
పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనపై ఎల్లో మీడియా విష ప్రచారానికి ఒడిగట్టింది.
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనపై ఎల్లో మీడియా విష ప్రచారానికి ఒడిగట్టింది. ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని పోలీస్ అధికారులు ఖండించారు. పులివెందులలో వైఎస్ జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తుండగా, కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయని.. ఎటువంటి రాళ్లదాడి జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.
పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదని.. కేవలం వైఎస్ జగన్‌ను చూడడానికి ప్రజలు తరలిరావడంతో తోపులాట జరిగిందని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు.