సాక్షి, వైఎస్సార్ కడప: మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో ఇంటి పట్టా విలువ కనీసం రూ. 2 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. రూ. 147 కోట్లతో జగనన్న కాలనీ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
జగనన్న కాలనీలో 8042 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు పెడుతోందని పేర్కొన్నారు. కోర్టు కేసుల కారణంగా కార్యక్రమం ఆలస్యమయిందన్నారు. జగనన్న కాలనీలో అన్ని రకాల మౌలిక సదుపాయల అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. జగనన్న కాలనీకి సమీపంలోనే ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు, నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు పెడుతోంది: సీఎం జగన్
నియోజక వర్గంలో ఆక్వాహబ్ సహా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పులివెందులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కు రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పులివెందులలో రూ. 65 కోట్లతో సమగ్రనీటి పథకం, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందించనున్నట్లు చెప్పారు. ప్రతి మండలానికి మర్కెటింగ్ గిడ్డంగి నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగంలో మరిన్ని ముఖ్యాంశాలు:
►చినీ రైతుల కోసం 6వేల టన్నుల నిల్వ చేసే పెద్ద షెడ్డూ ఏర్పాటు
►పెద్దముడియం, కాశీనాయన పోలీసుస్టేషన్లు ప్రారంభం
►రూ.34 కోట్లతో కొత్త బస్‌స్టేషన్ ఏర్పాటు
►పులివెందులలో శిల్పారామం అభివృద్ధికి రూ.13 కోట్లు
►రూ.18 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం
►రూ.44 కోట్లతో పార్క్ ఏర్పాటు
►2023 నాటికి గండి వీరాంజనేయ ఆలయం పునర్నిర్మాణం
►మార్కెట్ యార్డులో రూ.10.5 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
Comments
Please login to add a commentAdd a comment