వైవీయూ: ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన ‘సిద్ధం’ పాటల సీడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ ఆవిష్కరించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీడీని రూపొందించిన సూర్య చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు, ఎన్‌ఆర్‌ఐ సూర్యనారాయణ, పాటల రూపకర్త, ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ ఎం.ప్రభాకర్‌లను భారతమ్మ అభినందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘జనహృదయాల్లోకి చొచ్చుకెళ్లే శక్తి పాటకు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ యజ్ఞాన్ని పాటల రూపంలో గ్రామస్థాయికి తీసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. సోషల్ మీడియా ద్వారా కోట్లాది మంది అభిమానులకు ఈ పాటలను అందుబాటులోకి తెస్తాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ‘సిద్ధం’ పాటల సీడీ రూపకల్పనకు సహకారం అందించిన బి.రామతులసి, డా.వి.ఉష, ఎన్.సుదీప్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment