‘తమ్ముళ్ల’ తిరుగుబాటు | TDP leaders of the uprising | Sakshi
Sakshi News home page

‘తమ్ముళ్ల’ తిరుగుబాటు

Published Wed, Feb 11 2015 1:46 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

‘తమ్ముళ్ల’ తిరుగుబాటు - Sakshi

‘తమ్ముళ్ల’ తిరుగుబాటు

తాడికొండ(గుంటూరు): రాజధాని నిర్మాణం కోసం జరుపుతున్న భూ సమీకరణపై ఆ ప్రాంత తెలుగు తమ్ముళ్లు తిరుగుబావుటా ఎగురవేశారు. జరీ భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస భూమి, 600 గజాల వాణిజ్య స్థలం ఇస్తూ వాటికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ భూములు ఇవ్వబోమని తెల్చి చెప్పారు.

తుళ్లూరు మండలం వెంకటపాలెంలో మంగళవారం టీడీపీ గ్రామ నేతలు, మద్దతు దారులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ జెండాలతో నిరసన తెలిపారు. పరిహారంపై తమకున్న సందేహాలను ఇప్పటి వరకు తీర్చలేదని ఆరోపించారు. అభద్రతా భావాన్ని తొలగించే ప్రయత్నం చేయకుంటే కోర్టుకు వెళతామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement