
సాక్షి, పల్నాడు జిల్లా: ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులో కార్యక్రమం జరిగింది.
ఉగాది వేడుకలకు హాజరైన సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులకు శాలువా కప్పి, అక్షింతలు చల్లి ఆశీర్వాదం ఇచ్చారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు, విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: జగన్ ముందుకు.. అధఃపాతాళానికి చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment