Ugadhi
-
సీఎం జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం
-
సీఎం జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం
సాక్షి, పల్నాడు జిల్లా: ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులో కార్యక్రమం జరిగింది. ఉగాది వేడుకలకు హాజరైన సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులకు శాలువా కప్పి, అక్షింతలు చల్లి ఆశీర్వాదం ఇచ్చారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు, విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇదీ చదవండి: జగన్ ముందుకు.. అధఃపాతాళానికి చంద్రబాబు -
Ugadi Festival 2024: పండుగ వస్తోంది.. ఈ స్పెషల్ ఫుడ్స్‌తో గడపండిలా..
ఉగాది వస్తోంది.. క్రోధి నామంతో కొత్త ఏడాదిని తెస్తోంది. కొత్తబెల్లంతో ఉగాది పచ్చడి ఎలాగూ కలుపుకుంటాం. పండుగ రోజు పచ్చడి తర్వాత ఇంకా ఏమేమి తిందాం. కొబ్బరి పాల గారెలు.. మజ్జిగ వడలు చేసుకుందాం. మరికొంత సులువుగా ఓట్స్ స్మూతీ కూడా చేసుకుందాం. ఓట్స్ స్వీట్ స్మూతీ.. కావలసినవి: ప్లెయిన్ సఫోలా ఓట్స్ – అరకప్పు; అరటిపండు – 1; బాదం పాలు – అరకప్పు; నీరు›– అర కప్పు; చక్కెర – పావు కప్పు. తయారీ.. ఓట్స్‌ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో బాదం పాలు, నీరు, అరటి పండు గుజ్జు, చక్కెర, ఓట్స్ పొడి వేసి బీటర్‌తో కలిపితే స్మూతీ రెడీ. గ్లాసులో పోసుకుని తాగడానికి వీల్లేనంత చిక్కగా ఉంటే మరికొంత నీటిని చేర్చుకోవచ్చు. స్మూతీని చల్లగా తాగాలనుకుంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి లేదా స్మూతీ కోసం వాడే నీటిని ముందుగా ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరుచుకోవాలి. బాదం పాలు రెడీమేడ్‌వి తీసుకోవచ్చు లేదా బాదం పప్పులు– నీటిని కలిపి మిక్సీ వేసి పాలను తయారు చేసుకోవాలి. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పాల గారెలు.. కావలసినవి: మినప్పప్పు – పావు కేజీ; నూనె – వడలు వేయించడానికి తగినంత; కొబ్బరిపాలు – లీటరు; యాలకుల పొడి– అర టీ స్పూన్; ఉప్పు– చిటికెడు; బాదం పప్పు – 10 (నానబెట్టి పొట్టు తీసి తరగాలి); జీడిపప్పు – 20; కిస్మిస్– టేబుల్ స్పూన్; పిస్తా– టేబుల్ స్పూన్; నెయ్యి– టేబుల్ స్పూన్; బెల్లం లేదా చక్కెర – అర కేజీ. తయారీ.. మినప్పప్పును శుభ్రంగా కడిగి నాలుగు గంటల సేపు మంచినీటిలో నానబెట్టిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పప్పును ఒక గిన్నెలోకి తీసుకుని బీటర్ లేదా స్పూన్‌తో రెండు నిమిషాల పాటు చిలకాలి. స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న పాత్రను పెట్టి కొబ్బరి పాలు పోసి మరిగించాలి. వేడెక్కుతున్నప్పుడు అందులో చక్కెర వేసి కలుపుతూ మరిగించాలి. చిక్కబడేటప్పుడు యాలకుల పొడి వేసి మరో నిమిషం పాటు మరిగించి దించేయాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న బాణలి పెట్టి నెయ్యి వేడి చేసి అందులో బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ వేయించి కొబ్బరి పాలు బెల్లం మిశ్రమంలో కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి అందులో మినపపిండిని పాలిథిన్ పేపర్ మీద వేసి వత్తి (నిమ్మకాయంత గోళీలుగా కూడా వేసుకోవచ్చు) నూనెలో వేయాలి. రెండువైపులా కాలనిచ్చి తీసి టిష్యూపేపర్ మీద వేయాలి. అదనంగా ఉన్న నూనెను పేపర్ పీల్చుకున్న వెంటనే (వేడిగా ఉండగానే) వడలను ఒక వెడల్పు పాత్రలో పరిచినట్లు అమర్చి కొబ్బరిపాల మిశ్రమాన్ని పోయాలి. వడలు ఐదు నిమిషాల్లో కొబ్బరి పాలను పీల్చుకుంటాయి. వడలు పీల్చుకున్న తర్వాత కూడా పాలు ఇంకా మిగులుగా ఉండాలి. సర్వ్ చేసేటప్పుడు కప్పులో ఒక వడ ఒక గరిటె కొబ్బరి పాలు వేసి ఇవ్వాలి. ఉగాది పచ్చడి.. కావలసినవి: మామిడి పిందె – ఒకటి; వేప పువ్వు – టేబుల్ స్పూన్; బెల్లం పొడి– టేబుల్ స్పూన్; చింతకాయ – ఒకటి (లేకపోతే కొత్త చింతపండు చిన్న గోళీ అంత); ఉప్పు – చిటికెడు; పచ్చిమిర్చి – ఒకటి (తరగాలి). తయారీ.. వేప పువ్వును తొడిమలు, ఈనెలూ తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. చింతపండును నీటిలో నానబెట్టి రసం తీసుకోవాలి. మామిడికాయను శుభ్రంగా కడిగి తొక్క తీయకుండా సన్నగా తరగాలి. ఒక పాత్రలో బెల్లం పొడి, చింతపండు రసం, మామిడికాయ ముక్కలు, వేపపువ్వు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలిపితే ఉగాది పచ్చడి రెడీ. గమనిక: ఇష్టమైతే చెరుకు ముక్కలు, రుచి కోసం అరటిపండు గుజ్జు కలుపుకోవచ్చు. మజ్జిగ వడ.. కావలసినవి: అటుకులు – కప్పు; రవ్వ – పావు కప్పు; మజ్జిగ– అర కప్పు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); అల్లం తరుగు – టేబుల్ స్పూన్; నువ్వులు – టీ స్పూన్; కరివేపాకు – రెండు రెమ్మలు (తరగాలి); కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; బియ్యప్పిండి లేదా ఓట్స్ – టేబుల్ స్పూన్; ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము – టేబుల్ స్పూన్; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; పచ్చి శనగపప్పు– టేబుల్ స్పూన్; నూనె– వేయించడానికి తగినంత. తయారీ.. అటుకులను వెడల్పు పాత్రలో వేసి నీటిని పోసి కడిగి వేరొక పాత్రలోకి తీసుకోవాలి. అటుకులను నీటి నుంచి వేరు చేయడానికి నీటిని వంపకూడదు. నీటిలో తేలుతున్న అటుకులను చేత్తో తీసి మరొక పాత్రలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అటుకుల్లో ఇసుక ఉంటే నీటి అడుగుకు వెళ్లిపోతుంది. అటుకులు శుభ్రంగా ఉంటాయి. పచ్చి శనగపప్పు కడిగి అటుకుల్లో వేయాలి. అందులో రవ్వ, ఉప్పు, మజ్జిగ వేసి కలిపి ఇరవై నిమిషాల సేపు నాననివ్వాలి. ఇప్పుడు నానిన అటుకుల్లో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి తురుము, నువ్వులు, బియ్యప్పిండి వేసి కలిపి పది నిమిషాల సేపు ఉంచాలి. ఇప్పుడు మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని వడకు సరిపోయేటట్లు ఉందా లేదా అని సరి చూసుకోవాలి. మరీ జారుడుగా ఉంటే మరికొంత బియ్యప్పిండి కలుపుకుని పిండి అంతటినీ పెద్ద నిమ్మకాయంత గోళీలు చేసి పక్కన పెట్టాలి. బాణలిలో నూనె వేడి చేసి అటుకుల గోళీని వత్తి మధ్యలో చిల్లు పెట్టి నూనెలో వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చి తీయాలి. ఇలాగే పిండినంతటినీ చేసుకోవాలి. వేడి వేడి వడల్లోకి పుదీనా చట్నీ రుచిగా ఉంటుంది. ఇవి చదవండి: వేసవి తాపాన్ని తగ్గించడంలో మేటి ఈ పప్పు! ఎన్ని ప్రయోజనాలంటే.. -
వచ్చే ఉగాదికి ఘోర విపత్తు.. జోస్యం చెప్పిన కోడిమఠం స్వామి
దొడ్డబళ్లాపురం: దేశంలో 2024 ఉగాది నాటికి ఫెర దుర్ఘటన జరుగుతుందని కోడిమఠం స్వామి జోస్యం చెప్పారు. విపత్తుల గురించి ఆయన తరచ జోస్యాలు చెప్పడం తెలిసిందే. ఆదివారంనాడు హాసన్ జిల్లా అరసికెరె తాలకా హారనహళ్లిలోని కోడిమఠంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రపంచానికి మూడు గండాలు ఉన్నాయని అన్నారు. ఒకటి రెండు దేశాలు కనుమరుగవుతాయని, జనం అకాల మృత్యువాత పడతారని చెప్పారు. 2024 ఉగాదిలోపు ముగ్గురు ప్రముఖ వ్యక్తులకు గండం ఉందని, పాలకులు ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ గండాలను తప్పించవచ్చన్నారు. ఆ గండాలేమిటో కాలం వచ్చినప్పుడు చెబుతానన్నారు. భారీవర్షాలు కురిసి పట్టణాలకు, నగరాలకు అపాయం ఉందన్నారు. పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలుతాయన్నారు. అందరూ ఆధ్యాతి్మక చింతన అలవరచుకోవాలన్నారు. -
ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో వస్తున్న 'స్క్రీన్ ప్లే'.. టైటిల్ లోగో రిలీజ్
పల్లె ఫిల్మ్స్, లయన్ టీమ్ క్రెడిట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్న చిత్రం 'స్క్రీన్ ప్లే'. అంకుర్ కసగోని దర్శకత్వంలో పల్లె అనిల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ లోగోను విడుదల చేసింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ తీయని ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. భారతీయ సినిమా రంగానికి ఆస్కార్ అందించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించింది. ఈ తరుణంలో ఒక వినూత్న యూనివర్సల్ కాన్సెప్ట్ ఎంచుకున్నట్లు దర్శకుడు అంకుర్ కసగోని తెలిపారు. ఈ నెల చివరి వారంలో మొదటి షెడ్యూల్ ప్రారంభించి ఏప్రిల్ చివరినాటి కల్లా షూటింగ్ పూర్తి చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ ఇండియా బుల్స్ మార్కెటింగ్ మేనేజర్ ఉమామహేష్ కప్పల, కవితాలయ స్టూడియోస్ ఈ చిత్ర నిర్మాణానికి సహకారం అందిస్తున్నట్లు నిర్మాత తెలిపారు. -
మస్కట్‌లో ఘనంగా ఉగాది వేడుకలు!
ఒమన్: ఇండియన్ సోషల్ క్లబ్ ఒమన్- తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో మస్కట్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉగాది వేడుకల్లో 600 మంది భారతీయులు పాల్గొన్నారు. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కౌనిసలర్ ఇర్షిద్ అహ్మద్ (కారిమక్ & సామాజిక్ సంక్షేమం), ఇండియన్ ఎంబసీ, శుభోదయం గ్రూప్ ఛైర్మన్ లక్ష్మీ ప్రసాద్ క్లపటపు ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇర్షిద్ అహ్మద్ తెలుగు కళా సమితి విశిష్టతను, మస్కుట్ లోని తెలుగు కమ్యూనిటీ కోసం తెలుగు కళా సమితి చేస్తున్న కృషిని,సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ అనిల్ కుమార్‌తో పాటు చిన్నారావు, తవ్వా కుమార్, సీతారాం, శ్రీదేవి, చైతు సూరపనేని, చైతన్య, రాజ, చరణ్, మూర్తి, శ్రీధర్, రాణి తదితరులు పాల్గొన్నారు. ఉగాది పండుగ వేడుకలు కన్నుల పండువగా జరిపేందుకు తమ వంతు కృషి చేశారు. -
పోలీసులకు ఉగాది పురస్కారాలు
సాక్షి, అమరావతి: పోలీసు శాఖలోని పలు విభాగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న వారికి ప్రభుత్వం ఉగాది పురస్కారాలు ప్రకటించింది. 2020, 2021 ఉత్తమ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాలను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (హోం) కుమార్ విశ్వజిత్ సోమవారం విడుదల చేశారు. రాష్ట్ర పోలీస్, ఫైర్ సర్వీసెస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు పతకాలను ప్రకటించారు. ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి శౌర్య పతకాన్ని ఇద్దరికి ప్రత్యేకంగా ప్రకటించగా, మరో నాలుగు విభాగాల్లో పతకాలను ఇవ్వనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి శౌర్య పతకానికి ఎంపికైన వారికి నెలకు రూ.500 చొప్పున, ఒకేసారి రూ.10 వేల నగదు అందిస్తారు. పోలీస్, ఫైర్ సర్వీసెస్ మహోన్నత సేవా పతకం కింద నెలకు రూ.125, ఒకేసారి రూ.6 వేల నగదు అవార్డుగా ఇస్తారు. పోలీస్, ఫైర్ సర్వీసెస్ ఉత్తమ సేవా పతకానికి ఎంపికైన వారికి నెలకు రూ.100, ఒకేసారి రూ.5 వేల నగదు పారితోషకాన్ని అందిస్తారు. ఏపీ పోలీస్ కఠిన సేవా పతకానికి ఎంపికైన వారికి నెలకు రూ.100, ఒకేసారి రూ.4 వేల నగదు అందిస్తారు. ఏపీ పోలీస్, ఫైర్ సర్వీసెస్ సేవా పతకం కింద నెలకు రూ.75, ఒకేసారి రూ.4 వేలు ఇస్తారు. 2020 ఉగాది పురస్కారాలకు ఎంపికైన వారు పోలీస్ శాఖలో మహోన్నత సేవా పతకానికి విజయవాడ సీఐడీ ఎస్ఐ సీహెచ్ శ్రీనివాసరావు, విజయనగరం ఆర్ఎస్ఐ వైఎస్ భూషణరావు, విజయవాడ ఇంటెలిజెన్స్ ఏఆర్ ఎస్ఐ ఎస్.వెంకటేశ్వరరావుతోపాటు 37 మంది ఎంపికయ్యారు. కఠిన సేవా పతకానికి 30 మంది, సేవా పతకానికి 160 మందిని ఎంపిక చేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులో ఉత్తమ సేవా పతకానికి ముగ్గురు, సేవా పతకానికి 15 మందిని ఎంపిక చేశారు. ఏపీ ఫైర్ సర్వీసెస్ ఉత్తమ సేవా పతకానికి ఇద్దరు, సేవా పతకానికి 25 మందిని ఎంపిక చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో మహోన్నత సేవా పతకానికి విజయవాడలో పనిచేస్తున్న సీహెచ్ రవికాంత్, ఉత్తమ సేవా పతకానికి 13 మందిని ఎంపిక చేశారు. 2021 పురస్కారాలు ఇలా.. పోలీస్ శాఖలో మహోన్నత సేవా పతకానికి తిరుమల ఏఎస్పీ ఎం.మునిరామయ్య, మంగళగిరి 6వ ఏపీఎస్పీ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సీహెచ్‌వీవీ మల్లికార్జునరావు, అనంతపురం డీఎస్పీ ఎన్.మురళీధర్ ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పతకానికి 37 మంది, కఠిన సేవా పతకానికి 30 మంది, పోలీస్ సేవా పతకానికి 161 మంది ఎంపికయ్యారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులో ఉత్తమ సేవా పతకానికి ముగ్గురు, సేవా పతకానికి 8 మంది ఎంపికయ్యారు. ఏసీబీలో మహోన్నత సేవా పతకానికి ముగ్గురు, సేవా పతకానికి 12 మంది ఎంపికయ్యారు. ఫైర్ సర్వీసెస్‌లో ఉత్తమ సేవా పతకానికి ముగ్గురు, సేవా పతకానికి 25 మంది ఎంపికయ్యారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఉత్తమ సేవా పతకానికి 11 మంది ఎంపికయ్యారు. ధర్మాడి సత్యంకు పౌర విభాగంలో శౌర్య పతకం రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్తూ కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీయడంలో విశేష కృషి చేసిన ధర్మాడి సత్యం(కాకినాడ)కు పౌర విభాగం నుంచి ఏపీ ముఖ్యమంత్రి శౌర్య పతకానికి ఎంపిక చేశారు. విజయవాడ బందరు కాలువలో మునిగిపోయిన బాలికను రక్షించిన రిజర్వ్ ఎస్ఐ అర్జునరావుకు కూడా ముఖ్యమంత్రి శౌర్య పతకాన్ని ప్రకటించారు. -
ఉగాదికి కొత్తగా...!
కొత్త తెలుగు సంవత్సర ప్రారంభోత్సవం రోజున చిరంజీవి సరికొత్త అవతారంలో ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మాతలు. పోలవరం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన పోరాట సన్నివేశాలను ఇటీవల తెరకెక్కించారని సమాచారం. అలాగే ఈ సినిమాలో చిరంజీవి లుక్ ఇదేనంటూ ఓ ఫొటో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఉగాది సందర్భంగా అధికారికంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. అందుకు తగ్గ సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘ఆచార్య’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఉగాది నాటికి 25లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు
సాక్షి, ఒంగోలు : రాష్ట్రంలో ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇంటి స్థలాలు పంపిణి చేసేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అమరావతి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో గ్రామ సచివాలయాలు, స్పందన, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. దీనిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి ఉగాది నాటికి ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇంటి స్థలాల పంపిణీ చేపట్టాలన్నారు. సొంత ఆటోలు, టాక్సీలు ఉన్న అర్హులైన వారికి సెప్టెంబర్ చివరి వారం నాటికి వారి బ్యాంకు ఖాతాలో నేరుగా రూ.10 వేలు జమచేస్తామన్నారు. అక్టోబర్ 2వ వారం నాటికి రైతు భరోసా కార్యక్రమం అమలు చేస్తామన్నారు. రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేశామన్నారు. నవంబర్ 21వ తేదీ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సముద్రంలో వేటకు వెళ్లే వారి ఖాతాలో రూ. 10 వేలు జమ చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఇతర అధికారులు అదేవిధంగా మత్స్యకారులకు తక్కువ ధరకు డీజిల్ అందించేందుకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. డీజిల్‌పై లీటరుకు రూ.6 నుంచి రూ. 9 వరకు సబ్సిడీ పెంచామన్నారు. గ్రామ వలంటీర్లు మత్స్యకారులకు ఈ విషయంపై అవగాహన కల్పించేలా చూడాలన్నారు. డిసెంబర్ 21 నాటికి మగ్గం ఉన్న ప్రతి చేనేకారుడికి రూ.24 వేలు ఇస్తామన్నారు. జనవరి 26 నాటికి అమ్మఒడి పథకం కింద పిల్లలను చదివించే ప్రతి తల్లికి రూ.15 వేలు తల్లి ఖాతాలో జమచేస్తామన్నారు. ఫిబ్రవరి చివరి వారం నాటికి షాపులున్న నాయిబ్రాహ్మణులకు, రజకులకు, టైలర్ల వారి ఖాతాల్లో రూ.10 వేలు జమచేస్తామన్నారు. ఫిబ్రవరి చివరి వారం నాటికి వైఎస్సార్ పెళ్లికానుక ప్రోత్సాహకాన్ని పెంచి ఇస్తామన్నారు. మార్చి చివరి వారంలో దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకు, చర్చిల్లో పాస్టర్లకు, మసీదుల్లో ఇమామ్‌లకు ప్రోత్సాహకాలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మార్చి నెలాఖరుకు ఇంటి పట్టాలు పంపిణీ చేసేలా జిల్లా కలెక్టర్లు శ్రద్ధ చూపాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు విడతల వారీగా నగదు అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు రూ.1150 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందకు ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి దశల వారీగా నగదు పంపిణి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం నిర్వహించి వచ్చిన నగదును ప్రభుత్వం జమ చేసుకుంటుందన్నారు. రైతు భరోసా పథకం కింద కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని చేసినట్లు తెలిపారు. గ్రామ వలంటీర్లు రైతులకు, కౌలు రైతులకు మేలు జరిగే కార్యక్రమాన్ని తెలియజేయాలన్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఈ నెల 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుందన్నారు. గత ఐదేళ్ల నుంచి జాతీయ స్థాయిలో క్రీడా రంగంలో గోల్డ్‌మెడల్ సాధించిన వారికి రూ.5 లక్షలు, సిల్వర్ మెడల్ సాధించిన వారికి రూ.4 లక్షలు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి రూ.3 లక్షలు జాతీయ స్థాయిలో జూనియర్ క్రీడాకారులకు గోల్డ్‌మెడల్ సాధించిన వారికి రూ.1.25 లక్షలు, సిల్వర్ మెడ్ సాధించిన వారికి రూ.75 వేలు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి రూ.50 వేలు లెక్కన నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. సచివాలయ ఉద్యోగ పరీక్షలు సజావుగా జరగాలి సెప్టెంబర్‌లో నిర్వహించనున్న గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలను పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు అన్నీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. అక్టోబర్ 2వ తేదీకి గ్రామ, వార్డు సచివాలయ భవనాలను సిద్ధం చేయాలన్నారు. గ్రామ సచివాలయాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం, జెరాక్స్, లామినేషన్ యంత్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఇసుకను బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక కొరత లేకుండా స్టాక్ యార్డ్‌ల్లో ఇసుక నిల్వలు ఉంచాలన్నారు. స్పందన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అర్జీల పరిష్కారంలో తీసుకున్న చొరవను ఇతర జిల్లాల కలెక్టర్లు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలను అభినందించారు. వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక రీచ్‌లు అందుబాటులో లేవని తెలిపారు. రైతులకు సంబంధించిన పట్టాభూమలను 23 ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో గ్రామ సచివాలయ ఏర్పాట్లకు భవనాలను సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. సచివాలయ ఉద్యోగ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను జిల్లా ఎస్పీతో కలిసి కొన్ని అంశాలను పరిశీలించి వేగవంతంగా పరిష్కరించామని వివరించారు. దీనిలో జాయింట్ కలెక్టర్ షాన్మోహన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటసుబ్బయ్య, సీపీఓ వెంకటేశ్వర్లు, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల జేడీలు శ్రీరామమూర్తి, రవీంద్రనాథ్ఠా>గూర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సంజీవరెడ్డి, డీఆర్డీఏ పీడీ నరసింహులు, ఓఎంసీ కమిషనర్ నిరంజన్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు. -
టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
అమెరికాలోని టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల నాయకత్వంలో జరిగిన ఈ ఉగాది సంబరాల్లో లైవ్ కాన్సర్ట్‌లో గాయనీ గాయకులు సుమంగళి, గీతా మాధురి, రోహిత్, శ్రీకాంత్, మెహర్ చంటి లైవ్ బాండ్‌తో అలరించారు. సుమారు 800 మంది ఆహుతులు పాల్గొన్న ఈకార్యక్రమాన్ని ముందుగా షాలిని వేమూరి భరతనాట్యంతో ప్రారంభించారు. క్రిస్టల్ ఈవెంట్స్ వారు చక్కని స్టేజి డెకరేషన్, ఫోటో బూత్ రెడీ చేయగా, మామ్ అండ్ మీ కాన్సెప్ట్ తో నిర్వహించిన ఫ్యాషన్ షో అందరిని ఆకట్టుకుంది. తొలుత సోలో, తర్వాత డ్యూయెట్ పాటలతో స్టేజి మార్మోగిపోయింది. యాంకర్ సాహిత్య తన వ్యాఖ్యానంతో అబ్బురపరిచింది. టెన్నెస్సీ తెలుగు సమితి తదుపరి కార్యవర్గాన్ని అధ్యక్షులు దీప్తి రెడ్డి సభకు పరిచయం చేశారు. ఈసందర్భంగా కమిటీ సభ్యులను, స్పాన్సర్స్, సింగర్స్ అందరిని సత్కరించారు. టాలెంట్ షో, తానా క్యూరీ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. రాఫుల్ విజేతలకు అయిదు గ్రాముల గోల్డ్ కాయిన్స్ అందజేయడం విశేషం. అలాగే వినయ గోపిశెట్టి రూపకల్పన చేసిన విభా ఫ్యాషన్ షో హైలెట్‌గా నిలిచింది. గ్రాండ్ ఫినాలేలో భాగంగా చేసిన డ్రమ్స్ షో, సింగర్స్ సంగీతం స్టాండింగ్ ఒవేషన్ అతిథులను ఆకట్టుకుంది. పెద్దలు కార్యక్రమాన్ని ఆస్వాధించడంకోసం తమ పిల్లలకు విడిగా ప్రొఫెషనల్ ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చెయ్యడం విశేషం. చివరిగా అధ్యక్షులు దీప్తి రెడ్డి ఈ కార్యక్రమానికి సహాయసహకారాలు అందించిన టీటీయస్ కార్యవర్గ సభ్యులు, అడ్వైజరీ కమిటీ, యూత్ కమిటి, స్పాన్సర్స్, అలాగే ఉగాది పచ్చడితోపాటు రుచికరమైన భోజనాన్ని అందించిన అమరావతి రెస్టారెంట్, విజయవంతంచేసిన ప్రేక్షకులు, ప్రత్యేకంగా ప్లాటినం స్పాన్సర్షిప్ ద్వారా లైవ్ బాండ్‌ని సమర్పించిన డాక్టర్ దీపక్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలియజేయడంతో కార్యక్రమం ముగిసింది. -
కొలోన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
కొలోన్ : వికారినామ సంవత్సర ఉగాది, శ్రీరామనవమి వేడుకలు జర్మనీలో కొలోన్ తెలుగు వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కొలోన్లోని స్థానిక ఆడిటోరియంలో అత్యంత శోభాయమానంగా జరిగిన ఈ కార్యక్రమానికి కొలోన్ చుట్టు పక్కన ప్రాంతాలైన ఆకెన్, బాన్, డ్యూస్సెల్ డోర్ఫ్, డ్యూస్బెర్గ్, కొబ్లెంస్, ఫ్రాంక్ఫర్ట్లతో పాటూ ఇతర ప్రాంతాలనుంచి 200మందికి పైగా తెలుగు వారు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినాన ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, వడపప్పు, పానకం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు, పెద్దలు తమ ప్రదర్శనలతో ఆహుతులను ఎంతగానో అలరించారు. నాటకాలు, పద్యాలు, శాస్త్రీయ సంగీతం, భరతనాట్యం, అన్నమయ్య కీర్తనలు, టాలీవుడ్ నృత్యాలు, తెలుగుదనం ఉట్టిపడే సమకాలీన నృత్యాలతో అందరినీ ఆద్యంతం ఆసక్తికరంగా అలరించారు. ప్రతేకించి చిన్నారులు ఆలపించిన హనుమాన్ చాలీసా, పంచాంగ శ్రవణంతో పాటూ, కూచిపూడి, భరతనాట్యం వంటి కార్యక్రమాలతో వేడుక అంతా ఉత్సాహంగా గడిచింది. విశ్వవిద్యాలయాలలో చదువుతున్న తెలుగు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. అతిథులందరికి రుచికరమైన తెలుగు వంటకాలతో భోజనాలు వడ్డించారు. సాయంత్రం వరకు ఎంతో సరదాగా, సంబరంగా ఈ వేడుక సాగి పోయింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక సహాయ సహకారాలు అందించిన సంఘ సభ్యులకు అతిథులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. -
టొరంటోలో ఘనంగా ఉగాది వేడుకలు
టొరంటో : తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టోరంటో(టీసీఏజీటీ) ఆధ్వర్యంలో మెగా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. టొరంటోలోని బిషప్ ఆల్లెన్ అకాడమీ క్యాథలిక్ సెకండరీ స్కూల్లో శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిపారు. టీసీఏజీటీ సెక్రటరీ దేవి చౌదరి ప్రాంభోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆటా, పాటలతో పాటూ పలు సంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలు ఆద్యంతం ఆసక్తిగా సాగాయి. టోరంటో చుట్టు పక్కన ప్రాంతలైన మర్కమ్, బ్రాంప్టన్, మిస్సిసౌగా, ఓక్విల్లే, వాటర్డౌన్, కిట్చెనర్, వాటర్లూ, కేంబ్రిడ్జి, హామిల్టన్, మిల్టన్లతో పాటూ ఇతర ప్రాంతాలనుంచి వందలాది కుటుంబాలు ఈ వేడుకలకు హాజరయ్యాయి. శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు. గత ముప్పై ఏళ్లుగా టీసీఏజీటీ అందిస్తున్న సేవలను ప్రెసిడెంట్ కోటేశ్వరరావు పోలవరపు వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో సహకరించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ట్రస్టీలు, స్పాన్సర్లు, వాలంటీర్లుకు ఛైర్మన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సూర్య బెజవాడ, దేవి చౌదరిలు కృతజ్ఞతలు తెలిపారు. -
ఉందిలే మంచికాలం ముందుముందునా..
సాక్షి, ఏలూరు (మెట్రో): పంచాంగ శ్రవణంలో జిల్లాలో అనుకూలమైన అంశాలున్నాయని పండితులు తెలిపారు. రైతులకు సాగునీటికి కొరత ఉండదని, వారి పరిస్థితి కూడా బాగుంటుందని చెప్పారు. శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలను శనివారం కలెక్టర్ కార్యాలయంలోని గోదావరి సమావేశ మందిరంలో జ్యోతిని వెలిగించి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రారంభించారు. పండితులు తాడికొండ నరసింహరావు, కాశిభొట్ల ప్రసాద్ సంయుక్తంగా పంచాంగ శ్రవణం చేశారు. జిల్లాకు బాగుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కన్నా పశ్చిమ గోదావరి జిల్లా అగ్రభాగాన ఉండేందుకు అవసరమైన సహజ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజల సహకారంతో అభివృద్ధిలో జిల్లాను నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసేందుకు సిద్ధం కావాలన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకు నూరుశాతం చేరినప్పుడే అభివృద్ధి కల సాకారమవుతుందన్నారు. మనం చేసే పని సానుకూల దృక్పథంతో చేస్తే సత్ఫలితాలు సాధించగలమన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. వేద పండితులు యనమండ్ర రవిప్రకాష్ శర్మ, పిరాట్ల ఆదిత్య శఱ్మ, కూచిబొట్ల సచ్చితానంద ప్రసాద్ వేదపఠనం చేసి, వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం గండికోట రాజేష్ శిష్యబృందం ప్రదర్శించిన ఉగాది స్వాగత నృత్యం, జిల్లా ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ ప్రదర్శించిన నృత్యం సభికులను ఆకట్టుకుంది. అనంతరం వేద పఠనం, పంచాంగ శ్రవణకర్తలను కలెక్టర్ సత్కరించారు. కలెక్టర్‌కు జేసీ ఎం.వేణుగోపాలరెడ్డి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
యోగాకు మతం లేదు: వెంకయ్య
ఢిల్లీ: యాంత్రిక జీవితం నుంచి మళ్లీ మనమంతా వెనక్కి వెళ్లాలని, ఆధ్యాత్మిక జీవితాన్ని అలవర్చుకోవాలని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి నివాసంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్రమంత్రి విజయ్ గోయల్, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన సెక్రటరీలు, ఢిల్లీలోని తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... యోగాకు మతం లేదని, దానిని అందరూ అనుసరించాలని సూచన చేశారు. సూర్య నమస్కారం ఇష్టం లేకుంటే చంద్ర నమస్కారం చేయవచ్చునని తెలిపారు. భారత దేశం ఎన్నడూ కూడా ఏ దేశంపైన దాడులు చేయలేదన్నారు. ప్రపంచ శాంతిని కోరుకునేది భారతదేశమని, ప్రపంచమంతా ఒక కుటుంబం లాగా బతకాలన్నదే భారతీయ సంస్కృతి అని తెలియజేశారు. సంస్కృతిని, పర్యావరణాన్ని కాపాడుకుని ముందుకు తీసుకెళ్లడమే భారతీయ సంస్కృతని అభివర్ణించారు. విశిష్టమైన ఈ సంస్కృతిని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనదేనన్నారు. 42 ఏళ్ల తర్వాత ఎన్నికల ఉపన్యాసాలకు దూరంగా ఉండటం ఇదే మొదటిసారని చెప్పారు. రాజ్యాంగ విధులు నిర్వహించడం ఇప్పుడు తన ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. -
సిటీ ‘ఎలక్షన్ టూర్’
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు పిల్లలకు వేసవి సెలవులు.. మరోవైపు ఎన్నికలు.. పైగా ఉగాది పర్వదినం.. అన్నీ ఒకేసారి కలిసి రావడంతో నగరవాసులు ‘ఎన్నికల టూర్’కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత ఊళ్లో ఓటు హక్కును వినియోగించుకోవాలనే పట్టుదలతో పల్లె బాట పడుతున్నారు. ఎన్నికలు, ఉగాది సందర్భంగా కలసి వచ్చే వరుస సెలవుల దృష్ట్యా కూడా చాలా మంది పయనమవుతున్నారు. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు 10 లక్షల మందికి పైగా నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లనున్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు బయలుదేరే ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో సగానికిపైగా రిజర్వేషన్లు భర్తీ అయ్యాయి. విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోనూ వెయిటింగ్ లిస్టు భారీగా పెరిగింది. కొన్ని రైళ్లలో 150 నుంచి 200కు పైగా వెయిటింగ్ ఉంది. మరికొన్ని రైళ్లలో రిజర్వేషన్ల బుకింగ్ సైతం నిలిపివేశారు. వాటిలో ‘నో రూమ్’దర్శనమిస్తోంది. వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే దక్షిణమధ్య రైల్వే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఎన్నికల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లలోనూ బెర్త్‌లన్నీ భర్తీ అయ్యాయి. ప్రత్యేకించి ఏపీకి వెళ్లేందుకు ఇప్పటికిప్పుడు ఎలాంటి అవకాశం లేదు. ఎన్నికల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్ని రైళ్లు అదనంగా ఏర్పాటు చేస్తే తప్ప జనం సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం లేదు. తెలంగాణలోనూ వివిధ జిల్లాలకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లనున్నారు. ఎండాకాలం దృష్ట్యా ఇప్పటికే పలు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరో వారం రోజుల్లో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరుకోనుంది. అదనపు రైళ్లేవి... వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, ముంబై, బెంగళూర్ తదితర ప్రాంతాలకు సుమారు 50 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. వీటిలో చాలా వరకు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లే ఉన్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉండే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఈ రైళ్లు ఎన్నికల రద్దీకి అనుగుణంగా అందుబాటులో లేవు. దీంతో రెగ్యులర్ రైళ్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సుమారు 85 రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ నెల 5 నుంచి 12 వరకు పూర్తిగా బుక్ అయ్యాయి. రద్దీ రెట్టింపయింది. సాధారణ రోజుల్లో మూడు రైల్వేస్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులతో పాటు ఎన్నికల సందర్భంగా మరో 1.5 లక్షల మందికి పైగా బయలుదేరే అవకాశం ఉంది. కానీ ఈ అదనపు రద్దీని అధిగమించేందుకు ఇప్పటి వరకు దక్షిణమధ్య రైల్వే ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. ఏసీ, నాన్ ఏసీ బోగీలన్నీ బుక్ అయిన దృష్ట్యా ప్రయాణికులు అప్పటికప్పుడు సాధారణ బోగీలను ఆశ్రయించవలసి ఉంటుంది. కానీ ఈ జనరల్ బోగీల్లోనూ రెట్టింపుగా తరలివెళ్లే అవకాశం ఉంది. ఏపీలో లోక్‌సభ ఎన్నికలతోపాటు, అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్న దృష్ట్యా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే వారి సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ప్రత్యేక బస్సులకు ఆర్టీసీ ప్రణాళిక... ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 1000 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీఎస్ఆర్టీసీతో పాటు, ఏపీఎస్ ఆర్టీసీ కూడా నగరంలోని కూకట్పల్లి, మియాపూర్, ఎస్సార్ నగర్, అమీర్‌పేట్, ఈసీఐఎల్, సైనిక్‌పురి, ఎల్బీ నగర్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ అధి కారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అను గుణంగా ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేక బస్సు లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సైతం సిద్ధమవుతున్నాయి. ఎన్నికల సంద ర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చార్జీలను రెట్టింపు చేసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. విమాన ప్రయాణాల్లో రాయితీ ఒకవైపు రైళ్లు, బస్సుల్లో ఎన్నికల రద్దీ పరిస్థితి ఇలా ఉండగా, ఎన్నికల సందర్భంగా సొంత ఊళ్లో ఓటు వేసేందుకు బయలుదేరే ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు ప్రత్యేక రాయితీని ప్రకటించాయి. ‘ఘర్ జావో ఓట్ కరో’అనే నినాదంతో థామస్ కుక్ ప్రచారం చేపట్టింది. ఏప్రిల్ నుంచి మే వరకు ఎన్నికల సందర్భంగా రాకపోకలు సాగించే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీని ప్రకటించింది. దేశీయ ప్రయాణాలపైన రూ.1000 చొప్పున, అంతర్జాతీయ ప్రయాణాలపైన రూ.3000 వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆఫర్‌ను వినియోగించుకొనేందుకు ప్రయాణికులు ఆధా ర్ కార్డును, తిరుగు ప్రయాణంలో అయితే ఓటు వేసిన సిరా గుర్తును చూపితే చాలు. ఈ రాయితీ లభిస్తుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. -
జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం
ప్రజాసంకల్ప యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల ఆశీర్వాదం, ప్రజా సంకల్పంతో ముఖ్యమంత్రి కావడం తథ్యమని పంచాంగకర్తలు భవిష్యవాణి వినిపించారు. 2019 మే నెలలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణ పాలనను ప్రజలు మళ్లీ చూడబోతున్నారని పేర్కొన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి పురోహితులు ఆశీర్వాదం అందించారు. ప్రజాసంకల్ప యాత్ర శిబిరం వద్ద జరిగిన ఉగాది వేడుకల్లో ప్రముఖ పంచాంగకర్త శ్రీరామకృష్ణ శర్మ, నల్లపెద్ది ప్రసాదశివరామశర్మ తమ బృందంతో పాల్గొని పంచాంగ శ్రవణం చేశారు. మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహిస్తాం విళంబి అంటే పొడవైనదనే అర్థం వస్తుందని, అధిక మాసాలు ఎక్కువ ఉన్నందున దీన్ని పొడవైన సంవత్సరంగా భావించవచ్చని శ్రీరామకృష్ణ శర్మ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 25 వరకూ జగన్మోహన్రెడ్డి జాతకంలో ఉన్న గోచార సమస్యలు పూర్తి కానున్నాయని తెలిపారు. అవి పూర్తి కాగానే జగన్ కీర్తి మరింత పెరుగుతుందని, 2019 ఎన్నికలకు ముందే ఆయనకు బుధ మహాదశ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇదంతా తాము ముఖస్తుతి కోసం చెప్పడం లేదన్నారు. 2019లో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 135 అసెంబ్లీ సీట్లు వస్తాయని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. 40 మంది పంచాంగకర్తలం కూర్చుని భవిష్యత్తులో జరగబోయేదాన్ని అంచనా వేశామని, ఈ అంచనాలు ఏకాభిప్రాయమని అన్నారు. తాను చెప్పింది జరగకపోతే ఇక జీవితంలో మరెక్కడా పంచాంగ శ్రవణం చేయబోనని అన్నారు. జగన్‌కు, రాష్ట్రానికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఆరిమండ వరప్రసాదరెడ్డి సహకారంతో మహారుద్ర సహిత సహస్ర చండీయాగం తలపెట్టామని, రెండేళ్లపాటు యాగం నిర్వహిస్తామని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక జగన్ పూర్ణాహుతి కోసం వస్తారని పురోహితులు శుభ వచనాలు పలికారు. గత నాలుగేళ్లుగా జగన్ ఏ కార్యక్రమం చేపట్టినా అది ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనేనని చెప్పారు. నత్తనడకన సాగునీటి ప్రాజెక్టుల పనులు ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని, పంటల దిగుబడి కూడా అంతంతమాత్రంగానే ఉంటుందని పంచాంగకర్తలు పంచాంగ శ్రవణంలో తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని, పనులు నత్తనడకన సాగుతాయని చెప్పారు. పంచాంగ శ్రవణం సందర్భంగా వేద పండి తులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆశీర్వచనం ఇచ్చారు. వేద పండితులను ఆయన దుశ్శాలు వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, బాలశౌరి, రావి వెంకటరమణ, మేకతోటి సుచరిత, మర్రి రాజశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, అప్పిరెడ్డితోపాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ మంచి జరగాలి: వైఎస్ జగన్ ‘‘ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడికి వచ్చిన అక్కాచెల్లెమ్మలకు, సోదరులకు, అవ్వాతాతలకు, మిత్రులకు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. -
ప్రతి పండుగలో శాస్త్రీయత: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: భారతీయ సమాజంలో ప్రతి పర్వదినానికి ఓ విశిష్టత ఉందని... వేదాలు, పురాణాలు పూర్వీకుల నుంచి సాంప్రదాయకంగా వస్తున్న ప్రతి పండుగలో శాస్త్రీయత, చరిత్ర ఇమిడి ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. విళంబి నామ సంవత్సర ఉగాది పర్వ దినాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడారు. ఉగాది పండుగ ప్రకృతితో ముడిపడి ఉందని, ఆ విషయం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే తరాలకు సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు పండుగల ప్రత్యేకతను వివరించి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. కులమతాలకతీతంగా అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా అందరూ బాగుపడాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా నరేంద్రమోదీ ఆశయాలు, సంకల్పాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర పార్టీ కార్యకర్తలు కంకణబద్ధులు కావాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రీ శశిభూషణ్ శర్మ పంచాంగ శ్రవణం చేయగా, కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్ రావు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు అద్భుత భవిష్యత్
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్ ఉందని పంచాంగకర్త గొట్టిపాల తిరుమల శాస్త్రి జోస్యం చెప్పారు. ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ చేసే పోరాటాలు విజయం సాధిస్తాయన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో విళంబి నామ సంవత్సర ఉగాది వేడు కలు ఘనంగా జరిగాయి. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలంతా ఏఐసీసీ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లడంతో టీపీసీసీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం పంచాంగ పఠనం చేసిన తిరుమల శాస్త్రి.. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్‌కు మంచి భవిష్యత్ ఉందని, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజల్లో మంచి ఆదరణ పొందుతారని చెప్పారు. అక్టోబర్ తర్వాత ఉత్తమ్‌కు కలిసొస్తుందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి అల్లం భాస్కర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పండుగ వేళ విషాదం
దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఆదివారం ఉగాది సందర్భంగా నిర్వహించిన ఎడ్ల బండ్ల ఊరేగింపులో విషాదం చోటు చేసుకుంది. బెదిరిన ఎడ్లు అదుపు తప్పి జనంపైకి దూసుకెళ్లగా, ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పండుగ సందర్భంగా స్థానిక శివరాంమందిర్ వద్ద ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఊరేగింపు నిర్వహించారు. బండ్లు వరుసగా ఆలయం చుట్టూ తిరుగుతున్నాయి. జనం పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లను తిలకించడానికి వచ్చారు. అదే సమయంలో వరుసలో చివర ఉన్న ఓ ఎడ్ల బండి అదుపు తప్పి జనంపైకి వెళ్లింది. ఒక్కసారిగా జనం పరుగులు తీశారు. అక్కడే ఉన్న బోరెడ్డి బాల్‌రెడ్డి (45) కింద పడగా తలపై నుంచి ఎడ్లబండి వెళ్లింది. దీంతో తల పగిలి తీవ్రంగా రక్తస్రావం కాగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. బాల్‌రెడ్డిని తొలుత స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా రక్తస్రావం ఆగలేదు. ఈ నేపథ్యంలో కామారెడ్డికి తరలించేందుకు యత్నిస్తుండగా, ఆయన అప్పటికే మృతి చెందాడు. -
పంచాంగం సైన్సే
సాక్షి, హైదరాబాద్ : ‘‘దైవారాధన, పెద్దలు చెప్పిన మంచి విషయాలను అనుసరిస్తూ నిరంతరం మానవ ప్రయత్నం కొనసాగిస్తూ ముందుకు సాగాలి. ఇందుకు సంబంధించిన వివరాలు చెప్పే పంచాంగం.. జాతకం చెప్పటం లాంటిది కాదు. అది కచ్చితంగా సైన్స్..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ‘‘గ్రహాల గతి, గమనం, గ్రహణాల తీరు, వాటి వల్ల వచ్చే కాస్మిక్ ప్రభావంపై కచ్చితమైన సమాచారం ఉంటుంది. 50 ఏళ్ల తర్వాత వచ్చే గ్రహణాల పట్టు విడుపులపై ఘడియ, విఘడియలతో సహా కచ్చితమైన సమయాలను చెప్తుంది.టెలీస్కోప్ లాంటివి లేని సమయంలో కూడా ఈ కచ్చితత్వం వచ్చేలా మనకు అందించిన గొప్ప సనాతన పద్ధతి. అద్భుత శాస్త్ర పరిజ్ఞాన శక్తి పంచాంగ రచన’’అని కొనియాడారు. ఉగాది పండుగ రోజు స్వీకరించే పచ్చడిని తినే పదార్థంగా కాకుండా జీవిత పరమార్థంగా పరిగణించాలని, జీవితం ఒకే రకంగా ఉండదని, కొంచెం సుఖం, కొంచెం కష్టం, కొంత సంతోషం, కొంత దుఃఖం ఉంటుందని పేర్కొన్నారు. ఆదివారం ఉద యం ప్రగతి భవన్లో విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించారు. ఇందులో శృంగేరి ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయన్నారు. ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు నూటికి నూరుపాళ్లు నిజమవుతున్నాయని చెప్పారు. తెలంగాణ గొప్ప దేవ భూమి అని, ఇక్కడ ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో నిరంతరం ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందన్నారు. అర్చకులు, ఇమామ్‌లు, మౌజన్లకు వేతనాలిచ్చే పద్ధతి తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదని తెలిపారు. అన్ని వర్గాలను సమదృష్టితో ఆదరించే సంస్కారం తెలంగాణలో ఉందని, ఈరోజు ఉదయమే ఓ పెద్ద మనిషి తనతో అన్నట్టు పేర్కొన్నారు. చిరునవ్వులతో బతికే తెలంగాణ పరిఢవిల్లాలని, ప్రవర్ధమా నం కావాలని, అందుకు దేవుడు పంపిన కార్య కర్తల్లా అంతా కలసి కృషి చేయాలన్నారు. కచ్చితంగా మిగులు రాష్ట్రమే ‘‘భావి తెలంగాణపై ఉద్యమ సమయంలో ఎన్నో ఆకాంక్షించాం, ఆశించాం, వాదించాం. రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఇప్పుడు రాష్ట్రం ఆ దిశగా ముందుకు సాగుతున్న నిజం కళ్ల ముందు కదలాడుతుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది? స్వయం సమృద్ధంగా ఉంటూ కొన్ని రాష్ట్రాలకు సహాయ హస్తం కూడా అందిస్తున్నాం’’ అని సీఎం అన్నారు. సొంతంగా అభివృద్ధి చెందుతూ జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నామని, ఇలాంటి రాష్ట్రాలు ఏడెనిమిదే ఉన్నాయని, అందులో తెలంగాణ కీలకమైందని చెప్పారు. ‘‘కేంద్రానికి మనం రూ.50 వేల కోట్ల వరకు ఇస్తాం. తిరిగి మనకు వచ్చేది రూ.24 వేల కోట్ల లోపే ఉంటుంది. ఇదే విషయాన్ని ఓ సందర్భంలో ప్రధానితో కూడా చెప్పా. ఇప్పుడు విళంబినామ సంవత్సర పంచాంగం కూడా ఇదే చెప్తోంది. కచ్చితంగా తెలంగాణ మిగులు రాష్ట్రమే. ఈ విషయం మళ్లీ రుజువైంది’’అని అన్నారు. రాష్ట్రానికి ఏం ఢోకా లేదని, కచ్చితంగా మిగులు రాష్ట్రంగానే పురోగమిస్తుందని పేర్కొన్నారు. ప్రజల్లో ఉంటే వాటంతట అవే టికెట్లు నేతలెవరైనా హైదరాబాద్‌లో ఉండకుండా ప్రజల్లో ఉంటే టికెట్లు వాటంతట అవే వస్తాయని సీఎం అన్నారు. పోలీసు, ఆరోగ్య శాఖ తీరు బాగుంటుందని పంచాంగ పఠనంలో చెప్పటంతో మంత్రులు నాయిని, లక్ష్మారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి సంతోషంగా కనిపిస్తున్నారన్నారు. ‘‘ఎవరినీ కొట్టే పరిస్థితి ఉండదు. ఎవరినీ పట్టుకునే పరిస్థితి ఉండదు, దుర్మార్గుల ప్రకోపం తగ్గుతుందని చెప్పటం సంతోషం’’అని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ రాశి నా రాశి కర్కాటకనే. నా సంగతి పక్కన పెడితే విళంబినామ సంవత్సరంలో ఈ రాశి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా పంచాంగం చెబుతోంది. మిగులు రాష్ట్రానికి ఇది శుభసూచకమే. ఏతావాతా ఈ రాష్ట్రం వెలుగుజిలుగులు, సిరిసంపదలతో తులతూగుతుందని పంచాంగం చెప్పడం సంతోషం’’అని అన్నారు. ప్రసంగం చివర్లో సీఎం జై తెలంగాణ.. జై భారత్ అంటూ నినదించారు. -
పంచెకట్టులో సీఎం భరత్
వరుస ఫ్లాప్‌లతో నిరాశపరిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. వరుస బ్లాక్ బస్టర్లతో ఫుల్ ఫాంలో ఉన్న కొరటాల మహేష్ కెరీర్‌ను తిరిగి గాడిలో పడతాడన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించిన చిత్రయూనిట్ ఉగాది సందర్భంగా ఆసక్తికరమైన పోస్టర్‌ను రిలీజ్ చేసింది. మహేష్ సాంప్రదాయ దుస్తుల్లో దైవ దర్శనానికి వెలుతున్నట్టుగా ఉన్న పోస్టర్ అభిమానుల్లో మరింత జోష్ పెంచింది. మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ 20న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
అతివృష్టి,అనావృష్టితో రైతులకు ఇబ్బందికరం
-
ఉగాది వేడుకల్లో పాల్గొననున్న వైఎస్ జగన్
-
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
-
రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు