KIMS Hospitals
-
లూపస్ వ్యాధి చాలా డేంజర్.... తొందరగా గుర్తిస్తే నయం చేయవచ్చు
-
విశాఖ : గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాల తరలింపు (ఫొటోలు)
-
డాక్టర్ పి రఘురామ్‌కు బ్రిటిష్ ఎంపైర్ ఓబీఈ అవార్డు
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ రెండో అత్యున్నత ర్యాంకింగ్ అవార్డు ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్–2021’ను ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల కేంద్రం డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక సీఈఓ డాక్టర్ పి.రఘురామ్ అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా ఆయన ఘనత సాధించారు. లండన్ దగ్గర్లోని విండ్సర్ క్యాసిల్‌లో జరిగిన వేడుకలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ చార్లెస్ ఈ అవార్డును ప్రదానం చేశారు. భారత్‌లో రొమ్ము కేన్సర్ నుంచి సంరక్షణ, శస్త్ర చికిత్స విద్యను మెరుగుపరచడం, యూకే–భారత్ మధ్య సత్సంబంధాలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు రఘురామ్ ఈ అవార్డును పొందారు.కిమ్స్ఆస్పత్రిలోని సహో ద్యోగులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భార తీయ శస్త్ర చికిత్స డాక్టర్లకు ఈ అవార్డును అంకి తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రఘురామ్ అత్యంత చిన్నవయసులో 2015లో పద్మశ్రీని, 2016లో బీసీ రాయ్ నేషనల్ అవార్డును అప్ప టి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. -
60వ పుట్టిన రోజు: కీలక ప్రకటన ఇచ్చిన జగపతి బాబు
సినిమాల్లో హీరో కన్నా జీవితంలో హీరో అవ్వాలని ఉద్దేశ్యంతో అవయవ దానం చేస్తున్నట్టు నటుడు జగపతి బాబు అన్నారు... సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన అవయవ దానం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విలక్షన నటుడు జగపతిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు తన 60వ పుట్టిన రోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. చదవండి: Khiladi Movie Review: ఖిలాడి మూవీ ఎలా ఉందంటే.. మనుషులుగా జన్మిస్తాము. మనుషులుగానే చనిపోతాం. వెళ్లేటపుడు 200 గ్రాముల బూడిద తప్ప ఇంకేం మిగలదు అని ఆయన అన్నారు... అవయవ దానం వల్ల మనం మరణించిన తర్వాత 7,8 మందికి పునర్జన్మ ఇవ్వొచ్చు అని జగపతి బాబు అన్నారు... అవయవ దానం చేసిన వాళ్ళకి పద్మశ్రీలు పద్మ భూషణ్ లు ప్రదానం చేయాలని ఆయన అన్నారు... ఈ కార్యక్రమంలో కిమ్స్ ఎండి భాస్కర్ రావు, సీనియర్ IAS అధికారి జయేష్ రంజాన్, జీవన్ దాన్ ఇంచార్జి డాక్టర్ స్వర్ణలత, అక్కినేని నాగసుశీల పాల్గొన్నారు. చదవండి: అక్షయ్‌తో వివాదం.. వివరణ ఇచ్చిన ప్రముఖ కమెడియన్ -
ఎక్మోపై ఉన్నా గెలిచాడు.. మృత్యువుపై శౌర్యం చూపాడు!
సాక్షి, హైదరాబాద్: పన్నెండేళ్ల బాలుడు. కరోనా సోకింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తీవ్రమైంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. మూత్రపిండాలు, కాలేయం పనితీరు దెబ్బతింది. రక్తంలోనూ ఇన్ఫెక్షన్ సోకింది. ఇలాంటి పరిస్థితుల్లో బాలుడిని కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు కాపాడారు. దాదాపు 65 రోజులు ఎక్మోపైనే ఉంచి చికిత్స చేశారు. ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా మెరుగుపరిచి డిశ్చార్జ్ చేశారు. చాలా రోజులు మంచానికే పరిమితం కావడంతో కదలికల్లేకుండా ఉన్న శరీరభాగాలను పూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు ఫిజియోథెరపీకి పంపారు. చికిత్సకు సంబంధించిన వివరాలను కిమ్స్ సీఈవో అభినయ్ బొల్లినేని, ఊపిరితిత్తుల మార్పిడి నిపుణుడు డాక్టర్ సందీప్ అత్తావర్, పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్, ఫిజిషియన్ బీపీసింగ్ శుక్రవారం విలేకరులకు వివరించారు. చిన్నపిల్లలు ఎక్మోపై సుదీర్ఘకాలం ఉండి కోలుకోవడం అరుదైన అంశమని, ఇది ఆసియాలోనే మొదటిదని వైద్యులు వెల్లడించారు. లక్నో నుంచి నగరానికి.. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన శౌర్య (12) సెప్టెంబర్ రెండో వారంలో కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం తల్లిదండ్రులు స్థానిక మిడ్‌లాండ్ హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్లో చేర్చారు. తీవ్రమైన నిమోనియా వల్ల శ్వాస తీసుకోవడం కష్టమైంది. అప్పటికే బాలుడి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. కుమారుడిని ఎలాగైనా కాపాడుకోవాలని మెరుగైన వైద్యం కోసం నగరంలోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులను బాలుడి తల్లిదండ్రులు ఆశ్రయించారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. డాక్టర్లు చికిత్సకు అంగీకరించడంతో ప్రత్యేక విమానంలో వెంటిలేటర్ సపోర్టుతో సెప్టెంబర్ 25న సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలించారు. ఫిజియోథెరపీ అవసరమవడంతో.. వీనోవీనస్ ఎక్మో సపోర్ట్‌తో బాలుడికి వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. అప్పటికే మూత్రపిండాల పనితీరూ దెబ్బతినడంతో డయాలసిస్ చేశారు. కాలేయ పనితీరూ దెబ్బతింది. రక్తంలో ఇన్ఫెక్షన్ లెవల్స్ ఎక్కువయ్యాయి. యాంటిబయాటిక్ మందులు వాడి ఇన్ఫెక్షన్ రేటును తగ్గించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 65 రోజులు ఎక్మోపై ఉంచి వైద్యసేవలు అందించారు. సుదీర్ఘకాలం వైద్యసేవల తర్వాత బాలుని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. చాలా రోజులు మంచానికే పరిమితకావడం వల్ల కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాల కదలికల్లేకపోవడంతో ఫిజియోథెరపీ ద్వారా అవయవాలను పూర్వ స్థితికి తీసుకురావాలని భావించారు. ఆ మేరకు రెండ్రోజుల క్రితం అతన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి స్థానికంగా ఉన్న ఓ రిహాబిలిటేషన్ సెంటర్‌కు సిఫార్సు చేశారు. -
ఏడున్నరేళ్లు..742 ఆపరేషన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం నిమ్స్‌లో రికార్డు స్థాయిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. తెలంగాణ రాకముందు 25 ఏళ్లలో కేవలం 649 మాత్రమే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరగ్గా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడున్నరేళ్లలో ఏకంగా 742 ఆపరేషన్లు జరగడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల్లో అధునాతన వైద్య పరికరాలను, తగినంత వైద్య సిబ్బందిని అందుబాటులోకి తేవడంతో శస్త్రచికిత్సలు పెరిగాయ ని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఒక్కో శస్త్రచికిత్సకు రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాదిలో జరిగిన వంద కిడ్నీ మార్పిడి చికిత్సలో 97 ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించగా, అందు లో 90 ఆరోగ్యశ్రీ ద్వారానే నిర్వహించడం గమనార్హం. జీవితాంతం ఉచితంగా మందులు... ప్రభుత్వం అవయవదానాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7,800 మంది అవయవాల మార్పిడి కోసం జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎదురుచూస్తున్నారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడంతోపాటు అనంతరం అవసరమయ్యే మందులను జీవితకాలానికి ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. ఇలా ఉచితం గా మందులు అందించే రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని వైద్య వర్గాలు వెల్లడించాయి. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలకు అవసరమైన మౌలిక సదుపాయాలను, యంత్రాలను గాంధీ, నిమ్స్, ఉస్మానియా ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచింది. కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలు: హరీశ్‌రావు ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధగా వ్యవహరిస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కలలుగన్న ఆరోగ్య తెలంగాణగా మన రాష్ట్రం మారుతోందన్నారు. కిడ్నీ మార్పిడి చికిత్సలు చేయడంలో రికార్డు సాధించామని, ఇదే స్ఫూర్తితో మరిన్ని శస్త్రచికిత్సలు నిర్వహించి రోగులకు ప్రాణదానం చేయాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ రంగంలోని ఆస్పత్రులు కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడేలా వైద్య సేవలుండాలన్నారు. అందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెస్తుందన్నారు. ప్రభుత్వ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. -
KIMS Hospital: ‘ఊపిరి’ ఆడుతుండగానే అమర్చారు.. దేశంలోనే తొలిసారి
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. దేశంలోనే తొలిసారిగా బ్రీతింగ్ లంగ్ (ఎక్స్‌వీవో ఆర్గాన్ పర్ఫ్యూజన్ సిస్టమ్) మార్పిడి శస్త్ర చికిత్సను ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి ఊపిరితిత్తుల మార్పిడి విభాగం డైరెక్టర్ డాక్టర్ సందీప్ అత్తావర్ వెల్లడించారు. ‘మధ్య వయసున్న ఓ వ్యక్తి 2021 ఆగస్టు నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడు తున్నాడు. రోజూ 10 లీటర్ల ఆక్సిజన్ తీసుకుంటున్నాడు. ఆ వ్యక్తికి ఆదివారం ఉదయం కిమ్స్ వైద్య బృందం బ్రీతింగ్ లంగ్ మార్పిడి శస్త్ర చికిత్స చేసింది. ఈ పద్ధతిలో ‘కోల్డ్ ఇష్కేమియా టైమ్’వల్ల వచ్చే దుష్ప్రభావాలు తగ్గి ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. దాతలు ఇచ్చిన ఊపిరితిత్తుల విని యోగం 30 శాతం ఎక్కువవుతూ రోగికి మరింత ఎ క్కువ కాలం ప్రయోజనం ఉంటుంది’అని చెప్పా రు. అమెరికా, కెనడా, ఆస్ట్రియా లాంటి దేశాల్లోని అతి కొద్ది సంస్థల్లోనే ఈ పద్ధతుల ద్వారా ఊపిరిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నారన్నారు. అవయవాన్ని రవాణా చేసేటప్పుడు.. ముందే సేకరించిన అవయవాన్ని పోషకాలు, యాంటి బయాటిక్స్ ఉన్న ద్రావణంలో పెట్టడం వల్ల.. ఐస్ బాక్సులో రవాణా చేసే సమయంలో జరిగే కోల్డ్ ఇషేమిక్ ప్రభావం, గాయాల నుంచి కా పాడవచ్చని కిమ్స్ ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ విజల్ రాహుల్ వివరించారు. ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరిచేందుకు వాటిని కండీషనింగ్ చేసి తద్వారా నీరు చేరడాన్ని తగ్గించవచ్చని తెలిపారు. వైద్యుల బృందాన్ని కిమ్స్ సీఈ వో డాక్టర్ అభినయ్ బొల్లినేని అభినందించారు. ఏంటీ బ్రీతింగ్ లంగ్ ప్రక్రియ? బ్రీతింగ్ లంగ్ ప్రక్రియలో ఊపిరితిత్తులు ఆడుతున్నపుడే వాటిని చల్లబరిచే పరికరంలో పెడతారని, వెంటిలేటర్ సాయంతో కృత్రిమంగా ఊపిరి తీసుకునేలా చేస్తారని డాక్టర్ సందీప్ అత్తావర్ వివరించారు. ‘పోషకాలు, యాంటీ బయాటిక్స్ ఉన్న ద్రావణంలో ఆ ఊపిరితిత్తులను పెట్టడంతో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గుతుంది. మెషీన్‌లోనే బ్రాంకోస్కోపి ద్వారా వాయు మార్గాలను శుభ్రం చేయడం, అదే సమయంలో పలు పరీక్షలు చేయడం వల్ల ఊపిరితిత్తులు చల్లబడేలోపే వాటి పనితీరు బాగా మెరుగవుతుంది. ఈ ప్రక్రియ అంతా స్పెషలిస్టుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఆ తర్వాత వాటిని గ్రహీతకు అమరుస్తారు’ అని చెప్పారు. -
ఇంకా ఐసీయూలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి.. వైద్యులు ఏమన్నారంటే..
Sirivennela Seetharama Sastry Health Bulletin Released: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తాజాగా సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. సినీ గేయ రచయిత సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న సిరివెన్నెల ఆరోగ్యాన్ని నిపుణులైన వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం అని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా అనారోగ్యం కారణంగా ఈనెల 24న సిరివెన్నెలను ఆయన కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. -
‘సిరివెన్నెల’కు అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గేయ రచయిత ‘సిరివెన్నెల’సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ‘సిరివెన్నెల’న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఐసీయూలో ఉంచి ఊపిరితిత్తులకు సంబంధించి తగిన వైద్యం అందజేస్తున్నామని చెప్పాయి. అలాగే గడిచిన 24 గంటల్లో ‘సిరివెన్నెల’ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వెల్లడించాయి. -
Stock Exchange : కిమ్స్, దొడ్ల... శుభారంభం
ముంబై : స్టాక్ ఎక్సేంజ్‌లో దొడ్ల డెయిరీ, కిమ్స్ హస్పిటల్స్‌కి సంబంధించిన షేర్లు దూసుకుపోతున్నాయి. ఇటీవల ఈ రెండు సంస్థలు ఐపీవోను జారీ చేశాయి. అనంతరం జూన్ 28న తొలిసారిగా స్టాక్మార్కెట్లో లిస్టయ్యాయి. ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే ఈ రెండు సంస్థలకు చెందిన షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఉత్సాహాం చూపించారు. కిమ్స్ సానుకూలం కిమ్స్ హాస్పిటల్ సంస్థ షేరు రూ. 825తో మొదలవగా కాసేపట్టికే 25 శాతం పెరిగి రూ. 1034 దగ్గర గరిష్ట స్థాయికి చేరుకుంది. నేషనల్ స్టాక్ ఎక్సెంజీలో రూ. 1036 వరకు చేరుకుంది. కిమ్స్ షేర్ల ట్రేడింగ్ పట్ల మార్కెట్ సానుకూలంగానే ఉంది. సౌతిండియాలో కిమ్స్ ఆధ్వర్యంలో 9 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయి. 3,064 బెడ్ల సామర్థ్యం ఉంది. దొడ్ల షేర్ ఇలా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ డైయిరీ సంస్థైన దొడ్ల సైతం ఈ రోజు స్టాక్ మార్కెట్ తొలి సారి లిస్టయ్యింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో దొడ్ల షేర్ 475 -525 మధ్యన ట్రేడ్ అవుతోంది. ఒక దశలో షేర్ వాల్యూ 33 శాతం పెరిగి రూ. 575 దగ్గర నమోదైంది. ఎన్ఎస్సీలో రూ. 572 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రెండు సంస్థలకు సంబంధించి ఐపీవోలు జూన్ 16 నుంచి 18వరకు ముగిశాయి. చదవండి : Mahindra XUV 700: మేఘాలలో తేలిపోమ్మనది -
విస్తరణ బాటలో కిమ్స్ హాస్పిటల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ఐపీవో జూన్ 16న ప్రారంభం కానుంది. 18న ఇష్యూ ముగియనుంది. రూ.10 ముఖ విలువతో ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ రూ.815–825గా నిర్ణయించారు. ఐపీవో ద్వారా రూ.2,144 కోట్లు సమీకరిస్తారు. ఫ్రెష్ ఇష్యూ రూ.200 కోట్లు ఉంది. ఆఫర్ ఫర్ సేల్ కింద 2.35 కోట్ల షేర్లను జారీ చేస్తారు. ఇందులో జనరల్ అట్లాంటిక్ సింగపూర్ కేహెచ్ 1.60 కోట్ల షేర్లు, భాస్కర్ రావు బొల్లినేని 3.88 లక్షలు, రాజ్యశ్రీ బొల్లినేని 7.76 లక్షలు, బొల్లినేని రమణయ్య మెమోరియల్ హాస్పిటల్స్ 3.88 లక్షలు, ఇతరులకు చెందిన 60 లక్షల షేర్లున్నాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్‌కు 75 శాతం, నాన్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్స్‌కు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం షేర్లను కేటాయిస్తారు. పొరుగు రాష్ట్రాలకు విస్తరణ.. ఐపీవో ద్వారా వచ్చిన నిధులను మధ్య భారత్, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సంస్థ విస్తరణకు వినియోగిస్తామని కిమ్స్ సీఈవో బొల్లినేని అభినయ్ తెలిపారు. ఎండీ భాస్కర్‌రావుతో కలిసి శుక్రవారం ఆయన మీడియాకు ఐపీవో వివరాలను వెల్లడించారు. హాస్పిటల్స్ బెడ్స్ సామర్థ్యం సైతం పెంచుతామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సంస్థకు ప్రస్తుతం 9 ఆసుపత్రులు ఉన్నాయి. మొత్తం పడకల సంఖ్య 3,064. కిమ్స్ 2020–21లో రూ.1,340 కోట్ల టర్నోవర్‌పై రూ.205 కోట్ల నికరలాభం ఆర్జించింది. కాగా, కొటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యాక్సిస్ క్యాపిటల్, క్రెడిట్ సూసే సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో షేర్లను నమోదు చేస్తారు. చదవండి: దొడ్ల ప్రైస్ బ్యాండ్ రూ. 421-428 -
అరుదైన చికిత్సతో చిన్నారికి పునర్జన్మ
రాంగోపాల్‌పేట (హైదరాబాద్): గర్భంలోని పిల్లలు అత్యంత అరుదుగా మలవిసర్జన చేస్తారు. అప్పుడు అది ఉమ్మనీరులో కలసి తిరిగి వాళ్ల ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. తద్వారా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. సరిగ్గా ఇలాంటి సమస్యకు గురైన ఓ శిశువుకు ఎక్మో చికిత్సతో పునర్జన్మనిచ్చారు కిమ్స్ వైద్యులు. ఆ వివరాలను ఆస్పత్రి కన్సల్టెంట్ పీడియాట్రిక్ డాక్టర్ వి.నందకిశోర్ బుధవారం వెల్లడించారు. ఉప్పల్‌కు చెందిన స్రవంతికి సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. పాప పుట్టినప్పుడు బాగానే ఉన్నా కొద్దిసేపటికే ఊపిరి పీల్చుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడసాగింది. దాంతో చిన్నారిని వెంటనే ఐసీయూకు తరలించి వెంటిలేటర్ ద్వారా గాలి అందించారు. గర్భంలో ఉండగా మల విసర్జన చేయడంతో అది ఊపిరితిత్తుల్లోకి చేరి పాపకు రక్తపోటు (పల్మనరీ హైపర్‌టెన్షన్) బాగా ఎక్కువైనట్లు గుర్తించారు. దాంతో ప్రత్యేకమైన ఔషధం, గ్యాస్ (ఇన్హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్) కూడా అందించి రక్తపోటు తగ్గించారు. ఇంత చికిత్స చేసినా పాప పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఎక్మో ఆధారంగా చికిత్స చేశారు. ఈ క్రమంలో పాపకు ఐదు రోజుల పాటు ఎక్మో సాయం అవసరమైంది. ఆ తర్వాత మరో ఐదు రోజులు ఐసీయూలో ఉంచి పర్యవేక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడంతో డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. చిన్నారి ఇప్పుడు పాలు కూడా తాగగలుగుతోందని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్ నందకిశోర్ తెలిపారు. కాగా, చిన్నారికి ఎదురైన అరుదైన పరిస్థితుల్లాంటివి వచ్చినప్పుడు ఊపిరితిత్తులు చేసే పనిని ఎక్మో చేస్తుందని ఆయన చెప్పారు. అంటే ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ విడిచిపెడుతుందని వివరించారు. తద్వారా ఊపిరితిత్తులు కోలుకోవడానికి సమయం, విశ్రాంతి దొరుకుతాయన్నారు. ఎక్మో సర్క్యూట్లో ఉండే కృత్రిమ ఊపిరితిత్తులకు (ఆక్సిజనేటర్) రక్త ప్రసరణ మళ్లిస్తారని చెప్పారు. గుండె లేదా ఊపిరితిత్తుల పనితీరు దారుణంగా దెబ్బతిని, సంప్రదాయ చికిత్స పద్ధతులతో నయం కాని పరిస్థితుల్లో ఎక్మోను ప్రయోగిస్తారని పేర్కొన్నారు. అన్ని వయస్సుల వారికీ ఈ చికిత్స చేయవచ్చని చెప్పారు. అప్పుడే పుట్టిన పిల్లలకు ఎక్మో చికిత్స చేయడం కిమ్స్ ఆస్పత్రిలో ఇది రెండోసారని వెల్లడించారు. -
మిసెస్ మామ్ పోటీలు
-
పళ్లు క్లీన్ చేయించుకునేందుకు వెళితే..ప్రాణం మీదికి తెచ్చారు..
రాంగోపాల్‌పేట్: డెంటల్ క్లీనింగ్ కోసమంటూ ఆస్పత్రికి వెళ్లిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అనవసర వైద్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చారు. ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం కారణంగా తాను తీవ్ర మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నానని బాధితుడు ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి వచ్చిన సమాచారంతో రాంగోపాల్‌పేట్ పోలీసులు ఆస్పత్రిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి బంజారాహిల్స్‌కు చెందిన పాండురంగారావు (71) రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. 2017 సెప్టెంబర్ 4న అతను డెంటల్ క్లీనింగ్ కోసం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ కాస్మోటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ బింధులను అతడిని పరీక్షించారు. ఆయన దంతాలకు శాశ్వత చికిత్స చేసుకోకపోతే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ తరహా వైద్యం సినిమా నటులు, రాజకీయ నాయకులు, వీఐపీలకు అందించినట్లు తెలిపారు. తనకు తండ్రిలాంటి వారని ఒక బిడ్డ సలహా ఇస్తుదని భావించి వైద్యం చేయించుకోవాలని డాక్టర్ ప్రత్యూష చెప్పడంతో ఆమె మాటలు నమ్మిం అందుకు అంగీకరించినట్లు తెలిపారు. అంతకు ముందే ఆయన దంతాలు పూర్తి పటిష్టంగా ఉన్నప్పటికీ 2017, సెప్టెంబర్ 15న ఆయన 32 దంతాలకు వైద్యం చేసి క్యాప్స్ అమర్చారు. ఇందుకుగాను అతను రూ.5లక్షల రూపాయలు చెల్లించాడు. చికిత్స పూర్తయిన 6 నెలలకు తనకు కొత్త సమస్యలు మొదలయ్యాయని, అన్నం, రోటీతో పాటు గట్టి పదార్థాలు తినేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపాడు. నోట్లో ఉండే కణాలు దెబ్బతినడంతో రుచి తెలియడం లేదని, 5కేజీల బరువు తగ్గాడు. 30 ఏళ్లుగా రోజూ 6కిమీ వాకింగ్ చేసే ఆయన పూర్తిగా బెడ్‌కు పరిమితమయ్యాడు. దీంతో అతను మరోసారి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్ ప్రత్యూష ఆయనను కిమ్స్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సేతుబాబు దగ్గరకు తీసుకుని వెళ్లింది. 23 మార్చి 2018 నుంచి 27 మార్చి 2018 వరకు ఆయనకు ఆల్ట్రాసౌండ్ అబ్డామినల్ పరీక్షలు, అప్పర్ జీఐ ఎండోస్కోపి తదితర పరీక్షలు నిర్వహించి ఏమీ లేదని తేల్చారు. ఆ తర్వాత కొన్ని మందులు ఇచ్చినా ఫలితం లేదు. దీంతో పాండురంగారావు భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రితో పాటు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం, తనకు చికిత్స చేసిన వైద్యులపై ఫిర్యాదు చేశారు. ఇదే ఫిర్యాదును రాష్ట్రపతి, ప్రధాన మంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నుంచి రాష్ట్ర పోలీసులకు అందడంతో రాంగోపాల్‌పేట్ పోలీసులు ఈ నెల 12న కిమ్స్ ఆస్పత్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు. చికిత్స లోపం లేదు ఆస్పత్రి అందించిన చికిత్సలో ఎలాంటి లోపం లేదు. రోగి ఇప్పటికే కోర్టును ఆశ్రయించినందున మేము ఈ విషయంలో మేము ఎలాంటి వివరణ ఇవ్వలేము. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకుందాం –డాక్టర్ ప్రసాద్ ,కిమ్స్ ఆసుపత్రి డెంటల్ సర్జన్ -
మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత
-
టీడీపీ నేత ఆనం వివేకా కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి(67) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న టీడీపీ నేత ఆనం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు తొలుత నెల్లూరులో చికిత్స చేయించుకున్నారు. మెరుగైన వైద్యాన్ని డాక్టర్లు సూచించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అయితే కిమ్స్ వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆనం తుదిశ్వాస విడిచినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆనం వివేకా మృతిపట్ల ప్రముఖుల సంతాపం ఆనం వివేకా మృతిపట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆనం వివేకా మృతి పట్ల పలువురు టీడీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనం కుటుంబ సభ్యులకు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు కళా వెంకట్రావు, నారాయణ, నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆనం వివేకా మృతిపట్ల సంతాపం తెలిపిన అనంతరం నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ.. ఓ విలక్షణ రాజకీయ నాయకుడిని కోల్పోయామన్నారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ, పలువురు టీడీపీ నేతలు కిమ్స్ ఆసుపత్రికి వచ్చి ఆనం వివేకాను పరామర్శించిన విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా ఆనం అనారోగ్యంతో బాధపడుతున్నారని, రేడియేషన్ చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి ఎండీ భాస్కర్‌రావు కొన్ని రోజుల కిందట తెలిపారు. గురువారం అంత్యక్రియలు రేపు (గురువారం) నెల్లూరులో ఆనం వివేకా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేతల్లో ఆనం వివేకానందరెడ్డి ఒకరు. ఆనం వివేకా సోదరుడు, టీడీపీ నేత ఆనం రాంనారాయణ రెడ్డి రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రిగా, ఆర్థికమంత్రిగా గతంలో పలు శాఖలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించే ఆనం వివేకా.. 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలుపొంది మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆయన 1950 డిసెంబర్ 25న జన్మించారు. ఆనంకు భార్య హైమావతి ఆనం, సంతానం ఆనం చెంచు సుబ్బారెడ్డి, ఆనం రంగా మయూర్ రెడ్డి ఉన్నారు. -
ఆందోళనకరంగా ఆనం వివేకా ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వివేకాకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన నెల్లూరులో చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత మెరుగైన వైద్యాన్ని డాక్టర్లు సూచించడంతో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం వివేకానందరెడ్డిని పరామర్శించారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణతో కలిసి ఆయన కిమ్స్ ఆసుపత్రి వచ్చారు. ఈ సందర్భంగా ఆనం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయనకు అందుతున్న వైద్యం గురించి ఆసుపత్రి ఎండీ భాస్కర్‌రావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం భాస్కర్‌రావు మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి గత నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారం క్రితం ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు రేడియేషన్ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు వచ్చిన సమయంలో వివేకా కళ్లు తెరిచి చూశారని చెప్పారు. -
ఇంకా ఆస్పత్రిలోనే దాసరి
హైదరాబాద్ : సినీ దర్శకుడు దాసరి నారాయణరావు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉందని కిమ్స్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ బి.భాస్కర్‌రావు తెలిపారు. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ గత 35 రోజుల క్రితం దాసరి ఆసుపత్రిలో చేర్పించారు. ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ క్లీన్ చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడం, కిడ్నీల పనితీరు మందగించడంతో ఆయన్ను నాలుగు రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టిందని, మూత్ర పిండాల పని తీరు కూడా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. -
కిమ్స్ హాస్పిటల్స్‌కు ఫార్మసీ డి క్వాలిటీ గుర్తింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అత్యుత్తమ ఫార్మసీ విధానాలకు గాను ప్రతిష్టాత్మకమైన ‘ఫార్మసి డి క్వాలిటీ’ ప్లాటినం రేటింగ్ గుర్తింపు దక్కించుకున్నట్లు కిమ్స్ హాస్పిటల్స్ వెల్లడించింది. దక్షిణాదిలో ఈ పురస్కారం దక్కించుకున్న మొట్టమొదటి ఆస్పత్రి తమదేనని పేర్కొంది. అబాట్ హెల్త్‌కేర్ డెరైక్టర్ విశ్వనాథ్ స్వరూప్, బ్యూరో వెరిటాస్ ప్రతినిధి నుంచి కిమ్స్ హాస్పిటల్స్ డెరైక్టర్ (ఆపరేషన్స్ విభాగం) డి. అనిత తదితరులు ఈ సర్టిఫికేషన్‌ను అందుకున్నారు. ఈ స్ఫూర్తితో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని కిమ్స్ ఆస్పత్రుల సీఈవో బి. భాస్కర్‌రావు తెలిపారు. ఔషధాల నిర్వహణ, పంపిణీ తదితర అయిదు అంశాల ప్రాతిపదికన ఇచ్చే ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను అబాట్ హెల్త్‌కేర్, బ్యూరో వెరిటాస్ సంయుక్తంగా రూపొందించాయి. -
ఆత్మస్థైర్యంతోనే క్యాన్సర్‌పై విజయం : నాగార్జున
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌ను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవచ్చని సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. నేషనల్ క్యాన్సర్ సర్వైవర్స్ డే సందర్భంగా శనివారం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి రూపొందించిన 'డోంట్ ఫైట్ అలోన్' అనే నినాదంతో క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారికి వైద్యులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకంటే ఆ వ్యాధిని జయించిన వారు ఇచ్చే స్ఫూర్తి ఎంతో ధైర్యాన్ని అందిస్తుందన్నారు. తన తండ్రి (అక్కినేని నాగేశ్వరరావు)కి క్యాన్సర్ అని తెలిసినపుడు తమ కుటుంబం మొత్తం ఎంతో తల్లడిల్లిపోయిందని చెప్పారు. తాము భయపడుతుంటే ఆయనే తమకు ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. తన ముందుకు వచ్చే వాళ్లు నవ్వుతూనే రావాలని ఆయన చెప్పేవారని నాగార్జున తెలిపారు. కిమ్స్ ఆస్పత్రి ఎండీ, సీఈవో డాక్టర్ భాస్కర్‌రావు, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డెరైక్టర్ డాక్టర్ రఘురాంలు మాట్లాడుతూ.. ఏటా 10 లక్షల మంది కొత్తగా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని తెలిపారు. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం, క్యాన్సర్‌ను జయించిన వారితోనే సందేహాలు నివృత్తి చేయించడం, ఒకరి బాధలు ఒకరు పంచుకోవడం ఈ గ్రూపు ఉద్దేశమన్నారు.