
టాలీవుడ్ నటుడు జగపతిబాబు తనదైన పాత్రలతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నారు. గతేడాది పుష్ప-2లో మెప్పించిన జగపతి.. ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. వీటితో పాటు గాటి, జాట్ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు జగ్గు భాయ్.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పటికీ టచ్‌లోనే ఉంటారు. సరదా పోస్టులతో అలరిస్తుంటారు. ఇటీవల ఆమనితో కలిసి ఓ మూవీ సెట్‌లో సరదాగా తన సినిమా శుభలగ్నం సీన్‌ను అందరికీ గుర్తు చేశారు. మళ్లీ అమ్మేయడానికి మేకప్ వేస్తున్నావా? అంటూ ఆటపట్టించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజాగా ఇవాళ ఉగాది సందర్భంగా తన మాతృమూర్తితో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. అమ్మ చేతులతో చేసిన ఉగాది పచ్చడిని ఆస్వాదించారు. అమ్మతో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు జగపతి బాబుకు ఉగాది శుభాకాంక్షలు చెబుతున్నారు.
Manchivallandharikey ughaadhi subhakhankshalu… pic.twitter.com/Tc0Vq48YfT
— Jaggu Bhai (@IamJagguBhai) March 30, 2025