పులివెందుల చేరుకున్న వైఎస్‌ జగన్‌ | YSRCP Chief YS Jagan Pulivendula Tour Updates Highlights, Check Complete Schedule Inside | Sakshi
Sakshi News home page

YS Jagan Pulivendula Tour: వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన.. తొలిరోజు అప్‌డేట్స్‌

Published Tue, Dec 24 2024 8:09 AM | Last Updated on Tue, Dec 24 2024 9:15 PM

Ysrcp Chief Ys Jagan Pulivendula Tour Updates

YS Jagan Pulivendula Tour Day 1 Updates

పులివెందుల చేరుకున్న వైఎస్‌ జగన్‌

  • పులివెందుల నివాసానికి చేరుకున్న జగన్‌

 

08.20PM

నూతన జంటకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం

  • వైఎస్సార్‌సీపీ నేత ఇంట వివాహ వేడుక
  • వేముల కొత్తపల్లిలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్‌ జగన్‌ 
  • వెన్నపూస వెంకట్రామిరెడ్డి ఇంట వివాహ వేడుక
  • వెంకట్రామిరెడ్డి కుమారుడు పురుషోత్తం రెడ్డి, సాహితీ రెడ్డిల వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన వైఎస్‌ జగన్
  • జననేతను చూసేందుకు ఎగబడ్డ జనం
  • కరచలనం, ఫొటోల కోసం ప్రయత్నం

 

03.52PM

కడప ముఖ్యనేతలతో వైఎస్‌ జగన్‌

  • కష్టాలు అనేవి శాశ్వతం కావు
  • మనమందరం కలిసికట్టుగా పని చేయాలి
  • కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు
  • దేశ చరిత్రలో ఏ ఒక్కరూ చేయని మంచి పనులు చేశాం
  • అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం
  • కడప ముఖ్యనేతలు, కార్పొరేటర్లతో వైఎస్‌ జగన్‌
  • పాల్గొన్న ఎంపీ అవినాష్‌ రెడ్డి,  మాజీ డిప్యూటీ సిఎం ఆంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు

ఇదీ  చదవండి: అందుకే మనం ప్రతిపక్షంలో ఉన్నాం!

02.24PM
వైఎస్‌జగన్‌ను కలిసిన కీలక నేతలు

  • పులివెందుల పర్యటనలో భాగంగా.. ముందుగా ఇడుపులపాయలో వైఎస్‌ జగన్‌
  • జగన్‌ను మర్యాదపూర్వకంగా కీలక నేతలు 
  • జగన్‌ను కలిసిన వాళ్లలో..పార్టీ  అధికార ప్రతినిధి.. మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు,  వైస్‌ ఎంపీపీ రామిరెడ్డి ద్వాజారెడ్డి

 

12.08PM

ఇడుపులపాయ ఎస్టేట్‌లోని చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌, కుటుంబ సభ్యులు, ఎంపీ అవినాష్ రెడ్డి

11.25AM

  • ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద తండ్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించిన వైఎస్‌ జగన్‌ 
  • అభిమానులకు అభివాదం చేసిన వైఎస్సార్‌సీపీ అధినేత 

11.08AM

ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. 

  • బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ 

  • వైఎస్సార్‌ ఘాట్‌లో తండ్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించనున్న వైఎస్‌ జగన్‌ 

 నేటి నుంచి నాలుగు రోజుల పాటు పులివెందులలో పర్యటన

  • ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌వద్ద నివాళులర్పిస్తారు

  • అనంతరం ప్రేయర్‌ హాల్‌లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు

  • ఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారు

  • మధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల వెళ్లి రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు

  • ఈ నెల 25న ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్‌ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొంటారు

  • మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించిన అనంతరం పులివెందుల చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు

  • 26వ తేదీన పులివెందుల క్యాంప్‌ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు

  • 27వ తేదీన ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరిగే వివాహానికి హాజరవుతారు

  • అనంతరం బెంగళూరుకు బయలుదేరి వెళతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement