pulivendula tour
-
తరగని అభిమానం
సాక్షి ప్రతినిధి, కడప: ఐదేళ్లు మహిళామణులకు అన్నీ తానై అండదండగా నిలిచారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అహర్నిశలు తపించారు. ప్రతి పథకంలోనూ మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. ఆ అభిమానం నారీలోకంలో గూడు కట్టుకుపోయింది. అయితే ఐదేళ్లకోసారి లభించే ప్రజా తీర్పులో ఆ అభిమాన నేత ఓటమిపాలయ్యారు. అయినా వారిలో ఉన్న మమతానురాగాలు చెక్కు చెదరలేదు. తామెంతో అభిమానించే జననేతను చూడగానే ఉబికి వస్తున్న కన్నీళ్లను పంటిబిగువన ఆపుకునే వారు కొందరైతే, బోరున ఏడ్చేవారు మరికొందరయ్యారు. ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించే ఈ దృశ్యాలు శనివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప నుంచి పులివెందులకు వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారిపై కనిపించాయి.👉 ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారిగా శనివారం పులివెందుల పర్యటనకు వచ్చారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కడపకు చేరుకున్నారు. వైఎస్ జగన్ కాన్వాయ్ వెంట అనుసరించారు. దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా కార్ల కాన్వాయ్ కొనసాగింది. ప్రతి చోటా కాన్వాయ్ ఆపడం, తనను చూసేందుకు వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ మాజీ సీఎం ముందుకు కదిలారు.పులివెందుల చేరేందుకునాలుగు గంటల సమయం..కడప నుంచి పులివెందుల చేరుకునేందుకు వీఐపీ కాన్వాయ్ గంట లేదా గంటన్నర సమ యం పడుతుంది. కాగా, శనివారం కడప నుంచి పులివెందుల చేరుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి 4 గంటల సమయం పట్టింది. కాన్వాయ్‌లో వాహనాలు సుమారు 2 కిలోమీటర్ల పొడువునా బారులు తీరాయి. రోడ్డుపైకి వచ్చిన గ్రామీణులకు అభివాదం చేస్తూ, మహిళలను ఓదారుస్తూ వైఎస్ జగన్ కదిలారు. బేస్తవారిపల్లెలో చిన్నారులను భుజానికెత్తుకుని లాలించారు. ఈ దృశ్యం అభిమానులకు కనువిందు చేసింది. ఇలా ప్రజల ప్రేమాభిమానాల మధ్య పులివెందుల చేరుకునేందుకు నాలుగు గంటలు పైగా సమయం పట్టడం విశేషం.బోరున విలపించిన మహిళలు..పులివెందుల రోడ్డు మార్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్తున్నారని తెలుసుకున్న గ్రామీణులు ఆయా గ్రామాల వద్ద రోడ్డుపైకి వచ్చి చేరారు. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా మహిళలు జగన్‌ను చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో వైఎస్ జగన్‌ను చూడగానే మహిళలు బోరున విలపించారు. వెల్లటూరులో ఆరు పదుల వయస్సు దాటిన ఓ మహిళ అందరూ కూడబలుక్కుని అన్యాయం చేశారే కొడుకా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇలా గ్రామ గ్రామాన మహిళలు తండోపతండాలుగా రోడ్డుపైకి వచ్చి, అభిమాన నాయకున్ని చూడగానే వారిలో ఉన్న ప్రేమాభిమానాలు గుప్పించారు. గుర్రాలచింతలపల్లె, ఇందిరానగర్, కొత్తూరు, వేంపల్లె, తాళ్లపల్లె, వి.కొత్తపల్లె, వేముల, వేల్పుల, బేస్తవారిపల్లె ఇలా దారి వెంబడి మహిళలు ఉద్వేగానికి లోనయ్యారు. మహిళలు ఆయా జంక్షన్లలో పిట్టగోడలు ఎక్కి జగన్ కోసం ఎదురు చూశారు. వేంపల్లె హన్మాన్ జంక్షన్లో మస్తాన్‌బీ అనే మహిళ తన ఆవేదనను ఆపుకోలేక ఒక్కమారుగా కన్నీరు పెట్టుకున్నారు. నాయనా...నువ్వు బాగుండాలి.. మా పాలిట దేవుడివి అంటూ అభిమానాన్ని చాటుకున్నారు. వేల్పులలో మహిళలు మూకుమ్మడిగా రోడ్డుపైకి వచ్చి మేమంతా నీ వెంటే అంటూ నినాదాలు చేశారు. -
‘ఎల్లో’ విష ప్రచారం.. పులివెందులలో ఎలాంటి రాళ్ల దాడి జరగలేదు: డీఎస్పీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై ఎల్లో మీడియా విష ప్రచారానికి ఒడిగట్టింది. ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని పోలీస్ అధికారులు ఖండించారు. పులివెందులలో వైఎస్ జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తుండగా, కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయని.. ఎటువంటి రాళ్లదాడి జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదని.. కేవలం వైఎస్ జగన్‌ను చూడడానికి ప్రజలు తరలిరావడంతో తోపులాట జరిగిందని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. -
YS జగన్ కు కడప ప్రజల బ్రహ్మరథం
-
నేడు పులివెందులకు వైఎస్ జగన్
-
సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
-
వైఎస్సార్సీపీ శ్రేణులకు సీఎం జగన్ ఆప్యాయ పలకరింపు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు, ఇతర వైఎస్సార్సీపీ నాయకులతోపాటు ఏపీ కార్ల్‌లో తొండూరు మండల వైఎస్సార్సీపీ శ్రేణులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మమేకమయ్యారు. ఒక్కొక్కరిని పేరు పేరునా పిలుస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడంపై వైఎస్సార్సీపీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. చదవండి: (దారులన్నీ ప్లీనరీ వైపే) -
Live Blog: సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన
-
CM YS JAGAN: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్
సాక్షి, పులివెందుల/కడప: జిల్లాలో ఈనెల 7,8 తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్ ఖరారు చేసింది. 7వ తేదీ ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ 9.30కి బయలుదేరి 10.20 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.30కి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 10.55కు పులివెందులలోని బాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 10.55కు హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు పులివెందులలోని ఆర్అండ్బి అతిథి గృహానికి చేరుకుంటారు. ►11.05 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ప్రజలు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడి వారి వినతులు స్వీకరిస్తారు. 1.05కు ఆర్అండ్బి గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి 1.15కు పులివెందులలోని ఏపీకార్ల్ చేరుకుంటారు. అక్కడ 1.30వరకూ ఉండి క్షేత్రస్థాయి పర్యటన చేస్తారు. 1.30కి ఏపీకార్ల్ నుంచి బయలుదేరి 1.35కు ఏపీకార్ల్ ప్రధాన భవనానికి చేరుకుని న్యూటెక్ బయోసైన్సెస్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రధాన భవనంలో ఐజీ కార్ల్ మీటింగ్‌లో పాల్గొంటారు. ►2.35కు ఏపీకార్ల్ నుంచి బయలుదేరి 2.45కు బాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 2.50కు అక్కడి నుంచి బయలుదేరి 3.05కు వేంపల్లి హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ 3.20వరకూ స్థానిక నేతలతో మాట్లాడుతారు. 3.20కి రోడ్డు మార్గాన బయలుదేరి 3.30కి డా. వైఎస్సార్ స్మారక పార్కుకు చేరుకొని పార్కును ప్రారంభిస్తారు. 3.50కి అక్కడి నుంచి బయలుదేరి 4 గంటలకు వేంపల్లి జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్‌కు చేరుకుని భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడ 4.50 వరకూ విద్యార్థినీ, విద్యార్థులతో ముచ్చటిస్తారు. 4.50కి వేంపల్లి జెడ్పీ స్కూల్ నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు వేంపల్లి హెలీప్యాడ్ చేరుకుంటారు. 5.05కు హెలికాప్టర్లో బయలుదేరి 5.15కు ఇడుపులపాయ చేరుకుంటారు. 5.20కి హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 5.25కు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. చదవండి: (YSRCP Plenary 2022: పార్టీ పండుగ ‘ప్లీనరీ’) ►8వ తేదీ ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి 8.05కు వైఎస్సార్ ఘాట్‌కు చేరుకొని దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నివాళులు అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. 8.45కు వైఎస్సార్ ఘాట్ నుంచి బయలుదేరి 8.50కు ఇడుపులపాయలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 8.55కు హెలీకాప్టర్‌లో బయలుదేరి 9.10కి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.20 గంటలకు కడప విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 10.20కి రోడ్డు మార్గాన బయలుదేరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగనున్న వైఎస్సార్సీపీ ప్లీనరీలో పాల్గొంటారు. వేంపల్లెలో సీఎం పర్యటనా ప్రాంతాలను పరిశీలిస్తున్న కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్ 8 సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు వేంపల్లె: ఈనెల 7, 8వ తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వి.విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జెడ్పీటీసీ ఎం.రవికుమార్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి పర్యటనా ప్రాంతాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ►కడప – పులివెందుల బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ స్థలాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న అధికారులకు భద్రతపై సలహాలు, సూచనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ మెమోరియల్ పార్కు, రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల నూతన భవనాలు, కంప్యూటర్ ల్యాబ్స్, ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంటును పరిశీలించారు. వీటిని 7వ తేదీన సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ►కార్యక్రమంలో జేసీ సాయికాంత్‌వర్మ, అడిషనల్ ఎస్పీ మహేష్‌కుమార్, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీనివాసులు, ఎంపీపీ ఎన్.లక్ష్మీగాయత్రి, మండల ఉపాధ్యక్షుడు బాబా షరీఫ్, డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, ఈఈ సిద్ధారెడ్డి, ఏపీఈడబ్లు్యఐడీసీ డీఈ సుబ్రమణ్యకుమార్, విద్యుత్ శాఖ డీఈ శ్రీకాంత్, స్పెషలాఫీసర్ మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్ ఎన్.చంద్రశేఖరరెడ్డి, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అధికారులకు సూచనలు పులివెందుల: సీఎం వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్న దృష్ట్యా అందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు మంగళవారం పరిశీలించారు. పులివెందులలోని భాకరాపురంలోని హెలీప్యాడ్, ఆర్అండ్బీ అతిథి గృహం, ఏపీ కార్ల్‌ను వారు పరిశీలించారు. అధికారులకు పర్యటనా ఏర్పాట్లపై తీసుకోవాల్సిన చర్యలు, భద్రతకు సంబంధించి పలు సూచనలు, సలహాలను అందించారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో తీసుకోవాల్సిన చర్యలపై, ఏపీ కార్ల్‌లో రైతులతో సమావేశం ఉన్నందున అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న విషయాలపై సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు. ►పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, ఆర్అండ్బీ ఈఈ సిద్ధారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ మాధవకృష్ణారెడ్డి, కమిషనర్ నరసింహారెడ్డి, సీఐలు రాజు, బాలమద్దిలేటి, ఎస్ఐలు గోపినాథరెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు. -
తొమ్మిదేళ్లు ఆఫీసుల చుట్టూ తిరిగా అన్నా..మీరు చెప్పినట్లు చేశారన్నా
పులివెందుల పర్యటనలో భాగంగా జగనన్న కాలనీ ఇళ్ల పట్టా పంపకాల సందర్భంగా లబ్ధిదారుల ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. సీఎం వైఎస్ జగన్ స్వయంగా పట్టాలు అందిస్తున్న తరుణంలో ఓ ఆడపడుచు మైకు అందుకుని భావోద్వేగానికి లోనైంది. ఇంటి పట్టా అందుకున్న సందర్భంగా సంక్రాంతి పండుగ చేసుకున్నట్లు ఉందని హుషారుగా మాట్లాడింది లబ్దిదారురాలు రేణుక. తన భర్త ఒక ఆటోడ్రైవర్ అని, సొంత ఇల్లు కోసం తొమ్మిదేళ్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పిందామె. అలాంటి సమయంలో ముఖ్యమంత్రిగా వచ్చిన జగనన్న.. ఇచ్చిన హామీకి కట్టుబడి పట్టాలు అందించడం సంతోషంగా ఉందని తెలిపిందామె. అంతేకాదు కరోనా కష్టకాలంలో నిర్లక్క్ష్యం చేయకుండా ఆదుకోవడం, నెలకు రెండుసార్లు రేషన్ ఇవ్వడం, ఇంకా ఇస్తుండడంపై రేణుక సంతోషం వ్యక్తం చేసింది. కష్టకాలంలో ఆసరాగా నిలిచిన వైఎస్ అవినాష్ రెడ్డికి సైతం ధన్యవాదాలు తెలిపింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వైఎస్సార్ కుటుంబానికి మాత్రమే సాధ్యమని, పులి కడుపునా పులే పుడుతుందని సంబురంగా మాట్లాడిందామె. ఒక అన్నలాగా, తమ్ముడిలాగా, తండ్రిలాగా ఆడవాళ్ల రక్షణ కోసం చట్టం చేశారని తెలిపిందామె. చివరగా.. శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా అని పేర్కొందామె. -
పులి కడుపున పులే పుడుతుంది
-
పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ: సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ కడప: మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో ఇంటి పట్టా విలువ కనీసం రూ. 2 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. రూ. 147 కోట్లతో జగనన్న కాలనీ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. జగనన్న కాలనీలో 8042 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు పెడుతోందని పేర్కొన్నారు. కోర్టు కేసుల కారణంగా కార్యక్రమం ఆలస్యమయిందన్నారు. జగనన్న కాలనీలో అన్ని రకాల మౌలిక సదుపాయల అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. జగనన్న కాలనీకి సమీపంలోనే ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు, నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు పెడుతోంది: సీఎం జగన్ నియోజక వర్గంలో ఆక్వాహబ్ సహా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పులివెందులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కు రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పులివెందులలో రూ. 65 కోట్లతో సమగ్రనీటి పథకం, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందించనున్నట్లు చెప్పారు. ప్రతి మండలానికి మర్కెటింగ్ గిడ్డంగి నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగంలో మరిన్ని ముఖ్యాంశాలు: ►చినీ రైతుల కోసం 6వేల టన్నుల నిల్వ చేసే పెద్ద షెడ్డూ ఏర్పాటు ►పెద్దముడియం, కాశీనాయన పోలీసుస్టేషన్లు ప్రారంభం ►రూ.34 కోట్లతో కొత్త బస్‌స్టేషన్ ఏర్పాటు ►పులివెందులలో శిల్పారామం అభివృద్ధికి రూ.13 కోట్లు ►రూ.18 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం ►రూ.44 కోట్లతో పార్క్ ఏర్పాటు ►2023 నాటికి గండి వీరాంజనేయ ఆలయం పునర్నిర్మాణం ►మార్కెట్ యార్డులో రూ.10.5 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కడప ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌కు ఘన స్వాగతం
సాక్షి, కడప: నేటి నుంచి రెండు రోజులపాటు పులివెందుల నియోజకవర్గం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మధ్యాహ్నం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 4.20 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకున్నారు సీఎం జగన్. కడపఎయిర్‌పోర్టు, ఇడుపులపాయలో సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం లభించింది. ఇడుపులపాయ వైఎస్సార్ ఎస్టేట్ చేరుకున్న అనంతరం 4.50 గంటల వరకు పార్టీ నేతలతో మాట్లాడారు. 5.00 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 4.20 గంటలకు ఇడుపులపాయ వైయఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకున్న సీఎం వైయస్ జగన్‌కు ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు స్వాగతం పలికారు. చదవండి: ఇక సొంత ఊరే.. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ -
రేపు వైఎస్సార్ జిల్లాకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్సార్ జిల్లా పులివెందులకు వెళ్లనున్నారు. అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4.20 గంటలకు ఇడుపులపాయలోని హెలిప్యాడ్ వద్ద స్థానిక నాయకులతో కొద్దిసేపు మాట్లాడతారు. అనంతరం వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. 3వ తేదీ తన మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఉదయం 10గంటలకు పులివెందులలోని లయోలా డిగ్రీ కాలేజీ రోడ్డులో ఉన్న సమాధి వద్దకు చేరుకొని నివాళులు అర్పిస్తారు. 10.30కి భాకరాపురంలోని ఆడిటోరియంలో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 11.40 గంటలకు భాకరాపురంలోని నివాసానికి వెళ్తారు. మధ్యాహ్నం 12.40కి కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 1.30కి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మధ్యాహ్నం 2కి తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు. -
వైఎస్సార్ జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ
వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పులివెందులలో మంగళవారం రాత్రి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ పటిష్టత, త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం వేంపల్లి మండలం నందిపల్లిలో పర్యటించారు. ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్ ఓబులేసురెడ్డి, పుల్లారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బుధవారం కూడా వైఎస్ జగన్ జిల్లాలో పర్యటించనున్నారు.