అమరవీరుల త్యాగాల ఫలమే తెలంగాణ | KCR Convey BIrthday Greetings To Governor Tamilisai Soundararajan | Sakshi
Sakshi News home page

అమరవీరుల త్యాగాల ఫలమే తెలంగాణ

Published Wed, Jun 3 2020 2:06 AM | Last Updated on Wed, Jun 3 2020 2:06 AM

KCR Convey BIrthday Greetings To Governor Tamilisai Soundararajan - Sakshi

రాజ్‌భవ¯Œ లో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజ¯Œ కు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ ర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి ఆమెను కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. పూ ర్తి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని ఆకాంక్షించారు. అలాగే.. ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కు గవర్నర్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టిన తేదీ, రాష్ట్ర అవతరణ దినోత్సవం ఒకటే రోజు కావడం ఆనందంగా ఉందని గవర్నర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య రాష్ట్ర అవతరణకు సంబం ధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. భార త స్వాతంత్య్రం తర్వాత అంత సుదీర్ఘ కాలం జరిగిన ఉద్యమంగా తెలంగాణ రాష్ట్ర పోరాటం చరిత్రలో నిలుస్తుందని తమిళిసై అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని కేసీఆర్‌ చెప్పారు. వారి త్యాగ ఫలితమే ఈ రాష్ట్రమన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అమరులకు ని వాళులు అర్పించిన తర్వాతే పతాకావిష్కరణ చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి వెంట రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, కేఆర్‌ సురేశ్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌ శర్మ, అనురాగ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సో మేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావు, మేయర్‌ బొంతు రా మ్మోహన్, డిప్యూటీ మేయర్‌ ఫసియుద్దీన్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, నాగేందర్, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement