![Telangana Governor Tamilisai Sensational Comments On CM KCR - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/8/Tamilisai.jpg.webp?itok=TdB6ndzq)
సాక్షి, హైదరాబాద్: ఈ మూడేళ్లలో రాజ్‌భవన్ ప్రజాభవన్‌గా మారిందని గవర్నర్ తమిళిసై అన్నారు. మూడేళ్ల పాలనపై గురువారం ఆమె రాజ్‌భవన్‌లో మాట్లాడుతూ, రాష్ట్రానికి మంచి చేయాలన్నదే తన అభిలాష అని, ప్రభుత్వం గౌరవం ఇవ్వకపోయినా తాను పని చేస్తానన్నారు. పలు సమస్యల పరిష్కారానికి సీఎంకు లేఖలు రాశానని, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటించానని గవర్నర్ పేర్కొన్నారు.
చదవండి: ఈటల రాజేందర్‌తో భేటీ.. బీజేపీలోకి దివ్యవాణి?
‘‘రాష్ట్రంలో పేదల కోసం పనిచేస్తూనే ఉంటాను. మేడారం వెళ్లేందుకు హెలికాఫ్టర్ అడిగితే ఇవ్వలేదు. కనీసం సరైన సమాచారం కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. చివరికి 8 గంటల ప్రయాణం చేసి మేడారం వెళ్లా. ‘గవర్నర్’ ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కారు. రాజ్‌భవన్‌పై వివక్ష చూపుతున్నారు. సమస్యలు ఉంటే నాతో మాట్లాడొచ్చు. ఎటోహోమ్‌కు వస్తానని సీఎం రాకపోవడం కరెక్టేనా?. వాస్తవాలు ప్రజలకు తెలియాలి’’ అని గవర్నర్ తమిళిసై అన్నారు.
‘‘రిపబ్లిక్ డేకు జెండా ఎగరేసే అవకాశం కల్పించలేదు. పెద్ద ఆసుపత్రి డైరెక్టర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటే.. తెలంగాణలో ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment