
‘రాజధాని’ నిర్మాణంలో భాగస్వాములవుతాం
బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ అలిస్టర్
విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణంలో తమ దేశానికి చెందిన సంస్థలు, నిపుణులను కూడా భాగస్వాములుగా చేసుకోవాలని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ అండ్రూ మెక్ అలిస్టర్ కోరారు. మంగళవారం సీఆర్‌డీఏ కార్యాలయంలో కమిషనర్ శ్రీకాంత్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై శ్రీకాంత్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
భూసమీకరణ విధానంలో 32 వేల ఎకరాల భూమిని సేకరించామని, రాజధాని నిర్మాణంలో స్థానికుల భాగస్వామ్యం ఉందని వివరించారు. రాజధాని నమూనా బాగుందని చెప్పిన అలిస్టర్.. యునెటైడ్ కింగ్‌డమ్ సంస్థల భాగస్వామ్యం కూడా ఉంటే బాగుంటుందన్నారు. ఇందుకు శ్రీకాంత్ సానుకూలత వ్యక్తం చేసి ఆహ్వానం పలికారు. అనంతరం అలిస్టర్ బృందం తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు ప్రాంతాలను పరిశీలించింది.