
చంద్రబాబు దేవుడు కాదు
నెల్లూరు, సిటీ: ఇచ్చిన హామీలను అన్నింటిని ఒకేసారి నెరవేర్చడానికి సీఎం చంద్రబాబునాయుడు దేవుడు కాదని, క్రమంగా నెరవేరుస్తారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఏసీ సెంటర్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. విజయవాడలో రాజధాని నిర్మాణం జరిగితే పరిశ్రమలు వస్తాయన్నారు. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బర్నాబాస్, చక్రవర్తి, కేవీ రాఘవరెడ్డి, రాజేష్, ప్రేమ్, ముజీర్, పేరారెడ్డి, చిన్ని శేఖర్, మునాఫ్, ముజావీర్, శివ, మదన్, తదితరులు పాల్గొన్నారు.