
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదిస్తున్న తిరుమల అర్చకులు
సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం పురస్కరించుకుని శుక్రవారం పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వేద పండితులు క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి వేద మంత్రోచ్ఛారణలతో ఆయన్ను ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు.
క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న సీఎం. చిత్రంలో సీఎస్, ఇతర అధికారులు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రి జగన్‌తో న్యూ ఇయర్ కేక్ కట్ చేయించారు. ఇక సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు శ్రీరంగనాథరాజు, గౌతంరెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బాలశౌరి, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ కేవీఆర్‌ఎన్ రెడ్డి, సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనంజయ్‌రెడ్డి, సీఎం ముఖ్య సలహాదారులు అజేయ కల్లం, నీలం సాహ్ని, ప్రభుత్వ, ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కమ్యూనికేషన్స్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్, సమాచారశాఖ కమిషనర్ టి విజయ్‌కుమార్ రెడ్డి. సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి, స్పెషల్ ఆఫీసర్ టు సీఎం డాక్టర్ ఎం హరికృష్ణ ఉన్నారు. అలాగే, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు కూడా సీఎంని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment