
వైఎస్సార్ జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ
వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పులివెందులలో మంగళవారం రాత్రి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్లతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ పటిష్టత, త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం వేంపల్లి మండలం నందిపల్లిలో పర్యటించారు. ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్ ఓబులేసురెడ్డి, పుల్లారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బుధవారం కూడా వైఎస్ జగన్ జిల్లాలో పర్యటించనున్నారు.