఒత్తిడి తెచ్చి భూములు సమీకరించినట్టు వెల్లడైంది ► త్వరలో రాజధాని గ్రామాల్లో పర్యటిస్తా హైదరాబాద్: దేశానికి అన్నపూర్ణగా భాసిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌కు అప్రతిష్ట తేవొద్దని సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచించారు. రాజధాని నిర్మాణం కోసం ఏడాదికి రెండు మూడు పంటలు పండే భూములను తీసుకుంటే దేశ ఆహార భద్రతకు తూట్లు పొడిచినట్లు అవుతుందని ఆయన హెచ్చరించారు. రైతులెవరూ స్వచ్ఛందంగా భూములిచ్చిన దాఖలాలు లేవన్న సంగతి వెల్లడైందని, బలవంతంగా భూసేకరణ చేస్తామని బెదిరించడంతోనే వారు ప్రభుత్వానికి భూములిచ్చినట్టు తేటతెల్లమైందని ఆయన స్పష్టం చేశారు. ఒత్తిళ్లకు తలొగ్గి భూములు అప్పగించిన రైతులు ఇప్పుడు వాటిని తిరిగి తమకు అప్పగించాలని కోరుతున్నారని, అందువల్ల వారికి తక్షణం ఆ భూములను అప్పగించాలని ఆయన సూచించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన మంగళవారం లేఖ రాశారు. పంట భూముల పరిరక్షణకోసం రైతులకు దన్నుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తానని అన్నాహజారే అందులో తెలిపారు. అన్నాహజారే లేఖలో పేర్కొన్న అంశాలివీ... ‘‘రాష్ట్ర విభజన బాధాకరమే. ఆర్థికలోటులో ఆంధ్రప్రదేశ్ ఉందన్నది నాకు తెలుసు. రాష్ట్రం ఆర్థిక లోటును తొందరలోనే అధిగమిస్తుందని భావిస్తున్నా. రాజధాని నగరం నిర్మాణం పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏడాదికి రెండు, మూడు పంటలు పండే భూములను అధికారులు రైతులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి సమీకరించారంటూ కొందరు నాకు వినతిపత్రాలను పంపారు. రెండు మూడు పంటలు పండే భూములను పరిరక్షించాలని కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ అనే పేరుంది. ఆ భూములను సేకరించడం ద్వారా అన్నపూర్ణ అనే పేరున్న రాష్ట్రానికి అప్రతిష్ట తేవొద్దు. రాజధాని ప్రాంత గ్రామాల్లో సామాజిక ఉద్యమకారులు పీవీ రాజగోపాల్, స్వామి అగ్నివేశ్, మేధాపాట్కర్, ఎంజీ దేవసహాయం వంటి వారు ఎంతోమంది పర్యటించారు. వేలాదిమంది రైతులతో వారు సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణం కోసం ఏ ఒక్క రైతూ స్వచ్ఛందంగా భూములిచ్చిన దాఖలాలు లేవన్నది వారి పర్యటనల్లో వెల్లడైంది. భూ సమీకరణకు అంగీకరించకపోతే బలవంతంగానైనా భూసేకరణ చేస్తామని అధికారులు బెదిరించడంతోనే రైతులు భూములను ప్రభుత్వానికి అప్పగించారు. అప్పట్లో ఒత్తిళ్లకు తలొగ్గి భూములు అప్పగించిన రైతులు ఇప్పుడు తమ భూములు తమకు అప్పగించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ రైతులకు తక్షణమే భూములను అప్పగించండి. పారిశ్రామికీకరణకు.. అభివృద్ధికి నేను వ్యతిరేకమనుకుంటే తప్పు. వ్యవసాయయోగ్యం కాని భూముల్లో రాజధాని నగరం నిర్మించండి. బంజరు భూముల్లోనే పరిశ్రమలను స్థాపించండి. రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయయోగ్యం కాని భూములను తక్షణమే వర్గీకరించండి. ఆహార భద్రత దృష్ట్యా వ్యవసాయ యోగ్యమైన భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించవద్దు. పాలేకర్ సూచించిన రీతిలో సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని అమలుచేసి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దండి. శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని రాజధాని నగరాన్ని నిర్మించండి. నేను త్వరలోనే రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తా. రైతులు, రైతు కూలీలతో సమావేశమవుతా. నేను సూచించిన సలహాలను పాటిస్తారని భావిస్తున్నా’’ అని అన్నాహజారే తన లేఖలో పేర్కొన్నారు. -
రాజధాని భూముల పరిహారం చెల్లింపులో మెలిక
ఎంజాయ్మెంటు, భూముల నిర్ధారణకు కొనసాగుతున్న సర్వే సర్వే పూర్తయ్యాక పరిహారం చెల్లిస్తామంటున్న సర్కారు జరీబు భూములపై పీటముడి వేస్తున్న అధికారగణం అధికశాతం భూములను మెట్టగానే చూపాలని మౌఖిక ఆదేశాలు! హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఈ నెల 21లోగా వచ్చే ఏడాది కౌలు చెల్లిస్తామని బీరాలు పలికిన సర్కారు ఇప్పుడు భూముల నిర్ధారణలో మెలిక పెడుతోంది. ఇటీవలే కౌలు పరిహారానికిగాను సీఆర్డీఏకు రూ.143 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఆ మేరకు రైతులకు డీడీలు ఇవ్వడంలో మాత్రం జాప్యం చేస్తోంది. అదేమంటే భూమి ఎవరి స్వాధీనంలో ఉన్నదీ నిర్ధారించేందుకు ఉద్దేశించిన ఎంజాయ్మెంటు సర్వే కొనసాగుతున్నదని, ఈ నెలాఖరుకు దీన్ని పూర్తి చేసి పరిహారం చెల్లిస్తామని చెబుతోంది. ఇప్పటికే రైతులందించిన పత్రాల్ని 1908 భూ రికార్డులతో సీఆర్డీఏ సిబ్బంది పోల్చిచూశారు. అవన్నీ సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించారు. అయితే ఏ రైతుకు ఎంత భూమి ఉంది? ఎవరి అనుభవంలో ఉందనే విషయాన్ని తేల్చేందుకు ఓ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సర్వేయర్లతో ఎంజాయ్మెంట్ సర్వే ప్రారంభించారు. మొత్తం 29 గ్రామాల్లోనూ 26 యూనిట్లలో ఈ సర్వే కొనసాగుతోంది. ఒక్కో యూనిట్‌కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేతృత్వం వహిస్తున్నారు. అధిక శాతం మెట్టభూములుగానే పరిగణన! రాజధాని నిర్మాణానికి జనవరి 2 నుంచి భూసమీకరణ ప్రారంభించారు. మొత్తం 29 గ్రామాల్లో 47,870 ఎకరాల భూమి ఉంది. దీన్లో అసైన్మెంట్, వక్ఫ్‌బోర్డు, దేవాదాయ, ప్రభుత్వ భూములుపోనూ ప్రైవేటు పట్టాభూములు మొత్తం 33,252 ఎకరాలను సేకరించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందులో వెయ్యి ఎకరాలకుపైగా నదీగర్భంలో కలసినందున వీటిని సర్వే చేస్తున్నారు. రైతులనుంచి సేకరించిన భూముల్లో పదేళ్లపాటు ఎకరాకు మెట్టకు రూ.33 వేలు, జరీబు భూమికి రూ.55 వేలు చొప్పున పరిహారాన్ని ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ భూముల్లో ఎన్ని ఎకరాలు మెట్ట భూములున్నాయో.. ఎన్ని ఎకరాలు జరీబు భూములున్నాయో.. ప్రభుత్వం పారదర్శకంగా వెల్లడించకుండా ఆ రికార్డుల్ని తహసీల్దారు యూనిట్లకు కాంపిటెంట్ అథారిటీగా వ్యవహరిస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు అందజేసింది. వీరి ఆధ్వర్యంలో.. సమీకరించిన భూముల్ని ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులు పరిశీలించి జరీబు భూములా? మెట్టభూములా? అన్నది తేలుస్తారు. తహసీల్దారు రికార్డుల్లో మెట్టభూములుగా నమోదై, క్షేత్రస్థాయిలో జరీబు భూములైతే వాటిని జరీబు భూములుగా మార్చేందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు అధికారముంది. ఇదిలా ఉండగా రైతులనుంచి సమీకరించిన భూముల్ని అధికశాతం మెట్టభూములుగానే పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకందిన ఆదేశాల మేరకు ముందుకెళుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో తామిచ్చిన అంగీకారపత్రాల్ని వెనక్కు తీసుకునేందుకు వారు ఆందోళన బాట పడుతున్నారు. కాగా తహసీల్దారు అందించిన రికార్డుల్లో జరీబు అని ఉన్నా క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత మెట్టభూములుగానే డిక్లేర్ చేయాలని అంతర్గత ఆదేశాలున్నట్లు సమాచారం. మంగళగిరి ప్రాంతంలోని గ్రామాల్లో మొత్తం జరీబు భూములైనా అధికారులు కొన్నింటిని మెట్టభూములుగానే గుర్తిస్తున్నారని రైతులు చెబుతున్నారు. నేడు సర్వే బృందాలతో సీఆర్డీఏ కమిషనర్ భేటీ గుంటూరుకు సమీపంలోని పలకలూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ సర్వే బృందాలతో ఆదివారం సమావేశం కానున్నారు. రైతులకు అందించే పరిహారం ఆలస్యమవుతున్నందున, ఈ నెలాఖరుకు సర్వే పూర్తి చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. కాగా మెట్ట, జరీబు భూములపై అధికారిక ప్రకటన చేసేందుకు సీఆర్డీఏ కసరత్తు చేస్తోంది. -
విజయవాడలో రియల్టర్ ఆత్మహత్య
నూజివీడులో భూములు కొని నష్టపోయిన వ్యాపారి రాజధాని అక్కడే వస్తుందని నమ్మి అప్పులు చేసి కొనుగోళ్లు వడ్డీ వ్యాపారులు ఒత్తిడి పెంచడంతో బలవన్మరణం విజయవాడ: రాజధాని నిర్మాణం కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలోనే జరుగుతుందని నమ్మి ఆ ప్రాంతంలో భూములు కొని నష్టపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పుప్పాల విజయ్‌కుమార్.. సోమవారం మధ్యాహ్నం బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజధాని గుంటూరు జిల్లా తుళ్లూరుకు వెళ్లడంతో విజయ్ కుమార్ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడని, వడ్డీ వ్యాపారుల ఒత్తిడి చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని విజయ్‌కుమార్ బంధువులు ఆరోపిస్తున్నారు. రాజధాని నిర్మాణంపై గతంలో ప్రభుత్వం పలు ప్రకటనలు చేయడంతో.. విజయవాడలోని రామవరప్పాడులో నివాసి విజయ్‌కుమార్ నూజివీడులో స్థలాలు కొన్నాడు. దాని కోసం తనకు గన్నవరం సమీపంలోని తేలప్రోలు వద్దనున్న 36 సెంట్ల స్థలాన్ని అమ్మాడు. ఆ సమయంలో పొరుగు స్థలం వారితో వివాదం ఏర్పడినట్లు సమాచారం. సొంత స్థలం అమ్మిన పైకంతో పాటు.. అధిక వడ్డీలకు మరో రూ. కోటి వరకూ అప్పుచేసి మొత్తం రూ. 5 కోట్లతో నూజివీడులో స్థలాలను కొనుగోలు చేశాడు. వాటిలో కొన్నింటికి అడ్వాన్స్‌లు మాత్రమే చెల్లించాడు. కొన్ని రిజిస్ట్రేషన్లు చేయగా, కొన్ని రిజిస్ట్రేషన్ కాలేదు. స్థలాలు వెంటనే అమ్ముడుబోతే వారికి పూర్తిగా డబ్బు చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. స్థలాలు అమ్మకాలు జరగకపోవడంతో తాను కొన్న భూములకు మిగిలిన డబ్బులు వెంటనే చెల్లించలేకపోయాడు. కాగా, సాయిరామ్ అనే ఫైనాన్షియర్ వద్ద రూ. 3 వడ్డీకి రూ. 40 లక్షలు అప్పు తీసుకున్నాడు. దానిపై నెలకు రూ. 1.20 లక్షల వడ్డీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఐదు నెలల నుంచి ఫైనాన్షియర్స్ నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నెల 9వ తేదీ వచ్చినా వడ్డీ చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి వద్ద నుంచి సోమవారం ఉదయం 10.23 గంటలకు ఫోన్ వచ్చింది. దీంతో విజయకుమార్ వణికిపోయాడు. భార్యను బయటకు పంపి..: అప్పుడే రామవరప్పాడులోని స్కూల్లో చదువుతున్న ఇద్దరు ఆడపిల్లలకు భోజనం క్యారియర్ ఇచ్చేందుకు భార్య బయలుదేరింది. ఆమెతో ఫోన్ విషయాన్ని వివరించి బాధపడ్డాడు. భార్య బయటకు వెళ్లగానే ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ వద్ద విజయ్ కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ.. అప్పులిచ్చినవారి ఒత్తిళ్ల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించారు. అప్పుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాశాడని, దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. -
సంతకాలు ముగిశాక ఇక సమరమే
సందర్భం రాజధాని నిర్మాణం ప్రకటించినది మొదలు ఆయన సింగపూర్ పర్యటనలు చేస్తుంటే ఇక్కడ ప్రజలు కంటి మీద కునుకు లేకుండా అభద్రతతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం భూసమీకరణ పూర్త యింది. ఇక రైతులూ, కూలీలు చేయవలసిన రణం మిగిలి ఉంది. మెతుక్కీ, బతుక్కీ భరో సా ఇచ్చిన జరీబు భూముల ను కోల్పోయిన రైతాంగం ‘అభివృద్ధి’ విధ్వంసాల మధ్య నష్టపరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయబోతున్నారు. చంద్రబాబు రంగుల ప్రపంచాన్ని కలలుకంటూ ఊహా లోకాలలో తేలుతూ సింగపూర్ తరహా రాజధానిని నిర్మిస్తే ఆ నూతన రాజధాని కూడళ్లలో రైతులు, కూలీల స్థానమెక్కడ? భవిష్యత్తు ఊహించడానికే భయానకంగా ఉంది. భయపడ్డారో, భద్రత లేదనుకున్నారో, మోసపో యారో గానీ కొంతమంది రైతులు భూములు ఇచ్చేశా రు. ‘మేము పూర్తి అవ గాహన/ ఆమోదంతో భూసేకరణ పథకంలో భాగస్వాములం కావడానికి అంగీకారం తెలి యజేస్తున్నాం. కావున ప్రస్తుత భూసేకరణ చట్టం- 2013 (పునరావాస, పునర్నిర్మాణ చట్టం) ప్రకారం ఎలాంటి నగదు పరిహారం లేదా ఇతర ప్రయోజనాలు, రాయితీలు పొందేందుకు మేం అర్హులం కాము, హక్కు లేదని ఇందుమూలంగా స్పష్టపరుస్తున్నాం’ అని 9.3 ఫారం మీద రైతులు సంతకాలు చేశారు. వేలిముద్ర లెన్నో, సంతకాలెన్నో తెలియదుకానీ, ప్రభుత్వం భయ పెట్టి ఈ ప్రక్రియను ఎట్టకేలకు ముగించింది. ఇంత జరి గినా ప్రభుత్వం ఈ భూములను ప్రజలే స్వచ్ఛందంగా ఇచ్చారని చెబుతోంది. కొత్త రాజధాని ఏర్పాటు కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ మాటతో సహా, చంద్రబాబు ఎవరి అభిప్రాయాలనూ పరిగణన లోనికి తీసుకోలేదు. విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని ఉంటుందని చెబుతూనే తుళ్లూరు, మంగళ గిరి, తాడేపల్లి మండల ప్రాంతాలను ఎంపిక చేయడం లో ఒక దుర్మార్గం ఉంది. అరెకరం, ఒకటి రెండు ఎక రాలు ఉన్న రైతులు, కూలీలు, దళితులు 90 శాతం ఉన్న ప్రాంతం ఇదే. భూస్వాములు, ధనికులు తక్కువగా ఉన్న ప్రాంతమిది. దాదాపు 20 వేల కుటుంబాలకు భూమి లేదు. కాబట్టి ఈ ప్రాంత వాసులను బెదిరించి తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిం చుకుని లక్షల కోట్లు దండుకోవాలనే దృష్టితో ఈ ప్రాం తాన్ని రాజధాని ప్రాంతంగా ఎంపిక చేశారనేది స్పష్టం. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇక్కడి భూములను కొని సింగపూర్ తరహా రాజధానిని నిర్మించడం భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ప్రత్యేక ప్రతిపత్తి తదితర హామీలు నీటి మీద రాతలవుతున్నాయి. అందువల్ల చంద్రబాబు నాయుడు కానీ ఖర్చు లేకుండా 30 నుంచి 50 వేల ఎకరాల దాకా ప్రజలనుంచి నయానో భయానో సేకరించాలని ల్యాండ్ పూలింగ్ పద్ధతిని తీసుకువచ్చారు. దీనికి ఎలాంటి చట్ట బద్ధతా లేదు. అయినా మంత్రులు గ్రామాల్లో తిష్టవే శారు. ఫిబ్రవరి 28 లోపు ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు సమీకరిస్తాం లేకపోతే సేకరణకు వెళ్లి భూము లు తీసుకుంటాం అని హెచ్చరికలు చేయడంతో రెండు రోజుల్లోనే రైతులు కొంత మంది భయపడి భూములు ఇచ్చి వేశారని చెబుతున్నారు. ఇది స్వచ్ఛందంగా ఇచ్చిం ది కానే కాదు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి రైతులు భూములిస్తే ప్రభుత్వం అభివృద్ధి చేసి పట్టా భూమికి 1200 చ.గ.లు, అసైన్డుభూమికి 900 చ.గ.లు ఇస్తామని ప్రకటించింది. సంవత్సరానికి 30 వేలు ఇస్తానంది. వ్యవసాయ కూలీలకు నెలకు 2,500 రూపా యలు ఇస్తామని ప్రకటించింది. సంవత్సరానికి 30 వేలు కౌలు ఇస్తానంది. వ్యవసాయ కూలీలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. రాజధాని నిర్మా ణం చేస్తామన్న 29 గ్రామాలలో 52 వేల ఎకరాల భూమి ని లాండ్ పూలింగ్ పద్ధతిలో సేకరించడానికి ప్రభుత్వం పూనుకుంది. అక్కడ పంట పొలాల్లో రైతులూ, కూలీలూ జీవిస్తున్నారు. ఈ మూడు మండలాల్లోనే 11,687 రైతు కుటుంబాలు, 51,573 మంది రైతు కూలీలు జీవిస్తు న్నారు. మూడు మండలాల పరిధిలో 74 వేల మంది దళి తులు, 12 వేల మంది ఎస్టీలు ప్రధానంగా వ్యవసా యం మీద ఆధారపడి జీవిస్తున్నారు. కూలీల్లో అత్య ధికం దళితులూ, బీసీలూ, ఇతర పేదలూ ఉన్నారు. వారి మాటల్లోనే చెప్పాలంటే 20 సెంట్లున్న రైతు సాఫ్ట్ వేర్ ఉద్యోగి సంపాదించినంత సంపాదిస్తున్నాడని ఈ భూములు పోతే మాకు దిక్కేమిటని గ్రామాల్ని సంద ర్శించిన వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఆవేదనతో మాట్లాడుతున్నారు. భార్యాభర్తలిద్దరూ రోజూ కూలీకి వెళితే నెలకు 20 వేలు సంపాదిస్తామని, ప్రభుత్వం ఇచ్చే 2,500 రూపాయలు ఏ మూలకు సరిపోతాయని బాధ పడుతున్నారు. రాజధాని నిర్మాణం ప్రకటించినది మొదలు ఆయన సింగపూర్ పర్యటనలు చేస్తుంటే ఇక్కడ ప్రజలు కంటి మీద కునుకు లేకుండా అభద్రతతో ఉన్నారు. పం టపొలాలు ఇవ్వబోమని, జరీబు భూములు ఇవ్వబో మని తేల్చి చెబితే పంట పొలాలు తగులబడతాయి. పోలీసులు రంగప్రవేశం చేస్తారు. ఈ ప్రాంతమంతా యుద్ధ వాతావరణం అలుముకుంటుంది. అదిరింపులు, బెదిరింపులు నిత్యకృత్యం అవుతాయి. పూలింగ్ అయితే మీకు లాభం, సేకరణ అయితే నష్టం అని మీరు ఇవ్వక పోయినా భూములు లాక్కొంటాం అని బెదిరింపులతో రైతుల్ని భయాందోళనలకు గురి చేశారు. విదేశీ పెట్టుబడుల కోసం అర్రులు చాస్తూ, సింగ పూర్, జపాన్ లాంటి రాజధాని కోసం ఆకాశానికి నిచ్చె నలు వేస్తున్న చంద్రబాబు వైఖరిని ప్రజలు పెద్ద ఎత్తున తిరస్కరించాలి. కార్పొరేట్ సంస్థల దోపిడీకి, తెలుగు దేశం పెద్దలు చేయబోయే రియల్ ఎస్టేట్ వ్యాపార దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలి. ఆత్మ విశ్వాసంతో పోరాడుతున్న రాజధాని ప్రాంత రైతులకు, కూలీలకు అంతా అండగా నిలబడాలి. (వ్యాసకర్త సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ర్ట నాయకులు మొబైల్: 9989737776) చిట్టిపాటి వెంకటేశ్వర్లు -
రాజధాని రైతుకు కౌలు సొమ్ము
తాడికొండ (గుంటూరు) : రాజధాని నిర్మాణంలో మరో ప్రధాన ఘట్టం సోమవారం ప్రారంభమైంది. భూములు ఇచ్చిన రైతులకు అధికారులు కౌలు చెక్కుల పంపిణీ ప్రారంభించారు. వ్యవసాయ భూములను చదును చేసే ప్రక్రియనూ ఆరంభించారు. భూములు ఎక్కువగా ఇచ్చిన తాడికొండ మండలం నేలపాడు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ సీహెచ్.శ్రీధర్ హాజరయ్యారు. కార్యక్రమానికి నేలపాడు సీఆర్డీఏ అధికారి శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించగా..కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, భూములు ఇచ్చిన రైతులకు మూడేళ్లలో అభివృద్ధి చేసి అందిస్తామని తెలిపారు. తొలిగా భూములిచ్చిన మహిళారైతు కొమ్మినేని ఆదిలక్ష్మిని అభినందించారు. భూములు ఇచ్చిన రైతుల వద్ద అంగీకార పత్రాలన్నీ కచ్చితంగా ఉంటే ఏడాదికి రూ.30 వేలు కౌలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. వివాదాలు ఉన్న భూములకు సంబంధించి వాటిని పరిష్కరించి రైతులకు కౌలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దాదాపు 80 శాతం భూములు కచ్చితంగానే ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం ఏడాది వరకు కొనసాగుతుందన్నారు. కలెక్టర్ కాంతి లాల్‌దండే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా రాజధానిని నిర్మించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. భూసమీకరణ పూర్తిచేసి సహకరించిన అధికారులంతా గుర్తుండిపోతారని చెబుతూ, తుళ్లూరు తహశీల్దారు సుధీర్‌బాబును అభినందించారు. సీఎం చంద్రబాబు రైతులతో తన ఆనందాన్ని పంచుకొనేందుకు తుళ్లూరులోనే ఉగాది జరుపుతున్నట్టు చెప్పా రు. జేసీ శ్రీధర్ మాట్లాడుతూ63 రోజుల్లో భూసమీకరణ పూర్తిచేసినట్లు తెలిపారు. రైతుల వద్దనుంచి అగ్రిమెంటు తీసుకొని కౌలు సొమ్ము అందిస్తున్నామన్నారు. ఏటా పది శాతం కౌలు పెరుగుతుందన్నారు. అనంతరం గ్రామంలోని 93 ఎకరాలకు సంబంధించి 36 మంది రైతులకు రూ. 27.93 లక్షల సొమ్ముకు చెక్కులు అందించారు. సర్పంచ్ ధనేకుల సుబ్బారావు పొలాన్ని దున్ని అభివృద్ధిని ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివశంకర్, ఆర్డీవో భాస్కరనాయుడు, ఎంపీపీ పద్మలత, నాయకులు దామినేని శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు. -
మెతుకు లాగేసుకుంటే.. బతుకేం కావాలి!
పోలవరం :రాజధాని నిర్మాణం పేరిట గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంత రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటున్నట్టుగానే పట్టిసీమ ఎత్తిపోతల పథకం విషయంలోనూ అధికారులు వ్యవహరిస్తారా.. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి గోదావరి జలాలను కృష్ణా జిల్లాకు తరలించుకుపోతారా.. అదే జరిగితే భూములను.. జల వనరులను ఎలా కాపాడుకోవాలనే ప్రశ్నలు పోలవరం ప్రాంత రైతులను, ప్రజలను వేధిస్తున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల భూములు కోల్పో యే రైతులైతే ఏం చేయాలో తెలియక దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ఉభయగోదావరి జిల్లాల్లోని రైతులు, రైతు సంఘాల నాయకులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు, వివిధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా ప్రభుత్వం పట్టిసీమ వద్ద ఎత్తిపోతలు నిర్మించేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిర్మించి తీరుతుందని, ఇందుకు అవసరమైన భూములను ఇక్కడి రైతులు లీజుకు ఇస్తే సరేసరి, లేదంటే భూసేకరణ చట్టాన్ని అనుసరించి కచ్చితంగా తీసేసుకుంటామని కలెక్టర్ కె.భాస్కర్ స్పష్టం చేశారు. భూములను లీజుకివ్వడమా లేక భూసేకరణ ద్వారా ప్రభుత్వానికి అప్పగించడమా అనే విషయమై రైతులే చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. దీంతో ఇక్కడి రైతుల్లో భయాందోళనలు తీవ్రమయ్యాయి. వివిధ పథకాల వల్ల రైతులు ఇప్పటికే భూములు కోల్పోయారు. వారివద్ద కొద్దిపాటి భూమి మాత్రమే మిగి లింది. ఆ భూముల్లో వరి, చెరకు, పత్తి, కూరగాయలు, కొబ్బరి తోటలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి మిగిలిన ఆ కొద్దిపాటి భూమిని కూడా ప్రభుత్వం లాగేసుకుంటే రైతు కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి. విధిలేని పరిస్థితుల్లో భూములను కాపాడుకునేందుకు ప్రభుత్వంపై పోరాడటం తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం లేదనేది ఇక్కడి రైతుల అంతరంగం. ఈ పథకం వల్ల కోల్పోయే భూములు సారవంతమైనవి, ఎంతో విలువైనవి కావడంతో వీరి ఆవేదనకు అంతులేకుండా పోతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ భూములకు మరింత విలువ పెరుగుతుందని ఆశించారు. ఊహించని విధంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం రూపంలో భూములు కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. పట్టిసీమ వల్ల ఎవరి భూములు పోతాయో స్పష్టత లేకపోవడంతో మరింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పథకం పేరుచెప్పి పట్టిసీమ, బంగారమ్మపేట, కృష్ణారావుపేట, పోలవరం ప్రాంతాల్లోని రైతుల ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు పట్టిసీమకు చెందిన తానా వెంకటేశ్వరరావు అనే రైతు కుటుంబ సభ్యులందరికీ చెందిన భూమి ఈ ప్రాంతంలోనే ఉంది. అన్నదమ్ములు, అక్కచెళ్లెళ్లకు సంబంధించి ఎకరం లేదా రెండెకరాల భూమి చొప్పున ఇక్కడ ఉంది. ఈ భూములు కోల్పోతే ఆ కుటుంబాలన్నీ జీవనాధారం కోల్పోతాయి. ఈ పరిస్థితుల్లో భూముల్ని కాపాడుకునేందుకు తామంతా పోరుబాట పట్టక తప్పదని తానా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తమ కుటుంబాలు వీధిన పడకుండా కాపాడుకునేందుకు భూములు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు కప్పల రామచంద్రరావు, తానా శ్రీనివాస్, తెలగంశెట్టి సూర్యచంద్రరావు అంటున్నారు. -
రాజధాని పేరిట రైతులను శిక్షిస్తున్న బాబు
జంతర్ మంతర్ ధర్నాలో మేధా పాట్కర్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పేరిట రైతులకు సీఎం చంద్రబాబు శిక్ష విధిస్తున్నారని సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ ధ్వజమెత్తారు. జీవనోపాధినిస్తున్న భూములు లాక్కుంటూ రైతులకు ఉరివేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భూ సేకరణ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అన్నా హజారే నిర్వహించిన ధర్నాలో మంగళవారం ఆమె మాట్లాడారు. నిర్బంధ భూసేకరణకు తెచ్చిన ఆర్డినెన్సును ఆమోదించనివ్వబోమని చెప్పారు. ఆర్డినెన్సుతో వచ్చే అనర్థాలను వివరిస్తున్న నేపథ్యంలో ఏపీలో భూసేకరణ తీరును ప్రస్తావిస్తూ చంద్రబాబుపై విమర్శలు సంధించారు. పేద రైతుల సారవంతమైన వేలాది ఎకరాల భూముల్లో రాజధాని కోసం బహుళ అంతస్తుల భవనాలను నిర్మించాలను కోవడం అన్యాయమే కాదని, అపరాధమూ అవుతుందన్నారు. ఇలాంటి వారిని పార్లమెంటు ఏమీ చేయలేకపోయినా ప్రజా పార్లమెంటులో శిక్ష విధించాలని కోరారు. -
‘తమ్ముళ్ల’ తిరుగుబాటు
తాడికొండ(గుంటూరు): రాజధాని నిర్మాణం కోసం జరుపుతున్న భూ సమీకరణపై ఆ ప్రాంత తెలుగు తమ్ముళ్లు తిరుగుబావుటా ఎగురవేశారు. జరీ భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస భూమి, 600 గజాల వాణిజ్య స్థలం ఇస్తూ వాటికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ భూములు ఇవ్వబోమని తెల్చి చెప్పారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో మంగళవారం టీడీపీ గ్రామ నేతలు, మద్దతు దారులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ జెండాలతో నిరసన తెలిపారు. పరిహారంపై తమకున్న సందేహాలను ఇప్పటి వరకు తీర్చలేదని ఆరోపించారు. అభద్రతా భావాన్ని తొలగించే ప్రయత్నం చేయకుంటే కోర్టుకు వెళతామన్నారు. -
భూములివ్వాల్సిన అవసరం లేదు
విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మణరెడ్డి స్పష్టీకరణ తాడేపల్లి: రాజధాని నిర్మాణానికి రైతులు భూములు ఇవ్వాల్సిన అవసరం లేదని విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మణరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి రైతులకు మంగళవారం రాత్రి ఆయన న్యాయ సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 9.2, 9.3 ఫారాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని, ప్రభుత్వం వ్యాపారం చేసేందుకు, మూడు పంటలు పండే భూములను తీసుకోవడానికే.. ఈ ఫారాలు ప్రవేశపెట్టింది తప్ప అవేమీ చట్టాలు కావని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులు ఆ భూములపై సర్వ ఆధికారాలు కోల్పోతారని జస్టిస్ లక్ష్మణరెడ్డి వివరించారు. అడంగల్‌లో సైతం భూ యజమాని పేరును తొలగిస్తారన్నారు. ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే రైతులు కోర్టులను ఆశ్రయించవచ్చని తెలిపారు. భూ సమీకరణ పూర్తికాక ముందే రెండో పంట వేయొద్దని ఏ విధంగా చెప్పారో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ రైతులకు వివరించాలన్నారు. భూ సమీకరణ తర్వాత ఆగ్రిమెంటుపై రైతు సంతకాలు చేస్తేనే ప్రభుత్వానికి అధికారం ఉంటుందనీ, అంతవరకు పంటలు వేయొద్దని ఎవరు చెప్పినా పట్టించుకోనవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ఢిల్లీలో కనిపించకుండా పోయిందని గుర్తుచేశారు. -
రాజధాని తొలిదశకు 21వేల కోట్లు
30 వేల ఎకరాలు పట్టణాభివృద్ధిశాఖ అంచనా రూపకల్పన విజయవాడకు 12 కి.మీ. వాయవ్యంగా.. గుంటూరుకు 20 కి.మీ. ఈశాన్యంగా రాజధాని సాక్షి, హైదరాబాద్: రాజధానికి తొలిదశలో 30 వేల ఎకరాలు అవసరమని, నిర్మాణానికి 20,935 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అంచనాలను రూపొందించింది. తొలిదశ రాజధాని నిర్మాణం మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లోని 31 గ్రామాలు, నివాస ప్రాంతాల్లో ఉంటుందని పేర్కొంది. గుంటూరు జిల్లాలోని 122 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మాణాలు వస్తాయి. ఈ రాజధాని కృష్ణానదిని ఆనుకుని విజయవాడ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో వాయవ్యదిశగా, గుంటూ రు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈశాన్యదిశగా ఉంటుందని మున్సిపల్ శాఖ పేర్కొంది. తొలిదశ రాజధాని నిర్మాణంలో భాగంగా 8.5 లక్షల జనాభాకు సరిపడా వచ్చే పదేళ్లలో ఇళ్లు నిర్మించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ ప్రాంతం ఐటీ, వ్యాపారం, పర్యాటక, వైద్య సౌకర్యాలతో ఉంటుంది. పార్కులు, రిక్రియేషనల్ సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా సిటీ, క్రీడా ప్రాంగణాలు ఉంటాయి. కృష్ణానది వ్యూతో నిర్మిస్తున్నందున పర్యాటకులను ఆకర్షించేలా ఉంటుందన్నారు. నూతన రాజధాని తొలిదశ నిర్మాణ అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. C - కమర్షియల్ జోన్ JB - జంగిల్ సఫారీ LH - లాజిస్టిక్ హబ్ KP - నాలెడ్జ్ పార్క్ CM - సీఎం ఇల్లు G - స్టేట్ గెస్ట్ హౌస్ CH - సర్క్యూట్ హౌస్ RF - రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ GQF - గవర్నమెంట్ హౌసింగ్ ఫీచర్ GQ - గవర్నమెంట్ హౌసింగ్ R - రెసిడెన్షియల్ జోన్ MQ - మినిస్టర్స్ క్వార్టర్స్ OQ - ఆఫీసర్స్ క్వార్టర్స్ R - రెసిడెన్షియల్ జోన్ VS - విధాన సభ CC - క్యాపిటల్ కాంప్లెక్స్ GO - గవర్నమెంట్ ఆఫీస్ CP - సెంట్రల్ పార్క్ CBD - సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ OC - ఆఫీస్ కాంప్లెక్స్ I - ఇండస్ట్రియల్ జోన్ గృహ నిర్మాణాలకు రిజర్వ్ చేసే విస్తీర్ణం రంగాల వారీగా ఈ విధంగా ఉంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల గృహాలకు - 400.62 హెక్టార్లు తక్కువ ఆదాయ వర్గాల గృహాలకు - 801.24 హెక్టార్లు మధ్య ఆదాయ వర్గాల గృహాలకు- 934.78 హెక్టార్లు అధిక ఆదాయ వర్గాల గృహాలకు- 534.16 హెక్టార్లు రాజధాని ప్రాంతంలో భూ వినియోగం ఇలా.. 1. హౌసింగ్ డెవలప్మెంట్ కోసం రిజర్వు చేసింది: 22% 2.నగరస్థాయి మౌలిక సదుపాయాలకు: 20% 3. రంగాలవారీ మౌలిక సదుపాయాలకు: 15% 4. రాజధాని కాంప్లెక్స్, ప్రభుత్వ భవనాలకు: 5% 5.గవర్నర్, సీఎం, మంత్రుల నివాసాలకు: 1% 6.ప్రభుత్వ గృహాల కోసం: 1% 7.సామాజిక మౌలిక సదుపాయాలకు:3% 8.రిక్రియేషన్‌కు:5% 9.ప్రాజెక్టు బాధితులకు: 9% 10. పర్యావరణ ప్రాజెక్టులకు: 8% 11.సి.బి.డి. కోసం : 1% 12.కార్యాలయాలకు: 2% 13.బహిరంగ ప్రాంగణం కోసం : 8% -
నగరాభివృద్ధే లక్ష్యం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్ హార్డ్వర్క్తోనే మెరుగైన పాలన రాజధాని నిర్మాణంలో ప్లానింగ్ కీలకం సుందరీకరణపై ప్రత్యేక దృష్టి ఆస్తిపన్ను పెంపుపై స్టడీ చేస్తున్నానని వెల్లడి సాక్షి : సింగపూర్ ట్రిప్ ఎలా సాగింది. శిక్షణలో ఏం నేర్చుకున్నారు. కమిషనర్ : చాలా బాగా సాగింది. రాజధాని నగరం ఎలా ఉండాలి... రిసోర్స్, ఇంప్లిమెంటేషన్ తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో ప్లానింగ్ చాలా ముఖ్యమనే విషయం స్పష్టంగా అర్థమైంది. సాక్షి : నగర సుందరీకరణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? కమిషనర్ : రాజధాని నేపథ్యంలో నగరాన్ని సుందరీకరించాల్సిన అవసరం ఉంది. దేశ, విదేశాల నుంచి వీఐపీలు వచ్చి వె ళుతున్నారు. ఈక్రమంలో సుందరీకరణపై ప్రధానంగా దృష్టిసారించాం. కాల్వలు, సహజవనరులు నగరంలో పుష్కలంగా ఉన్నాయి. వీటిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెరైక్టర్ శ్రీధరన్, జీఎంఆర్ ఎక్స్‌పర్ట్స్‌తో త్వరలోనే చర్చిస్తాం. ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఖర్చు చేయాలనే దానిపై ఒక అవగాహనకు వచ్చాక సుందరీకరణ పనులు చేపడతాం. సాక్షి : స్మార్ట్ వార్డుల ఏర్పాటుకు ప్రణాళిక ఎంతవరకు వచ్చింది? కమిషనర్ : మౌలిక వసతులు, అందరికీ జీవనోపాధి, డ్రాప్ అవుట్స్ లేకపోవడం వంటి 20 లక్ష్యాలతో స్మార్ట్ వార్డులను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, వీఐపీల భాగస్వామ్యం అవసరం. ఎంపీ, ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేటర్లతోపాటు నగరంలోని సెలబ్రిటీలు, వ్యాపార ప్రముఖులు, సినిమా నటులను భాగస్వాములను చేయాలని నిర్ణయించాను. వీరితో చర్చలు ప్రారంభించాము. ఒక్కోవార్డును ఒక్కొక్కరికి ద త్తత ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాను. సాక్షి : ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదన ఎంతవరకు వచ్చింది? కమిషనర్ : నగరంలో ఆస్తిపన్ను పెంపునకు సంబంధించి వివిధ వర్గాల వారి నుంచి అభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంటుంది. గతంలో కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నాన్ రెసిడె న్షియల్ టాక్స్‌కు సంబంధించి 2007లో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆస్తిపన్ను పెంపుపై ఒక నిర్ణయం తీసుకుంటాం. పరిస్థితులను స్టడీ చేస్తున్నా. సాక్షి : డంపింగ్‌యార్డు స్థల సేకరణ సమస్య ఎప్పటిలోగా పరిష్కరిస్తారు? కమిషనర్ : నగరపాలక సంస్థలో ఇది ప్రధాన సమస్య. స్థల సేకరణకు ఏర్పాట్లుచేస్తున్నాం. జి.కొండూరు మండలం కడియం పోతవరం గ్రామంలో భూమిని పరిశీలించాను. ఎకరం కోటి రూపాయలు చెబుతున్నారు. రైతులతో సంప్రదింపులు జరపాలని తహశీల్దార్‌తో చెప్పాను. నున్న ప్రాంతంలో స్థలాన్ని త్వరలోనే పరిశీలిస్తాను. నెల రోజుల్లో స్థలాన్ని సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాను. సాక్షి : గడువులోపు జేఎన్ఎన్యూఆర్ఎం పనులు పూర్తిచేయగలరా? ఇళ్ల కేటాయింపుపై ఏం నిర్ణయం తీసుకున్నారు. కమిషనర్ : మార్చి 31వ తేదీలోపు జేఎన్ఎన్యూఆర్ఎం పనులను పూర్తి చేయాల్సి ఉంది. పెండింగ్ పనులు, రావాల్సిన నిధులపై ఫిబ్రవరి 2న సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటుచేశా. సాధ్యమైనంతవరకు గడువులోపు పనుల్ని పూర్తిచేస్తాం. అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్లు కేటాయిస్తాం. సాక్షి : నగరపాలక సంస్థలో ఆడిట్, కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయి. బడ్జెట్ తయారీలో జాప్యం జరుగుతోంది. దీనికి కారణం ఏమంటారు? కమిషనర్ : మీరు చెప్పింది నిజమే. 255 కేసులో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఆడిట్ అప్డేట్గా జరిగితేనే పాలన పారదర్శకంగా ఉంటుంది. వీటిపై ప్రత్యేక దృష్టిస్తా. బడ్జెట్ రూపొందించడంలో జాప్యం జరిగింది. అధికారులు ప్రస్తుతం బడ్జెట్ తయారు చేసేపనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే బడ్జెట్‌ను అప్రూవల్ కోసం స్టాండింగ్ కమిటీకి పంపుతాం. సాక్షి : ఉదయం 5.30 గంటలకే నగర పర్యటనకు వెళ్తున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? కమిషనర్ : ఉంది. ఐఏఎస్ శిక్షణలో ఉన్న సమయంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎలా వ్యవహరించాలనే దానిపై గుల్జార్ శిక్షణ ఇచ్చారు. ఉదయం 5.30 గంటలకు రోడ్డుపైకి వెళితేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని ఆయన చెప్పారు. ఆ స్ఫూర్తితోనే హార్డ్‌వర్క్ చేస్తున్నా. జాబ్ ఏం డిమాండ్ చేస్తే అది చేయాలన్నది నా అభిప్రాయం. సాక్షి : రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా మీపైన ఉన్నాయా? కమిషనర్ : ఇప్పటివరకు అలాంటివి ఏమీ లేవు. అర్బన్ లోకల్ బాడీలో ఎలా పనిచేయాలనే దానిపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడం కోసం కృషిచేస్తా. నగరాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా. -
మానవ సంబంధాలు మృగ్యం
ఆస్తుల కోసం అన్నదమ్ముల కుమ్ములాటలు. తల్లిదండ్రులపై సైతం భౌతిక దాడులు. ధన కాంక్షతో హత్యలు. వేధింపుల నేపథ్యంలో భర్తలను హతమారుస్తున్న భార్యలు. కామంతో కళ్లు మూసుకుపోయి బాలికలు, విద్యార్థినులపై అత్యాచారాలకు తెగబడుతూ వారి జీవితాలను ఛిద్రం చేస్తున్న మృగాళ్లు. ఇవీ జిల్లాలో... మృగ్యమవుతున్న మానవ సంబంధాలకు కొన్ని ఉదాహరణలు. సాక్షి, గుంటూరు : ప్రేమానురాగాలు, ఆప్యాయత ఆనందాలతో వెల్లివిరియాల్సిన మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. సోదరభావంతో కలసిమెలిసి ఉండే పల్లెల్లో సైతం కొన్ని కుటుంబాలు పగలు, ప్రతీకారాలతో రగిలిపోతున్నాయి. ప్రాణాలను తృణప్రాయంగా తీసేస్తున్నారు. రాజధాని నిర్మాణ నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో ఆ గ్రామాల్లో పాత గొడవలు తిరిగి రేగుతున్నాయి. తల్లీతండ్రి, అక్కా చెల్లెలు, అన్నాతమ్ముడు, బావమరుదులు, భార్యాభర్తలు ఈ సంబంధాలేవీ డబ్బుకంటే ఎక్కువ కాదంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మానవ సంబంధాలపై చైతన్యం కలిగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని ఘటనలు పరిశీలిస్తే... ఆప్యాయంగా అక్కున చేర్చుకోవాల్సిన అన్న కుమారుడిని ఓ మానవ మృగం కానరానిలోకాలకు పంపిన ఘటన గత నెలలో కృష్ణానది వద్ద జరిగింది. తెనాలికి చెందిన చిన్నారి మోక్ష జ్ఞ తేజను సొంత బాబాయే హతమార్చి కృష్ణానదిలో పడవేశాడు. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించింది. బాపట్లకు చెందిన ప్రత్యూష అనే ఇంటర్ విద్యార్థిని ఇంటివెనుక ఉన్న మార్కెట్‌యార్డులోకి తీసుకు వెళ్లి అత్యాచారం చేసి, ఆపై ప్రాణాలు తీసిన ఓ మృగాడి కిరాతక చర్య జిల్లా ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది. ఈ ఘటనలో తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉండి కాపుకాయాల్సిన వ్యక్తే హంతకుడుగా తేలడం మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసింది. రెండు రోజుల క్రితం నరసరావుపేట పట్టణం పాతూరులో ఆస్తి కోసం సొంత అన్నను కిరాతకంగా హతమార్చిన ఓ తమ్ముడు చివరకు తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో తమ్ముడు మృత్యువుతో పోరాడుతున్నాడు. నగరం మండలంలో ఓ మహిళ తన భర్తను హతమార్చి కుమారుడి సహాయంతో పూడ్చిపెట్టింది. భర్త వేధింపులు తాళలేకే ఆ మహిళ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తేలింది. తల్లిదండ్రులతో భర్త తరచూ గొడవపడటాన్ని తట్టుకోలేని ఓ మహిళ కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకోగా కాపాడేందుకు వెళ్లిన అక్క, పక్కనే నిద్రిస్తున్న చిన్నారికి మంటలు అంటుకున్న సంఘటన గురజాల మండలం మాడుగులలో జరిగింది. ఆ మహిళతోపాటు చిన్నారి కూడా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇలా జిల్లాలో జరుగుతున్న సం ఘటనలను పరిశీలిస్తే మానవసంబంధాలు ఎటుదారితీస్తున్నాయనే ప్రశ్న తలెత్తకమానదు. మానవ సంబంధాలు, రాజధాని నిర్మాణం, మృగాలు, Human relations, capital structure, animals -
సతీష్‌చంద్రకు ‘ముఖ్య’ బాధ్యతలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర ఇప్పుడు నంబర్‌వన్‌గా వ్యవహరిస్తున్నారు. కీలకమైన సాధారణ పరిపాలన, హోం, ఆర్థిక, రాజధాని నిర్మాణం తదితర శాఖలను సీఎం ఆయనకే అప్పగించారు. ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం సంయుక్త కార్యదర్శిగా నియమితులైన ఎస్.ప్రద్యుమ్నకు రెవెన్యూ (సహాయ-పునరావాసం), మానవ వనరులు, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్ వంటి శాఖలను అప్పగించారు. ముఖ్యమంత్రి తన పేషీలోని అధికారులకు తాజాగా కేటాయించిన శాఖల వివరాలు ఇవీ.. సతీష్ చంద్ర: సాధారణ పరిపాలన, హోంశాఖ, మున్సిపల్-పట్టణాభివృద్ధి, రవాణా-రహదారులు-భవనాలు, ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్, ఎక్సైజ్, పర్యావరణం-అటవీ, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, నైపుణ్య అభివృద్ధి, గనులు, పరిశ్రమలు, మౌలిక వసతులు పెట్టుబలు, నూతన రాజధాని, పర్యాటకం, న్యాయ శాఖ, శాసనసభా వ్యవహారాలు, ముఖ్యమంత్రి కార్యాలయ నిర్వహణ, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు, ఎవరికీ కేటాయించని అంశాలు. జి.సాయిప్రపాద్: రెవెన్యూ (ల్యాండ్), వ్యవసాయం, సహకారం, ఉద్యానవన, పశుసంవర్థక, సాగునీటి, విద్యుత్, పౌరసరఫరాలు-ధరల పర్యవేక్షణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ (దేవాదాయం). పి.ఎస్. ప్రద్యుమ్న: రెవెన్యూ (పునరావాసం-విపత్తుల నిర్వహణ), మానవ వనరులు (ప్రాధమిక, సెంకడరీ విద్య), గృహ నిర్మాణం, కార్మిక-ఉపాధి-శిక్షణ, యువజన సర్వీసులు-క్రీడా-సాంస్కృతిక, పంచాయతీరాజ్-గ్రామీణ మంచినీటి సరఫరా-పారిశుద్ధ్యం, ఆర్ఐఎడి, ప్రభుత్వ రంగ సంస్థలు. అజయ్ సహాని: వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమం. సీహెచ్. వెంకయ్య చౌదరి: సీఎంఆర్ఎఫ్, సీఎం గ్రీవియన్స్ పర్యవేక్షణ, కేంద్ర నిధుల సమీకరణ-వ్యయం, ఆదాయ వనరుల సమీకరణ, కేంద్ర ప్రాజెక్టుల పర్యవేక్షణ. అభీష్ట: ఐటీ, ఐటీ మౌలిక వసతులు, ఇ-గవర్నెన్స్, ఏపీఎస్ఏ. -
రాజధాని పేరుతో ‘రియల్’ వ్యాపారం
ముఖ్యమంత్రి, మంత్రులదీ అదే దారి {పభుత్వం ప్రజల కష్టాలను గాలికి వదిలేసింది ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ తుపాను నష్టాలు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరువు కష్టాలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు ‘సాక్షి’తో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు: ప్రజల కష్టాలను గాలికొదిలి ముఖ్యమంత్రి, మంత్రులు రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో వరద, హుదుహుద్ తుపాను బీభత్సానికి ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. వారికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందలేదన్నారు. రాయలసీమతోపాటు ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కరువు తాండవిస్తోందన్నారు. చిత్తూరు జిల్లాలో సాగునీటి సంగతి దేవుడెగురు తాగునీటి కోసం ప్రజలు నానాపాట్లు పడుతున్నారన్నారు. చిత్తూరు ప్రజల దాహార్తి తీర్చేందుకు వై.ఎస్. రాజశేఖరరెడ్డి చేపట్టిన హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ చూపలేదని విమర్శించారు. హంద్రీ నీవా పూర్తికాకుండా జిల్లా వాసులకు తాగునీరు అందే పరిస్థితి లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు వ్యవసాయ రుణాలతో పాటు, బంగారం రుణాలను మాఫీ చేస్తానని హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిని తుంగలో తొక్కి రైతులను, మహిళలను వంచించార ని పెద్దిరెడ్డి విమర్శించారు. లక్షా రెండువేల కోట్ల రుణాలుంటే బడ్జెట్లో కేటాయించింది రూ.5 వేల కోట్లు మాత్రమేనన్నారు. తొలి దఫాలో రూ.4 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని ఆయన విమర్శిం చారు. ఈ మొత్తానికి 14 వేల కోట్లు వడ్డీ అవుతుందన్నారు. రెండవ విడత మాఫీ నాటికి వడ్డీ రూ.30 వేల కోట్లకు చేరుకుంటుందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చేది వడ్డీలో 25 శా తం కూడా కాదని పెద్దిరెడ్డి విమర్శించారు. గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన రైతులు, మహిళలపై ఎలాంటి దుష్పప్రభావం చూపిందో ఇప్పుడు అంతకుమించిన విధంగా ఉందని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు రాజధాని పేరుతో సంవత్సరానికి ఐ దు పంటలు పండే భూములను దౌర్జన్యంగా లా క్కుంటున్నారని ఆయన విమర్శించారు. సింగపూర్, మలేషియా పేర్లు చెప్పి అధికార పార్టీ నేతలు రియల్ వ్యాపారంతో కోట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారన్నా రు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర దేశాలు పర్యటిస్తే ఇక్కడ రాజధాని ఏర్పడదన్నారు. అలాగే కరువు పోదన్నారు. మంచినీటి కష్టాలు తీరవన్నారు. తుపానులో దెబ్బతిన్న భూములు బాగుపడవన్నా రు. బాగుపడేదంతా రాజధాని పేరుతో రియల్ వ్యాపారం చేస్తున్న దేశం నేతలేనని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితే కొనసాగితే రెండు మూడు సంవత్సరాలకు మించి ఈ ప్రభుత్వం కొనసాగే అవకాశం లేదని తేల్చి చెప్పారు. -
రాజధాని నిర్మాణం వెనక బాబు కుట్ర
గుంటూరు సిటీ : రాజధాని నిర్మాణం వెనక పెద్ద కుట్ర దాగి ఉన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సింగపూర్ సహకారంతో రాజధాని నిర్మించే ముసుగులో అక్కడ ఉన్న తన ఆస్తులను ఇక్కడికి డంప్ చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పన్నిన పన్నాగమిదని ఆరోపించారు. గుంటూరు అరండల్‌పేటలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం పోలూరి విలేకరులతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాలంలో సంపాదించిన ఆస్తులన్నీ అప్పట్లోనే సింగపూర్ తరలించారన్నారు. దీనిపై తెహల్కా డాట్ కామ్‌తో సహా పలు జాతీయ పత్రికలు కూడా వార్తా కథనాలు ప్రచురించాయనీ పేర్కొన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన సందర్భాన్ని ఉపయోగించుకుని ఇప్పుడా ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకు బాబు అనేక కుయుక్తులు పన్నుతున్నారనీ, అందులో రాజధాని నిర్మాణం ఒకటనీ వివరించారు. వీటన్నింటినీ బట్టబయలు చేసేందుకు వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ నడుం బిగించిందన్నారు. రాజధాని భూ సేకరణ విషయంలో చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధే ఉంటే ముందుగానే ఆయన హైకోర్టులో దీనిపై కేవియట్ ఎందుకు దాఖలు చేస్తారని వెంకటరెడ్డి ప్రశ్నించారు. దీని వలన కేసులు ఆగుతాయనుకోవడం భ్రమేనని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ తరుపున న్యాయవాదులు మొత్తం రాజధాని గ్రామాల బాధిత రైతాంగానికి బాసటగా నిలుస్తుందని స్పష్టంచేశారు. వారి కోసం కేసులు ఉచితంగా వాదించి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. దీని కోసం పది మంది సీనియర్ న్యాయవాదులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆ కమిటీ నేతృత్వంలో రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి అమల్లో ఉన్న చట్టాలు, సీఆర్డీఏ బిల్లు తదితరాలపైఅవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. -
ఇవ్వంగాక...ఇవ్వం!
* ఏకతాటిపైనే జరీబు రైతులు * రాజధాని భూసమీకరణకు ఇప్పటికీ వ్యతిరేకమే * అవసరమైతే ప్రభుత్వంతో న్యాయపోరాటానికీ సిద్ధం * ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో తెగేసి చెప్పిన అన్నదాతలు * అందుకే సీఎంతో సమావేశానికి సైతం దూరం..దూరం సాక్షి, గుంటూరు : రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు జరీబు రైతులు ససేమిరా అంటున్నారు. సీఎంతో చర్చలకు సైతం విముఖత వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వ ప్యాకేజీలు అవసరం లేదని, భూములు ఇవ్వబోమని తేల్చిచెబుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం విజయవాడ వచ్చారు. దీనికి రెండు రోజుల ముందు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ జరీబు రైతులతో సంప్రదింపులు జరిపారు. సీఎంతో సమావేశానికైనా విజయవాడ రావాలని కోరారు. దీనికి జరీబు రైతులు ఏ మాత్రం అంగీకరించలేదు. దీంతో భూ సమీకరణకు అనుకూలంగా ఉన్న రైతులను తీసుకువెళ్లి ముఖ్యమంత్రికి సన్మానం చేయడం వంటి కార్యక్రమాలతో హడావుడి చేశారు. అంతా ఏకపక్ష నిర్ణయాలే.... రాజధాని భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం మొదటి నుంచి వ్యవహరిస్తున్న తీరు ఈ ప్రాంత రైతుల్లో అనుమానాలు రేకెత్తించింది. కనీసం రైతులతో సంప్రదించకుండానే భూములు ఇచ్చేందుకు అనుకూలం అని ప్రకటించడం, అనుకూల గ్రామాల్లో మాత్రమే మంత్రి వర్గ ఉప సంఘం సభ్యులు సభలు నిర్వహించి అంతా బాగుందన్న ప్రచారాన్ని తీసుకువచ్చారు. * గ్రామ సభల్లో సైతం తెలుగుదేశం పార్టీ నాయకులను ముందు నిలిపి భూ సమీకరణకు అందరూ అనుకూలమనే నినాదాలు సైతం ఇప్పించడం రైతుల్లో మరింత అభద్రతా భావాన్ని పెంచేలా చేసింది. * ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచనల మేరకు ఎంపిక చేసిన రైతులను మాత్రమే తొలిదశలో హైదరాబాద్ తీసుకువెళ్లి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించడం కూడా మిగిలిన రైతుల్లో ఆగ్రహాన్ని కలిగించింది. * అంతేగాక, భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్న రైతులను మొక్కుబడిగా చర్చలకు పిలిచి అవమానకర రీతిలో వ్యవహరించడంపై కూడా అన్నదాతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. * ఇలాంటి పరిస్థితులే జరీబు రైతులకు ప్రభుత్వానికి మధ్య మరింత దూరం పెంచేలా చేసింది. భూ సేకరణ అంటూ బెదిరింపులు... * భూ సమీకరణకు రైతులు అంగీకరించని పక్షంలో ప్రభుత్వం భూ సేకరణకు దిగుతుందనే సంకేతాలు పంపుతూ టీడీపీ నేతలు రైతులను తమ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. * మరో వైపు రైతులు కూడా ప్రభుత్వ బెదిరింపులకు లొంగకుండా న్యాయపోరాటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. * మరో వారం రోజుల్లో సింగపూర్ ప్రతినిధుల బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించనుందని, ఈ లోపు భూసమీకరణ అంశాన్ని ఓ కొలిక్కి తేవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూనే వున్నాయి. భూముల ధర పెంచకుండా.... * రాజధాని ప్రాంతంలో ఎకరా భూమి కోటీ అరవై లక్షల రూపాయల వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం ఎకరా భూమి ధర రూ.3.50 లక్షల నుంచి ఏడు లక్షలలోపు మాత్రమే ఉంది. * భూముల ధర పెంచితే ఆదాయం రాగలదని విజిలెన్స్ శాఖ సూచనలు చేస్తున్నా ప్రభుత్వం అందుకు ఒప్పుకోవడం లేదని సమాచారం. * ఒకవైపు భూముల ధర పెంచితే, మరో వైపు భూసేకరణ చేయాల్సి వస్తే నిబంధనల ప్రకారం రైతులకు పది రెట్లు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందనే ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. * మొత్తం మీద రాజధాని ప్రాంతంలో జరీబు భూముల సమీకరణ విషయం లో మాత్రం ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోక తప్పేలా లేదు. -
బాక్సైట్ దోపిడీని అడ్డుకుంటాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ స్పష్టీకరణ {పజా సమస్యలపై పార్టీ నిరంతర పోరాటం ఎంపీ గీత కు దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలి పాడేరు :విశాఖ ఏజెన్సీలో గిరిజనుల సంపదైన బాక్సైట్‌ను దోచుకుని రాజధాని నిర్మాణానికి ఉపయోగించాలనే ప్రభుత్వ కుట్రను ప్రాణాలు ఒడ్డైనా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలమంతా అడ్డుకుంటామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధ్యక్షతన ఇక్కడి ఆర్అండ్బీ అతిథి గృహం ఆవరణలో శనివారం సాయంత్రం ఏర్పాటైన పాడేరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. బాక్సైట్ ఖనిజాలు తవ్వాలని ప్రభుత్వం చేసే ప్రయత్నాలను తామంతా అడ్డుకుంటామన్నారు. వైఎస్సార్సీపీ అన్ని మండలాల్లో బాక్సైట్ వ్యతిరేక పోరాటాలను ఉధృతం చేస్తుందని, అవసరమైన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కూడా రప్పిస్తామన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు గిరిజనులందరికీ మేలు చేస్తానని హామీలు ఇచ్చి, ఇప్పుడు విస్మరించారని ఆరోపించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు తన ప్రాంతంలో ఉన్న ఆన్‌రాక్ ఫ్యాక్టరీ పక్షాన నిలిచి బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు, ఆరు నెలల్లో తన నిజ స్వరూపం రుజువు చేసుకున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం, జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై ఉన్న అభిమానం, ఆదరణతో కొత్తపల్లి గీతను రికార్డు మెజార్టీతో ఎంపీగా గిరిజనులు గెలిపించారని అయితే ఆమె మాత్రం అధికారం, డబ్బు ఆశతో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పని చేస్తుండటం గిరిజనులను బాధిస్తుందన్నారు. బాక్సైట్‌కు కొత్తపల్లి గీత అనుకూలమో, వ్యతిరేకమో వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భిక్షతో గెలిచిన కొత్తపల్లి గీతకు దమ్ము, ధైర్యం ఉంటే వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అరకు పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ గిరిజనుల పక్షాన వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందన్నారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనుల అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. హుద్‌హుద్ తుఫానుతో ఏజెన్సీలోని కాఫీ తోటలకు తీవ్ర నష్టం వాటిల్లినా వాటిని పరిశీలించకుండానే మొక్కుబడి సాయాన్ని ప్రకటించారన్నారు. ఈ సమావేశంలో పాడేరు, చింతపల్లి, జీకేవీధి జెడ్పీటీసీ సభ్యులు పి.నూకరత్నం, పద్మకుమారి, నళిని, మహిళా విభాగం జిల్లా నేత పీల వెంకటలక్ష్మి, పాడేరు, జీకేవీధి, జి.మాడుగుల ఎంపీపీలు వర్తన ముత్యాలమ్మ, సాగిన బాలరాజు, ఎం.వెంకట గంగరాజు, పాడేరు మాజీ ఎంపీపీ ఎస్.వి.వి.రమణమూర్తి, కొయ్యూరు, పాడేరు వైస్ ఎంపీపీలు వై.రాజేశ్వరి, ఎం.బొజ్జమ్మ, పలు మండలాల్లోని ఎంపీటీసీలు, సర్పంచులు కర్రి నాయుడు, వారం చిట్టిబాబునాయుడు, కె.చంద్రమోహన్‌కుమార్, పాడేరు కో-ఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్ జోగిరాజు, టి.ఎస్.రాందాసు, ఎ.బొంజునాయుడు, ఐసరం హనుమంతరావు, కె.చిన్నయ్య, చిట్టిబాబు, లకే రత్నాభాయి, సూరిబాబు, రామస్వామి, రఘునాథ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ రాజధానికి ‘చండీ గఢ్ సూత్రం’
ఏపీ మంత్రి నారాయణ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం లో భాగంగా భూమి ఇచ్చే రైతులకు చండీగఢ్ తరహాలో పరిహారం అమలు చేసే అవకాశం ఉందని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ అన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. చండీగఢ్‌లో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు 1000 గజాలు ఇచ్చారని, ఇది కాకుండా వాణిజ్య సముదాయ ప్రాంతం (కమర్షియల్ జోన్)లో మరో 100 గజాలు అదనంగా ఇచ్చారని పేర్కొన్నారు. ఈ తరహా పరి హారం ఇచ్చే అవకాశం ఉందన్నారు. దీనిపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. 9న తెంగ్ చూతో సమావేశం సింగపూర్ పట్టణాభివృద్ధి విభాగం నిపుణుడు, ఏపీ రాజధాని సలహా కమిటీలో సభ్యుడైన కూ తెంగ్ చూ ఈ నెల 9న రాష్ట్రానికి రానున్నారని మంత్రి అన్నారు. ఆ రోజు రాజధాని సలహా మండలి సభ్యుల బృం దం సమావేశం జరుగుతుందని, అందులో తెంగ్ చూ పాల్గొంటారని అన్నారు. -
భూ బకాసురుల పలాయనం
కాచవరంలో రూ. 20కోట్ల విలువైన భూమి ఆక్రమణకు యత్నం అడ్డుకున్న గ్రామస్తులు పొక్లయిన్లు, జేసీబీలతో సహా వెనుదిరిగిన ఆక్రమణదారులు కృష్ణానదికి అవతలివైపు రాజధాని నేపథ్యంలో వాగుపోరంబోకు పెరిగిన డిమాండ్ కాచవరం,(ఇబ్రహీంపట్నం రూరల్) : రాజధాని నిర్మాణం నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూ ఆక్రమణదారులు పెరిగిపోయారు. ఎక్కడ ప్రభుత్వ భూములున్నా వాలిపోతున్నారు. కృష్ణానదికి అవతల వైపు రాజధాని నిర్మాణం నేపథ్యంలో... ఇవతలి వైపు ఉన్న ఇబ్రహీంపట్నం మండలం కాచవరంలో సుమారు రూ.20కోట్ల విలువైన తొమ్మిది ఎకరాల భూమి కబ్జాకు కొందరు యత్నించారు. సర్వే నంబర్లు 8/5, 8/6, 8/7, 8/8, 8/9లో ఈ భూమి ఉంది. దీని విలువ ఎకరం రెండు కోట్లపైమాటే. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు పొక్లయిన్లు, రెండు జేసీబీలతో 9ఎకరాల భూమిని చదును చేస్తుండగా ఎంపీటీసీ సభ్యుడు కందుల భాస్కరరావు, కొందరు యువకులు అడ్డుకున్నారు. పత్రాలు చూపాలని నిలదీశారు. లక్ష్మీపార్వతి భర్త రామరావు పేరుతో అడంగళ్ కాపీలో నమోదైన పత్రాలను వారు చూపారు. వారి నుంచి గొల్లపూడికి చెందిన శివకుమార్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు అడంగళ్ కాపీలున్నాయి. పట్టా చూపాలని పట్టుబట్టడంతో కంగారు పడిన ఆక్రమణదారులు పత్రాలు రేపు చూపుతామని పలాయనం చిత్తంగించారు. వారి సామగ్రీని తరలించారు. 2005లో ఇక్కడున్న 9.50 ఎకరాల్లో ఇందిరమ్మ కాలనీ ఏర్పాటుకు నిర్ణయించారు. పట్టాలు, పాస్ పుస్తకాలు అందచేశారు. అప్పట్లో వారు అమ్మేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఉదంతం వెలుగు చూడటంతో గతంలో పట్టాలు పొందిన వ్యక్తులు మేల్కొన్నారు. భూమిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని ఎంపీటీసీ భాస్కరరావు చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి దేవినేని ఉమా దృష్టికి తీసుకెళ్లనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కొండవాగు పోరంబోకు భూమి కొండవాగు పోరంబోకని కాచవరం వీఆర్వో సయ్యద్ ఖాశీం చెప్పారు. అడంగళ్‌లో ఎవరి పేర్లూ లేవన్నారు. విషయం తహశీల్దార్‌కు తెలియజేస్తానని చెప్పారు. -
ఇది పెట్టుబడుల బాట
సీఎం జపాన్ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూ సమీకరణను రైతులు ఒకపక్క వ్యతిరేకిస్తున్నా.. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది.. పెట్టుబడులు పెట్టండంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోపక్క విదేశీ పెట్టు బడి దారులను ఆహ్వానిస్తున్నారు. ఆ విధంగా పెట్టుబడులు పెట్టేవారికి భూ కేటాయింపుతో పాటు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని, మౌలికసదుపాయాలు ఏర్పాటు చేస్తామని జపాన్‌కు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు. ఆది వారం అర్ధరాత్రి ఆయన ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తల బృందంతో జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పెట్టుబడులకున్న సానుకూలాంశాలను అక్కడి ప్రభుత్వానికి, వివిధ కంపెనీలు, వాణిజ్య సంస్థల ప్రతినిధులకు వివ రిస్తారని రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. జపాన్ పెట్టుబడి దారులకు వివరించేందుకు ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కూడా రూపొం దించారు. అందులో పేర్కొన్న పది లక్షల ఎకరా లూ ప్రభుత్వ భూమా? లేక ప్రైవేటు భూమా? అనేది ఎక్కడా స్పష్టం చేయకపోవడం గమనార్హం. ‘సన్‌రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పేరిట రూపొందించిన ఈ ప్రజెంటేషన్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న అన్ని ప్రత్యేకాంశాలను పొందుపరిచారు. దేశంలో ఆంధ్రప్రదేశ్.. తూర్పు, ఆగ్నేయ దేశాలైన జపాన్, చైనా, థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్, శ్రీలంకలకు వ్యూహా త్మక ప్రాంతంగా ఉందని, పారిశ్రామిక, వ్యాపారానుకూల వాతావరణం రాష్ట్రంలో ఉందని అందులో వివరించారు. ‘దేశంలో మొట్టమొదటి తీరప్రాంత పారిశ్రామిక కారిడార్‌గా విశాఖపట్నం-చెన్నై రూపొందుతోంది. ఇది గేట్ వే టూ ఈస్ట్‌గా మారుతుంది. కొల్కతా నుంచి చెన్నై వరకు ఉన్న కారిడార్‌లో ఏపీ లోని తొమ్మిది జిల్లా ల్లో ఉన్న తీరప్రాంతమే కీలకం..’ అని పేర్కొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో పాటు ఈ మేరకు లఘు చిత్రాన్ని కూడా రూపొందించి బాబు బృందం జపాన్‌కు తీసుకెళ్లింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లోని వివరాలు.. 10 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ‘రాష్ట్రంలో పారదర్శకమైన భూకేటాయింపు విధానం అమలుచేస్తున్నాం. 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకు ఉంది. (ప్రభుత్వ భూమా, ప్రైవేటు భూమా ?అన్నది వివరించలేదు.) ఈ భూముల ధరలూ అందుబాటులో ఉన్నాయి. అమ్మకానికి లేదా దీర్ఘకాలిక లీజుకు వీలుగా కేటాయింపు విధానం ఉంటుంది. పెట్టుబడులు పెట్టేవారు కొనే భూములకు స్టాంప్ డ్యూటీ పూర్తిగా వెనక్కి తిరిగి చెల్లిస్తాం. అందుబాటులో ఉన్న భూమి వివరాలను ఏపీ గవర్నమెంట్ పోర్టల్‌లో చూసుకోవచ్చు..’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నామనీ తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మెగా ఫుడ్ పార్కులు, విశాఖపట్నంలో ఐటీ హబ్, మధ్య కోస్తా జిల్లాల్లో మెరైన్ హబ్, చిత్తూరు, నెల్లూరులతో ఆటో హబ్ ఏర్పాటు . లోహ పరిశ్రమలు, ఉద్యాన పంటలు, రక్షణ, ఏరోస్పేస్‌లకు ఆలవాలంగా రాయలసీమ ప్రాంతాలు ఉండనుందని వివరించారు. 2022 నాటికి దేశంలో మూడో స్థానం ‘2022 నాటికి ఏపీని దేశంలోనే మూడో స్థానానికి, 2029 నాటికి అన్నిటికన్నా అగ్రస్థానంలోకి తీసుకువెళ్లనున్నాం. బెరైటీస్, మైకా, సున్నపురాయి నిక్షేపాలకు నిలయం. 2,950 సంస్థల ద్వారా 3.45 లక్షల మంది నైపుణ్యంకల యువకులు, విద్యార్థులు అందుబాటులో ఉన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, గనులు, ఫార్మా, ఆటోమొబైల్, ఇంజనీరింగ్ రంగాల్లో అభివృద్ధికి అవకాశాలున్నాయి. విశాఖ, గంగవరం, కష్ణపట్నం డీప్ సీ పోర్టులు, రానున్న ఐదేళ్లలో 17 వేల మెగావాట్ల ఉత్పత్తి ద్వారా జరగనున్న 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా,అత్యుత్తమ విద్యాసంస్థలు, వైద్యసంస్థలు, పర్యాటక ప్రాంతాలుండడంతోపాటు కొత్తగా మెట్రోరైళ్ల వ్యవస్థ ఏర్పాటుకాబోతోంది..’’ అని పేర్కొన్నారు. -
రగిలిన రాయపూడి రణరంగం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణను రాయపూడి గ్రామస్తులు మరో మారు వ్యతిరేకించారు. ఆది నుంచి చెబుతున్నట్టుగానే భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన సమావేశానికి తుళ్లూరు రైతులు రావడాన్ని ఆక్షేపించారు. ఈ సందర్భంగా రాజుకున్న వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. ఆగ్రహావేశాలకు లోనైన రెండు గ్రామాల రైతులు ఓ దశలో కుర్చీలు పడదోసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు సవాళ్లు ప్రతిసవాళ్ళతో సమావేశం దద్దరిల్లింది. రంగంలోకి దిగిన పోలీసులను చూసి మరింత కోపోద్రిక్తులయ్యారు. పోలీసు బలగాలతో రావాల్సిన అవసరం ఏంటని నిలిదీశారు. రైతుల అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పనివ్వరా? పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారా అంటూ ఒక్కసారిగా రైతులు తిరగబడటంతో వారిని బుజ్జగించడం కమిటీ సభ్యుల వల్ల కాలేదు. దీంతో నన్నపనేని రాజకుమారి అర్ధంతరంగా సమావేశం నుంచి నిష్ర్కమిం చారు. చివరకు పోలీసులను బయటకు పంపినా గ్రామస్తులు శాంతించలేదు. 4రాజధాని భూ సమీకరణకు మంత్రివర్గ ఉపసంఘం శనివారం రాయపూడిరైతులతో సమావేశమయ్యారు. కమిటీ సభ్యుడు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు. 4రాయపూడి కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు మల్లెల హరేంధ్రనాధ్ చౌదరి నేతృ త్వంలో గ్రామ రైతులు భూములిచ్చేందుకు ససేమిరా వీల్లేదని తేల్చి చెప్పారు. మొన్న మందడంలో రైతులు తిరుగుబాటు చేసినట్టే ఇక్కడా రైతులు సమీకరణను వ్యతిరేకించారు. ప్రజాప్రతినిధులు,అధికారులను నిలదీశారు. 4హరేంధ్రనాధ్ చౌదరి మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి రాయపూడి గ్రా మం నుంచి ఒక్క గజం భూమి కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు తమ సొసైటీ తరఫున 1100 మంది రైతుల సంతకాలతో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు వెల్లడించారు. దీనికి విరుద్ధంగా ఎవరైనా ఇస్తామని ముందుకు వస్తే నిరభ్యం తరంగా తీసుకోవచ్చని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. 4దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో రైతులను ఒప్పించేందుకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మరోమారు కలుస్తామని, భూములు ఇవ్వడానికి ఎందుకు నిరాకరి స్తున్నారో తమకు చెబితే అదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని చెప్పి బయలుదేరారు. టీడీపీ కార్యకర్తల దాడులు, హెచ్చరికలు... 4భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రజా సంఘాలపై టీడీపీ కార్యకర్తల దాడులు, హెచ్చరికలు పెరిగిపోయాయి. భూ సమీ కరణ చేపట్టిన గ్రామాల్లో ప్రజా సంఘాల పర్యటనలకు ఆటంకాలు కలిగిస్తున్నారు. కరపత్రాల పంపిణీని అడ్డుకుంటున్నారు. 4వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ మినహా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ,సీపీఐ (ఎంఎల్- న్యూ డెమొక్రసీ) నేతలు, కార్యకర్తల పర్యటనలకు ఆటంకాలు కలిగించారు. 4నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీ.రామచంద్రయ్య ఇతర నాయకులు తుళ్లూరులో రైతుల అభిప్రాయ సేకరణకు చేసిన ప్రయత్నాలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 4మండల కేంద్రమైన తుళ్లూరులో శనివారం సీపీఐ (ఎంఎల్- న్యూ డెమొక్రసీ) కార్యకర్తలు భూసమీకరణపై కరపత్రాలు పంపిణీ చేస్తుండగా, టీడీపీ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు అడ్డుకున్నారు. ఆ కార్యకర్తల వాహనం గాలి తీశారు. 4కరపత్రాలు పంపిణీ చేయడానికి వీలులేదని కార్యకర్తలను దుర్భాషలాడినట్లు పార్టీ అధికార ప్రతినిధి వై.సాంబశివరావు తెలిపారు. దాడిచేయడాన్ని హేయమైన చర్యగా ఖండించారు. -
ఎకరాకు లక్ష చందా ఇస్తాం
వాటితో ఎక్కడైనా రాజధానికి భూములు కొనుక్కొని నిర్మించుకోండి {పభుత్వంపై విరుచుకుపడిన నిడమర్రు రైతులు మంగళగిరి:రాజధాని నిర్మాణానికి అవసరమైతే మేం ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున ప్రభుత్వానికి చందా ఇస్తామని, వాటితో వేరే చోట ఎక్కడైనా భూములు సేకరించి రాజధాని నిర్మించుకోవాలని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల రైతులు ప్రభుత్వానికి సూచించారు. తమ భూములను సెంటు కూడా వదులుకోబోమని, ఒకవేళ బలవంతంగా భూములు సేకరించదలచుకుంటే తమ శవాలపై రాజధాని నిర్మించుకోవాల్సి వుంటుందంటూ వారు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ రైతు హక్కుల పరిరక్షణ కమిటీ గురువారం పై మూడు గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఉండవల్లిలో రైతు కూలీ ధనలక్ష్మి మాట్లాడుతూ రైతుల భూములు ప్రభుత్వం తీసుకుంటే తాము ఎవరి దగ్గర కూలీ పనికి వెళ్లి బతకాలని వారు ప్రశ్నించారు. రైతు అన్నపురెడ్డి గోవిందరెడ్డి మాట్లాడుతూ తమకు ఎకరంన్నర పొలం వుందని, దానిలో ఎకరం పొలం కూతురుకు కట్నంగా ఇచ్చి వివాహం చేద్దామనుకున్నానని, గత నెల రోజుల నుంచి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలతో ఆందోళనకు గురవుతున్నామని చెప్పారు. పెనుమాకలో రైతుకూలీ శివ మాట్లాడుతూ తాము అనారోగ్యానికి గురై పనికి వెళ్లలేకపోయినా రైతు దగ్గరకు వెళ్లి రేపు పనికి వస్తామని చెప్పి వంద రూపాయలు తెచ్చుకునే వాళ్లమని, ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వం తీసుకుంటే తాము ఎవరి దగ్గరకు వెళ్లాలన్నారు. నిడమర్రులో పంట పొలాల్లో పరిశీలించిన సమయంలో మహిళా రైతు బత్తుల జయమ్మ కమిటీ ఎదుట కన్నీటిపర్యంతమైంది. కూలీ రైతు కె.భారతి,మహిళా రైతులు కె లలిత, ఉషారాణి తదితరులు వారి బాధలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం గ్రామంలో జరిగిన సమావేశంలో రైతులు భీమవరపు కృష్ణారెడ్డి, బుర్రముక్క సుందరరెడ్డి, గాదె ప్రకాష్‌రెడ్డి, కంఠం నరేంద్రరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు ప్రభుత్వానికి చందాలు ఇస్తాం కానీ భూములు మాత్రం ఇవ్వమని తేల్చి చెప్పారు. తాము ఆత్మహత్యలకైనా సిద్ధమేనన్నారు. మహిళా రైతు గుదిబండ చిట్టెమ్మ మాట్లాడుతూ ఎలాగైనా తమ భూములను కాపాడాలని కమిటీని వేడుకున్నారు. -
వేగంగా విజయవాడకు...
-
వేగంగా విజయవాడకు..
తాత్కాలిక రాజధానికి కార్యాలయాల తరలింపునకు చర్యలు నాగార్జున వర్సిటీలో సచివాలయం, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖల ఏర్పాటుకు ప్రతిపాదనలు గుంటూరు లాంఫాంలో వ్యవసాయ శాఖ కార్యాలయం! సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ-గుంటూరు నడుమ రాజధాని నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో తాత్కాలిక రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం సీనియర్ ఐఏఎస్‌లు అజేయ్ కల్లం, శాంబాబ్, సాంబశివరావులతో కూడిన కమిటీ గుంటూరు, విజయవాడల్లో పర్యటించి తక్షణం కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను, ఉన్న సౌకర్యాలను పరిశీలించింది. నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు లాంఫాం, గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డు, కెనాల్ గెస్ట్‌హౌస్, మేథా టవర్, కానూరులోని నాలుగు అపార్టుమెంట్లను ఈ బృందం పరిశీలించింది. గొల్లపూడిలో మార్కెటింగ్ శాఖ, విజయవాడ కెనాల్ గెస్ట్‌హౌస్‌లో మరికొన్ని కీలక శాఖలు, మేధా టవర్‌లో ఐటీ విభాగం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. నాగార్జున వర్సిటీలో రాష్ట్ర సచివాలయం ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నారు. ఇక్కడికే రెవెన్యూ శాఖను కూడా తరలించాలన్న భావిస్తున్నారు. ఇప్పటికే తాత్కాలిక రాజధానిలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్న మంత్రులకు అధికారుల కమిటీ పర్యటన ఊతమిచ్చినట్టయింది. కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులకు వారున్న చోటనే కార్యాలయాల ఏర్పాటుకు అవకాశమేర్పడింది. కృష్ణా జిల్లాకు చెందిన నీటి పారుదల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు తొలుత విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇరిగేషన్ ఈఎన్సీ కార్యాలయాన్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. కృష్ణా జిల్లాకు చెందిన మరో మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ కార్యాలయాన్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. మరో మంత్రి కామినేని శ్రీనివాస్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో వినియోగించడంలేదు. గుంటూరు లాంఫాంలో వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు మంత్రి ప్రతిపాటి పుల్లారావు యోచిస్తున్నారు. నాగార్జున వర్సిటీలో సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటుకు మంత్రి రావెల కిషోర్‌బాబు ప్రతిపాదించినట్టు తెలిసింది. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
నిడమర్రు (మంగళగిరి రూరల్) రైతుల భూముల జోలికి రాకుండా ప్రభుత్వ భూములతోపాటు బడాపారిశ్రామిక వేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యవసాయం చేయనివారి భూములను రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా ఇస్తే తనకు నిడమర్రు గ్రామంలో వున్న 53 ఎకరాలను రాజధాని నిర్మాణానికి ఇస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతుల భూములను ఒక్క అంగుళం కూడా తీసుకోకుండా, పేద రైతులు నష్టపోకుండా రాజధాని నిర్మాణం జరగాలన్నారు. రాజధాని భూసేకరణ నేపథ్యంలో నిడమర్రు గ్రామ లైబ్రరీ సెంటర్లో బుధవారం నిడమర్రు, బేతపూడి, కురగల్లు, నీరుకొండ గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. ఆర్కే మాట్లాడుతూ దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి సంతకం ఉచిత విద్యుత్ మాదిరి చంద్రబాబు తొలి సంతకం రైతు రుణమాఫీ చేస్తారని ప్రజలు నమ్మి ఓట్లువేస్తే అయిదు నెల లైనా రుణమాఫీకి అతీగతీ లేదన్నారు. రాజధాని పేరుతో భూములను లాక్కుం టామని రైతుల్లో ఆందోళన కలుగజేసి వారిని నిద్రపోనివ్వకుండా చేయడం దారుణమన్నారు. తన నైజాన్ని మార్చుకోని చంద్రబాబు రైతు వ్యతిరేకిగా మళ్లీ తన నిర్ణయాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, ఎక్కడ ఏఏ నిర్మాణాలు చేపట్టనున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 10వేల ఎకరాల దేవాదాయ, ప్రభుత్వ అసైన్డు, అటవీ శాఖ భూములు వున్నాయని, ముందు వాటిని తీసుకోవాలని సూచిం చారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకోవాలని యత్నిస్తే రైతుల తరపున పోరాడతామన్నారు. గుండుగొలను- కాజ హైవే రహదారి నిర్మాణాలను సంబంధించి భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందించలేదని, పులిచింతల బాధితులు సైతం పరి హారం కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారని ఆర్కే గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కటే చెప్పారని, ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే మిగిలిన పార్టీలతో కలసిపోరాడతామని, కచ్చితంగా తమ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందన్నారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఏటుకూరి గంగాధరరావు మాట్లాడుతూ చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రుణమాఫీలో విఫలమైన చంద్రబాబును ఏవిధంగా నమ్మి రాజధాని నిర్మాణానికి భూములు ఇస్తారని ప్రశ్నించారు. జంగా నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామ సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఎంపీపీ పచ్చల రత్నకుమారి, ఉపాధ్యక్షుడు మొసలి పకీరయ్య, ఎంపీటీసీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కొదమకొండ్ల నాగరత్నం,లిఫ్ట్ ఇరిగేషన్ గౌరవ అధ్యక్షుడు గాదె అంజిరెడ్డి, సింహాద్రి లక్ష్మారెడ్డి, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం.భాగ్యరాజ్, గ్రామ ఉప సర్పంచ్ గాదె సాగర్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యులు షేక్ బాజి తదితరులు పాల్గొన్నారు. -
మరుగుదొడ్డి నిర్మించకపోతే కాపురం చేయకండి
నిర్మాణానికి రాష్ట్ర ప్రజలంతా ఆర్థికంగా తోడ్పాటునందించాలి జన్మభూమి సభల్లో సీఎం చంద్రబాబు బ్యాంకుకు వెళ్లలేని వృద్ధులకు ఇంటి వద్దే పింఛను చెల్లింపు వయసుతో నిమిత్తం లేకుండా చదువుకునే వారందరికీ ఫీజులు మరుగుదొడ్ల నిర్మాణంతోనే స్వచ్చ భారత్ మిగులు విద్యుత్ తెలంగాణకు ఇస్తాం కేసీఆర్ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు గుంటూరు: ‘గుంటూరు జిల్లాలో నే నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మిద్దాం. రాష్ట్రంలోని 4.93 కోట్ల ప్రజలు ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరూ ఆర్థికం గా తోడ్పాటునందించాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రం లోని ఏ ప్రాంతం వారైనా మూడు గంటల్లో రాజధానికి చేరుకునేలా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం అవసరమైతే మరోమారు జిల్లాకు వస్తానని, ఇక్కడివారి సహకారం, సలహాలు తీసుకుంటానని తెలిపా రు. బుధవారం గుంటూరు జిల్లా వినుకొండ పట్టణం, శావల్యాపురం మండలంలో ఏర్పాటు చేసిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. వినుకొండ ప్రభుత్వ జూని యర్ కాలేజీలో విద్యార్థులతో ముఖాముఖి కా ర్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శివయ్య స్థూపం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్ఎస్పీ కాలనీలో ఎన్టీర్ సుజల స్రవం తి పథకాన్ని ప్రారంభించారు. శావల్యాపురం మండలంలోని 121 డ్వాక్రా సంఘాలకు రూ.5 కోట్ల చెక్కు అందజేశారు. ముత్తుపల్లిలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో సీఎం మాట్లాడారు. రైతులు, పేదలు తనకు రెండు కళ్లని, వారి అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. తాను అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ, వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు, డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తున్నానని చెప్పారు. వెనుకబడిన వర్గాల మహిళల ఆర్థిక పురోభివృద్ధికి రూ. 8 వేల కోట్లు వెచ్చించడం ప్రపంచంలో మరెక్కడా జరగలేదన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తామని చెప్పారు. జనధన్ బీమా పథకం ద్వారా బ్యాంకు ఖాతాను పొందిన ప్రతి ఒక్కరికీ రూ.5 వేలు ఓవర్ డ్రాఫ్ట్, లక్ష రూపాయల బీమా సౌకర్చాన్ని కల్పించామన్నారు. ప్రతి గ్రామానికీ స్వచ్చమైన నీరు, విద్యుత్, తారురోడ్ల సౌకర్యాలు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. ప్రతి ఇంటికీ రెండు ఎల్ఈడీ లైట్లు ఇస్తామని, వీటి ద్వారా 500 మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేయొచ్చని చెప్పారు.కేంద్రం సహకారంతో రాష్ట్రంలో 100 రోజుల్లోనే నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యపడిందని చెప్పారు. ఈ కార్యక్రమా ల్లో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, శ్రీరాం మాల్యాద్రి, ఎమ్మెల్యేలు జి.వి.ఆంజనేయులు, అనగాని సత్యప్రసాద్, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎమ్మెల్సీలు నన్నపనేని రాజకుమారి, కె.ఎస్.లక్ష్మణరావు, జిల్లా పరిషత్ చైర్మన్ జానీమూన్ తదితరులు పాల్గొన్నారు. మరుగుదొడ్డి నిర్మించకపోతే కాపురం చేయకండి ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం రూ.12 వేల ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తోందని తెలిపారు. మరుగుదొడ్డి వాడని వాడు మనిషే కాదని అన్నారు. మరుగుదొడ్డి నిర్మించకపోతే మహిళలు కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లాలని సూచించారు. మరుగుదొడ్ల వినియోగం వల్ల 20 శాతం వ్యాధులను దూరం చేయవచ్చని, వీటి నిర్మాణం ద్వారా స్వచ్చ ఆంధ్రప్రదేశ్ స్థాపనకు మార్గం ఏర్పడుతుందని చెప్పారు. -
లక్ష ఎకరాలు బిల్లీరావు, ఎమ్మార్ కోసమేనా?
మండిపడ్డ మాజీ ఎంపీ, రైతు నేత యలమంచిలి శివాజీ విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణంపై స్పష్టతలేని ప్రభుత్వం లక్ష ఎకరాలు సేకరించి బిల్లీరావు, ఎమ్మార్‌లకు కట్టబెడుతుందా? పరిపాలన చేయాల్సిన ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా? అంటూ రాజ్యసభ మాజీ సభ్యుడు, రైతు నేత యలమంచిలి శివాజీ మండిపడ్డారు. జాతీయ భూ సేకరణ చట్టం- రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్ట్, నియమ నిబంధనలపై భూమి ఉపాధి హక్కుల వేదిక, దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ... రాజధాని పేరుతో వ్యాపారం చేయాలనుకునే కొందరు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు మేల్కొనకపోతే రాజధాని నిర్మాణం మాటున భూ స్కామ్‌లకు అవకాశం ఇచ్చిన కళంకితుడవుతారని హెచ్చరించారు.ప్రైవేటు భూములను లాక్కుని రాజధాని నిర్మిస్తామని చెప్పడం సరికాదన్నారు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో 23వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, రాజధానిని వాటిలో నిర్మించుకోవచ్చని సూచించారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియేట్ 22ఎకరాల్లో ఉందని, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం 20 ఎకరాల్లో ఉందని ప్రస్తావించారు. ఈ లెక్కన చూస్తే రాజధానికి లక్షల ఎకరాలు అవసరంలేదనే విషయం అవగతమవుతుందన్నారు. రాజధానికి 5 వేల నుంచి 10 వేల ఎకరాలు అవసరమని, తొలిదశలో 1,500 ఎకరాలు కావాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిందని శివాజీ గుర్తు చేశారు.ప్రైవేటు భూములే కావాలనుకుంటే మంత్రులు, ఎంపీలు, వారి బంధువులు ఇక్కడ కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను తొలుత సేకరించాలని డిమాండ్ చేశారు. -
రైతులను బెదిరిస్తే ఊరుకోం
వైఎస్సార్సీపీ హెచ్చరిక ... రాజధాని నిర్మాణంపై సీఎం మాటలు గర్హనీయం హైదరాబాద్: రాజధాని నిర్మాణం పేరుతో విజయవాడ, గుంటూరు పరిసరాల రైతులను సీఎం చంద్రబాబు బెదిరిస్తే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని, బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తే గట్టిగా ప్రతిఘటిస్తామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి హెచ్చరించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం భూసేకరణపై రైతులు అత్యాశకు పోవద్దని, అత్యాశకు పోతే అనర్థాలేనని చంద్రబాబు శుక్రవారం చేసిన ప్రకటన తీవ్ర అభ్యంతరకరమని విమర్శించారు. ‘ల్యాండ్ పూలింగ్ కావాలా లేక భూసేకరణ కావాలా? రైతులే నిర్ణయించుకోండి. భూమి ఇస్తే ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అనుసరిస్తాం... లేదంటే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తాం...’ అని బాబు బెదిరించడం గర్హనీయమన్నారు. ఆయన మాట తీరు చూస్తూంటే ఏమాత్రం మారలేదనేది స్పష్టమవుతోందని దుయ్యబట్టారు. అదేదో పోటా చట్టం మాదిరిగా భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని సీఎం రైతులను బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. విజయవాడ, గుంటూరు పరిసరాల్లోని రైతులు తమ భూములకు మార్కెట్ విలువ కావాలని కోరుకోవడం అత్యాశ అవుతుందా? అదే చంద్రబాబు వందిమాగధులు, ఆయన వర్గీయులు, తాబేదారులు ఎక్కువ ధరకు భూములను అమ్మకానికి పెడితే అత్యాశ కాదా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక చక్కటి రాజధాని కావాలనేది వైఎస్సార్సీపీ అభిమతమని, దాని నిర్మాణానికి తాము మనస్ఫూర్తిగా సహకరిస్తామని, అయితే రైతులను ఇబ్బందులు పెడితే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. వాస్తవానికి విజయవాడ, గుంటూరు పరిసరాల్లో 35 నుంచి 40 వేల ఎకరాల మేరకు ప్రభుత్వ భూమి ఉందని, ముందుగా దానిని రాజధాని అవసరాల కోసం తీసుకుని ఆ తరువాత రైతుల భూముల గురించి ఆలోచిస్తే మంచిదని సూచించారు. టీడీపీ నేతల ప్రకటనలు, భూసేకరణ కోసం వేసిన కమిటీ తీరును చూసినపుడు అసలు ప్రభుత్వ ఉద్దేశ్యం మంచి రాజధాని నిర్మించడం కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచి పోషించి తన వాళ్లందరికీ పెద్ద ఎత్తున లాభాలు చేకూర్చడమేనన్నది వెల్లడవుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి ఓట్లేయని లక్షలాది మంది పింఛన్లను ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా తొలగించారని తెలిపారు. పామర్రు నియోజకవర్గంలో జన్మభూమి సభలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేద్దామని వెళ్లిన తమ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరిపోతారంటూ ఆమె చేతిలో ఓటమిపాలైన వర్ల రామయ్య మాట్లాడ్డం అభ్యంతరకరమన్నారు. -
రాజధానికి 3 లక్షల కోట్లు కావాలి!
కేంద్రానికి సిఫారసు చేయాల్సిందిగా 14వ ఆర్థికసంఘాన్ని కోరనున్న ఏపీ రేపు తిరుపతికి ఆర్థికసంఘం రాక... ఎల్లుండి సీఎం, అధికారులతో భేటీ హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా కేంద్రం నుంచి గ్రాంటుకు సిఫారసు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు 14వ ఆర్థికసంఘాన్ని కోరాలని నిర్ణయించారు. దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలుత అధికారులు రాజధాని నిర్మాణానికి 1.35 లక్షల కోట్ల రూపాయల గ్రాంటును కోరేందుకు ప్రతి పాదనలు సిద్ధం చేశారు. దీనిపై సీఎం స్పంది స్తూ రాజధాని నిర్మాణానికి శివరామకృష్ణన్ కమిటీయే 4.50 లక్షల కోట్ల రూపాయలు వ్యయమవుతుందని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించి ప్రతిపాదనలను మార్చాలని సూచించారు. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టం నిబంధనలను సవరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎఫ్ఆర్బీఎం చట్టంలోని నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేశామని, రాష్ట్రం విడిపోయినందున రెవెన్యూ మిగులు నుంచి లోటులోకి వెళ్లిపోయామని, ఈ నేపథ్యంలో ద్రవ్య లోటును 7 శాతానికి, రెవెన్యూ లోటును 4.8 శాతానికి పెంచుతూ ఎఫ్ఆర్బీఎం చట్టంలో సవరణలకు సిఫారసు చేయాలని కోరనున్నారు. 14వ ఆర్థికసంఘం చైర్మన్ వై.వి.రెడ్డి, ఇతర సభ్యులు ఈ నెల 11వ తేదీన తిరుపతికి చేరుకోనున్నారు. 12న తిరుపతిలోనే సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు, సీఎస్, పలు శాఖల ఉన్నతాధికారులతో ఆర్థికసంఘం సమావేశమవుతుంది.ట -
అవి తుగ్లక్ చేష్టలు
వైఎస్సార్ సీపీ నేత అంబటి ధ్వజం దేవాలయాల్లో పెట్టాల్సిన హుండీలు సచివాలయంలోనా..? హైదరాబాద్: విశేష పరిపాలనానుభవ ం ఉందని గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసమని హుండీలు ఏర్పాటు చేయడం పిచ్చి తుగ్లక్ చేష్టలను తలపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆలయాల్లో పెట్టాల్సిన హుండీలను సచివాలయంలో, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేయడమేమిటని ప్రశ్నించారు. భక్తులు సమర్పించే కానుకల కోసం దేవాలయాల్లో హుండీలు పెట్టే అధికారం, హక్కు ఒక్క దేవాదాయ, ధర్మాదాయ శాఖకు మాత్రమే ఉందని, ఎక్కడంటే అక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పారు. సామాన్య ప్రజలు సచివాలయానికి రావడంలేదని, మరి చంద్రబాబు ఎవరిని కానుకలడగడానికి సచివాలయంలో హుండీని ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓట్లేసిన ప్రజలు ఆయన మంచి పరిపాలన అందిస్తారని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని భావిస్తున్నారని, ఇలా హుండీలు పెట్టడానికి కాదని దుయ్యబట్టారు. టీడీపీ గెలిచిన తర్వాత ఈ రెండు నెలల్లో రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా? ప్రభుత్వం అనేది ఉందా? అనే అనుమానాలు సామాన్యులకు కూడా కలుగుతున్నాయని అంబటి విమర్శించారు. రుణ మాఫీ చేస్తారని రైతులు, డ్వాక్రా మహిళలు, ఉద్యోగాలొస్తాయని నిరుద్యోగులు, మినరల్ వాటర్ ఇస్తారని సామాన్య ప్రజలు ఓట్లేస్తే చంద్రబాబు వాటి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎర్రచందనం అమ్మి రుణ మాఫీ చేస్తా.. తెల్ల సిమెంటు అమ్ముతా అని కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని అన్నారు. -
సింగపూర్ లాంటి రాజధాని అసాధ్యం
నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అడ్డంకి తిరుపతిలో శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు రెవి స్పష్టీకరణ తిరుపతి: నవ్యాంధ్రప్రదేశ్‌కు సింగపూర్ వంటి రాజధాని నిర్మాణం అసాధ్యమని శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు ఆరోమర్ రెవి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ప్రొఫెసర్ శివరామకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ బుధవారం తిరుపతిలో పర్యటించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు ఆరోమర్ రెవి తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని.. సింగపూర్ వంటి రాజ ధాని నిర్మాణానికి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించదని గుర్తుచేశారు. అంతకువుునుపు కమిటీతో మేథావులు వూట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని ఒక్కచోటే కేంద్రీకరిస్తే మరో విభజన ఉద్యమం పుట్టుకొస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కమిటీ తిరుపతిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు చిత్తూరు జిల్లాకు చెందిన ఏ ఒక్క మంత్రిగానీ.. ప్రజాప్రతినిధిగానీ హాజరుకాలేదు.