సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23, 24, 25 తేదీల్లో వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అలాగే, క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటారు. ముఖ్యమంత్రి మూడ్రోజుల పర్యటన షెడ్యూల్ ఇలా..
♦ 23వ తేదీ ఉ.9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కడప చేరుకుంటారు. అక్కడి నుంచి గోపవరం చేరుకుని సెంచురీ ప్‌లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్‌పీఎల్ ప్లాంట్లను ప్రారంభించి చైర్మన్, సిబ్బందితో మాట్లాడతారు.
♦ ఆ తర్వాత కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. దీంతో పాటు డాక్టర్ వైఎస్సార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌ను ప్రారంభించిన అనంతరం అదే రిమ్స్ ప్రాంగణంలో డాక్టర్ వైఎస్సార్ క్యాన్సర్ కేర్ బ్లాక్‌ను ప్రారంభిస్తారు.
♦ అనంతరం ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభిస్తారు.
♦ అలాగే, వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లడ్‌లైట్లను ప్రారంభిస్తారు.
♦ ఆ తర్వాత ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని, నవీకరించిన అంబేద్కర్ సర్కిల్, వై.జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ ప్రారంభిస్తారు.
♦అంతేకాక.. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బసచేస్తారు.
♦ఇక 24న ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్ హాల్‌లో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం.. మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్కులో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బసచేస్తారు.
♦ 25వ తేదీ ఉదయం ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి పులివెందుల చేరుకుంటారు, అక్కడ సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు, మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
23, 24, 25 తేదీల్లో.. సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన
Published Fri, Dec 22 2023 5:00 AM | Last Updated on Fri, Dec 22 2023 5:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment