
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గేయ రచయిత ‘సిరివెన్నెల’సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ‘సిరివెన్నెల’న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
ఐసీయూలో ఉంచి ఊపిరితిత్తులకు సంబంధించి తగిన వైద్యం అందజేస్తున్నామని చెప్పాయి. అలాగే గడిచిన 24 గంటల్లో ‘సిరివెన్నెల’ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment