ప్రజల వెంటే వైఎస్సార్ సీపీ | People arrive YSR CP party :- ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

ప్రజల వెంటే వైఎస్సార్ సీపీ

Published Fri, May 27 2016 11:16 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ప్రజల వెంటే వైఎస్సార్ సీపీ - Sakshi

ప్రజల వెంటే వైఎస్సార్ సీపీ

వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 
తాడేపల్లి (తాడేపల్లి రూరల్)
: పేద ప్రజల వెంటే వైఎస్సార్ సీపీ ఉంటుందని, వారికి ఏ కష్టం వచ్చినా ముందుండి పోరాడుతుందని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రత్తిపాడు వెళ్తున్న జగన్‌ను పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కనకదుర్గమ్మ వారధి వద్ద కలిశారు. పుష్కరాలు, రాజధాని పేరుతో పేదలకు జరుగుతున్న అన్యాయం గురించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయనకు వివరించారు. తాడేపల్లి మునిసిపాలిటీలో పేదల ఇళ్ల తొలగింపు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఇళ్లు కోల్పోతున్న మహిళలతో జగన్ మాట్లాడారు. ఏళ్ల తరబడి పన్నులు చెల్లిస్తున్న వారి ఇళ్లు ఎలా తొలగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్‌కు వినతి పత్రం అందజేసిన వారిలో తాడేపల్లి ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి, మంగళగిరి ఎంపీపీ పచ్చల రత్నకుమారి, యువజన నాయకులు మున్నంతి వివేకానందరెడ్డి, మంగళగిరి మండల అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి,  సంపూర్ణ పార్వతి, ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు ముదిగొండ ప్రకాష్, బాలసాని అనిల్, పట్టణ కార్యదర్శి ఎండీ గోరేబాబు, బీసీ సెల్ నాయకులు ఓలేటి రాము, కేళి వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు మాచర్ల అబ్బు, కాటాబత్తుల నిర్మల, దర్శి విజయశ్రీ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement