శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: శ్రీ విళంబినామ సంవత్సరంలో యావన్మంది తెలుగు ప్రజలు, అన్య సంస్కృతులు, భాషల ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో శనివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘కాలం జరుగుతూనే ఉంటుంది. ఒక మంచి వస్తుంటుంది. ఒక చెడ్డ వస్తుంటుంది. అన్నింటినీ సహిస్తూ, భరిస్తూ ఆనందాన్ని ఆస్వాదిస్తూ, దుః ఖాన్ని దిగమింగుతూ ముందుకు సాగేదే జీవితం. ప్రతి ఏడాది ప్రారంభాన్ని అందరూ జరుపుకుంటుంటారు.
దేశంలో అనేక భాషలు, అనేక సంస్కృతులు ఉన్నప్పటికీ మన తెలుగువారు ఉగాదిని గొప్పగా జరుపుకోవడం, షడ్రుచుల పచ్చడిని స్వీకరించడం, అందులో మంచీచెడూ రెండు కలసి ఉన్నాయనే అర్థాన్ని ఆస్వాదిస్తారు’ అని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment