Vedic scholars
-
సీఎం జగన్‌కు వేద పండితుల ఆశీర్వచనం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాహిత పాలన కొనసాగాలని, ఆయనకు మరోసారి విజయం చేకూరాలని ఆకాంక్షిస్తూ.. 41 రోజులుగా 45 మంది వేద పండితులతో తాడేపల్లిలో నిర్వహిస్తున్న శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం బుధవారం దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్‌తో వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించారు. పూర్ణాహుతికి వినియోగించే ద్రవ్యాలకు సీఎం జగన్‌తో షోడశోపచార పూజలు చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనం అందజేశారు. బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ, గౌరావర్జుల నాగేంద్రశర్మ ఆధ్వర్యంలో ఈ యాగం జరిగింది. పూర్ణాహుతి కార్యక్రమంలో చండీయాగ నిర్వాహకులు డాక్టర్ ఆరిమండ వరప్రసాద రెడ్డి, విజయశారదా రెడ్డి దంపతులు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు, రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమట సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
-
సీఎం జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం
-
సీఎం జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం
సాక్షి, పల్నాడు జిల్లా: ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులో కార్యక్రమం జరిగింది. ఉగాది వేడుకలకు హాజరైన సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులకు శాలువా కప్పి, అక్షింతలు చల్లి ఆశీర్వాదం ఇచ్చారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు, విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇదీ చదవండి: జగన్ ముందుకు.. అధఃపాతాళానికి చంద్రబాబు -
సీఎం జగన్ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం
-
ఔషధ గుణం.. తారా వనం..
పిఠాపురం: వృక్షారాధన భారతీయుల ఆచారంగా కొనసాగుతోంది. ప్రతి దైవక్షేత్రానికి ఒక స్థల వృక్షం ఉంటుంది.తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి ఆలయ స్థలవృక్షం చింత చెట్టు. ద్వాదశ రాశులు, నవ గ్రహాలు, 27 నక్షత్రాలతో పవిత్రమైన వృక్షాలకు అనుబంధం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. నక్షత్ర వనాలు.. ప్రకృతిని ప్రభావితం చేసే పచ్చని వృక్షాలు జీవరాశుల మనుగడకు దోహదం చేస్తున్నాయి. ప్రతి గ్రహానికి నక్షత్రానికి ఒక వృక్షం ఉంటుందని భారతీయ సనాతన ధర్మం చెబుతోంది. నవగ్రహారాధనలో వృక్షాలకు ప్రత్యేక స్థానం ఉందని వేద పండితులు చెబుతున్నారు. ఒక్కో కాలంలో ఒక్కో చెట్టును పూజిస్తుంటారు.నవ గ్రహాల్లో చంద్రుడికి మోదుగ, సూర్యుడికి ఎర్ర చందనం, అంగారకుడికి చండ్ర, బుధుడికి రావి, గురుడుకి ఉత్తరేణి, శుక్రుడికి వెలగ, శనీశ్వరుడికి జమ్మి, రాహువుకు గరిక, కేతువుకు దర్ప వృక్షాలను పూజించాలని వేదాలు చెబుతున్నాయి. ఆగమ శాస్త్ర ప్రకారం 27 నక్షత్రాలు, 9 గ్రహాలకు సంబంధించి 36 రకాల వృక్షాలను గ్రహాలు, నక్షత్రాలకు సూచికగా చెబుతుంటారు. నక్షత్రాల్లో అశ్వినికి ముషిని, భరణికి ఉసిరి, కృత్తికకు మేడి, రోహిణికి నేరేడు, మృగశిరకు సండ్ర, ఆరుద్రకు గుమ్మడి, పునర్వసుకు సదనం, పుష్యమికి రావి, ఆశ్లేషకు నాగకేశరి, మూలాకు శ్రీగంధం, పూర్వాషాఢకు వందనం, ఉత్తరాషాఢకు పనస, శ్రవణానికి తెల్ల జిల్లేడు, ధనిష్టకు ఇనుపతుమ్మ, శతభిషానికి కదంబ, పూర్వాభాద్రకు వేప, ఉత్తరాభాద్రకు మామిడి, రేవతికి ఇప్ప, మఖకు మర్రి, పుబ్బకు మోదుగ, ఉత్తరకు జువ్వి, హస్తకు అడివి మామిడి, చిత్తకు మారేడు, స్వాతికి తెల్లమద్ది, వైశాఖకి పులివెలగ, అనురాధకు పొగడ, జేష్టకు బూరుగు మొక్కలు నాటడం మంచిదని చెబుతున్నారు. ఆయుర్వేద వనమూలికలుగా చెప్పే నక్షత్ర వృక్షాల కొమ్మలతో హోమం నిర్వహిస్తే వాటి నుంచి వచ్చే పొగ వాతావరణాన్ని రక్షిస్తుందని, గాలిని శుభ్రపరుస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. నా మొక్క నా శ్వాస నా మొక్క నా శ్వాస అనే నినాదంతో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. ఔషధ గుణాలున్న మొక్కలు నాటాలనే సంకల్పంతో ఇటీవల నక్షత్రవనం నిర్మాణం చేపట్టాం. – డాక్టర్ ఉమర్ అలీషా, శ్రీవిశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతులు, పిఠాపురం నక్షత్రాలను బట్టి మొక్కలు ఎవరి నక్షత్రానికి తగ్గ మొక్కను నాటడం వారికి చాలా మంచిది. ఆయా నక్షత్రాల ప్రకారం ఔషధ మొక్కలు నాటితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. – అల్లంరాజు చంద్ర మౌళి, వేద పండితులు, పిఠాపురం -
మహాస్వామి వారి మౌన బోధనం
జగద్గురు ఆదిశంకరులు కూడా మౌనంగానే శిష్యులకు బోధించేవారట. వారి చిన్ముద్రలోనే శిష్యులకు సమస్తసమూ బోధపడేవిట. సత్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాల కారణంగా ఏర్పేడేదే సంసారం. వీటికి దూరంగా ఉండటమే చిన్ముద్ర సందేశం. ఈ సందేశాన్ని ఉత్తమ విద్యార్థులైన రుషులు అర్థం చేసుకున్నారట. అందుకే వారందరూ మూకుమ్మడిగా ఆయననే తమ ఉత్తమోత్తమ గురువుగా, ఉత్తరోత్తరా కూడా ఆయనే తమ గురువుగా ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా కంచి పరమాచార్యను కూడా వారి భక్తులు, శిష్యులు ఇప్పటికీ తమ గురుపరంపరలో ఆద్యునిగా ఆరాధిస్తున్నారు. సేవిస్తున్నారు. సాంత్వన పొందుతున్నారు. ప్రాచీన ఆలయాల ప్రాకారాలపై చెక్కి ఉన్న దక్షిణామూర్తి రూపాన్ని చూస్తే దక్షిణామూర్తి ఒక యువకుడు. చెట్టు మూలంలో కూర్చుని ఉంటాడు. శిష్యులందరూ వృద్ధులు. ఆయనేమో మౌనంగా చిన్ముద్రలో ఉంటాడు. ఆ మౌన వ్యాఖ్యతోనే శిష్యుల సందేహాలు పటాపంచలౌతాయట. చెట్టు ఒక ప్రసిద్ధమైన సంకేతం. ఎడతెరిపి లేని జనన మరణాలతో కూడిన సంసారమనే వక్షం. సంసారానికి మూలమైన పరమాత్మ అనేది శుద్ధ చైతన్యమని మన సిద్ధాంతం. ఈ చైతన్యంలో ప్రకటమయ్యే సృజనాత్మక శక్తినే ప్రకృతి లేదా మాయ అన్నారు. చైతన్యమే జగత్తుగా కనిపిస్తుందని అర్థం. ఈ చెట్టు మూలంలో ఉన్న దక్షిణామూర్తి ఎల్లప్పుడూ మౌనంగా చిన్ముద్రలో కూర్చుని ఉంటాడు. ఆ మౌనముద్రలోనే అంత పెద్ద శిష్యుల సందేహాలన్నీ పటాపంచలు కావడానికి ప్రత్యక్ష ఉదాహరణమే శ్రీశ్రీశ్రీ కంచిçకామకోటి పీఠాధిపతి జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి. ఆయన సాక్షాత్తూ దక్షిణామూర్తి స్వరూపులు. స్వామివారి సన్నిధికి వచ్చి ఆయనను దర్శించుకుని, తమకున్న కొండంత కష్టాల గురించి ఆయనతో మొరపెట్టుకుని ఆయన అనుగ్రహంతో వాటిని తొలగించుకుని తిరిగి సాధారణ జీవితాన్ని గడిపిన వారు కోకొల్లలు. స్వామివారు కాష్ఠమౌనంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు తమ సమస్యలను నివేదించుకునేవారు. ఆయన మౌనంగానే ఉండి తమకు అంతా తెలుసునన్నట్లు వారివంక చిరునవ్వుతో చూసేవారు. సాక్షాత్తూ దైవస్వరూపులైన స్వామి వారి కరుణాపూరిత దృక్కులు చాలదా వారి దుఃఖాలను బాపటానికి! మానవ సంబంధాలలో అత్యుత్తమ మైనది గురుశిష్య బాంధవ్యం. అర్థరహిత, స్వార్థరహితమైన బాంధవ్యం. ఆ గురుశిష్య సంబంధానికి అర్థబలంతో అంగబలంతో పనిలేదు. అహంకారంతో పనిలేదు. స్వార్ధరహితం. ఇలా రహిత పద్ధతిగా ఏర్పడేది ఒక్క గురుశిష్య బాంధవ్యం మాత్రమే. దానిలో ఏమీ మిగలదు. ఎందుకంటే అశరీర పద్ధతే లక్ష్యం కాబట్టి. సశరీర ధర్మాలుగానీ, సశరీర బాంధవ్యాలు గానీ లేకుండా చేసే పద్ధతిగా నిన్ను పరిణమింపచేయడమే దాని ఉద్దేశ్యం. వింతైన విషయం ఏమిటంటే ఈ అన్యోన్య దర్శనం ఉన్నప్పుడే ఈ మౌన వ్యాఖ్య సాధ్యమౌతుంది. పరబ్రహ్మ తత్త్వాన్ని తెలియచెప్పాలంటే ఒకే ఒక మార్గముంది. ప్రకటించటం అంటే తెలియచెప్పటం. పరబ్రహ్మ తత్త్వాన్ని తెలియచెప్పాలంటే ఒకే ఒక పద్ధతుంది. మౌనవ్యాఖ్య. దానిని గురించి శాస్త్రాలలో, ఉపనిషత్తులలో ధర్మ పద్ధతిగా, జ్ఞాన పద్ధతిగా, యోగ పద్ధతిగా ఎలా చెప్పబడింది అనే సాంప్రదాయ రీతులలో దానిని గురించి విశేషంగా మాట్లాడటాన్ని వ్యాఖ్య అన్నారు. గురు హృదయంలో బోధించాలనే సంకల్పం కలగగానే, వ్యక్తీకరించక ముందే శిష్యుడికి అర్థమైపోవాలి.. దక్షిణామూర్తిని గమనిస్తే ‘వటమూల నివాసిని’ వటవృక్షమంటే మర్రిచెట్టు. వటవృక్షం దక్షిణామూర్తి సమానం. అశ్వత్థ వృక్షమంటే రావిచెట్టు. అశ్వత్థ వృక్షం విష్ణు సమానం. పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి ఈ వటవృక్షాన్ని అధ్యయనం చేయాలి, ఆశ్రయించాలి. ‘‘వటవిటపి సమీపే భూమి భాగే విషణ్ణం! సకల ముని జనానాం జ్ఞాన దాతార మారాత్!!’’ ఇటువంటి జ్ఞానానికి అధికారి ఎలా ఉండాలట? జ్ఞానదాత అంటే సద్గురువే. అటువంటి సద్గురువు, నడిచేదైవంగా పేరు పొందిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామికి జేజేలు. ఆయన సన్నిధిని ప్రత్యక్షంగా అనుభవించిన వారికే కాదు, పరోక్షంగా ఆయన బోధల వల్ల ప్రేరణ పొందిన వారికి కూడా ఆయన జీవన్ముక్త స్థితి, భక్తవత్సలత గురించీ బాగా తెలుసు. ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా, తమ అనుగ్రహంతో, ఆశీర్వాదపూర్వకంగా మార్చిన కర్మయోగి, జ్ఞానయోగి. గీతాబోధకు ప్రత్యక్ష నిదర్శనం. నడిచేదైవానికి సహస్రకోటి ప్రణామాలు. సూక్తి సుధ ► మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే.. బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు. ► ఈ ప్రపంచంలో కష్టమయిన పని అంటూ ఏది లేదు.మనకి అదంటే ఇష్టం లేకపోవటం వలన అది ’కష్టం’ గా మారుతుందంతే. ► దూరంగా ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు. దగ్గరగా ఉంటే బంధాలు పెరిగిపోవు. ఎదుటివారి మనసులో మనం ఉన్నపుడు దూరం, దగ్గర అనేవి సమస్యలు కానేకావు. ► మంచో చెడో ఒకడుగు ముందుకెయ్యడానికి ప్రయత్నించు. గెలుపైతే ముందుకెళ్ళు. ఓటమైతే ఆలోచన మార్పు చేయి. ► ఎవరైనా తమతో స్నేహం చేసేవారికి వారివద్దనున్న గుణాన్నే పంచగలరు. మంచివాడు మంచిని, చెడ్డవారు చెడును, కోపిష్టి కోపాన్ని, అజ్ఞానుడు అజ్ఞానాన్ని, తెలివి వంతుడు తన తెలివిని పంచగలడు. ఇందులో నీకు ఎలాంటి స్నేహం కావాలో ఎంచుకోవడం నీ బాధ్యత. నీ స్నేహాన్నిబట్టే సమాజం నిన్ను అంచనా వేస్తుంది. – ఎన్. రమేశన్, ఐ.ఎ.ఎస్. -
సీఎం జగన్‌కు వేద పండితుల ఆశీర్వచనం
సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం పురస్కరించుకుని శుక్రవారం పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వేద పండితులు క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి వేద మంత్రోచ్ఛారణలతో ఆయన్ను ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న సీఎం. చిత్రంలో సీఎస్, ఇతర అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రి జగన్‌తో న్యూ ఇయర్ కేక్ కట్ చేయించారు. ఇక సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు శ్రీరంగనాథరాజు, గౌతంరెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బాలశౌరి, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ కేవీఆర్ఎన్ రెడ్డి, సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనంజయ్‌రెడ్డి, సీఎం ముఖ్య సలహాదారులు అజేయ కల్లం, నీలం సాహ్ని, ప్రభుత్వ, ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కమ్యూనికేషన్స్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్, సమాచారశాఖ కమిషనర్ టి విజయ్‌కుమార్ రెడ్డి. సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి, స్పెషల్ ఆఫీసర్ టు సీఎం డాక్టర్ ఎం హరికృష్ణ ఉన్నారు. అలాగే, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు కూడా సీఎంని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
వేద విద్య ప్రోత్సాహానికి పాఠశాలలు: ఇంద్రకరణ్
సాక్షి, హైదరాబాద్: దేవాలయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, పూజారులు, వేద పండితులు, సిద్ధాంతుల సంక్షేమానికి పాడుతోందని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ, భాషా సాంస్కృతిక శాఖలు, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సహకారంతో రెండు రోజుల తెలంగాణ జ్యోతిష మహాసభలు–2018 సోమవారం రవీంద్రభారతిలో ప్రారంభమయ్యాయి. వేదవిద్యను ప్రోత్సహించేందు కు రాష్ట్రంలో అవసరమైనన్ని వేద పాఠశాలలు ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, జ్యోతిష మహాసభలు సమాజ శ్రేయస్సుకు, రాష్ట్ర సంక్షేమానికి తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు. పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్ధండ విద్యాశంకర భారతీస్వామి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ సనాతన జ్యోతిశ్శాస్త్ర విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు యాయ వరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి మాట్లాడుతూ, ఈ మహాసభలు రాబోయే పండుగల తేదీలపై ఏకాభిప్రాయం సాధించేందుకు దోహదపడతాయన్నారు. జ్యోతిశ్శాస్త్ర వైభవమ్ విశిష్ట సంచికను ఆవిష్కరించి తొలి ప్రతిని గాయత్రీ పీఠం తత్త్వానంద రుషికి అంద జేశారు. కార్యక్రమంలో ‘దర్శనమ్’ ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకుడు మరుమాముల వేంకటరమణ శర్మ, ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి సముద్రా ల వేణుగోపాలాచారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాసంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు బోర్పట్ల హనుమంతాచార్య, కవేలి అనంతాచార్యులు, కృష్ణమాచార్య సిద్ధాంతి, అంతర్వేది కృష్ణమాచార్యులు, తెలంగాణ విద్వత్సభ ఉపాధ్యక్షుడు ఐనవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి తదితరులు పాల్గొన్నారు. -
‘పాలకుర్తి’ సిద్ధాంతి కన్నుమూత
కొడకండ్ల: జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వేద పండితుడు, పంచాంగ సిద్ధాంతి పాలకుర్తి నృసింహరామ శర్మ పరమపదించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తొర్రూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పాలకుర్తి లక్ష్మీనారాయణ శాస్త్రీ, రాధమ్మ దంపతుల కుమారుడు నృసింహరామ శర్మ 1922 జూలై 20న జన్మించారు. ప్రముఖ వేదపండితుడిగా పేరుగాంచిన ఈయన వేలాది దేవాలయాలకు ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు.కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లోనూ వైదిక కార్యక్రమాలు, వేల సంఖ్యలో చండీయాగాలు నిర్వహించారు. శృంగేరి జగద్గురువులు, కంచికామకోటి జగద్గురువులు, హంపి పీఠాధిపతులు, శ్రీకరపాత్ర స్వామి, బసవకళ్యాణ్ శ్రీమదనానంద సరస్వతీ స్వామి, తంజావూరు రాంబాబా, కుర్తాళం పీఠాధిపతులు, సిద్ధేశ్వరానంద భారతీ స్వామి, చినజీయర్ స్వామి, పుష్పగిరి పీఠాధిపతి, విజయదుర్గ పీఠాధిపతి, శ్రీకృష్ణానంద సరస్వతీ స్వామి, శ్రీమాధవానంద సరస్వతీ స్వామి, సద్గురు శివానందమూర్తి వంటి ఎందరో మహనీయులతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999లో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రెండుమార్లు ఉగాది పురస్కారాలను అందుకున్నారు. నృసింహరామశర్మ సిద్ధాంతితో కేసీఆర్‌కు విడదీయలేని అనుబంధం ఉన్నది. ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధాంతి చేతనే ముహూర్తాలు పెట్టించేవారు. దర్శనం ఆధ్యాత్మిక పత్రిక వారు నృసింహరామశర్మకు ధార్మిక వరేణ్య బిరుదును ప్రదానం చేయగా కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరై సిద్ధాంతికి నిర్వహించిన పల్లకీ సేవను స్వయంగా మోసి సన్మానించారు. గతంలో కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సందర్భంలో అనేక కార్యక్రమాలకు సిద్ధాంతి ముహూర్తం నిర్ణయించారు. నృసింహరామశర్మ మృతి పట్ల కేసీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
ముహూర్తం మంచిదేనా?
-
చినుకు రాలాలి.. చింత తీరాలి
చిలుకూరు (మొయినాబాద్): వేద పండితుల మంత్రోచ్చారణలు... విరాటపర్వం పారాయణం... హనుమాన్ చాలీసా పారాయణం... కలశాభిషేకాలతో వరుణ జపం ఘనంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో పన్నెండమంది వేదపండితులతో గురువారం ఆలయ సమీపంలోని గండిపేట చెరువులో వరుణ జపం చేపట్టారు. ఉదయం 10 గంటలకు కలశాల్లో స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకువెళ్లి చెరువులో కలిపి వరుణ జపం ప్రారంభించారు. నాభి (నడుము భాగం) వరకు నీటిలో నిల్చుని పన్నెండు మంది వేదపండితులు మంత్రోచ్చారణలతో మధ్యాహ్నం 12 గంటల వరకు వరుణ జపం చేశారు. నూటా ఎనిమిదిసార్లు (11 ఆవృతులు) వరుణ దేవు ణ్ని ప్రార్థిస్తూ మంత్రాలు జపించారు. అనంతరం చెరువులో నుంచి కలశాన్ని తీసుకువచ్చి గరుత్మంతుడికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్తులు సైతం వరుణ జప మంత్రాల్ని అనుకరించారు. చిలుకూరు బాలాజీ దేవాల యంలో ప్రదక్షిణలు చేసే భక్తులు వర్షాలకోసం అదనంగా రెండు ప్రదక్షిణలు చేశారు. వారం రోజుల నుంచి అదనపు ప్రదక్షిణలు కొనసాగుతున్నాయి. వర్షాలు పడే వరకు భక్తులు అదనపు ప్రదక్షిణలు చేయాలని ఆలయ అర్చకులు సూచించారు. వరుణ జపంలో చిలుకూరు బాలాజీ దేవాలయం మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్, అర్చకులు రంగరాజన్, సురేష్‌స్వామి, వేదపండితులు పాల్గొన్నారు. అన్ని ఆలయాల్లో పూజలు చేయాలి: సౌందరరాజన్ వర్షాలు లేక దేశం కరువు కోరల్లోకి వెళ్తుందన్న సంకేతాలు వస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు ఎక్కడిక్కడ దేవాలయాల్లో పూజలు చేయాలని, వర్షాలకోసం భగవంతున్ని ప్రార్థించాలని చిలుకూరు బాలాజీ దేవాలయం మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్ సూచించారు. వరుణ జపం అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం చిలుకూరులో వరుణ జపం చేసిన తర్వాతే వర్షాలు బాగా పడ్డాయని, ఆ నీళ్లే ఇప్పటి వరకు ఉన్నాయన్నారు. చిలుకూరు బాలాజీ కరుణతో ఈసారి వర్షాలు బాగానే కురుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.