సంతకాలు ముగిశాక ఇక సమరమే | After the signing of the war to capital | Sakshi
Sakshi News home page

సంతకాలు ముగిశాక ఇక సమరమే

Published Wed, Mar 11 2015 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

సంతకాలు ముగిశాక ఇక సమరమే

సంతకాలు ముగిశాక ఇక సమరమే

సందర్భం
 
రాజధాని నిర్మాణం ప్రకటించినది మొదలు ఆయన సింగపూర్ పర్యటనలు చేస్తుంటే ఇక్కడ ప్రజలు కంటి మీద కునుకు లేకుండా అభద్రతతో ఉన్నారు.
 
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం భూసమీకరణ పూర్త యింది. ఇక రైతులూ, కూలీలు చేయవలసిన రణం మిగిలి ఉంది. మెతుక్కీ, బతుక్కీ భరో సా ఇచ్చిన జరీబు భూముల ను కోల్పోయిన రైతాంగం ‘అభివృద్ధి’ విధ్వంసాల  మధ్య నష్టపరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయబోతున్నారు. చంద్రబాబు రంగుల ప్రపంచాన్ని కలలుకంటూ ఊహా లోకాలలో తేలుతూ సింగపూర్ తరహా రాజధానిని నిర్మిస్తే ఆ నూతన రాజధాని కూడళ్లలో రైతులు, కూలీల స్థానమెక్కడ? భవిష్యత్తు ఊహించడానికే భయానకంగా ఉంది.

భయపడ్డారో, భద్రత లేదనుకున్నారో, మోసపో యారో గానీ కొంతమంది రైతులు భూములు ఇచ్చేశా రు. ‘మేము పూర్తి అవ గాహన/ ఆమోదంతో భూసేకరణ పథకంలో భాగస్వాములం కావడానికి అంగీకారం తెలి యజేస్తున్నాం. కావున ప్రస్తుత భూసేకరణ చట్టం- 2013 (పునరావాస, పునర్‌నిర్మాణ చట్టం) ప్రకారం ఎలాంటి నగదు పరిహారం లేదా ఇతర ప్రయోజనాలు, రాయితీలు పొందేందుకు మేం అర్హులం కాము, హక్కు లేదని ఇందుమూలంగా స్పష్టపరుస్తున్నాం’ అని 9.3 ఫారం మీద రైతులు సంతకాలు చేశారు. వేలిముద్ర లెన్నో, సంతకాలెన్నో తెలియదుకానీ, ప్రభుత్వం భయ పెట్టి ఈ ప్రక్రియను ఎట్టకేలకు ముగించింది. ఇంత జరి గినా ప్రభుత్వం ఈ భూములను ప్రజలే స్వచ్ఛందంగా ఇచ్చారని చెబుతోంది. కొత్త రాజధాని ఏర్పాటు కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ మాటతో సహా, చంద్రబాబు ఎవరి అభిప్రాయాలనూ పరిగణన లోనికి తీసుకోలేదు. విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని ఉంటుందని చెబుతూనే తుళ్లూరు, మంగళ గిరి, తాడేపల్లి మండల ప్రాంతాలను ఎంపిక చేయడం లో ఒక దుర్మార్గం ఉంది. అరెకరం, ఒకటి రెండు ఎక రాలు ఉన్న రైతులు, కూలీలు, దళితులు 90 శాతం ఉన్న ప్రాంతం ఇదే. భూస్వాములు, ధనికులు తక్కువగా ఉన్న ప్రాంతమిది. దాదాపు 20 వేల కుటుంబాలకు భూమి లేదు. కాబట్టి ఈ ప్రాంత వాసులను బెదిరించి తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిం చుకుని లక్షల కోట్లు దండుకోవాలనే దృష్టితో ఈ ప్రాం తాన్ని రాజధాని ప్రాంతంగా ఎంపిక చేశారనేది స్పష్టం. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇక్కడి భూములను కొని సింగపూర్ తరహా రాజధానిని నిర్మించడం భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం.
 ప్రత్యేక ప్రతిపత్తి తదితర హామీలు నీటి మీద రాతలవుతున్నాయి.

అందువల్ల చంద్రబాబు నాయుడు కానీ ఖర్చు లేకుండా 30 నుంచి 50 వేల ఎకరాల దాకా ప్రజలనుంచి నయానో భయానో సేకరించాలని ల్యాండ్ పూలింగ్ పద్ధతిని తీసుకువచ్చారు. దీనికి ఎలాంటి చట్ట బద్ధతా లేదు. అయినా మంత్రులు గ్రామాల్లో తిష్టవే శారు. ఫిబ్రవరి 28 లోపు ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు సమీకరిస్తాం లేకపోతే సేకరణకు వెళ్లి భూము లు తీసుకుంటాం అని హెచ్చరికలు చేయడంతో రెండు రోజుల్లోనే రైతులు కొంత మంది భయపడి భూములు ఇచ్చి వేశారని చెబుతున్నారు. ఇది స్వచ్ఛందంగా ఇచ్చిం ది కానే కాదు.

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి రైతులు భూములిస్తే ప్రభుత్వం అభివృద్ధి చేసి పట్టా భూమికి 1200 చ.గ.లు, అసైన్డుభూమికి 900 చ.గ.లు ఇస్తామని ప్రకటించింది. సంవత్సరానికి 30 వేలు ఇస్తానంది. వ్యవసాయ కూలీలకు నెలకు 2,500 రూపా యలు ఇస్తామని ప్రకటించింది. సంవత్సరానికి 30 వేలు కౌలు ఇస్తానంది. వ్యవసాయ కూలీలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. రాజధాని నిర్మా ణం చేస్తామన్న 29 గ్రామాలలో 52 వేల ఎకరాల భూమి ని లాండ్ పూలింగ్ పద్ధతిలో సేకరించడానికి ప్రభుత్వం పూనుకుంది. అక్కడ పంట పొలాల్లో రైతులూ, కూలీలూ జీవిస్తున్నారు. ఈ మూడు మండలాల్లోనే 11,687 రైతు కుటుంబాలు, 51,573 మంది రైతు కూలీలు జీవిస్తు న్నారు.

మూడు మండలాల పరిధిలో 74 వేల మంది దళి తులు, 12 వేల మంది ఎస్‌టీలు ప్రధానంగా వ్యవసా యం మీద ఆధారపడి జీవిస్తున్నారు. కూలీల్లో అత్య ధికం దళితులూ, బీసీలూ, ఇతర పేదలూ ఉన్నారు. వారి మాటల్లోనే చెప్పాలంటే 20 సెంట్లున్న రైతు సాఫ్ట్ వేర్ ఉద్యోగి సంపాదించినంత సంపాదిస్తున్నాడని ఈ భూములు పోతే మాకు దిక్కేమిటని గ్రామాల్ని సంద ర్శించిన వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఆవేదనతో మాట్లాడుతున్నారు. భార్యాభర్తలిద్దరూ రోజూ కూలీకి వెళితే నెలకు 20 వేలు సంపాదిస్తామని, ప్రభుత్వం ఇచ్చే 2,500 రూపాయలు ఏ మూలకు సరిపోతాయని బాధ పడుతున్నారు.

రాజధాని నిర్మాణం ప్రకటించినది మొదలు ఆయన సింగపూర్ పర్యటనలు చేస్తుంటే ఇక్కడ ప్రజలు కంటి మీద కునుకు లేకుండా అభద్రతతో ఉన్నారు. పం టపొలాలు ఇవ్వబోమని, జరీబు భూములు ఇవ్వబో మని తేల్చి చెబితే పంట పొలాలు తగులబడతాయి. పోలీసులు రంగప్రవేశం చేస్తారు. ఈ ప్రాంతమంతా యుద్ధ వాతావరణం అలుముకుంటుంది. అదిరింపులు, బెదిరింపులు నిత్యకృత్యం అవుతాయి. పూలింగ్ అయితే మీకు లాభం, సేకరణ అయితే నష్టం అని మీరు ఇవ్వక పోయినా భూములు లాక్కొంటాం అని బెదిరింపులతో రైతుల్ని భయాందోళనలకు గురి చేశారు.

విదేశీ పెట్టుబడుల కోసం అర్రులు చాస్తూ, సింగ పూర్, జపాన్ లాంటి రాజధాని కోసం ఆకాశానికి నిచ్చె నలు వేస్తున్న చంద్రబాబు వైఖరిని ప్రజలు పెద్ద ఎత్తున తిరస్కరించాలి. కార్పొరేట్ సంస్థల దోపిడీకి, తెలుగు దేశం పెద్దలు చేయబోయే రియల్ ఎస్టేట్ వ్యాపార దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలి. ఆత్మ విశ్వాసంతో పోరాడుతున్న రాజధాని ప్రాంత రైతులకు, కూలీలకు అంతా అండగా నిలబడాలి.
 (వ్యాసకర్త సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ
 రాష్ర్ట నాయకులు మొబైల్: 9989737776)
 
చిట్టిపాటి  వెంకటేశ్వర్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement