ఉగాదికి కొత్తగా...! | acharya first look released on ugadi | Sakshi
Sakshi News home page

ఉగాదికి కొత్తగా...!

Published Mon, Mar 9 2020 12:20 AM | Last Updated on Mon, Mar 9 2020 5:03 AM

acharya first look released on ugadi - Sakshi

చిరంజీవి

కొత్త తెలుగు సంవత్సర ప్రారంభోత్సవం రోజున చిరంజీవి సరికొత్త అవతారంలో ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మాతలు. పోలవరం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన పోరాట సన్నివేశాలను ఇటీవల తెరకెక్కించారని సమాచారం. అలాగే ఈ సినిమాలో చిరంజీవి లుక్‌ ఇదేనంటూ ఓ ఫొటో కూడా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఉగాది సందర్భంగా అధికారికంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. అందుకు తగ్గ సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘ఆచార్య’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement