మిస్టరీగా మారిన జమ్ము కశ్మీర్ వరుస �...
నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో మ�...
సంగారెడ్డి, సాక్షి: పటాన్చెరులో కాం�...
అన్నమయ్య, సాక్షి: టీడీపీ జాతీయ కార్యద...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమ�...
క్యాపిటల్ ఘటనలో నిందితులకు క్షమాభి�...
ఇద్దరు ప్రజా ప్రతినిధులు.. అది కూడా పె...
కృష్ణా, సాక్షి: గన్నవరం ఎయిర్‌పోర్టు�...
ఏలూరు, సాక్షి: ఏపీ బీజేపీలో అసంతృప్తి ...
బెంగళూరు, సాక్షి: కర్ణాటక రోడ్డు మరోస�...
హైదరాబాద్, సాక్షి: సంక్షేమ పథకాల లబ్�...
ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తన ఇంట్లోన�...
విజయవాడ, సాక్షి: సీనియర్ ఐపీఎస్ అధ�...
ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్.. ఎక్కడ గుజర�...
పగలు మనుషులకేనా? ప్రకృతిలో ఉన్న ప్రత�...
Published Thu, Jul 7 2022 8:12 AM | Last Updated on Thu, Jul 7 2022 3:16 PM
సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన హైలెట్స్
వేంపల్లిలో రూ. 40 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు
రూ. 3 కోట్ల వ్యయంతో వైఎస్సార్ మెమోరియల్ పార్క్ ఏర్పాటు
వేంపల్లిలో రెండు నూతన పాఠశాలలు ప్రారంభోత్సవం
బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను ప్రారంభించిన సీఎం జగన్
రాష్ట్రంలోనే మోడల్ పాఠశాలగా వేంపల్లి జెడ్పీ పాఠశాల
రూ. 15 కోట్ల రూపాయలతో నిర్మించిన జెడ్పీ పాఠశాల
ప్రకృతి వ్యవసాయంపై గ్రామ స్థాయి నుంచి శిక్షణ అవసరమని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలను తగ్గించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచాలని. వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాలపై దృష్టి సారించాలని సూచించారు.
ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోని సమావేశ హాలులో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై స్థానిక నాయకులు, అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సొంత గడ్డ మమకారం, స్థానిక బంధువులు, స్నేహితులు, సన్నిహితులను ఒకేచోట కలిసిన ఆనందంతో.. నియోజకవర్గ నాయకులను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్
ఈ కార్యక్రమంలో.. పాల్గొన్న జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపి అవినాష్ రెడ్డి
నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతంగా అత్యంత పారదర్శకంగా అలుపెరుగకుండా శ్రమిస్తున్న వైసిపి నాయకులకు, అధికారులకు అభినందనలు తెలియజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
పులివెందుల, వేంపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం
పులివెందుల ఏపీ కార్ల్‌లో న్యూటెక్ బయో సైన్స్‌కు శంకుస్థాపన
పులివెందుల ఆర్అండ్బి గెస్ట్‌హౌస్‌కు సీఎం జగన్ చేరుకున్నారు. పులివెందుల నియజకవర్గం ప్రజలు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.
పులివెందులకు సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. కాసేపట్లో ఆర్అండ్బి గెస్ట్‌హౌస్‌లో ప్రజా ప్రతినిధులతో చర్చలు జరిపి, వినతులు స్వీకరించనున్నారు. అనంతరం పులివెందులలో బయోసైన్స్‌కు శంకుస్థాపన చేయనున్నారు. వేంపల్లెలో వైఎస్సార్ సార్మక పార్క్‌ను సీఎం ప్రారంభించనున్నారు.
కడప ఎయిర్‌పోర్ట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. కాసేపట్లో పులివెందుల బయల్దేరనున్నారు. ఆర్అండ్బి గెస్ట్‌హౌస్‌లో ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపి, వినతులు స్వీకరించనున్నారు. అనంతరం పులివెందులలో బయోసైన్స్‌కు శంకుస్థాపన చేయనున్నారు. వేంపల్లెలో వైఎస్సార్ సార్మక పార్క్‌ను సీఎం ప్రారంభించనున్నారు.
వైఎస్సార్ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. నేడు, రేపు పులివెందుల, వేంపల్లె మండలాల్లో సీఎం పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పులివెందుల చేరుకోనున్నారు. ఆర్అండ్బి గెస్ట్‌హౌస్‌లో ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపి, వినతులు స్వీకరించనున్నారు. అనంతరం పులివెందులలో బయోసైన్స్‌కు శంకుస్థాపన చేయనున్నారు. వేంపల్లెలో వైఎస్సార్ సార్మక పార్క్‌ను సీఎం ప్రారంభించనున్నారు.
శుక్రవారం ఉదయం 8.05 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు సీఎం జగన్ చేరుకుంటారు. తన తండ్రి, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పిస్తారు. 8.55 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి 10.10 గంటలకల్లా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం నాగార్జున వర్సిటీ ఎదురుగా జరిగే వైఎస్సార్సీపీ ప్లీనరీలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 3.30 గంటలకు డాక్టర్ వైఎస్సార్ స్మారక పార్కును సీఎం ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు వేంపల్లె జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చేరుకొని భవనాలను ప్రారంభించి.. విద్యార్థులతో ముచ్చటిస్తారు. సాయంత్రం 5.25 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 7(గురువారం), 8 (శుక్రవారం) తేదీల్లో వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 10.50 గంటలకు పులివెందుల చేరుకుంటారు. ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి వారి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పులివెందులలోని ఏపీ కార్ల్‌కు చేరుకొని.. న్యూటెక్ బయోసైన్సెస్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఐజీ కార్ల్ మీటింగ్‌లో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి.. మధ్యాహ్నం 3.05 గంటలకు వేంపల్లె చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment