సినిమాల్లో హీరో కన్నా జీవితంలో హీరో అవ్వాలని ఉద్దేశ్యంతో అవయవ దానం చేస్తున్నట్టు నటుడు జగపతి బాబు అన్నారు... సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన అవయవ దానం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విలక్షన నటుడు జగపతిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు తన 60వ పుట్టిన రోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
చదవండి: Khiladi Movie Review: ఖిలాడి మూవీ ఎలా ఉందంటే..
మనుషులుగా జన్మిస్తాము. మనుషులుగానే చనిపోతాం. వెళ్లేటపుడు 200 గ్రాముల బూడిద తప్ప ఇంకేం మిగలదు అని ఆయన అన్నారు... అవయవ దానం వల్ల మనం మరణించిన తర్వాత 7,8 మందికి పునర్జన్మ ఇవ్వొచ్చు అని జగపతి బాబు అన్నారు... అవయవ దానం చేసిన వాళ్ళకి పద్మశ్రీలు పద్మ భూషణ్ లు ప్రదానం చేయాలని ఆయన అన్నారు... ఈ కార్యక్రమంలో కిమ్స్ ఎండి భాస్కర్ రావు, సీనియర్ IAS అధికారి జయేష్ రంజాన్, జీవన్ దాన్ ఇంచార్జి డాక్టర్ స్వర్ణలత, అక్కినేని నాగసుశీల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment