పులివెందుల పర్యటనలో భాగంగా జగనన్న కాలనీ ఇళ్ల పట్టా పంపకాల సందర్భంగా లబ్ధిదారుల ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. సీఎం వైఎస్ జగన్ స్వయంగా పట్టాలు అందిస్తున్న తరుణంలో ఓ ఆడపడుచు మైకు అందుకుని భావోద్వేగానికి లోనైంది.
ఇంటి పట్టా అందుకున్న సందర్భంగా సంక్రాంతి పండుగ చేసుకున్నట్లు ఉందని హుషారుగా మాట్లాడింది లబ్దిదారురాలు రేణుక. తన భర్త ఒక ఆటోడ్రైవర్ అని, సొంత ఇల్లు కోసం తొమ్మిదేళ్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పిందామె. అలాంటి సమయంలో ముఖ్యమంత్రిగా వచ్చిన జగనన్న.. ఇచ్చిన హామీకి కట్టుబడి పట్టాలు అందించడం సంతోషంగా ఉందని తెలిపిందామె.
అంతేకాదు కరోనా కష్టకాలంలో నిర్లక్క్ష్యం చేయకుండా ఆదుకోవడం, నెలకు రెండుసార్లు రేషన్ ఇవ్వడం, ఇంకా ఇస్తుండడంపై రేణుక సంతోషం వ్యక్తం చేసింది. కష్టకాలంలో ఆసరాగా నిలిచిన వైఎస్ అవినాష్ రెడ్డికి సైతం ధన్యవాదాలు తెలిపింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వైఎస్సార్ కుటుంబానికి మాత్రమే సాధ్యమని, పులి కడుపునా పులే పుడుతుందని సంబురంగా మాట్లాడిందామె. ఒక అన్నలాగా, తమ్ముడిలాగా, తండ్రిలాగా ఆడవాళ్ల రక్షణ కోసం చట్టం చేశారని తెలిపిందామె. చివరగా.. శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా అని పేర్కొందామె.
Comments
Please login to add a commentAdd a comment