ఆందోళనకరంగా ఆనం వివేకా ఆరోగ్యం | Anam Vivekananda Reddy Health in Critical Condition - Sakshi
Sakshi News home page

ఆందోళనకరంగా ఆనం వివేకా ఆరోగ్యం

Published Fri, Apr 13 2018 5:02 PM | Last Updated on Sat, Jul 28 2018 4:43 PM

Anam Vivekananda Reddy In Critical Condition  - Sakshi

వివేకానందరెడ్డిని పరామర్శిస్తున్న చంద్రబాబు

సాక్షి, హైదరాబాద్‌: గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం కిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వివేకాకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన నెల్లూరులో చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత మెరుగైన వైద్యాన్ని డాక్టర్లు సూచించడంతో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ​

ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం వివేకానందరెడ్డిని పరామర్శించారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణతో కలిసి ఆయన కిమ్స్‌ ఆసుపత్రి వచ్చారు. ఈ సందర్భంగా ఆనం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయనకు అందుతున్న వైద్యం గురించి ఆసుపత్రి ఎండీ భాస్కర్‌రావును అడిగి తెలుసుకున్నారు.

అనంతరం భాస్కర్‌రావు మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి గత నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారం క్రితం ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు రేడియేషన్‌ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు వచ్చిన సమయంలో వివేకా కళ్లు తెరిచి చూశారని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement