YS Bharathi Reddy
-
సేవాభావాన్ని గుర్తించడం సామాన్యమైన విషయం కాదు
సాక్షి, హైదరాబాద్: సమాజంలో సేవ చేస్తున్న వారిని గుర్తించడం సామాన్యమైన విషయం కాదని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఎన్నో రంగాల్లో సేవ చేస్తున్నవారు నిజజీవితంలో తారసపడుతున్నప్పటికీ.. అందులో ఉత్తమమైన వారిని గుర్తించి అవార్డులు అందిస్తున్న ‘సాక్షి’కృషి అద్భుతమని ప్రశంసించారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న విశిష్ట వ్యక్తులకు ‘సాక్షి’మీడియా గ్రూప్ ఎక్సలెన్సీ అవార్డులు అందజేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ టెన్త్ ఎడిషన్’కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన బండారు దత్తాత్రేయ.. వైఎస్ భారతిరెడ్డితో కలసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడారు.ఈ కృషిని అభినందించాల్సిందే..సమాజంలో ఎలాంటి ఫలాలను ఆశించకుండా సేవచేస్తున్నవారు ఎంతోమంది ఉన్నారని.. ఆ సేవలను గుర్తించి ప్రోత్సహిస్తే, వారిలో ఉత్సాహం రెట్టింపు అవుతుందని దత్తాత్రేయ చెప్పారు. వారి జీవితం సమాజంలోని ఎంతోమందికి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. ఎక్సలెన్స్ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ‘సాక్షి’మీడియా గ్రూప్ పదేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తోందని.. ఈ కృషిని అభినందించాల్సిందేనని చెప్పారు.‘‘ఎక్సలెన్స్ అవార్డుల ఎంపిక ప్రక్రియ ఆషామాషీ కాదు. సేవ చేసేవారిని గుర్తించడం, వారి సేవతో సమాజంలో వస్తున్న మార్పును విశ్లేషించడం ద్వారా విశిష్ట వ్యక్తులను గుర్తించి అవార్డులకు ఎంపిక చేయడం జ్యూరీ సభ్యులకు అతిపెద్ద సవాలు..’’అని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ అవార్డులకు ఎంపిక చేసిన విధానం అద్భుతంగా ఉందని జ్యూరీ సభ్యులను అభినందించారు. పదేళ్ల అవార్డుల ప్రదానోత్సవానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, విద్య, సామాజిక అభివృద్ధి, వ్యాపారం, పరిశ్రమలు, ఆరోగ్య పరిరక్షణ తదితర కేటగిరీలలో తొమ్మిది మందికి గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ‘సాక్షి’ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, ఇక్ఫాయ్ యూనివర్సిటీ డైరెక్టర్లు కె.ఎల్.నారాయణ, కె.ఎస్.వేణుగోపాల్‌రావు, వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ పోతూరి, సాక్షి సీఈవో, డైరెక్టర్లు, ఎడిటర్ పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పుత్రికోత్సాహం.. లండన్‌లో కుటుంబంతో.. ఈ చిత్రాలు చూశారా?
-
వైఎస్ అభిషేక్ రెడ్డికి వైఎస్ జగన్ దంపతులు నివాళి
-
కొత్త జంటను ఆశీర్వదించిన వైఎస్ జగన్
-
పులివెందుల : కొత్త జంటకు వైఎస్ జగన్ దంపతుల ఆశీర్వాదం (ఫొటోలు)
-
క్రిస్మస్ వేడుకల్లో YS భారతీ
-
కుటుంబంతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వరుడిని ఆశీర్వదించిన వైఎస్ భారతిరెడ్డి
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలో ఆర్అండ్బీ డీఈగా పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి, వైఎస్ మెమోరియల్ బాలికల కళాశాల అధ్యాపకురాలిగా పనిచేస్తున్న అనితమ్మల కుమారుడు యశ్వంత్ రెడ్డి వివాహం కాకినాడకు చెందిన శ్రీనిజతో ఆదివారం రాత్రి జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి, ఆమె తల్లి ఈసీ సుగుణమ్మలతో పాటు మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్సార్సీపీ పులివెందుల నియోజకర్గ ఇన్చార్జి దుష్యంత్‌రెడ్డి, ఆయన సతీమణి శిల్పతో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ ఆనందరెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి తదితరులు శనివారం నూతన వరుడిని ఆశీర్వదించారు. -
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
సాక్షి కడప/వేంపల్లె: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 15వ వర్థంతిని పురస్కరించుకుని వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులరి్పంచారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డితోపాటు ఇతర కుటుంబ సభ్యులు సోమవారం ఉదయాన్నే ఘాట్ వద్ద పూలమాలలు వేసి ఘన నివాళి అరి్పంచారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ఇడుపులపాయకు కదిలివచ్చారు. ముందుగా వైఎస్ జగన్ కుటుంబమంతా ఘాట్ ప్రాంగణంలో దివంగత నేతను స్మరించుకున్నారు. వైఎస్ జగన్‌తోపాటు తల్లి విజయమ్మ నివాళులరి్పంచే క్షణంలో భావోద్వేగానికి గురయ్యారు. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి పాస్టర్లు దేవుని వాక్యంతోపాటు వైఎస్సార్ హయాంలో జరిగిన మంచి పనులను వివరించారు. వైఎస్సార్ సువర్ణ పాలనలో ప్రజలంతా సంక్షేమంలో మునిగిపోయారని కొనియాడారు.అంతేకాక.. 108, ఆరోగ్యశ్రీ, 104, ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల కోసం రుణమాఫీ అమలుచేసి ప్రజల కష్టాల నుంచి మహానేత రక్షించారని స్మరించుకున్నారు. మహానేత సేవలు చిరస్మరణీయమన్నారు. వైఎస్సార్ అడుగుజాడల్లోనే వైఎస్ జగన్ ధైర్యంగా ముందుకెళ్తున్నారని పాస్టర్లు కొనియాడారు. కష్టకాలంలో దేవునితోపాటు నాన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్‌కు తోడుగా నిలబడాలని వారు ఆకాంక్షించారు. ఇక ప్రత్యేక ప్రార్థనల్లో చిన్నాన్న వైఎస్ సు«దీకర్‌రెడ్డి, అత్తమ్మ ఈసీ సుగుణమ్మ, సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి, మేనమామ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప నగర మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, టి. చంద్రశేఖర్, విరూపాక్షి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, గోవిందరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ఆర్. రమే‹Ùకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచి్చన వైఎస్సార్ అభిమానులు, పార్టీ శ్రేణులు, నేతలు అందరికీ వైఎస్ జగన్ అభివాదం చేశారు. ఒక్కొక్కరిని పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. -
ఒకే మాట, ఒకే బాట.. అందమైన జంట
-
నూతన వధూవరుల్ని ఆశీర్వదించిన వైఎస్ జగన్ దంపతులు (ఫొటోలు)
-
మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డీ కుమార్తె వివాహనికి హాజరైన వైఎస్ జగన్ దంపతులు
-
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ భారతి
-
CM YS Jagan and YS Bharathi: పులివెందులలో ఓటేసిన సీఎం జగన్ దంపతులు (ఫొటోలు)
-
పులివెందులకు చేరుకున్న సీఎం జగన్
పులివెందుల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా పులివెందులకు చేరుకున్నారు. తన సతీమణి వైఎస్ భారతమ్మతో కలిసి సాయంత్రం 6.15 గంటలకు భాకరాపురంలోని స్వగృహానికి ఆయన చేరుకున్నారు. అనంతరం స్థానిక నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు. సోమవారం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య భాకరాపురంలోని 138 పోలింగ్ బూత్‌లో వారు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం సీఎం జగన్ తాడేపల్లికి బయలుదేరుతారు. -
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
-
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
వైవీయూ: ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన ‘సిద్ధం’ పాటల సీడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ ఆవిష్కరించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీడీని రూపొందించిన సూర్య చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు, ఎన్ఆర్ఐ సూర్యనారాయణ, పాటల రూపకర్త, ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ ఎం.ప్రభాకర్‌లను భారతమ్మ అభినందించారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘జనహృదయాల్లోకి చొచ్చుకెళ్లే శక్తి పాటకు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ యజ్ఞాన్ని పాటల రూపంలో గ్రామస్థాయికి తీసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. సోషల్ మీడియా ద్వారా కోట్లాది మంది అభిమానులకు ఈ పాటలను అందుబాటులోకి తెస్తాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ‘సిద్ధం’ పాటల సీడీ రూపకల్పనకు సహకారం అందించిన బి.రామతులసి, డా.వి.ఉష, ఎన్.సుదీప్‌రెడ్డి పాల్గొన్నారు. -
అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
చక్రాయపేట: ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిన మీ అందరివాడు సీఎం వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతమ్మ ప్రజలను కోరారు. ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డితో కలసి సురభి గ్రామం బీటీపల్లెలో ఇంటింటి ప్రచారం, రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా భారతమ్మ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘వైఎస్ జగన్ ప్రభుత్వం ఎలాంటి బేధాలు లేకుండా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టనన్ని పథకాలను అమలు చేసి.. అందరినీ ఆ రి్థకంగా బలోపేతం చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. అమ్మ ఒడి, చేయూత, పింఛన్లు, ఆసరా, సున్నా వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన.. ఇలా దేశంలో ఎక్కడా లేని పథకాలను మన రాష్ట్రంలో అందించి ఆదర్శంగా నిలిచారు.పేదల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఇంతటి గొప్ప పాలన మళ్లీ కావాలన్నా.. సంక్షేమాభివృద్ధి కొనసాగాలన్నా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వైఎస్ జగన్‌ను, అవి నాష్ రెడ్డిని గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించండి’ అని ప్రజలకు భారతమ్మ విజ్ఞప్తి చేశారు. గడప గడపకూ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ.. ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీటీపల్లెలో గడప గడపకూ వెళ్లారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరిస్తూ మళ్లీ ప్యాన్ గుర్తుకు ఓట్లేయాలని కోరారు. లక్షుమమ్మ అనే వృద్ధురాలు తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పడంతో భారతమ్మ ధైర్యం చెప్పారు. పులివెందులలోని ఆస్పత్రిలో చూపించుకోవాలని సూచిస్తూ.. అక్కడి వైద్యుడికి లేఖ రాసి ఇచ్చారు.అలాగే శారదమ్మ అనే మహిళ తన సమస్య చెప్పుకోగా.. న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రీ, కొడుకులు ఓబుళశెట్టి శ్రీరాములు, అయ్యప్ప ప్రసాద్‌ను భారతమ్మ ఆప్యాయంగా పలకరించారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. చెన్నకేశవులు అనే వృద్ధుడిని ‘ఆరోగ్యంగా ఉన్నావా తాతా’ అంటూ పలకరించారు. మందులు సకాలంలో వేసుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు.అలాగే చిన్నారులను, విద్యార్థులను పలకరించిన భారతమ్మ.. బాగా చదువుకోవాలని చెప్పారు. మీ కోసం అమ్మ ఒడి, గోరుముద్ద, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని వివరించారు. కాగా, భారతమ్మతో సెల్ఫీలు దిగేందుకు యువతీయువకులు పోటీ పడగా.. మహిళలు హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో చక్రాయపేట, తొండూరు మండల ఇన్‌చార్జ్‌లు వైఎస్ కొండారెడ్డి, వైఎస్ మధురెడ్డిల సతీమణులు ధనలక్ష్మి, మాధవీలత, కొండారెడ్డి, సతీ‹Ùరెడ్డిల తనయులు రాహుల్‌రెడ్డి, రోహన్ నాగిరెడ్డి, ఎంపీపీ మాధవీ బాలకృష్ణ, జెడ్పీటీసీ శివప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రామాంజనేయరెడ్డి, ప్రసాదరావు, సభాపతి నాయుడు, వెంకట సుబ్బయ్య, వేదమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారంలో భారతమ్మ..!
-
అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
వేముల: వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ ప్రజలను కోరారు. వైఎస్సార్ జిల్లా వేములలో ఆదివారం ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వైఎస్ జగన్, వైఎస్ అవినాశ్‌రెడ్డిలను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్ భారతమ్మ, ఆమె సోదరుడు, ప్రముఖ వైద్యుడు ఈసీ దినేశ్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి భారతమ్మపై అభిమానం చూపారు. ఆమెను చూడగానే చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ, తమ ఇంటిలోకి ఆహ్వానించి అభిమానాన్ని చాటుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆమెను చూడటంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు. వేముల మెయిన్ రోడ్డు, ఎస్సీ కాలనీ, శేషన్నగారిపల్లె, బచ్చయ్యగారిపల్లెల్లో భారతమ్మ, ఈసీ దినేశ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సోదరి శ్వేతారెడ్డి.. జెడ్పీటీసీ వెంకట బయపురెడ్డి, ఎంపీపీ చల్లా గంగాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ లింగాల ఉషారాణి, వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జి నాగెళ్ల సాంబశివారెడ్డి, మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి, పీసీబీ డైరెక్టర్ మరక శివకృష్ణారెడ్డిలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక టీసీసీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రచారంలో అవ్వాతాతలను, మహిళలు, పెద్దలను ‘అన్న బాగున్నారా.. అవ్వా బాగున్నారా’ అంటూ భారతమ్మ ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఇంటి వద్ద వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను ఆప్యాయంగా ఎత్తుకున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని భారతమ్మ చెప్పారు. పేదలు ఉన్నత చదువులు చదివితే ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చివేశారన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనను గ్రామీణ విద్యార్థులకు చేరువ చేశారని తెలిపారు. పేదల సంక్షేమ పథకాలు కొనసాగడానికి మరోసారి వైఎస్ జగన్‌ను సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. సీఎం జగన్‌కు మెండుగా ప్రజల ఆశీస్సులు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాలపై దృష్టి సారించిందని భారతమ్మ తెలిపారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పాలనను ప్రజల వద్దకే తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేశారన్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ జగన్‌ను ప్రజలు మళ్లీ సీఎంగా కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్ విజయాన్ని ఆపలేరన్నారు. ఎన్నికల ప్రచారంలో పలువురు నేతలు పాల్గొన్నారు. -
అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
-
ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు జగన్‌వైపే
పులివెందుల: ఎన్ని పా ర్టీలు ఏకమైనా, ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా రాష్ట్ర ప్రజలంతా వైఎస్ జగన్‌వైపే ఉన్నారని ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతీరెడ్డి చెప్పారు. జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఇస్లాంపురం, జెండామానువీధుల్లో ఆమె శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ భారతీరెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమ సారథి అయిన వైఎస్ జగన్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకురావాలని.. ఆయనను ఆశీర్వదించాలని కోరారు. టీడీపీ మోసపూరిత హామీలతో మేనిఫెస్టో విడుదల చేసినా.. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. చంద్రబాబు కుయుక్తులను రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి సోదరీమణులు శ్వేత, తేజారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు వైఎస్ ప్రమీలమ్మ, రుక్మిణి, మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, చైర్మన్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన
-
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
-
వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
-
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
ప్రజా క్షేత్రంలో ఒక్కడిని.. ఒకేఒక్కడిని ఎదుర్కొనే దమ్ము లేని పార్టీలు ఏకం అయ్యాయి. కూటమిగా కుట్రలు చేస్తూ.. అసత్య ప్రచారాలతో, మోసపూరిత హామీలతో ప్రజల్ని మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నాయి. కానీ, ఆ జననేత ఈ 58 నెలల పాలనలో ప్రజలకు చేసిన మంచిని నమ్ముకున్నారు. సంక్షేమం తోపాటు అభివృద్ధి, సామాజిక న్యాయం.. ఇవే ఈ ఎన్నికల్లో సీఎం జగన్‌కు మరోసారి అధికారం కట్టబెడుతాయి అని వైఎస్ భారతి అంటున్నారు . పులివెందులలో సీఎం జగన్ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి.. ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాల్ని పంచుకున్నారు..పులివెందుల నా సొంతగడ్డ. నెలకు రెండు రోజులు ఇక్కడికి వస్తుంటా. పులివెందుల ఎమ్మెల్యే సీఎం జగన్‌కు, ఇక్కడి ప్రజలకు మధ్య నేనొక వారధిని. ఇక్కడి ప్రజల బాగోగుల్ని వీళ్ల ఎమ్మెల్యే తరఫున నేనే చూస్తుంటా. ఎప్పుడు, ఎవరు, ఏ సమయంలో అయినా సరే తమకు ఫలానా కష్టం వచ్చింది అంటే చాలూ.. అప్పటికప్పుడే పరిష్కారం చూపిస్తుంటాం. ఇప్పుడు.. ఈ ప్రచారంలోనూ కొందరు విజ్ఞప్తులు ఇస్తున్నారు. కానీ, కోడ్ అమలులో ఉంది కాబట్టి ఎన్నికలయ్యాక పరిష్కరిస్తామని భరోసా ఇస్తూ ముందుకెళ్తున్నాం. తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచే..సీఎం వైఎస్ జగన్ తన 58 నెలల పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృష్టి చేశారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ కనబర్చారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం మొదలు.. బడికి వెళ్తే ప్రత్యేక మెనూతో నాణ్యమైన భోజనం అందించేందుకు జగనన్న గోరుముద్ద లాంటి పథకాలు అమలు చేస్తున్నారు. పేదపిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువును అందిస్తున్నారు. ఎనిమిదో తరగతి నుంచే విద్యార్థులకు బైజూస్ కంటెంట్ అందిస్తూ.. డిగ్రీ కోర్సులతో పాట టోఫెల్ వంటి కోర్సుల శిక్షణ అందించటం కోసం ఎడెక్స్ లాంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు.లక్షల మంది యువతకు ఉపాధిసీఎం జగన్ పాలనలో గత ఐదేళ్ల పాలనలో ప్రైవేటు, ప్రభుత్వ ఒప్పంద ఉద్యోగాలు కలిపితే.. సుమారు 30.32 లక్షల మంది యువతకు ఉపాధి దక్కింది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను గాలికి వదిలేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం ఎంఎస్ఎంఈలకు భారీ ఇన్సెంటీవ్స్ అందించింది. సీఎం జగన్ ప్రభుత్వం ఇచ్చిన మద్దతుతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు యువతకు కొత్త ఉద్యోగాలను కల్పిస్తున్నాయి.మరోవైపు ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయం, మత్య్స రంగాలను అభివృద్ధి చేసి ఉపాధి కల్పనపై దృష్టి పెట్టింది. నూతనంగా నాలుగు పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. తద్వారా మత్స్య పరిశ్రమ ఆదాయాన్ని పెంచటంతో పాటు ఉపాధిని కల్పిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద నగరాలు లేవు. అయినా.. రాష్ట్రంలో ఉన్న వనరులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినియోగించుకొని అభివృద్ధి చేయటంతో పాటు.. యువతకు ఉద్యోగాలు కల్పించింది.కరోనా కాలంలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని ఆపలేదు. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకుంది. ఆ సమయంలోనూ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేసింది. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలో రాగానే.. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుంది.ఈ మేనిఫెస్టో సంక్షేమం కొనసాగింపే..ఈ మధ్యే వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ప్రకటించింది. గత ఐదేళ్ల ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కొనసాగిస్తామని.. ఆ పథకాలకు అదనపు సంక్షేమం ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అంటే సంక్షేమం విషయంలో అడుగులు ముందుకే ఉంటాయని ఆయన అన్నారు. గిగ్ వర్కర్లకు కూడా ఇన్స్‌రెన్స్ సదుపాయం కల్పించడం హర్షనీయమైన విషయం.ఇద్దరిలో ఎవరిపైన పులివెందుల ప్రజలకు ఎక్కువ ప్రేమ? పులివెందులలో మూడు తరాల ప్రజలకు వైఎస్సార్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. దివంగత మహానేత వైఎస్సార్ తొలిసారి 1978లో ఎమ్మెల్యే గెలిచారు. ఆస్పత్రులు, కాలేజీలు నిర్మించారు. అప్పటి నుంచి 45 ఏళ్లుగా ఇక్కడి ప్రజలకు వైఎస్సార్ కుటుంబం సేవ చేస్తోంది. సీఎం జగన్‌కు కూడా పులివెందుల ప్రజలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వైఎస్సార్ చేసిన అభివృద్ధిని సీఎం జగన్ కొనసాగిస్తున్నారు. మా కుటుంబం కూడా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోంది. వైఎస్సార్, సీఎం జగన్‌కు పులివెందుల ప్రజల ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. పులివెందులలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి. అన్ని మండలాల్లో ఇంటింటికి ప్రచారం చేసి.. సీఎం జగన్‌కు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరుతున్నా. వెళ్లిన ప్రతీ చోట్లా అంతా ఆప్యాయంగా పలకరించడం సంతోషంగా ఉంది. ఆ స్పందనే సీఎం జగన్ గెలుపును తెలియజేస్తోందని వైఎస్ భారతి అన్నారు👉: ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వైఎస్ భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం
-
వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు
-
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
-
పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం
-
మాజీ సీఎం చంద్రబాబు విచక్షణతో మాట్లాడాలి
వేంపల్లె : మాజీ సీఎం చంద్రబాబునాయుడు విచక్షణతో మాట్లాడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ అన్నారు. వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పారు. ఆమె సోమవారం వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను చంపితే ఏం చేస్తారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. చంద్రబాబు వయసులో పెద్దవారని, ప్రజా జీవితంలో ఇలాంటి మాటలు మాట్లాడటం తగదని అన్నారు. ఇలాంటి ఆలోచనలు మంచివి కావన్నారు. విశాఖ, విజయవాడల్లో జరిగిన హత్యాయత్నాల లాంటి ఘటనలను ప్రేరేపించడం దారుణమన్నారు. పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి లేదని మాట్లాడే వాళ్లకు కళ్లు లేవని అనుకుంటున్నానని అన్నారు. కోట్లాది రూపాయలతో చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందని చెప్పారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, మహిళలు అందరూ జగన్‌ను వారి పెద్ద కొడుకని, నెలనెలా ఇంటికి డబ్బు ఇస్తున్నాడని తన ఎన్నికల ప్రచారం సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఐదేళ్లకు ముందు ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటి ముంగిట సమస్యలు ఉన్నాయని, మాకు అవి రాలేదు ఇవి రాలేదని చెప్పేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నామని, సీఎం జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటామని ప్రజలంతా చెప్పారన్నారు. సంక్షేమ పథకాలు చాలా బాగా అందుతున్నాయని ప్రజలు చెబుతుండటంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీ‹Ùకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్‌రెడ్డి, ఎంపీపీ లక్ష్మిగాయత్రి, సర్పంచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
బాబు వ్యాఖ్యలకు వైఎస్ భారతి రియాక్షన్
-
చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ భారతి స్పందన
వైఎస్సార్, సాక్షి: ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మరోవైపు టీడీపీ అధినేత వ్యాఖ్యలపై పులివెందుల ప్రచారంలో ఉన్న సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారామె.సీఎం జగన్ పాలనపై ప్రజలు సంతోషగా ఉన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. పులివెందులలో అభివృద్ధి లేదనే వారికి కళ్లు లేవు అనుకోవాలి. పులివెందులలో ఎంతో అభివృద్ధి జరిగింది.చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రజాజీవితంలో ఉన్నవారు విచక్షణతో మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు వయసులో పెద్దవారు. ఆయన అలా మాట్లాడటం తప్పు. ఒక వ్యక్తిని చంపాలనుకోవడం తప్పు ఏమైనా ఉంటే ప్రజల వద్ద తేల్చుకోవాలి. ఇది ఆయన విక్షణకే వదిలేస్తున్నాం. ప్రజలను మెప్పించుకోవాలి కానీ, అడ్డు తొలగించుకోవాలనుకోవడం దారుణం అని భారతి అన్నారు.ఇదిలా ఉంటే.. వైఎస్ భారతి ప్రచారానికి పులివెందుల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గడపగడపకు వెళ్లి అయిదేళ్ల కాలంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రస్తుత మేనిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేందుకు సీఎం వైఎస్ జగన్‌కు ఓటు వేసి గెలిపించాలన్నారు. -
ప్రతి ఇంటి దగ్గర మా బిడ్డ..మా బిడ్డ అంటున్నారు.. భార్యగా నాకు ఇంకేం కావాలి
-
ఇంటింటి ప్రచారంలో వైఎస్ భారతి
-
అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ..!
-
సకుటుంబ సపరివార సమేతంగా
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట అయిన వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఘనవిజయానికి ఆయన కుటుంబమంతా కదిలింది. పులివెందుల అసెంబ్లీ స్థానంలో సీఎం వైఎస్ జగన్‌కు, కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాశ్‌రెడ్డి, పార్టీ ఇతర అభ్యర్థులకు గత ఎన్నికల్లోకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించే బాధ్యతలను కుటుంబ సభ్యులు భుజాన వేసుకున్నారు. అందరూ కలిసి ప్రణాళిక ప్రకారం జిల్లా ప్రజల ముందుకు వెళ్తున్నారు. వైఎస్సార్ సోదరులు, సమీప బంధువులు నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు.సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ సహా మరికొందరు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన సంక్షేమం, సాధించిన అభివృద్ధి, సుపరిపాలనను వివరిస్తూ గత ఎన్నికలకంటే మరింత ఎక్కువ మెజార్టీతో ఘనవిజయాన్ని అందించాలని ప్రజలను కోరుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సామాన్యుల ఉన్నతే లక్ష్యంగా, విశేష పారిశ్రామిక ప్రగతి సాధించిన సీఎం వైఎస్ జగన్‌ను, వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించారని, మరోమారు ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు బాధ్యతలిలా.. వైఎస్సార్ సోదరులు వైఎస్ రవీంద్రనాథరెడ్డి, వైఎస్ సు«దీకర్‌రెడ్డి, వైఎస్ మధుకర్‌రెడ్డి కడప నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల మున్సిపాలిటీకి వైఎస్ మనోహర్‌రెడ్డి, లింగాలకు వైఎస్ అభిõÙక్‌రెడ్డి, తొండూరుకు వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి ఇన్చార్జిలుగా ఉన్నారు. పులివెందుల రూరల్, కొండాపురం మండలాలకు చవ్వా దుష్యంత్‌రెడ్డి, జమ్మలమడుగుకు చవ్వా జగదీష్‌రెడ్డి ప్రచార బాధ్యతలు చేపట్టారు. వేముల మండల ఇన్చార్జిగా డాక్టర్ ఈసీ దినేష్‌రెడ్డి, సింహాద్రిపురానికి గండ్లూరు వీరశివారెడ్డి, చక్రాయపేటకు వైఎస్ కొండారెడ్డి, వేంపల్లెకు వైఎస్సార్ మేనల్లుడు యువరాజ్‌రెడ్డి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ విజయం కోసం సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సతీమణి వైఎస్ సమతారెడ్డి, సోదరి వైఎస్ శ్వేతారెడ్డి, చవ్వా సునీతారెడ్డి, వైఎస్ తేజారెడ్డి, దివ్య (వైఎస్సార్ మేనకోడలు) విస్తృతంగా పర్యటిస్తున్నారు. వీరంతా ఇప్పటికే పులివెందుల, కడప, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో పర్యటించారు. జగన్ చెబితే చేస్తారు.. చంద్రబాబు చెప్పినా చేయరు: వైఎస్ భారతమ్మ పులివెందుల/తొండూరు: సీఎం వైఎస్ జగన్ చెబితే చేస్తారని, చంద్రబాబు చెప్పినా చేయరని సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ చెప్పారు. రాష్ట్ర ప్రజలందరిదీ కూడా ఇదే అభిప్రాయమన్నారు. ఆమె ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం ఇనగలూరులో ప్రజలతో మమేకమయ్యారు. పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ప్రజలతో మాట్లాడారు.తమకు సీఎం జగన్ వల్ల అన్ని పథకాలూ అందుతున్నాయని అక్కడున్న వారంతా చెప్పారు. తమ కుటుంబాలన్నీ ఎంతో సంతోషంగా ఉన్నాయని, తమ ఓట్లు వైఎస్సార్సీపీకే అని బదులిచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు భారతమ్మ స్పందించారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి గత ఎన్నికల్లోకంటే మరింత ఎక్కువ మెజార్టీని ఇస్తారని చెప్పారు. ఇందుకు వారే నిదర్శనమంటూ ప్రజలను చూపించారు. అక్కడున్న ప్రజలంతా జగన్మోహన్రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీని అందిస్తామంటూ నినదించారు. మేనిఫెస్టో గురించి భారతమ్మ మాట్లాడుతూ ఇప్పుడున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆ పథకాలకు సీఎం జగన్ మరింత మెరుగులు దిద్ది అందిస్తారని చెప్పారు. పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి బలమని, 40 ఏళ్లుగా ప్రజలు ఆదరిస్తున్నారని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. ఆమెతో పాటు వైఎస్ సమత, వైఎస్ మధురెడ్డి కోడలు చైతన్య, డాక్టర్ చందన ఉన్నారు.ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎదురు లేని వైఎస్సార్ కుటుంబంఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ కుటుంబానికి ఇప్పటివరకు ఎదురే లేదు. కడప పార్లమెంటు నుంచి 1989లో తొలిసారి వైఎస్సార్ ఎంపీగా ఎన్నికయ్యారు. వరసగా నాలుగు పర్యాయాలు ఆయనదే విజయం. 1989 నుంచి 2019 వరకు 10 సార్లు కడప పార్లమెంటుకు ఎన్నికలు జరగ్గా, అన్ని ఎన్నికల్లో జిల్లా ప్రజానీకం వైఎస్ కుటుంబానికే పట్టం కట్టారు. నాటి నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
పులివెందులలో వైఎస్ భారతి.. ప్రతి ఇంటా ఆప్యాయ పలకరింపు (ఫొటోలు)
-
పులివెందులలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రతి గ్రామంలో వైఎస్ భారతికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వన్స్‌మోర్ సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు.వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వైఎస్ భారతి అన్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు ఆమె వివరిస్తున్నారు. -
సీఎం జగన్ ఎన్నికల ప్రచారం
-
సీఎం జగన్‌కు అభివాదం చేసిన సతీమణి వైఎస్ భారతీ
-
సీఎం జగన్‌కు అభివాదం చేసిన సతీమణి వైఎస్ భారతీ (ఫొటోలు)
-
ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు (ఫొటోలు)
-
సీఎం జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం
-
సీఎం జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం
సాక్షి, పల్నాడు జిల్లా: ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులో కార్యక్రమం జరిగింది. ఉగాది వేడుకలకు హాజరైన సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులకు శాలువా కప్పి, అక్షింతలు చల్లి ఆశీర్వాదం ఇచ్చారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు, విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇదీ చదవండి: జగన్ ముందుకు.. అధఃపాతాళానికి చంద్రబాబు -
రారండోయ్.. వేడుక చూద్దాం.. (ఫోటోలు)
-
ఏపీ గవర్నర్ ఎట్ హోం కార్యక్రమంలో సీఎం జగన్, వైఎస్ భారతి
-
ఈసీ గంగిరెడ్డికి నివాళులర్పించిన వైఎస్ భారతి
-
సాక్షి లైఫ్.. మీ ఆరోగ్య నేస్తం
వైద్య రంగంలో విశ్వసనీయమైన సమాచారా న్ని అందించేందుకు ‘సాక్షి లైఫ్’ను తీసుకొచ్చింది సాక్షి మీడియా గ్రూప్. సమస్త ఆరోగ్య సమచారాన్ని సమగ్రంగా ఆర్టికల్స్, వీడియోల రూపంలో తీర్చిదిద్దింది. ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేందుకు నిష్ణాతులైన డాక్టర్ల సూచనలు, సలహాలతో పాటు ఆహారం, వ్యాయామాల గురించి వివరంగా ఇందులో నిక్షిప్తం చేసింది. life.sakshi.com పేరుతో వచ్చిన ఈ వెబ్సైట్లో వైద్యరంగానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ విభాగాలకు సంబంధించి ప్రముఖ వైద్యు ల ఇంటర్వ్యూలు, నిపుణుల సలహాలను వీడియోల రూపంలో యూట్యూబ్‌లో sakshi life ఛానల్లో అప్లోడ్ చేసింది. ‘సాక్షి‘ ఇద్దరి స్పూర్తితో ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వైద్యరంగం నుంచి వచ్చి రాజకీయ నాయకుడిగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఒకరు. రూపాయికే వైద్యం అందించి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన వైఎస్సార్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ ని తీసుకొచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. మరొకరు డాక్టర్ ఈ.సీ.గంగిరెడ్డి. నిస్వార్థ వైద్య సేవలకు మారుపేరుగా నిలిచి ప్రజల గుండెల్లో కొలువైన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి వైద్యం వృత్తి కాదు,ప్రాణం అని నమ్మారు. ఈ ఇద్దరి మహనీయుల స్ఫూర్తితో ‘సాక్షి లైఫ్ ‘ తెలుగు ప్రజల ముందుకు వస్తోంది. ఆరోగ్య సమాచారాన్ని సులువుగా తెలుగు వారందరికీ అందించాలన్నదే ‘సాక్షి’ లక్ష్యం. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, శ్రీమతి వై.ఎస్.భారతి రెడ్డి ‘సాక్షి లైఫ్’ వెబ్సైట్ తో పాటు యూట్యూబ్ ఛానెల్ ను లాంఛనంగా ఆవిష్కరించారు. సాక్షి లైఫ్ ప్రజలందరి ఆరోగ్య నేస్తం. అందుబాటులో ఉన్న వేర్వేరు వైద్య విధానాల గురించి చెప్పడమే కాదు, అసలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తుంది. life.sakshi.com https://www.youtube.com/@life.sakshi సాక్షి లైఫ్ప్రారంభం సందర్భంగా ప్రముఖ డాక్టర్లు ఏమన్నారంటే... ‘హెల్త్ కు సంబంధించిన విశ్వసనీయమైన సమాచారం సాక్షి లైఫ్‌లో ఉంది. ఇది సమాజానికి చాలా అవసరం.’ – డా.డి.నాగేశ్వర్ రెడ్డి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ‘ప్రస్తుతం నమ్మకమైన వైద్య సమాచారం అందుబాటులో లేదు, ఆ లోటును సాక్షి లైఫ్ భర్తీ చేస్తుందనుకుంటున్నాను’ . – డా. మంజుల అనగాని, ప్రముఖ గైనకాలజిస్ట్ ‘వైద్యరంగంలో పరిశోధనలు, వాటి విశేషాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా సాక్షి లైఫ్‌ను తీర్చిదిద్దారు’. – డా. చిన్నబాబు సుంకవల్లి, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ‘ప్రతీ ఒక్కరికి గుండె కీలకం, అది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలన్నది సాక్షి లైఫ్‌లో విపులంగా చె΄్పారు’. – డా. ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్ట్ ‘జీవనశైలిలో మార్పులే రోగాలకు కారణం, ఈ విషయంపై సాక్షి లైఫ్‌లో నిపుణుల సలహాలున్నాయి.’ – డా.గోపీ చంద్ మన్నం, చీఫ్ కార్డియో థొరాసిక్ సర్జన్ ‘ఆరోగ్య రంగానికి సంబంధించిన సరైన సమాచారాన్ని నిపుణులైన వైద్యుల ద్వారా అందుబాటులోకి తెచ్చిన ‘సాక్షి లైఫ్‘ కు వెల్కమ్’ – డా.కోనేటి నాగేశ్వరరావు, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ‘మానసిక సమస్యలు పైకి చెప్పుకోలేని వారికి సాక్షి లైఫ్‌లో నిపుణుల ఇంటర్వ్యూల ద్వారా మంచి అవగాహన కలుగుతుంది, ఆల్ ది బెస్ట్’ – డా. పూర్ణిమ నాగరాజు, సైకియాట్రిస్ట్ ‘ఆర్థరైటిస్ సమస్యలు తలెత్తడా నికి కారణాలు.. ముందుగా తెలుసుకుంటే అవి రాకుండా జాగ్రత్త పడొచ్చు.. ఇలాంటి సమా చారాన్ని సాక్షి లైఫ్ ద్వారా అందిస్తున్నారు.’ – డా.కె. జె.రెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ -
సంబరంగా సంక్రాంతి వేడుక
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గంగిరెద్దులకు సారెను సమర్పించడం, భోగిమంటలు, గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు, హరిదాసుల కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలతో వేడుకలు కన్నులపండువగా జరిగాయి. సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాలను చక్కగా పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. నవరత్నాలతో ముఖ్యమంత్రి ప్రతిఇంటికీ సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, మెడికల్ కాలేజీ, నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా తీర్చిదిద్ధిన స్కూల్ భవనం, పాల కేంద్రం నమూనాలు వంటి ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తూ.. ముత్యాల ముగ్గులు, రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, ధాన్యాగారాలు, గడ్డివాములు, ఎడ్లబండ్లు ఇలా అచ్చం అసలు సిసలైన గ్రామీణ వాతావరణ ప్రతిబింబించేలా, మన సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిసేలా.. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నేతృత్వంలో గ్రామ స్వరాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. సీఎం దంపతులను మంత్రముగ్థుల్ని చేసేలా ఆ ప్రాంతం శోభాయమానంగా అలంకరించారు. ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు ఏర్పాటుచేసిన శిలాతోరణం అందరినీ ఆకట్టుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో భోగి మంటలు వెలిగిస్తున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. ఇక ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో హాజరైన సీఎం జగన్ దంపతులను వేదపండితులు నుదుట తిలకం దిద్ది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం.. వారిరువురూ భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. హరిదాసుకు స్వయంపాకం, సారె సమర్పించారు. అలాగే, గోశాలలోని గోవులకు పూజచేసి వాటిని నిమురుతూ కొద్దిసేపు అక్కడ గడిపారు. గంగిరెద్దులకు, తులసి చెట్టుకు పూజలు చేశారు. గ్రామీణ సంక్రాంతి వేడుకల్లో ప్రధానంగా కనిపించే వివిధ కళాకారులను సీఎం ఆప్యాయంగా పలకరించారు. అంతేకాక.. తెలుగింటి సంక్రాంతి పిండివంటలను ముఖ్యమంత్రి దంపతులు రుచి చూశారు. అనంతరం.. కలియుగ దైవమైన శ్రీహరికి పూజలు నిర్వహించటం, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు ఏర్పాటుచేసిన వందేళ్ల క్రితం నాటి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ నమూనా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్ దంపతులు పూలమాల వేసి నివాళులరి్పంచారు. అనంతరం.. అక్కడున్న మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులను పలకరిస్తూ ముందుకు కదిలారు. తొలుత.. కాణిపాక వినాయక విగ్రహానికి సీఎం జగన్ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. తర్వాత.. కనకదుర్గమ్మకు.. అనంతరం శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదపండితుల ఆశీర్వాదం స్వీకరించారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎంకు కంకణం కట్టగా.. వేదపండితులు అందించిన మరో కంకణాన్ని భారతమ్మకు ముఖ్యమంత్రి జగన్ కట్టారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. ప్రముఖ సినీ నేపథ్యగాయని గోపిక పూర్ణిమ, ప్రముఖ గాయని శ్రీలలిత పాటల కార్యక్రమం శ్రవణపేయంగా సాగింది. అలాగే, సినీ రంగానికి చెందిన ప్రముఖ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ రాఘవ, కౌండిన్య, మెహర్, మానస్, చందు, రమేష్, హరేరాము, మహేష్, భాను తదితరుల లైవ్ పెర్ఫామెన్స్.. ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారులు రిత్విక్ వెంకట్, చార్మి, చిన్నారి కేతనరెడ్డి నాట్య ప్రదర్శన.. నీలకంఠం మిమిక్రీ, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉదయ్ బృందంచే సంక్రాంతి ప్రత్యేక గీతాల నృత్యం, మాస్టర్ భువనేష్ ప్రత్యేక గీతాలు.. వీటితో పాటు ప్రముఖ సినీగేయ రచయిత, సంగీత దర్శకులు విశ్వ.. ప్రముఖ సినీ మరియు ప్రజా గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, ప్రజా రచయితలు మానుకోట ప్రసాద్, మాట్ల తిరుపతి, గాయకులు గద్దర్ నర్సిరెడ్డి, తేలు విజయల కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కృష్ణవేణి మల్లావఝుల వ్యవహరించారు. చివర్లో వీరందరిని సీఎం జగన్ దంపతులు సత్కరించి, మెమొంటోలు అందజేశారు. అంతేకాక.. ప్రాంగణంలో ఉన్న అందరితో సీఎం జగన్ దంపతులు ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చెవిరెడ్డికి సీఎం అభినందనలు.. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా.. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలా.. చక్కని ఏర్పాట్లతో, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. విజయానందాలతో అడుగులు ముందుకేయాలి.. సీఎం జగన్ ట్వీట్ ఊరూ వాడా ఒక్కటై.. బంధుమిత్రులు ఏకమై.. అంబరమంత సంబరంగా జరుపుకునే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకుని.. సుఖ సంతోషాలతో.. విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటూ ఆదివారం ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తెలిపారు. -
సీఎం జగన్ ఇంట అంబరాన్నంటిన ‘సంక్రాంతి’ సంబరాలు (ఫొటోలు)
-
పులివెందులలో సీఎం క్రిస్మస్ వేడుకలు
పులివెందుల: క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా మూడో రోజైన సోమవారం ఉదయం సీఎం ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి హెలికాప్టర్ ద్వారా భాకరాపురం హెలిప్యాడ్, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా పులివెందుల పట్టణానికి చేరుకున్నారు. ఉ.9.30 గంటలకు సీఎస్ఐ చర్చి ప్రాంగణానికి చేరుకుని అక్కడ హాజరైన వారిని ఆప్యాయంగా, చిరునవ్వుతో పలకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం తన బంధువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్.. ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏటా క్రిస్మస్ రోజున తన సొంత గడ్డపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. అందరి అభిమానం, ఆశీస్సులు, దేవుని చల్లని దీవెనలు తనకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన ప్రార్థించారు. రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో తరిస్తున్నానని.. ఎప్పటికీ మీ హృదయాల్లో ప్రియమైన నాయకుడిగా సుస్థిర స్థానాన్ని పొందుతానన్నారు. అనంతరం.. ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. 2024 నూతన సంవత్సర చర్చి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆ తర్వాత చర్చి నుంచి రోడ్డు మార్గాన సీఎం బయల్దేరి వైఎస్సార్సీపీ నేత నల్లచెరువుపల్లె రవి ఇంటికెళ్లి నూతన దంపతులు మంజ్రేకర్రెడ్డి, రేణుకారెడ్డిలను ఆశీర్వదించారు. ఇక ఉ.11.07 గంటలకు సీఎం జగన్ అక్కడ నుంచి బయల్దేరి 11.15 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడారు. ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. మ.12.19 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి మైదుకూరులోని జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ దస్తగిరి నివాసంలో ఆయన కుమారుడు, ఇద్దరు కుమార్తెల వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులు.. ఇక క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, కుటుంబ సభ్యులు వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, ఆత్మీయులు, మిత్రులు, పుర ప్రజలు పాల్గొన్నారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ డి. సుధ, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, ఆర్డీఓ వెంకటేశులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలపై ఉండాలి సీఎం వైఎస్ జగన్ సాక్షి,అమరావతి: నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలపై ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని సోమవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
Sakshi Excellence Awards 2023 : కన్నులపండువగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు (ఫొటోలు)
-
ప్రతిభా పురస్కారాల సాక్షిగా..
'నిస్వార్థంగా సేవ చేసిన వారు కొందరైతే.. పూట గడవని స్థితి నుంచి పదిమంది ఆకలి తీర్చే స్థాయికి ఎదిగిన వారు మరికొందరు... అలాగే పిన్న వయస్సులోనే ప్రతిభ చూపేవారు... తమ ప్రతిభను సమాజ హితం కోసం... దేశానికి పతకాల పంటను అందించడం కోసం తోడ్పడేవారు... ఎంచుకున్న రంగంలో విశేష కృషి చేసిన వారు ఎందరో... ఇలాంటి వారిలో ప్రతి ఏటా తమ దృష్టికి వచ్చిన కొందరిని సాక్షి గుర్తించి అభినందిస్తోంది... సత్కరించి గౌరవిస్తోంది. ఇందులో భాగంగా 9వ ఎడిషన్‌కు సంబంధించిన ‘సాక్షి’ ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో నవంబర్ 16, గురువారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దలు, ప్రముఖుల సమక్షంలో కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్న వారి వివరాలు, స్పందనలు.' లాన్స్‌నాయక్ బొగ్గల సాయి తేజస్పెషల్ జ్యూరీ పురస్కారం (మరణానంతరం) చిత్తూరుజిల్లాలోని ఎగువ రేగడ పల్లి గ్రామానికి చెందిన యువతేజం బొగ్గల సాయితేజ బాల్యం నుంచే సైన్యంలో చేరాలని కలలు కన్నారు. 2013లో బెంగళూరు రెజిమెంట్‌లో ఆర్మీజవాన్ గా చేరి తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. స్వల్పకాలంలోనే ఉన్నతాధికారుల మన్ననలు పొందారు సాయితేజ. అతని శక్తియుక్తులను గుర్తించిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్... ఆయనను తన వ్యక్తిగత భద్రతాసిబ్బందిలో ఒకరిగా నియమించుకున్నారు. అయితే... అనూహ్యంగా 2021 డిసెంబర్లో తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్‌తోపాటు సాయితేజ కూడా అమరుడయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. సోదరుడు మహేష్ కూడా సైన్యంలో ఉన్నారు. విధి నిర్వహణలో అమరుడైన వీర జవాన్ లాన్ ్స నాయక్ సాయితేజకు సెల్యూట్ చేస్తూ సాక్షి ఎక్సలెన్ ్స – మరణానంతర పురస్కారాన్ని కుటుంబ సభ్యులకు అందజేసింది సాక్షి మీడియా గ్రూప్. తల్లిదండ్రుల స్పందన: మా సాయితేజ చిన్నప్పటి నుంచే దేశం గురించి ఆలోచించేవాడు. దేశసేవ గురించి ఎన్నో విషయాలు చెప్పేవాడు. తనే సొంతంగా వెళ్లి ఆర్మీలో సెలక్ట్ అయ్యాడు. అక్కడ దేశం కోసం అమరుడయ్యాడు. కొడుకు మీద మీద ప్రేమతో గుడికట్టి, మేమూ ఆ ప్రాంగణంలోనే ఉంటున్నాం. ఈ అవార్డు మాకు నిత్య స్మరణీయం. పంతంగి భార్గవి యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ (ఎడ్యుకేషన్) పంతంగి భార్గవి తండ్రి ఒక ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ చదువుల తల్లి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంది. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గౌలిదొడ్డిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీలో సీటు సంపాదించుకుంది. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీ పట్టి చిక్కుప్రశ్నలు పరిష్కరించే మెళకువలను ఆకళింపు చేసుకుంది భార్గవి. కరోనా మహమ్మారి విరుచుకుపడినా మనోధైర్యం కోల్పోకుండా ఆన్ లైన్ క్లాసుల ద్వారా సాధన కొనసాగించింది. జేఈఈ అడ్వాన్ ్సడ్ ఎగ్జామ్‌లో ర్యాంక్ సాధించి బాంబే ఐఐటీలో ఇంజినీరింగ్‌లో చేరింది... సాధన చేస్తే సాధ్యం కానిదేమీ లేదని నిరూపించిన భార్గవిని యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ – ఎడ్యుకేషన్ అవార్డ్‌తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. భార్గవి సోదరి స్పందన: మా అమ్మానాన్న మమ్మల్ని చదివించడానికి ఎంత కష్టపడ్డారో మాటల్లో చెప్పలేను. నేను బీటెక్ చేసి టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాను. తమ్ముడు చదువుకుంటున్నాడు. చెల్లికి ఇంత గొప్ప పురస్కారం లభించడం మాకెంతో సంతోషంగా ఉంది. మాటలు రావడం లేదు. పార్టిసిపేటరి రూరల్ డెవలప్మెంట్ ఇన్షియేటివ్ సొసైటీ ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ (ప్రొ. ఎస్వీ రెడ్డి, ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచి వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తోంది పార్టిసిపేటరి రూర ల్ డెవలప్మెంట్ ఇన్షియేటివ్ సొసైటీ. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వ్యవసాయం, పర్యావరణం, ఎరువులు, పురుగుమందుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అధిక దిగుబడులు సాధించేలా రైతులకు మెళకువలు నేర్పిం చి, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేలా శిక్షణ ఇస్తోంది. ఫలితంగా ఒక్కో రైతుకు ఎకరాకు పది వేల నుంచి 25 వేల వరకు అధికంగా ఆదాయం చేకూరుతోంది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్న ఈ సొసైటీ ని ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. పురస్కార గ్రహీత స్పందన: సరిగ్గా చేసుకుంటే వ్యవసాయం లాభదాయకమే. ఖర్చులు తగ్గించుకోవాలి, కొత్త వంగడాలతో శ్రద్ధగా సేద్యం చేయాలి. రైతులకు నేను చెప్పే మాట ఒక్కటే... ‘రసాయన ఎరువులకు బదులు గ్రీన్ లేబుల్ ఉన్న పెస్టిసైడ్స్‌ని వాడాలి’. తెలుగు నేలకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఇచ్చిన ఈ అవార్డు అమ్మ ప్రశంసలా ఉంది. కేడర్ల రంగయ్యఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కొమురంభీం జిల్లా కెరమెరి మండలం సావర్‌ఖేడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కేడర్ల రంగయ్య తాను పనిచేస్తున్న గ్రామంలోనే నివాసం ఉంటూ... తన ఇద్దరు పిల్లలను సర్కారు బడిలో చేర్పించారు. ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు నచ్చచెప్పి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. రంగయ్య కృషిఫలితంగా విద్యార్థుల సంఖ్య 50 నుంచి 280 కి పెరిగింది. ఇక్కడ చదువుకున్న పిల్లలు జిల్లాస్థాయిలో టాపర్స్‌గా నిలిచారు. సామాజిక రుగ్మతలైన బాల్యవివాహాలు, మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడారు. బెల్ట్‌షాపులు తొలగింపు కోసం నిరాహార దీక్ష చేశారు. ఫలితంగా బాల్యవివాహాలకు అడ్డుకట్ట పడింది. మద్యపానంపై స్వచ్ఛంద నిషేధం అమలవుతోంది. విద్యార్థుల భవితకు పాటుపడుతున్న ఈ ఉత్తమ ఉపాధ్యాయుణ్ణి ఎక్సలెన్్స ఇన్ ఎడ్యుకేషన్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. పురస్కార గ్రహీత స్పందన: పిల్లలను చైతన్యవంతం చేయడం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయవచ్చన్నది నా ఆలోచన. నాకు భార్య çసహకారం ఉంది. సాక్షి పురస్కారం నా బాధ్యతను పెంచింది. మరింత ఉత్సాహంగా పని చేసి లక్ష్యాన్ని సాధిస్తా. సునీల్ యల్లాప్రగడ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ (స్మాల్, మీడియమ్) కాంపోజిట్ మెటీరియల్స్‌తో సరికొత్త ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ట్రియోవిజన్ కాంపోజిట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. రైల్వేస్, ఆటోమోటివ్, విండ్, మెరైన్, డిఫెన్ ్స తదితర సంస్థలకు అవసరమైన డిజైన్, టూలింగ్, కాంపోజిట్ ప్రొడక్ట్స్ సరఫరా చేస్తోంది. ట్రియోవిజన్ ఉత్పత్తులు కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకుంటాయి. రసాయనాలు, మంటల నుంచి రక్షణ కల్పిస్తాయి. తుప్పుపట్టవు. దేశీయంగానే కాకుండా గ్రీస్, యుఏఈ, నైజీరియా తదితర దేశాలకూ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది ట్రియోవిజన్ . కాంపోజిట్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ దేశవిదేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ట్రియోవిజన్ కాంపోజిట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సునీల్ యల్లాప్రగడను సాక్షి స్మాల్ / మీడియం స్కేల్ – బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – అవార్డు వరించింది. పురస్కార గ్రహీత స్పందన: మేం తయారుచేస్తున్న ఉత్పత్తులను స్వదేశంలోనే కాదు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. మా కృషిని గుర్తించి బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సాక్షి మీడియా సంస్థ సత్కరించడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. కొమెర అంకారావు (జాజి) ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (ఇండివిడ్యువల్) పల్నాడు ప్రాంతానికి చెందిన కొమెర అంకారావుకు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే రోజూ అడవికి వెళ్లి విత్తనాలు చల్లడం... మొక్కలు నాటడం అలవాటు. అడవిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరేయడం, వేసవిలో మొక్కలకు నీళ్లుపోసి సంరక్షించడం, వారంలో నాలుగు రోజులు అడవుల్లోనే సంచరించడం, రెండురోజులు పర్యావరణం పట్ల పిల్లల్లో అవగాహన కల్పించడం అభిరుచులు. తన పొలంలో సేంద్రియ పద్ధతిలో పంట పండించి పక్షులకు ఆహారంగా వదిలేస్తారు. అంకారావు నిస్వార్థ సేవకుగాను పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. వన్యప్రేమికుడైన అంకారావు ఉరఫ్ జాజిని ఎక్సలెన్ ్స ఇన్ ఎన్విరాన్ మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ అవార్డుతో సత్కరించింది సాక్షి. పురస్కార గ్రహీత స్పందన: ఈ పని చేస్తే అవార్డులు వస్తాయని కూడా తెలియదు. సుచిర్ ఇండియా నుంచి సంకల్పతార, దయానంద సరస్వతి సంస్థ నుంచి వృక్షమిత్ర, చెన్నై ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్æ పురస్కారాలందుకున్నాను. అవార్డులు వస్తాయని పనిచేయలేదు, అవార్డులు రాకపోయినా పని ఆపను. డాక్టర్ చినబాబు సుంకవల్లి (ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్) క్యాన్సర్ సోకి ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నవారికి నేనున్నానని భరోసా కల్పిస్తున్నారు డాక్టర్ చినబాబు సుంకవల్లి. ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలతో క్యాన్సర్ ముప్పు తప్పించవచ్చనే ఆలోచనతో 2013లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆర్థికస్తోమత లేని రోగులకు అవసరమైన వైద్యం అందించి వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. మురికివాడలు, పల్లెలు, పట్టణాలు, గిరిజన తండాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ నిర్వహిస్తూ వ్యాధిపై అవగాహన కల్పిస్తోంది ఈ ఫౌండేషన్. ఈ సంవత్సరం ఇప్పటివరకు సుమారు లక్షమందికి వైద్య పరీక్షలు చేశారు. క్యాన్సర్ రోగులకు తనవంతు సేవ చేస్తున్న సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ చినబాబు సుంకవల్లిని సాక్షి ఎక్సలెన్ ్స ఇన్ హెల్త్ కేర్ అవార్డ్‌తో పురస్కరించింది. పురస్కార గ్రహీత స్పందన: వైద్యరంగంలో చికిత్స మాత్రమే కాదు, అంతకుమించిన సేవలు కూడా ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు ధైర్యం చెప్పి సాంత్వన కలిగించడం, క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి చైతన్యవంతం చేయడం వంటివి. మా సేవలను గుర్తించి సాక్షి ఇచ్చిన ఈ అవార్డు రెట్టించిన ఉత్సాహంతో పని చేయడానికి దోహదం చేస్తుంది. నెలకుర్తి సిక్కిరెడ్డి (యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్, స్పోర్ట్స్) తన ఆటతీరుతో జాతీయ.. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న నెలకుర్తి సిక్కిరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు. తల్లి గృహిణి. బాల్యం నుంచి క్రీడలపై కూతురికి ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు పేరెంట్స్. ఆమెకు బ్యాడ్మింటన్‌లో మెళకువలు నేర్పించేందుకు పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేర్పించారు. అక్కడ ఆటలో కఠోరమైన శిక్షణ తీసుకున్న సిక్కిరెడ్డి స్వల్పకాలంలోనే ప్రపంచస్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. 2007లో కెరీర్లో తొలి అంతర్జాతీయ జూనియర్ ప్రపంచ కప్ పోటీలో పాల్గొంది. బ్యాడ్మింటన్ లో విశేష ప్రతిభ చూపిన సిక్కిరెడ్డిని కేంద్రప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. తనకిష్టమైన క్రీడల్లో సత్తా చాటుతూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్న సిక్కిరెడ్డిని సాక్షి ఎక్సలెన్ ్స యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ – స్పోర్ట్స్ అవార్డు వరించింది. పురస్కార గ్రహీత స్పందన: చెప్పలేనంత ఆనందంగా ఉంది. నేను కెరీర్ మొదలు పెట్టిన తొలిరోజుల్లో ప్రారంభమైన సాక్షి, మొదటి నుంచి నాకు ప్రోత్సాహాన్నిస్తోంది. ప్రతి అవార్డూ దేనికదే ప్రత్యేకం. దేని గొప్పతనం దానిదే. సాక్షి పురస్కారం అర్జున అవార్డు మరోసారి అందుకున్నంత ఆనందాన్నిస్తోంది. జాస్పర్ పాల్ యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ (సోషల్ సర్వీస్) హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల జాస్పర్పాల్.... 2014లో ఒక ఘోర రోడ్డుప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అది దేవుడు తనకు ఇచ్చిన పునర్జన్మగా భావించిన జాస్పర్ ఆ క్షణమే ఒక గట్టి సంకల్పం తీసుకున్నారు. నిలువ నీడ లేని వృద్ధులను చేరదీసి ఆశ్రయం కల్పించేందుకు 2017లో సెకండ్ ఛాన్ ్స ఫౌండేషన్ స్థాపించారు. పుట్‌పాత్‌లపై నిస్సహాయంగా పడి ఉన్న వృద్ధులను చేరదీసి.. జీవిత చరమాంకంలో వారికి ఊరట కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 2000 మందికి ఆశ్రయం కల్పించారు. 300 మందిని తిరిగి వారి కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. హైదరాబాద్‌లో జాస్పర్ నిర్వహిస్తున్న షెల్టర్‌హోమ్స్‌లో సుమారు 200 మంది ఆశ్రయం పొందుతున్నారు. అంతేకాదు...ఫ్రీ హాస్పిటల్ ఫర్ ది హోమ్‌లెస్ పేరుతో నిలువ నీడలేని వారికి ఉచిత వైద్యసేవలు అందిస్తున్న జాస్పర్ పాల్ని సాక్షి యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ – సోషల్ సర్వీస్ అవార్డు వరించింది. పురస్కార గ్రహీత స్పందన: తొమ్మిదేళ్లుగా సామాజిక సేవలో ఉన్నాను. రకరకాల కారణాలతో వృద్ధులను వారి పిల్లలు వదిలేయడం గమనించాను. ఒంటరి వృద్ధులను చూసినప్పుడు బాధగా అనిపించేది. దీనికో పరిష్కారం కనుక్కోవాలని ఓల్డేజీ హోమ్ ఏర్పాటు ద్వారా ఎందరో వృద్ధులను కాపాడగలిగాను. దీన్ని సాక్షి గుర్తించి అవార్డు ఇవ్వడం... పెద్దల ఆశీస్సులు లభించినంత ఆనందంగా ఉంది. డాక్టర్ పద్మావతి పొట్టబత్తిని ఎక్సలెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ వైకల్యం ఆమె అభిరుచిని అడ్డుకోలేకపోయింది. సంకల్పం ఆమెకు కొత్తదారి చూపింది. ఆవిడే పద్మావతి పొట్టబత్తిని. పసితనంలో పోలియో బారినపడ్డా, చెక్కుచెదరని మనోబలంతో తనను తాను తీర్చిదిద్దుకున్నారు. సంగీత పాఠాలు నేర్చుకున్నారు. తనలోని కళాభిరుచికి రెక్కలు తొడిగి రంగస్థల నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దివ్యాంగుల కోసం ఒక సంస్థను ఏర్పాటుచేసి వారికి కంప్యూటర్స్, నృత్యం, సంగీతం, టైలరింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తున్న పద్మావతిని పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించడంతోపాటు రాష్ట్రప్రభుత్వం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. కళలు, సామాజిక సేవారంగంలో ప్రతిభ చూపుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న పద్మావతిని ఎక్సలెన్ ్స ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. పురస్కార గ్రహీత స్పందన: చిన్ననాటి నుంచి ఆర్టిస్టుగా ఉండటం వల్ల నాలాగా కళాకారులు అవ్వాలనుకునే దివ్యాంగులకు సాయం చేయాలనుకున్నాను. నేను ఎదుర్కొన్న సమస్యలు మిగతావారు ఫేస్ చేయకూడదని వారికి మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను. నా కృషిని గుర్తించి, ఈ అవార్డును ఇవ్వడం ఆనందంగా ఉంది. డా. బి. పార్థసారథి రెడ్డి, ఛైర్మన్ (హెటిరో డ్రగ్స్) – బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ లార్జ్ స్కేల్ (సుధాకర్ రెడ్డి, హెటిరో గ్రూప్ డైరెక్టర్) హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న హెటిరో ఫార్మాస్యూటికల్స్ తమ విభిన్నమైన ఉత్పత్తులతో పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్ పరంగా దేశవిదేశాల్లో విశేషమైన గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అత్యధికంగా యాంటీ రెట్రోవైరల్ డ్రగ్ ఉత్పత్తి చేస్తున్న ఈ ఫార్మా కంపెనీ హెచ్ఐవీ చికిత్సలో వినియోగించే డ్రగ్స్‌ను వందకు పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. స్వైన్ ఫ్లూ, కోవిడ్ చికిత్సలో వినియోగించిన ఔషధాలను పెద్దమొత్తంలో ఉత్పత్తిచేసి రికార్డు సృష్టించింది. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ఔషధాల ఉత్పత్తికి అంకితమై, విశేష కృషి చేస్తున్న హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డా. బి.పార్థసారథి రెడ్డిని బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ లార్జ్‌స్కేల్ అవార్డుతో సత్కరించింది సాక్షి. స్పందన: (సుధాకర్ రెడ్డి, డైరెక్టర్, అవార్డు అందుకున్నారు) మా వంతు సామాజిక బాధ్యతగా ప్రజలకు అవసరమైన ఔషధాల తయారీలో ముందుంటున్నాం. అదే నిబద్ధతతో ప్రయోగాలను కొనసాగిస్తూ మందులను తక్కువ ధరకు అందించడానికి ప్రయత్నిస్తాం. నెక్ట్స్ఎరా ఎనర్జీ రీసోర్సెస్ ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (కార్పొరేట్) (ఎమ్.వెంకట నారాయణ రెడ్డి, సీఈవో) వ్యర్థాల నుంచి ఎనర్జీని ఉత్పత్తి చేయడం, బయో ఇంధనం, సౌరశక్తి ఆధారిత పునరుత్పాదక ఎనర్జీ ప్రాజెక్టులను నిర్వహించడం నెక్ట్స్ ఎరా ఎనర్జీ రీసోర్సెస్ సంస్థ ప్రధాన ఉద్దేశం. వాతావరణ మార్పులను నియంత్రిస్తూ... క్లీన్ఎనర్జీతో ఈ సంస్థ పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. పునరుత్పాదక ఇంధన పరిజ్ఞానానికి సంబంధించి శిక్షణాకోర్సుల నిర్వహణతోపాటు ఆపరేటర్లు, టెక్నీషియన్లకు అవసరమైన శిక్షణ అందిస్తోంది. వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి, సోలార్ ఆఫ్– గ్రిడ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది ఈ సంస్థ. ప్రకృతి వనరుల సద్వినియోగంతో సామాజిక, ఆర్థిక, వ్యవసాయ అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునందిస్తున్న నెక్స్ట్ ఎరా ఎనర్జీ రీసోర్సెస్ ప్రతినిధి ఎస్. వెంకట నారాయణరెడ్డిని ఎక్సలెన్ ్స ఇన్ ఎన్విరాన్ మెంట్ – కార్పొరేట్ అవార్డ్‌తో సత్కరించింది సాక్షి. పురస్కార గ్రహీత స్పందన: సాక్షి సంస్థ మా సర్వీస్‌ను గుర్తించి అవార్డు ఇవ్వడం ఊహించని సంతోషం. సేవ చేసే వారిని గుర్తించి గౌరవించడం పెద్ద బాధ్యత. సాక్షి అంత పెద్ద బాధ్యతను నిరంతరాయంగా నిర్వహించడం అభినందనీయం. రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మోయినాబాద్ ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (ఎన్జీఓ) (ఉదయ్ పిలాని, ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్) పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మోయినాబాద్. హానికారకమైన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం, వాటిని రీ సైక్లింగ్ చేయడం అనే బృహత్కార్యాన్ని తన భుజాన వేసుకుంది ఈ క్లబ్. గత పదేళ్లుగా విశాఖలోని బీచ్, అపార్ట్మెంట్స్, మార్కెట్ ప్రాంతాల్లో ఇండియా యూత్ ఫర్ సొసైటీతో కలిసి జీవీఎం సహకారంతో ఒక ప్రాసెసింగ్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తోంది. వీరు నిర్వహిస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సెమినార్స్, వర్క్‌షాప్స్ ఫలితంగా ప్రజల్లో ఆశాజనకమైన మార్పు అంకురిస్తోంది. పుడమితల్లిని కాపాడుకునేందుకు తోడ్పాటునందిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తరపున ఉదయ్ పిలానిని ఎక్సలెన్ ్స ఇన్ ఎన్విరాన్ మెంట్ కన్సర్వేషన్ – ఎన్జీవో అవార్డ్‌తో సత్కరించింది సాక్షి. పురస్కార గ్రహీత స్పందన: పర్యావరణంపై చూపే ప్రేమ ఈ రోజు ఇంతమంది ముందుకు తీసుకువచ్చింది. సాక్షి ఎక్సెలెన్స్ అవార్డు సత్కారం మా రోటరీ క్లబ్‌కు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ఈ అవార్డు ఒక మైల్స్టోన్ లాంటిది. కృష్ణ కుమ్మరి యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ ఇస్రోలో సైంటిస్ట్‌గా చేరి తన కల నెరవేర్చుకున్నాడు యువశాస్త్రవేత్త కృష్ణ కుమ్మరి. స్వగ్రామం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి. తల్లిదండ్రులు లక్ష్మీదేవి, మద్దిలేటి. కూలిపనే వారి జీవనాధారం. ఒకవైపు పేదరికం...దానికితోడు చిన్నతనంలో సోకిన పోలియో. టెన్త్ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన కృష్ణ... తిరుపతిలో డిప్లొమో, హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు. ఇక చాలు అనుకోలేదు... 2018లో ఇస్రోలో సైంటిస్ట్‌గా చేరారు. చంద్రయాన్ – 3 ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించింది. గ్రౌండ్ డేటా ప్రాసెసింగ్ విభాగంలో పనిచేసి ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి దోహదపడ్డాడు కృష్ణ. చంద్రయాన్ 3 ప్రయోగంతో దేశప్రతిష్టను ఇనుమడింపచేసిన శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన కృష్ణని యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. పురస్కార గ్రహీత స్పందన: ఒక కుగ్రామంలో పుట్టి పెరిగిన నేను, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ఇస్రో వరకు వెళ్లాను. కానీ, అవార్డులు నన్ను వరిస్తాయని ఊహించలేదు. ఇంత గొప్ప వేదికపైన సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. స్వర్గీయ సి.ఆర్. రావు తెలుగు ఎన్నారై ఆఫ్ ద ఇయర్ పద్మ విభూషణ్ డాక్టర్ కల్యంపూడి రాధాకృష్ణ రావ్... కర్ణాటకలోని బళ్లారి జిల్లా హడగళిలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతాలో ఎం.ఎ. స్టాటిస్టిక్స్ చదివి... కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్లో డైరెక్టర్‌గానూ, అనంతరం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గానూ సేవలందించారు. 477 పరిశోధన పత్రాలను సమర్పించి 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్నారు. అమెరికా అత్యున్నత నేషనల్ మెడల్ ఆఫ్ సైన్ ్స పురస్కారాన్ని అందుకున్నారు. భట్నాగర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. గణాంక శాస్త్రంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకు ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్–2023 అవార్డును అందుకున్నారు సీఆర్ రావు. 102 ఏళ్ల వయసులో ఇటీవలే తుదిశ్వాస విడిచారు. గణాంక శాస్త్రంలో ఆయన అందించిన విశేషమైన సేవలను స్మరించుకుంటూ ఎక్సలెన్ ్స ఇన్ ఎన్ ఆర్ఐ అవార్డ్‌తో గౌరవించింది సాక్షి మీడియా గ్రూప్. డాక్టర్ సిఆర్ రావు మేనల్లుడు డాక్టర్ యు.యుగంధర్ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ –ఏఐఎమ్ఎస్సిఎస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్) అవార్డును స్వీకరించారు. -
తలశిల రఘురామ్ కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: శాసనమండలి సభ్యుడు తలశిల రఘురామ్ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఎ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలో వధువు ప్రణవ, వరుడు విష్ణులను సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులు ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. -
విజయవాడలో వివాహానికి హాజరు అయిన సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి
-
పురస్కార విజేతలు.. స్ఫూర్తి ప్రదాతలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు గర్వించే విజయాలు సాధించిన వారికి తగిన గుర్తింపును అందించడంలో సాక్షి మీడియా గ్రూప్ కృషి ప్రశంసనీయమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. విభిన్న రంగాల్లో విజయాలు సాధించిన వారిని గౌరవించేందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన 9వ సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వ్యవసాయం, క్రీడలు, ఆరోగ్యం, పర్యావరణం లాంటి రంగాల్లో అవార్డు గ్రహీతలు సమాజంపై చెప్పుకోదగిన ప్రభావం చూపారని, వారి శ్రమకు ఈ పురస్కారాలు తగిన గుర్తింపు అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏపీ గవర్నర్.. ‘మానవ సేవను మించిన అత్యుత్తమ మతం లేదు..’ అన్న ఉడ్రో విల్సన్(ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు) సూక్తిని ఉటంకించారు. సమాజ సేవ చేసే ఎన్జీవోలు, సంస్థలు, విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులను ఎంపిక చేయడంలో సెలక్షన్ కమిటీ పనితీరును ఆయన అభినందించారు. వ్యయ ప్రయాసలకోర్చి సాక్షి మీడియా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిందన్నారు. అవార్డు గ్రహీతలను.. పేరు పేరునా వారి విజయాలను ప్రస్తావిస్తూ జస్టిస్ నజీర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ భారతీరెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ సీఈఓ, డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. రైతుల కష్టాలను కళ్లకు గట్టిన సుమధుర ఆర్ట్స్ అకాడమీ నృత్య రూపకం, ఇతర సంగీత సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. -
లండన్‌కు బయలుదేరి వెళ్లిన సీఎం జగన్ దంపతులు
సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు వ్యక్తిగత పర్యటన నిమిత్తం శనివారం రాత్రి 9:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఇంగ్లండ్ రాజధాని లండన్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ చదువుకుంటున్న తమ కుమార్తెలను కలిసేందుకు లండన్ పర్యటనకు వెళుతున్న సీఎం జగన్ దంపతులు తిరిగి ఈ నెల 11వ తేదీ రాత్రికి తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకుంటారు. ఎయిర్‌పోర్ట్‌లో సీఎంకు మంత్రులు తానేటి వనిత, జోగి రమేశ్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు. -
నేడు లండన్‌కు సీఎం జగన్ దంపతులు
సాక్షి, అమరావతి: వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు శనివారం రాత్రి 9.30 గంటలకు లండన్ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ చదువుకుంటున్న తమ పిల్లలను కలిసేందుకు వీరు వెళుతున్నారు. తిరిగి ఈ నెల 11వ తేదీ రాత్రికి వారు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: పొదుపు వ్యవస్థలో విప్లవం..వైఎస్ ‘పావలా వడ్డీ’ -
మువ్వన్నెల కాంతుల్లో మురిసిన రాష్ట్రం
సాక్షి, అమరావతి: స్వేచ్ఛామారుతంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రతి మదిలో పంద్రాగస్టు సంతోషం ఉప్పొంగింది. గుండెల్లో జాతీయ భావా న్ని నింపుకొని.. గుండెలపై జాతీయ జెండాను పెట్టుకున్నవారితో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మురిసిపోయింది. త్యాగధనుల స్మరణలో.. ప్రజాసంక్షేమ నాయకత్వంలో.. బంగారు భవిష్యత్తు ధీమాలో రాష్ట్రంలో 77వ స్వాతంత్య్రదిన వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా సాగాయి. త్రివర్ణపతాక రెపరెపల నడుమ సాయుధదళాల కవాతు, దేశభక్తిని నింపిన పోలీసు అందరినీ ఉత్తేజితుల్ని చేశాయి. స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్‌ను పరిశీలించారు. గ్యాలరీల్లో ఆసీనులైన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రత్యేక ఆహా్వనితులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తర్వాత సాయుధదళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన వేడుకల్లో 14 ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ప్రతిబింబిస్తూ శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. అగ్నిమాపక, పాఠశాల విద్య, వైద్యం, అటవీ, పరిశ్రమలు, రెవెన్యూ, గృహనిర్మాణ, సంక్షేమ, మహిళా అభివృద్ధి–శిశుసంక్షేమ, గ్రామీణ పేదరిక నిర్మూలన, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు, వ్యవసాయ, పశుసంవర్థక, గ్రామ–వార్డు సచివాలయాల శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. పాఠశాల విద్య–సమగ్ర శిక్ష శకటానికి మొదటి బహుమతి దక్కగా వైద్య ఆరోగ్యశాఖ, గ్రామ–వార్డు సచివాలయాలశాఖ రెండు, మూడు బహుమతుల్ని దక్కించుకున్నాయి. దేశభక్తిని చాటిన సాయుధదళాల కవాతు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సాయుధదళాల కవాతు స్వతంత్ర భారతావని రక్షణ, దేశభక్తిని, అమరవీరుల త్యాగనిరతిని చాటిచెప్పింది. తెలంగాణ రాష్ట్ర 17వ స్పెషల్ పోలీసు బెటాలియన్, ఏపీ ఎన్సీసీ బాలబాలికల బృందం పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులు, యూత్ రెడ్‌క్రాస్, మాజీ సైనికుల కవాతు ప్రశంసలు అందుకుంది. ఏపీఎస్పీ బ్రాస్‌బ్యాండ్, ఫైర్‌బ్రాండ్ బృందాల కళాప్రదర్శన ఆçహూతుల్లో స్వాతంత్య్ర ఉద్వేగాన్ని పెంచింది. కవాతులో ఉత్తమ ప్రదర్శనగా సాయుధదళాల విభాగంలో 9వ ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్, ద్వితీయ స్థానంలో 16వ ఏపీఎస్పీ విశాఖ బెటాలియన్ నిలిచాయి. అన్ ఆర్మ్డ్ విభాగంలో ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రథమ స్థానం, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందం ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, మేయర్ భాగ్యలక్ష్మి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఆర్టీఐ ప్రధాన కమిషనర్ ఆర్ఎం బాషా, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, తెలుగు–సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు, ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలకు అవార్డులు ఈ ఏడాది జరిగిన పదోతరగతి పరీక్షల్లో నూరుశాతం విద్యార్థుల ఉత్తీర్ణతతో పాటు విద్యార్థుల సరాసరి అత్యధిక మార్కులు సాధించిన స్కూళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవార్డులను అందజేశారు. సీతంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జియ్యమ్మవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (పార్వతీపురం మన్యం జిల్లా), ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల (భీమునిపట్నం), భద్రగిరిలోని ఏపీ గిరిజన బాలికల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల–యూఆర్జేసీ (పార్వతీపురం మన్యం జిల్లా), మంచాల ఏపీ మోడల్ స్కూల్ (అనకాపల్లి జిల్లా), పెద్దపవని ఏపీ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా), డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ (కర్నూలు), వీరఘట్టం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (పార్వతీపురం మన్యం జిల్లా) ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అవార్డులను అందుకున్నారు. -
మిషనరీస్ అఫ్ చారిటీ నిర్మల్ హృదయ్ భవన్ ను సందర్శిస్తున్న సీఎం
-
విశ్వసనీయతే ‘సాక్షి’ పునాది..
సాక్షి, హైదరాబాద్: నాణేనికి మరో కోణాన్ని చూపించి, ‘సత్యమేవ జయతే’ నానుడిని సాకారం చేయాలనే లక్ష్యంతో విశ్వసనీయత పునాదిగా పుట్టిన ‘సాక్షి’.. అదే బాటలో తన ప్రస్థానం కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సతీమణి భారతీరెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో సాక్షి దినపత్రిక 15వ వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా భారతీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతాన్ని విశ్లేషించుకోవడానికి, భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి వార్షి కోత్సవాలు వేదిక కావాలన్నారు. కచ్చితత్వంతో కూడిన సమాచారం ఆధారంగా కథనాలు అందించేటప్పుడు తప్పనిసరిగా అవతలి వ్యక్తుల వివరణ తీసుకోవడం వంటి స్వచ్ఛతతో కూడిన పాత్రికేయ ప్రమాణాలు పాటించాలని సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో వెనుకంజ వేయనవసరం లేదన్నారు. పాఠకులకు సులభంగా చేరేలా, జనహితంగా కథనాలు సాగాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ వర్ధెల్లి మురళి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్, సీఈఓ అనురాగ్ అగర్వాల్, డైరెక్టర్లు రాణిరెడ్డి, వైఈపీ రెడ్డి, కేఆర్పీ రెడ్డి, ఏఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేన్సర్ బాధిత చిన్నారులతో.. ‘సాక్షి’ వార్షిక వేడుకల్లో భాగంగా వై.ఎస్.భారతీరెడ్డి కేన్సర్ బాధిత చిన్నారులను కలసి ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తమ బాధలను మరచిపోయిన చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు. బంజారాహిల్స్‌లోని సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్‌కేర్ సెంటర్ ద్వారా కేన్సర్‌కు ఉచితంగా చికిత్స పొందుతున్న చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
తాడేపల్లి: సీఎం జగన్ నివాసంలో శోభకృత్ నామ ఉగాది వేడుకలు (ఫొటోలు)
-
సీఎం జగన్ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం
-
ఉగాది పచ్చడి సేవించిన సీఎం జగన్ దంపతులు
-
సతీసమేతంగా ఉగాది సంబరాల్లో సీఎం జగన్
-
AP: సంబరంలా సంక్రాంతి
సాక్షి, అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం సంక్రాంతి సంబరాలు నేత్రపర్వంగా జరిగాయి. సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి చిహ్నానికి గుర్తుగా తెల్లని పావురాలను ఎగురవేశారు. సీఎం జగన్ దంపతుల మాటామంతీ గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా.. అంతకుముందు.. సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాలను చక్కగా పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతుభరోసా కేంద్రాలు, పాఠశాలల నాడు–నేడు వంటి ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తూ రంగవల్లులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, ధాన్యాగారాలు, గడ్డివాములు, ఎడ్లబండ్లు ఇలా అసలుసిసలైన పల్లె వాతావరణం ప్రతిబింబించేలా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో గ్రామ స్వరాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా.. ఇక ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో హాజరైన సీఎం దంపతులను వేదపండితులు నుదుట తిలకం దిద్ది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారిరువురూ జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. గోశాలలోని గోవులకు పూజచేసి దండలు వేసి వాటిని నిమిరుతూ కొద్దిసేపు సంతోషంగా అక్కడ గడిపిన అనంతరం తులసి మొక్కకు నీళ్లుపోసి నమస్కరించుకున్నారు. అక్కడి వినాయకుడి గుడిలోనూ పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన భోగిమంటను కాగడాతో వెలిగించారు. హరిదాసుకు బియ్యం పోయడంతోపాటు పండ్లు కూరగాయలతో కూడిన స్వయంపాకాన్ని సమర్పించారు. గ్రామీణ సంక్రాంతి వేడుకల్లో ప్రధానంగా కనిపించే వివిధ కళాకారులను సీఎం ఆప్యాయంగా పలకరించారు. అంతేకాక.. తెలుగింటి సంక్రాంతి పిండివంటలను ముఖ్యమంత్రి దంపతులు రుచి చూశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పర్ణశాలలో సీఎం దంపతులు ఆశీనులయ్యారు. హరిదాసుకు బియ్యం సమర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ‘శ్రీనివాస కల్యాణం’ నృత్య రూపకాన్ని సీఎం వైఎస్ జగన్ దంపతులు ఆద్యంతం ఆస్వాదించారు. నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతుభరోసా కేంద్రాలు తదితర సేవల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కారం చేసిన తీరును కళ్ల కట్టినట్లు చూపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. పాట పాడిన గాయని ప్రకృతిరెడ్డి, అదే సినిమాలో ఎత్తర జెండా.. పాట పాడిన హారిక నారాయణ్, ప్రముఖ జానపద గాయని కనకవ్వ తదితర కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎక్కడో తెలంగాణ మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి పిలిపించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దీర్ఘకాలం సీఎంగా ఉండాలంటూ ఆశీర్వదించారు. అనంతరం.. శాంతి చిహ్నానికి ప్రతీకగా సీఎం దంపతులు తెల్ల పావురాలను ఎగురవేశారు. ఈ సంబరాల్లో పాల్గొన్న వివిధ కళాకారులను ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించడంతో పాటు వారితో ఫొటోలు దిగుతూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ దంపతులు
-
సీఎం వైఎస్ జగన్ నివాసంలో సంక్రాంతి సందడి
-
నూతన వధూవరులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం పూలకుంట సర్పంచ్ కాటప్పగారి కృష్ణారెడ్డి కుమారుడు కాటప్పగారి అజయ్ విక్రాంత్‌రెడ్డి దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి ఆశీర్వదించారు. అజయ్ విక్రాంత్‌రెడ్డికి 10 రోజుల క్రితం పులివెందులకు చెందిన దీప్తితో వివాహమైంది. నవ దంపతులు శనివారం రాత్రి ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతిని కలిసి ఆశీర్వాదం అందుకున్నారు. చదవండి: (భారీ వరదకూ చెక్కుచెదరకుండా పింఛా ప్రాజెక్టు పునరుద్ధరణ) -
పులివెందులలోని రవిశేఖర్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్ దంపతులు
-
Pulivendula: వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్ దంపతులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సీఎం వ్యక్తిగత సహాయకుడు డి.రవిశేఖర్ యాదవ్ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హజరయ్యారు. నూతన వధూవరులు హేమలత, గంగాధర్‌లను సీఎం జగన్, భారతీరెడ్డి ఆశీర్వదించారు. వివాహానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.శనివారం ఉదయం ఇడుపులపాయ వైఎస్సార్‌ఎస్టేట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం పులివెందుల భాకరాపురం చేరుకున్నారు. అక్కడ నుంచి కదిరిరోడ్డులోని ఎస్సీఎస్ఆర్ గార్డెన్స్‌కు చేరుకుని వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు.చదవండి: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్ -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
కన్నుల పండువగా సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్-2021: తారాలోక తోరణం
సకలజన మనోరంజకమైన సినీ రంగంలోని పాపులర్ చిత్రాలు, ఉత్తమ కళాకారులు, సృజనశీలురను గుర్తించి గౌరవించడం... సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో గత ఎనిమిదేళ్ళుగా అవిచ్ఛి్ఛన్నంగా సాగుతున్న సత్సంప్రదాయం. గడచిన 2021లో విడుదలైన తెలుగు చిత్రాలకు ఇచ్చిన ఈ 8వ ఎడిషన్ అవార్డుల వేదిక పలువురు తారలతో, జీవనసాఫల్య పురస్కారాలందుకున్న సీనియర్లతో కళకళలాడింది. ఆత్మీయంగా సాగిన ఈ అవార్డుల సందడిలో... వారంతా మనసు విప్పి మాట్లాడిన సంగతుల సమాహారం... సంక్షిప్తంగా... ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న భారతిగారికి కూడా ఒక అవార్డు ఇవ్వాలి. అవార్డులు ప్రోత్సాహాన్ని అందిస్తాయి. విపత్కర పరిస్థితుల్లో మా సినిమాను(లవ్ స్టోరీ) విడుదల చేశాం. ముఖ్యంగా కులం, చైల్డ్ ఎబ్యూజ్ వంటి అంశాలను చూపించినందుకుగాను సాక్షి అవార్డు రావడం గర్వంగా ఉంది. మా ఇద్దరి (శేఖర్ కమ్ముల, సుకుమార్) ప్రయాణం ఒకేసారి మొదలైంది. ఇండస్ట్రీ గర్వించేలా సుకుమార్ సినిమాలు చేస్తున్నారు. వరుసగా రెండు సార్లు(2020, 2021) సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్ అందుకోవడం ఆనందంగా ఉంది.. హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నా. ఈ అవార్డు అందించిన సాక్షికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పురస్కారాన్ని ‘పుష్ప’ బృందానికి అంకితం ఇస్తున్నాను. తెరవెనుక వారి కృషి మాటల్లో చెప్పలేనిది. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం సుకుమార్‌గారు. ఆయన వల్లే ఇంత మంచి సినిమా తీశాం. దేవిశ్రీతో ప్రయాణం గొప్పగా ఉంటుంది. నా మొదటి సినిమా నుంచి ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూట్యూబ్‌లో ఎక్కువ మంది వింటున్న ఆల్బమ్ వరకు పాటలు అందించిన చంద్రబోస్‌గారికి థ్యాంక్స్. 2021లో ‘పుష్ప’ తో పాటు బాలకృష్ణగారి‘అఖండ’, నాని ‘శ్యామ్‌సింగరాయ్’, ‘జాతిరత్నాలు’ వంటి మంచి మూవీస్ విడుదలయ్యాయి.. వాటన్నిటికీ అభినందనలు. కరోనా తర్వాత మళ్లీ వరుసగా సినిమాలు రావడం హ్యాపీ. ఈ మధ్యనే సినిమా ప్రయాణం మొదలుపెట్టిన ప్రతిభావంతులకు ఈ వేదికపై అవార్డు రావడం అభినందనీయం. ఈ అవార్డు అందుకోవడం ఎంతో ప్రత్యేకం. అవార్డు గ్రహీతలను సెలెక్ట్ చేసే కోర్ టీం గురించి నాకు తెలుసు.. ప్రతి విషయాన్ని గమనిస్తూ, సాహిత్యానికి ప్రాధాన్యమిస్తూ నిష్పాక్షికంగా ఎన్నుకుంటారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన సాక్షికి, భారతిగారికి థ్యాంక్స్. ‘పుష్ప’ విజయంలో బన్నీ, ర ష్మిక, దేవిశ్రీ, నిర్మాతలు ఎంతో సహకారాన్ని అందించారు. నా కోసం ‘ఊ అంటావా మావా..’ పాటని ఐదేళ్లుగా దాచిన చంద్రబోస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ‘సిరివెన్నెల’గారు సినిమాల్లో సాహిత్యాన్ని నింపగలిగారు. ఆయన మరణించినప్పుడు.. ‘సిరివెన్నెలగారు బతికే ఉన్నారు... కానీ, పాటే ప్రాణం పోగొట్టుకుంది’ అని రాసుకున్నాను. ఎక్కడ టాలెంట్ ఉన్నా గుర్తించి, వారికి అవార్డులతో ప్రోత్సాహం అందిస్తున్న సాక్షి సంస్థ ఆ పేరుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఏ రంగంలోని వారికైనా సాక్షి అవార్డు వస్తే వారికి నిజమైన ప్రతిభ ఉందని గుర్తించవచ్చు. సమాజహితమైన వార్తలతో పాటు అవార్డులు అందించడం అద్భుతం. – ఎస్వీ కృష్ణా రెడ్డి, సీనియర్ డైరెక్టర్ ఎనిమిదేళ్లుగా సినిమాలతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ ఉన్న వారికి అంకితభావంతో, దిగ్విజయంగా అవార్డులు అందిస్తున్న సాక్షి యాజమాన్యానికి థ్యాంక్స్. టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించాలనే నిబద్ధతతో సాక్షి సంస్థ పనిచేస్తోంది. వార్తలతో పాటు మరింత మెరుగైన సమాజం కోసం, పర్యావరణ హితం కోసం పుడమి సాక్షిగా వంటి కార్యక్రమాలను, రైతుల కోసం మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి. – అచ్చిరెడ్డి, సీనియర్ నిర్మాత ఈ వేదికలో సాక్షి అవార్డు పొందడం రెండవ సారి. మా మొదటి మూవీకి కూడా ఇక్కడే అవార్డు అందుకున్నాం. మా విజయంలో టీం కృషి మర్చిపోలేనిది. – నవీన్ ఎర్నేని, నిర్మాత (పుష్ప) గత కొంతకాలంగా మా అందరికీ సాక్షి సంస్థ అవార్డులతో ప్రోత్సాహం అందిస్తోంది. ఇలాంటి వేదికను ఏర్పాటు చేసినందుకు సాక్షికి ధన్యవాదాలు. ఈ అవార్డు సుకుమార్ వల్లే అందుకోగలిగాను. తనకు ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. మైత్రీ మూవీస్ నిర్మాతలు, బన్నీ ప్రోత్సాహం మర్చిపోలేను. ‘పుష్ప 2’ మీరు ఊహించని రేంజ్లో ఉంటుంది. ఈ సందర్భంగా ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారిని గుర్తు చేసుకోవాలి. ఆయనతో నాది కొడుకులాంటి అనుబంధం. సినిమా కోసం గొడవపడి అలిగేంత చనువు ఉండేది. ప్రతీ అక్షరంతో జనాల గుండెల్లోకి దూసుకుపోయేవారు ఆయన. ‘వర్షం, పౌర్ణమి’.. వంటి ఎన్నో మంచి సినిమాలు కలిసి చేశాం. ఆయన్ని చూసి జీవితాన్ని నేర్చుకున్నాను. ‘సిరివెన్నెల’ గారు మన మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. – దేవిశ్రీ ప్రసాద్, మోస్ట్ పాపులర్ సంగీత దర్శకుడు (పుష్ప) సాక్షి ఎక్స్‌లెన్స్ పురస్కారానికి నన్ను అర్హున్ని చేసిన న్యాయనిర్ణేతలకు ధన్యవాదాలు. ఎప్పటికైనా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వెలుగుతుంది, లోకాన్ని ఏలుతుందనే నమ్మకం ఉండేది. ఆ కోరిక ‘పుష్ప’ సినిమాతో నిజమైనందుకు ఆనందంగా ఉంది. ఇందులో దర్శకుడు సుకుమార్, సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్ కృషి ఎనలేనిది. ఈ ప్రయాణంలో నా కృషి అణువంత.. అదృష్టం ఆకాశమంత. – చంద్రబోస్, మోస్ట్ పాపులర్ గీత రచయిత (పుష్ప) అవార్డులు గుర్తింపుతో పాటు మరింత బాధ్యతను పెంచుతాయి. సాక్షిలాంటి సంస్థ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ అవార్డు నా బాధ్యతను పెంచింది. ఈ అవార్డుల్లో భాగంగా జ్యూరీ విభాగంలో ఉన్నాను. ఇక్కడ ఎంపిక విధానం ఉన్నత ప్రమాణాలతో ఉంది. సాక్షి బృందానికి అభినందనలు. – పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ దిగ్గజం ముందుగా ఈ అవార్డును మా మావయ్య చిరంజీవిగారికి అంకితం ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన లేకపోతే నేను లేను. ఆ తర్వాత మా అమ్మగారికి. అమ్మా... ఈ అవార్డు నీ కోసమే..!. ఈ ఏడాది బెస్ట్ డెబ్యూడెంట్ యాక్టర్‌గా నేను అవార్డు తీసుకోవడానికి ఓ కారణం అయిన దర్శకుడు బుచ్చిబాబుకు ధన్యవాదాలు. అలాగే ‘ఉప్పెన’ సినిమాలో నటించిన విజయ్ సేతుపతిగారికి, నిర్మాతలు నవీన్, రవి శంకర్గార్లకు, డీఓపీ శ్యామ్దత్కు, డైరెక్టర్ సుకుమార్, ఆయన భార్య తబితగార్లకు థ్యాంక్స్. ఈ అవార్డును నాకు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు. – వైష్ణవ్‌తేజ్, ఉత్తమ తొలి చిత్ర నటుడు (ఉప్పెన). సాక్షి ఆధ్వర్యంలో మా చిత్రం ‘వైల్డ్ డాగ్’కు జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ‘వైల్డ్ డాగ్’లో నటించిన నాగార్జున గారికి ధన్యవాదాలు. – అన్వేష్‌రెడ్డి, నిర్మాత, జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ (వైల్డ్ డాగ్) మా అక్క మంగ్లీ (‘లవ్‌స్టోరీ’లోని ‘సారంగదరియా’ పాట), నేను (‘పుష్ప’లోని ‘ఊ అంటావా...’ పాట) పోటీపడి, సరిసమానంగా నిలిచి, ఇద్దరం ఈసారి అవార్డు గెల్చుకోవడం ఆనందంగా ఉంది. మా అక్క రాలేకపోయింది. అవార్డిచ్చిన భారతమ్మకు ధన్యవాదాలు. సుకుమార్, దేవీశ్రీ, చంద్రబోస్గార్లకు థ్యాంక్స్. – ఇంద్రావతి, మోస్ట్ పాపులర్ సింగర్ – ఫిమేల్ (పుష్ప) సామాజిక సేవ, విద్య, పర్యావరణం.. వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నవారికి సాక్షి అవార్డు అందించడం అభినందనీయం. ఈ కార్యక్రమానికి ఎనిమిదేళ్లుగా భారతి సిమెంట్ తరపున సహకారం ఇస్తున్నాం.. ఇలాంటి మంచి కార్యక్రమాలకు మా తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుంది. – రవీందర్ రెడ్డి. డైరెక్టర్ మార్కెటింగ్, భారతి సిమెంట్స్. అవార్డు చాలా బరువుగా ఉంది.. థ్యాంక్యూ సాక్షి. సుకుమార్సర్ లేకుంటే నేను లేను. దర్శకుడిగా నాకంటూ ఏదొచ్చినా అది మీదే. ‘ఉప్పెన’ ఇంత బాగా రావడానికి కారకులైన నిర్మాతలు నవీన్, రవిగార్లకు థ్యాంక్స్. అలాగే విజయ్ సేతుపతి, వైష్ణవ్, కృతి, దేవిశ్రీలకు థ్యాంక్స్. టీమ్ అంతా కష్టపడితే ఈ అవార్డు నాకు ఇచ్చారు. – బుచ్చిబాబు, ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు(ఉప్పెన) ‘నాంది’ సినిమా తీసినందుకు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ‘స్పెషల్ జ్యూరీ అవార్డ్’ రావడం సంతోషంగా ఉంది. అన్ని రంగాల్లోని ప్రతిభావంతులను ఎంపిక చేసి అవార్డులతో సత్కరించి, ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవార్డులు మాలాంటి యువ దర్శకులు, యువతకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సాక్షి ఇచ్చిన ప్రోత్సాహంతో భవిష్యత్‌లో కూడా మరిన్ని మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తాను. – దర్శకుడు విజయ్ కనకమేడల, జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ (నాంది) ‘నాంది’ రిలీజ్ కాకముందే మా సినిమా.. విడుదల తర్వాత ప్రేక్షకుల చిత్రం. వారి సొంత సినిమాలా భావించి ఆదరించారు. ఈ వేదికపై మేం ఉండటానికి ప్రధాన కారణం ప్రేక్షకుల ఆదరణే. అందుకే ఈ అవార్డును ప్రేక్షకులకు అంకితం ఇస్తున్నాను. అవార్డుకు ఎంపిక చేసిన సాక్షి జ్యూరీకి ధన్యవాదాలు. – సతీష్ వర్మ, నిర్మాత, జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ (నాంది) గత ఏడాది నా వర్క్‌ను గుర్తించి నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన సాక్షికి ధన్యవాదాలు. నా తొలి చిత్రం ‘జాంబీరెడ్డి’కి విశేష ఆదరణ లభించండం హ్యాపీ. నాపై నమ్మకం ఉంచిన దర్శక– నిర్మాతలకు థ్యాంక్స్. అలాగే ఓ నటుడిగా నన్ను ప్రేక్షకులు ఆదరించారు. నేను ఎంపిక చేసుకున్న కథలను ప్రేక్షకులు వారి ఆదరణ రూపంలో ప్రశంసించారు. ఇప్పుడు నా కష్టాన్ని కూడా గుర్తిస్తూ ఇలాంటి అవార్డులు రావడం నాకు కచ్చితంగా బోనస్‌లా అనిపిస్తోంది. – తేజా సజ్జా, జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ (జాంబీ రెడ్డి) ఈ అవార్డు ఇచ్చిన సాక్షికి థ్యాంక్స్. ఈ అవార్డును మన మధ్యలేని (ఇటీవల మరణించారు) ఈ సినిమా (సూపర్ ఓవర్) దర్శకుడు ప్రవీణ్‌కు అంకితం ఇస్తున్నాను. అలాగే ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. – సుధీర్‌వర్మ, మోస్ట్ పాపులర్ ఓటీటీ ఫిల్మ్ (సూపర్ ఓవర్) ఇది నా తొలి అవార్డు. నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అన్నకు ధన్యవాదాలు. ఆయన వల్లే ఇది సాధ్యమైంది. నేను ఈ అవార్డు అందుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన అందరికీ థ్యాంక్స్. అలాగే ‘పుష్ప’లాంటి అద్భుతమైన సినిమా తీసిన సుకుమార్‌గారికి, లిరిక్స్ రాసిన చంద్రబోస్‌గారికి ధన్యవాదాలు. – శివమ్, మోస్ట్ పాపులర్ సింగర్ (మేల్) (పుష్ప–1). కృష్ణవేణి లైఫ్ టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డ్ చిత్తజల్లు కృష్ణవేణి... పదేళ్ళ వయసులో సినిమా రంగానికి వచ్చారామె. ఇండియాలోనే తొలి బాలల చిత్రం ‘సతీ అనసూయ – ధ్రువ విజయం’లో అనసూయ పాత్రధారి ఆవిడే. బాల నటి నుంచి హీరోయిన్గా ఎదిగారు. గాయనిగా ప్రేక్షకులను పరవశింపజేశారు. శోభనాచల స్టూడియో అధినేత, దర్శక–నిర్మాత మీర్జాపురం రాజావారిని వరించారు. నిర్మాతగా మారారు. స్టూడియో అధినేత అయ్యారు. పదేళ్ళ వయసులో వచ్చి... 1935 నుంచి ఇప్పటికీ 86 ఏళ్ళుగా తెలుగు సినీ రంగంలో ఉన్న సీనియర్ మోస్ట్... నటి, నిర్మాత... బహుముఖ ప్రజ్ఞాశాలి... సి.కృష్ణవేణి. ‘సతీ అనసూయ, తుకారామ్, కచ దేవయాని, భోజ–కాళిదాసు, జీవనజ్యోతి, దక్షయజ్ఞం, భీష్మ, ధర్మాంగద, మదాలస, గొల్లభామ, శ్రీలక్ష్మమ్మ, మన దేశం, పల్లెటూరి పిల్ల’... ఇలా తెలుగు టాకీల తొలినాళ్ళలో ఆమెకు నటిగా, స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చిన చిత్రాలు అనేకం. అన్నమయ్య కీర్తన ‘జో అచ్యుతానంద జోజో ముకుంద...’ తెలుగు తెరపై తొలిసారిగా వినిపించింది కృష్ణవేణి గొంతులోనే. స్వాతంత్య్ర సమరం నేపథ్యంలో తెలుగులో వచ్చిన తొలి చిత్రం ‘మనదేశం’. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ఆ చిత్రాన్ని నిర్మించి, నటించడమే కాదు... ‘మనదేశం’తో ఎన్టీఆర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత కృష్ణవేణిది. ఘంటసాల, రమేశ్ నాయుడులను మ్యూజిక్ డైరెక్టర్స్‌గా, పి.లీలను ప్లేబ్యాక్ సింగర్‌గా పరిచయం చేశారు. అక్కినేని నాగేశ్వరరావుతో ‘కీలుగుర్రం’ మొదలు పలు సినిమాలు నిర్మించారు. రాజ్‌కుమార్‌తో కన్నడలో ‘భక్త కుంభార’, శివాజీ గణేశన్ ద్విపాత్రాభినయంతో తెలుగు హిట్ ‘యమగోల’ రీమేక్ గా ‘యమనుక్కు యమన్’ చిత్రాలు నిర్మించారు. గతంలో వై.ఎస్.ఆర్. సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చి సి.కృష్ణవేణిని గౌరవించింది. ఆమె కుమార్తె ఎన్.ఆర్.అనూరాధా దేవి సైతం ప్రసిద్ధ నిర్మాతే. వందేళ్ళ వయస్సు దగ్గరపడుతున్న వేళ ఈ అవార్డుతో ఘనమైన కీర్తి అందించిన సాక్షి వారికి అభినందనలు. పదేళ్ల వయస్సులో ‘సతీ అనసూయ’ అనే సినిమాలో అనసూయ పాత్ర చేసే అవకాశాన్నిచ్చారు సి.పుల్లయ్య. ‘మనదేశం’ సినిమాని రామారావు కోసమే తీసినట్టు అనిపిస్తోంది. – సి. కృష్ణవేణి, తొలితరం నటి –గాయని గిరిబాబు లైఫ్ టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డ్ అర్ధ శతాబ్ద కాలంగా తెలుగు సినీరంగంలో ఆయనది ఓ ప్రత్యేక స్థానం. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, దర్శకుడిగా... ఇలా వెండితెరపై బహుముఖ పాత్రధారి గిరిబాబు. చిన్నతనంలోనే నటనపై మక్కువతో నాటకాలతో మొదలుపెట్టి, మద్రాసులో సినిమా అవకాశాల కోసం పట్టుపట్టి, ఎన్టీఆర్, ఏయన్నార్ నుంచి చిరంజీవి, నాగార్జున దాకా మూడు తరాల అగ్ర హీరోలకు దీటుగా విలన్‌గా నటించిన ఖ్యాతి గిరిబాబుది. 1943 జూన్ 8న ప్రకాశం జిల్లా, రావినూతల గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన యర్రా శేషగిరిరావు... ఇలా గిరిబాబుగా పేరు సంపాదించుకున్న తీరు నేటి తరానికి ఒక స్ఫూర్తి పాఠం. 1973లో ‘జగమే మాయ’తో గిరిబాబు సినీరంగ ప్రవేశం చేశారు. స్వీయ అభిరుచికి అనుగుణంగా చిత్రాలు తీయాలని జయభేరి సంస్థను స్థాపించారు. తెలుగులో తొలి పూర్తి బ్లాక్ అండ్ వైట్ సినిమా స్కోప్ ‘దేవతలారా దీవించండి’తో 1977లో నిర్మాతగా మారి పది చిత్రాలు నిర్మించారు. అన్ని భాషల్లో కలిపి సుమారు 600లకు పైగా సినిమాల్లో విభిన్న పాత్రపోషణ చేశారు. సాంఘికం, చారిత్రకం, పౌరాణికం, జానపదం – ఇలా అన్ని తరహా చిత్రాల్లోనూ మెప్పించారు. ‘రణరంగం, ఇంద్రజిత్, నీ సుఖమే నే కోరుకున్నా’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. గిరిబాబు చిన్న కుమారుడు బోసుబాబు కొన్ని చిత్రాల్లో హీరోగా నటించారు. పెద్ద కుమారుడు రఘుబాబు సైతం తండ్రి బాటలో పయనించి, నటుడిగా ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నారు. సినీరంగానికి సుదీర్ఘ కాలంగా గిరిబాబు అందించిన సేవలను గుర్తించి... ఆయన సినీజీవిత స్వర్ణోత్సవ వేళ...లైఫ్‌టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డుతో... సాదరంగా సత్కరించింది... సాక్షి మీడియా గ్రూప్. సినిమా రంగంలో 50 ఏళ్ల అనుభవం ఉంది.. దాదాపు ఆరువందల సినిమాల్లో నటించాను. ఇంతకాలానికి జీవిత సాఫల్య పురస్కారం అవార్డు రావడం, ఈ అవార్డును సాక్షి సంస్థ అందించడం అమితమైన ఆనందాన్నిచ్చింది. ఇప్పటికీ సాక్షి పేపర్ చదవడం నాకు అలవాటు. – గిరిబాబు, సీనియర్ నటులు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లైఫ్ టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డ్ (మరణానంతరం) ఆయన పాట... చీకట్లో దారి చూపించే వెన్నెల. నిరాశలో వెన్నుతట్టి ముందుకు నడిపించే భరోసా. అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుక. ఆ పాట యువతరాన్ని ఉర్రూతలూగించింది... జీవిత సత్యాన్ని విడమర్చి చెప్పింది... ప్రేమతత్వాన్ని బోధించింది. ఆ పాటల పూదోట ఎవరో కాదు... చేంబోలు సీతారామశాస్త్రి. తొలిసినిమా పేరే ఆయనకు ఇంటిపేరై, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా ప్రసిద్ధు లయ్యారు. కె.విశ్వనాథ్ ప్రోత్సాహంతో ‘జననీ జన్మభూమి’తో సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ‘విధాత తలపున ప్రభవించినది...’ అంటూ తొలినాటి పాటతోనే సినీ సాహిత్య ప్రియుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొంది, తొలి నంది అవార్డు సాధించారు. అక్కడి నుంచి సీతారామశాస్త్రి కలం విశ్రమించలేదు. మూడున్నర దశాబ్దాలపైచిలుకు ప్రయాణంలో 800కు పైగా చిత్రాల్లో 3 వేలకు పైగా పాటలు రాశారు. ఉత్తమ గీత రచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 11 నంది అవార్డులు అందుకున్నారు సిరివెన్నెల. 2019లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సిరివెన్నెల సీతారామశాస్త్రిని తెలుగు సినీ ప్రియులందరి తరఫున సగౌరవంగా స్మరిస్తూ, ఆ మరపురాని సాహితీమూర్తికి మరణానంతరం... సభక్తికంగా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది సాక్షి మీడియా గ్రూపు. సాక్షి మీడియా వారు ఆయన్ను (‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి) అభిమానంతో గౌరవించినందుకు మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. – పద్మావతి (‘సిరివెన్నెల’ సతీమణి) నాన్నగారిని ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఆయన మీద గౌరవంతో అవార్డు ఇచ్చిన భారతిగారికి, సాక్షి మీడియాకి ధన్యవాదాలు. ప్రస్తుతానికి ఇంత కన్నా నేను ఎక్కువ మాట్లాడలేను (భావోద్వేగంతో...) – యోగేశ్వర్ (‘సిరివెన్నెల’ పెద్దబ్బాయి) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్-2021: సేవకు మకుటం.. ప్రతిభకు పట్టం
నిస్వార్థంగా సేవ చేసిన వారు కొందరైతే.. తిండిలేని స్థితి నుంచి పదిమంది ఆకలి తీర్చే స్థాయికి ఎదిగిన వారు మరికొందరు... పిన్న వయస్సులోనే ప్రతిభ చూపే వారు కొందరైతే... తమ ప్రతిభ ను సమాజ హితం కోసం, దేశానికి పతకాల పంటను అందించడం కోసం తోడ్పడేవారు ఇంకొందరు. ఎంచుకున్న రంగంలో విశేష కృషి చేసిన వారు మరికొందరు! ఇలాంటి వారిలో ప్రతి ఏటా తమ దృష్టికి వచ్చిన కొందరిని సాక్షి గుర్తించి అభినందిస్తోంది... గౌరవించి సత్కరిస్తోంది. ఇందులో భాగంగా 2021 సంవత్సరానికి సంబంధించి సాక్షి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో అక్టోబర్ 21, శుక్రవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దలు, ప్రముఖుల సమక్షంలో కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్న వారి వివరాలు, స్పందనలు. మరుప్రోలు జస్వంత్ రెడ్డి : (తల్లి వెంకటేశ్వరమ్మ, తండ్రి శ్రీనివాసులురెడ్డి) – స్పెషల్ జ్యూరీ పురస్కారం (మరణానంతరం) బాపట్లలోని దరివాద కొత్తపాలెం గ్రామానికి చెందిన జశ్వంత్ 18 ఏళ్ల వయసులోనే మద్రాస్ రెజిమెంట్‌లో శిక్షణ పూర్తి చేశాడు. తర్వాత ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా జమ్ముకాశ్మీర్‌కు వెళ్లాడు. 2021 జులై 8న జమ్మూకాశ్మీర్‌లోని సుందర్ బని సెక్టార్లో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద టెర్రరిస్టులతో తలపడ్డ జశ్వంత్, ఎదురు కాల్పులలో తీవ్రంగా గాయపడి తుది శ్వాస విడిచాడు. అమ్మా! కంగారు వద్దు... అవే చివరి మాటలు!! మా అబ్బాయి ఎప్పుడు ఫోన్ చేసినా ‘అమ్మా! నేను బాగున్నాను. మీరు జాగ్రత్త’ అని చెప్పేవాడు. గతేడాది సరిహద్దులో ఎదురు కాల్పులు జరుగుతున్న సమయంలో... జూలై 6న ఫోన్ చేసినప్పుడు కూడా ‘ఇక్కడ (జమ్ము) బాగుంది. నా నుంచి ఫోన్ లేకపోయినా మీరేం కంగారు పడకండి. మీరు జాగ్రత్త’ అన్నాడు. అవే చివరి మాటలు. ఎనిమిదవ తేదీ ప్రాణాలు వదిలాడు. డాక్టర్ డి. పరినాయుడు : జట్టు సంస్థ – ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తూ పురుగుమందులు లేకుండా వ్యవసాయం ఎలా చేయాలో గిరిజనులకు అవగాహన కల్పిస్తోంది జట్టు సంస్థ. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో 206 గ్రామాలకు చెందిన దాదాపు పదివేల మంది రైతులకు ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పించడంతోపాటు స్కూల్ టు ఫీల్డ్ స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు నాచురల్ ఫార్మింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈ సంస్థ. సేద్యానికి సేవ చేశాను: పదహారేళ్లుగా వ్యవసాయ పద్ధతుల్లో ఆచరణీయమైన ప్రయోగాలు చేశాను. అవార్డులు అందుకున్నాను. నాచురల్ ఫార్మింగ్‌కి ప్రచారం బాగానే ఉంది. కానీ రైతులు రావాల్సినంత స్థాయిలో ముందుకు రావడం లేదు. ఇలాంటి గుర్తింపులు, అవార్డులు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి. సహదేవయ్య–విక్టోరియా : ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ – నవజీవన్ సంస్థ, నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్రంగా అణగారిన వర్గాలకు అండగా నిలవడం కోసం 1996లో ఏర్పడిన ఈ సంస్థ అణచివేతకు గురైన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చేందుకు కృషి చేస్తోంది. సాధికారత, స్వయంసమృద్ధి, సహజ వనరుల సంరక్షణ, సమాన అవకాశాలు, రక్షిత మంచినీరు, బాలల హక్కులు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది. నిరుపేదలు, నిస్సహాయుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేస్తోంది. ప్రచారం లేకుండా పని చేశాం: ప్రచారం చేసుకోకుండా మా పని మేము చేసుకుంటూ ఉన్న సమయంలో సాక్షి మా సేవలను గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులు ప్రోత్సాహాన్నిస్తాయి. మరింత ఉత్సాహంగా పని చేయడానికి దోహదం చేస్తాయి. బొల్లంపల్లి ఇంద్రసేన్ రెడ్డి: ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ బొల్లంపల్లి ఇంద్రసేన్‌రెడ్డి వాతావరణంలోకి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీతో ఉన్న ప్రయోజనాల గురించి, సౌరశక్తి వినియోగం గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలో నివసించేవారికి పర్యావరణ పరిరక్షణ గురించి వర్క్‌షాప్‌లు నిర్వహించారు. యునైటెడ్ నేష¯Œ ్స ఆధ్వర్యంలో కౌన్సిల్ ఫర్ గ్రీ¯Œ రెవల్యూష¯Œ నిర్వహించే పలు సదస్సుల్లో పాల్గొన్నారు. ప్రకృతి విలువ తెలియచేయాలి: చిన్నప్పటి నుంచి ప్రకృతికి దగ్గరగా పెరిగాను. ప్రకృతి మీద ప్రత్యేకమైన మమకారం కూడా. అది కాలుష్యపూరితం అవుతుంటే చూస్తూ ఊరుకోలేక దాని పరిరక్షణ కోసం చిన్నచిన్న కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరికీ ప్రకృతి విలువ తెలియజేయాలనేది నా ప్రయత్నం. అనిల్ చలమలశెట్టి, భార్య స్వాతి : గ్రీన్ కో గ్రూప్ – ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది గ్రీన్కోగ్రూప్. ఈ కంపెనీ అధినేతలు అనిల్ చలమలశెట్టి, ఆయన భార్య స్వాతి. 2030 నాటికి ఒక గిగా వాట్ సామర్థ్యం గల సంప్రదాయేతర ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని, 2040 నాటికి పర్యావరణ సమతుల్యతను నెట్ జీరో కార్బన్ స్థాయికి తీసుకురావాలనేది వారి లక్ష్యం. ఈ సంస్థ కర్నూలులో 15 వేల కోట్ల వ్యయంతో 5,410 మెగావాట్ల విద్యుత్ కేంద్ర నిర్మాణం తలపెట్టింది. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్‌ని ఉత్పత్తి చేయడం వీరి ప్రాజెక్టు ప్రత్యేకత. పర్యావరణం కోసం పనిచేస్తాం: ఈ పురస్కారం మా టీమ్‌లో అందరికీ కలిపి సంయుక్తంగా ఇచ్చిన గౌరవం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా కార్య క్రమాలను ఇంకా ఇంకా కొనసాగిస్తాం. తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి : ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రముఖ పారిశ్రామికవేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి స్వస్థలం కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలంలోని జనగామ గ్రామం. తల్లిదండ్రులు సుశీల, నారాయణ రెడ్డి. భవన నిర్మాణ రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన సుభాష్‌రెడ్డి ఆరు కోట్ల రూపాయలతో బీబీపేట్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల భవనాన్ని అత్యాధునికంగా పునర్నిర్మించి ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు మన బడి కార్యక్రమానికి ప్రేరణగా నిలిచారు. సీతారాంపల్లిని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. నాణ్యతకు నా పనే గీటురాయి: దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన నాటి నాయకులలా మనం జీవితాలను త్యాగాలు చేయలేకపోయినా సమాజానికి మనకు చేతనైనంత సహాయం చేయాలనేది నా అభిమతం. రోడ్డు, స్కూలు బిల్డింగ్... ఏ పని చేసినా సరే... నాణ్యతకు నేనే గీటురాయి అన్నట్లుగా చేశాను. ఈ అవార్డు మా బాధ్యతను పెంచింది. ఈ సర్వీస్‌ని ఇలాగే కొనసాగిస్తాను. అక్షత్ సరాఫ్ : (రాధా టీఎమ్‌టీ) – బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ లార్జ్ స్కేల్ 1960లో శ్రీ రాధేశ్యామ్ జీ షరాఫ్ టి.ఎమ్.టి. సంస్థను స్థాపించారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో హై క్వాలిటీ స్టీల్ ఉత్పత్తి చేస్తూ మార్కెట్లో తన ప్రత్యేకతను చాటుతున్నారు రాధా టి.ఎమ్.టి. కంపెనీ డైరెక్టర్ అక్షత్ షరాఫ్.హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఈ సంస్థ శంకరంపేట్, చిన్న శంకరంపేట్ గ్రామాల ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు తోడ్పాటునందిస్తోంది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, మొక్కలు నాటించడం, స్టీల్ ప్లాంట్లలో కాలుష్య నివారణకు కృషి చేస్తోంది. ఇదే బాధ్యతను కొనసాగిస్తాం: మా వంతు సామాజిక బాధ్యతగా విద్యారంగానికి తోడ్పాటునందిస్తున్నాం. ఈ అవార్డు స్ఫూర్తితో... మా సేవలను నాణ్యత తగ్గకుండా ఇలాగే కొనసాగిస్తామని తెలియచేస్తున్నాను. పి.జ్ఞానేశ్వర్ : యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ – ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ సంగారెడ్డి జిల్లా నాగిల్గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన పాలడుగు జ్ఞానేశ్వర్ జువాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. తాను పుట్టిపెరిగిన గ్రామంలో పచ్చదనం తగ్గిపోవడం, మంజీరా నదీతీరం కళ తప్పడం చూసి పర్యావరణ పరిరక్షణకు కంకణం కట్టుకున్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ గురించి వివరిస్తున్నారు. పిల్లలను గ్రీన్ బ్రిగేడ్‌గా తయారుచేసి వారి చేత మొక్కలు నాటిస్తున్నారు. ఎర్త్ లీడర్లను తయారు చేస్తాను: మంజీర నది ఎండిపోయి నీరు లేక పక్షులు చనిపోయాయి. చెట్లు ఎండిపోయాయి. నా వంతుగా పరిరక్షణ బాధ్యత చేపట్టాలనుకుని, పర్యావరణవేత్తల సహకారంతో పనిచేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం కోటి మంది ఎర్త్ లీడర్లను తయారు చేయాలనేది నా లక్ష్యం. నిఖత్ జరీన్ : యంగ్ ఎచీవర్ ఆఫ్ ది ఇయర్ – స్పోర్ట్స్ బాక్సింగ్ రింగులో పవర్ ఫుల్ పంచ్‌లతో విజృంభిస్తూ ఒక్కో పతకాన్ని ఒడిసిపట్టుకుంటూ తన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిన నిఖత్ జరీన్ 1996 జూన్ 14న తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా దంపతులకు జన్మించింది. 13 సంవత్సరాల వయసులో తండ్రి వద్ద బాక్సింగ్‌లో ఓనమాలు నేర్చుకున్న నిఖత్, ఇస్తాంబుల్‌లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకాన్ని అందుకుని ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు నమోదు చేసింది. తల్లిగా గర్వపడుతున్నాను: మా అమ్మాయికి అవార్డు రావడం తల్లిగా నాకు ఎంత సంతోషంగా ఉంది. తను హైదరాబాద్‌లో లేదు. ఆమె తరఫున నేను అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి : యంగ్ ఎచీవర్ ఆఫ్ ది ఇయర్ (స్పోర్ట్స్) బ్యాడ్మింటన్‌లో అద్భుతాలు సృష్టిస్తు్తన్న ఈ అమలాపురం కుర్రాడు అంతర్జాతీయ పోటీల్లో రాకెట్లా దూసుకుపోతూ పతకాల పంట పండిస్తున్నాడు. చిరాగ్ శెట్టితో కలిసి భారత పురుషుల డబుల్స్ టీమ్‌లో సత్తా చాటుతున్నాడు. 2022లో జరిగిన థామస్ కప్‌లో స్వర్ణ పతకాన్ని, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యపతకాన్నీ గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో మూడు పతకాలు సాధించి రికార్డు నెలకొల్పాడు. సాత్విక్ తండ్రి కాశీవిశ్వనాథం, తల్లి రంగమణి సాక్షి ప్రోత్సాహాన్ని మరువలేం: మా అబ్బాయికి అర్జున అవార్డు వచ్చినప్పుడు ఎంత సంతోషించానో, ఇప్పుడూ అంతే సంతోషిస్తున్నాను.. మా సాత్విక్ క్రీడాప్రస్థానంలో తొలి నుంచి సాక్షి పత్రిక అండగా వెన్నంటే ఉందని చెప్పాలి. మా బాబు ఫైల్ తిరగేస్తే సాక్షి పత్రికలో వచ్చిన వార్తలే ఎక్కువగా ఉంటాయి. షేక్ సాదియా అల్మాస్ : యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ (స్పోర్ట్స్) మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్మాస్ పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటుతోంది. పవర్ లిఫ్టింగ్‌లో నేషనల్ చాంపియన్ అయిన తండ్రిని చూసి ప్రేరణ పొందిన సాదియా పదవ తరగతి నుంచి ప్రాక్టీస్ ప్రారంభించి ఒక్కో పతకం గెలుచుకుంటూ సంచలనాలు సృష్టిస్తోంది. మన దేశంలో జరిగిన పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. 2021లో టర్కీలో జరిగిన ఏషియన్ చాంపియన్‌షిప్ పోటీల్లో 57 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: మన నేల మీద నాకు వచ్చిన గుర్తింపు, అందుతున్న గౌరవం ఇది. ఎంతో మంది క్రీడాకారులున్నారు. అంతమంది నుంచి ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.∙ డాక్టర్ రామారెడ్డి కర్రి : ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్ రాజమండ్రిలో మానస ఆస్పత్రిని స్థాపించి మానసిక వైద్యుడిగా దాదాపు 40 ఏళ్లుగా వైద్యం చేస్తూనే మరోవైపు పలు సామాజిక, సాంస్కృతిక, విద్యా, కళాసంస్థల్లో వివిధ పదవులు నిర్వహించారు రామారెడ్డి. మానసిక సమస్యలు, వర్తమాన రాజకీయాలు, సామాజిక అంశాలపై పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియోలు రూపొందించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. అవార్డులు శక్తినిస్తాయి: మానసిక రుగ్మతల గురించి మన సమాజంలో సరైన అవగాహన లేని రోజుల్లో నా సర్వీస్ మొదలుపెట్టాను. నలభై రెండేళ్లలో దాదాపుగా ఒకటిన్నర లక్షల మంది తెలుగు వాళ్లకు స్వస్థత చేకూర్చగలిగాను. తెలుగు మీడియా సంస్థ నుంచి గుర్తింపు లభించడం సంతోషం. అవార్డులు మనసు మీద మనిషి మీద చాలా సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంకా బాగా పని చేయడానికి శక్తిని ఇస్తాయి. సిద్ధార్థ్ శ్రీవాస్తవ్ పిల్లి: యంగ్ అచీవర్ ఆఫ్ ఇది ఇయర్ (ఎడ్యుకేషన్) తెనాలికి చెందిన ప్రియ మానస, రాజ్‌కుమార్ దంపతుల కుమారుడైన సిద్ధార్థ్ శ్రీవాత్సవ్, పసి వయసులోనే కంప్యూటర్స్‌లో ఆరితేరడంతో మాంటెగ్న్ కంపెనీ ఏడో తరగతిలోనే నెలకు 25 వేల జీతంతో ఐటీ జాబ్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం ఇన్ఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్టుగా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూనే అమెరికన్ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కోడింగ్ క్లాసులు నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో భూకంపాల రాకను ముందుగానే పసిగట్టే ప్రాజెక్టులో సీనియర్ ప్రొఫెసర్లతో కలిసి పరిశోధనలు చేస్తున్నాడు. ఎంత శ్రద్ధ పెడితే అంత నేర్చుకుంటాం: డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఈ తరానికి చాలా అవసరం. మనం ఎంత నేర్చుకుంటామనేది... నేర్చుకోవడానికి మనం పెట్టిన శ్రద్ధాసక్తులను, ప్రాక్టీస్‌ని బట్టి ఉంటుంది. పేరెంట్స్ సపోర్టు, పిల్లల ఆసక్తి కలిస్తే అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి : తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజి చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి ఒకవైపు పేషంట్లకు చికిత్సలు, మరోవైపు పరిశోధనలతో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నాయకత్వంలో ఏఐజీ హాస్పిటల్స్ జీర్ణకోశ సంబంధ వ్యాధుల పరిశోధనలకు, ఎండోస్కోపీ శిక్షణకు ప్రపంచానికి కేంద్రబిందువుగా అవతరించింది. మూడు దశాబ్దాలుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులకు ఎ.ఐ.జీలో అధునాతన ఎండోస్కోపీ విధానాలలో శిక్షణ ఇస్తున్నారు. వైద్యుల త్యాగాలకు అంకితం: ఈ గౌరవం నాకు మాత్రమే దక్కుతున్న గుర్తింపు కాదు. మా డాక్టర్లందరికీ అందిన పురస్కారం. కోవిడ్ సమయంలో లక్షలాది పేషెంట్లకు వైద్య సేవలందించడంలోనూ, వ్యాక్సిన్ తయారీకి సహకారంలోనూ డాక్టర్ల భాగస్వామ్యం మరువలేనిది. ఈ అవార్డు... కోవిడ్ విధుల్లో భాగంగా అనారోగ్యం పాలై ప్రాణాలు వదిలిన డాక్టర్లకు, వారి త్యాగాలకు అంకితం. రవి పులి: తెలుగు ఎన్నారై ఆఫ్ ద ఇయర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన రవి అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో వాషింగ్టన్లో ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూప్‌కి వ్యవస్థాపక సీఈఓగా ఉన్నారు. అమెరికాలో పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇండియాలోని వారికి సేవలందిస్తున్నారు. వీటి ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఉద్యోగాల కోసం వేచి చూడకుండా.. ఎంట్రప్రెన్యూర్‌గా మారడానికి గైడె¯Œ ్స, మెంటార్షిప్ ఇవ్వడంతోపాటు కావాల్సిన పెట్టుబడి అందేలా సహకరిస్తున్నారు. కరోనా కాలంలో రవి చేసిన సాయం ఎంతోమంది తెలుగు వారిని సొంతగూటికి చేర్చింది. అంత కష్టం వద్దు: పాతికేళ్ల కిందట నేను యూఎస్‌కి వెళ్లినప్పుడు వీసా వంటి ఇతర వివరాల కోసం గైడెన్స్ ఇచ్చేవాళ్లు లేక చాలా కష్టపడ్డాను. అందుకే విదేశాలకు వచ్చే విద్యార్థులకు ఇరవై ఏళ్లుగా సలహాలిస్తున్నాను. ప్రోత్సహిస్తున్నాను. దీన్ని గుర్తించి అవార్డు ఇవ్వడం మరికొందరికి స్ఫూర్తినిస్తుంది. సాక్షికి కృతజ్ఞతలు. కారింగుల ప్రణయ్: యంగ్ ఎచీవర్ ఆఫ్ ది ఇయర్ (సోషల్ సర్వీస్) అదిలాబాద్ జిల్లాకు చెందిన కారింగుల ప్రణయ్ సామాజిక స్పృహ కలిగిన తనలాంటి యువకులతో కలిసి స్వాస్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా 11 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ...వేలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. పేద కుటుంబాల పిల్లలకు పౌష్ఠికాహారం అందించడం.. వారి చదువులకు తగిన ఆర్థిక భరోసా కల్పించడం, దివ్యాంగులు తమ కాళ్లపై తాము నిలబడేలా స్కిల్ డెవలప్మెంట్ క్యాంపులు పెట్టి వారికి శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలతో తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. మా గ్రామాలకు సంక్షేమాన్ని తీసుకెళ్తున్నాం: పోషకాహారలోపంతో బతుకీడ్చే ఆదివాసీ మహిళలు, పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలనిపించి స్వాస్ను స్థాపించాం. మొదలు పెట్టేనాటికి మా బృందంలో ఉన్నది పదిమందికి లోపే. ఇప్పుడు 700 మంది సేవలందిస్తున్నారు. ఇది మా అందరి సేవలకు అందిన పురస్కారం. సుంకరి చిన్నప్పల నాయుడు, సుజాత : బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ (స్మాల్, మీడియమ్) షీమాక్స్ ఎక్స్పర్ టెక్నోక్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ఎండీ సుంకరి చిన్నప్పల నాయుడు. పట్టణ యువతతో సమానంగా గ్రామీణ యువతకూ ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇప్పటివరకు 300 మంది గ్రామీణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి, సామాజిక బాధ్యతను పంచుకుంటున్నారు. ఈ జ్ఞాపిక ఉత్తేజాన్నిస్తుంది: చిన్న చిన్న సంస్థలకు ఆదర్శంగా మమ్మల్ని చూపించాలనుకోవడమే ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ అవార్డు నాలో ఉత్సాహాన్ని పెంచింది. భవిష్యత్తులో ఎప్పుడైనా నైరాశ్యానికి లోనైనా సరే ఈ జ్ఞాపికను చూడగానే ఉత్తేజం వస్తుంది. కె. లీలా లక్షా్మరెడ్డి : ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (ఎన్జీఓ గ్రీన్ రివల్యూషన్) కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ సంస్థ కె.లీలా లక్ష్మారెడ్డి అధ్యక్షతన 2010లో ఏర్పాటైంది. నాటినుంచి మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారు. రెండు రాష్ట్రాల్లో 14 జిల్లాల్లో కలిపి 12,485 గ్రామాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటించారు. ఇప్పటివరకు 3,500 పాఠశాలలు, సుమారు 9 లక్షల మంది విద్యార్థులు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. సేవకు పట్టం కడుతోంది: సమాజంలో సేవ చేసే వాళ్లను గుర్తించి, గౌరవించడం చాలా కష్టమైన విషయం. క్లిష్టమైనది కూడా. అలాంటిది ‘సేవకు పట్టం’ కట్టడాన్ని బాధ్యతగా తలకెత్తుకుంది. ఏడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని సమర్థంగా çకొనసాగిస్తున్న సాక్షికి అభినందనలు. చిన్నాలమ్మ: స్పెషల్ రికగ్నిషన్ ఇన్ ఫార్మింగ్ కొండ మీదినుంచి పారుతున్న నీటి ప్రవాహాన్ని తమ పొలాలకు మళ్లించిన 75 ఏళ్ల ఈ బామ్మ పేరు చిన్నాలమ్మ. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కిమిడిపల్లి గ్రామంలో నివసిస్తున్న దాదాపు 500 కుటుంబాల కోసం తన పెన్షన్ డబ్బులతో పాటు ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదువపెట్టి తెచ్చిన సొమ్ముకు గ్రామస్థుల భాగస్వామ్యంతో కాలువకు ఇరువైపులా కాంక్రీట్‌తో గట్లు నిర్మించుకునేలా చేసింది చిన్నాలమ్మ. ఈ చెక్‌డ్యామ్ వల్ల ఆ పొలాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. నీటిని నిలుపుకున్నాం: ఊరందరికీ వ్యవసాయమే ఆధారం. పంట పండేనాటికి తుపానులొచ్చి వరదలో పంట కొట్టుకుపోతూ ఉంటే ఎన్నాళ్లని చూస్తూ ఉంటాం; నీళ్లు నిలుపుకునే వీల్లేకపోవడంతో పొలాలు బీడు పెట్టాల్సి వచ్చేది. దాంతో మా సొంత డబ్బుతో చెక్ డ్యామ్‌లు కట్టుకున్నాం. మరో ఐదారు ఊళ్ల వాళ్ల పంటలూ నిలిచేటట్లు డ్యామ్‌లు కట్టాం. అందుకు గుర్తుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. కూరెళ్ళ విఠలాచార్య : జ్యూరీ ప్రత్యేక గుర్తింపు ప్రముఖ సాహితీవేత్త, రచయిత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నేముల గ్రామం. పుస్తకాలు కొనలేక ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో ఉద్యోగ విరమణ తరువాత 2014లో వెల్లంకి గ్రామంలో ప్రారంభించిన ఈ లైబ్రరీలో రెండు లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. విఠలాచార్య చేసిన కృషిని భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. ఆశ్చర్యం కలిగించింది: నేను స్థాపించిన ఈ గ్రంథాలయానికి రీసెర్చ్ స్కాలర్లు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు వస్తుంటారు. ఎక్కడో మారుమూల పల్లెలో నా పని నేను చేసుకుంటూ ఉంటే ఆ సంగతి ఎలా తెలిసిందో ఏమో గానీ ప్రధాని నా గురించి మాట్లాడటం, సాక్షి పత్రిక వాళ్లు అవార్డుతో సత్కరించడానికి ఆహ్వానించడం ఆశ్చర్యంగా ఉంది. ఎనభై ఐదేళ్ల వయసులో ఇంతకంటే పెద్ద సంతోషాలు ఇంకేం కావాలి? (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
స్ఫూర్తిదాయక విజయాలకుప్రోత్సాహమిది
సాక్షి, హైదరాబాద్: విభిన్న రంగాల్లోని వ్యక్తుల విజయాలు స్ఫూర్తిని అందిస్తాయని.. పురస్కారాల ద్వారా ఆ విజయాలకు మరింత విలువ వస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాణాలు పణంగా పెట్టి దేశరక్షణ కోసం ప్రాణాలొడ్డిన సైనికులు, దేశానికి అన్నం పెట్టే రైతులు, సాంకేతిక విప్లవాలతో అద్భుతాలు సృష్టిస్తున్నవారు, నిస్వార్ధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తులు ఇలా భిన్న రంగాల్లో దేశానికి సేవ చేస్తున్నవారికి సెల్యూట్ చేస్తున్నానని విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. అలాంటి వ్యక్తులను, సంస్థలను గుర్తించి పురస్కారాలు అందించడం అభినందనీయమన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నేపథ్యంలో.. వివిధ రంగాల్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల వారికి ‘సాక్షి’ మీడియా గుర్తింపు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, వైఎస్ భారతిరెడ్డి, సాక్షి డైరెక్టర్లు రాణిరెడ్డి, ఏఎల్ఎన్ రెడ్డి, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, సాక్షి సీఈవో అనురాగ్ అగర్వాల్, సాక్షి డైరెక్టర్లు కేఆర్పీ రెడ్డి, వైఈపీ రెడ్డి, వీఐటీ యూనివర్సిటీ ఏపీ క్యాంపస్ వీసీ ఎస్వీ కోటారెడ్డి పురస్కార గ్రహీతల విజయాలు తననెంతో ఆకట్టుకున్నాయన్నారు. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్య్ర సమరయోధుల విజయాలను ఆయన గుర్తు చేశారు. ‘‘ఒక సమయంలో ఒకే పని చెయ్యి. దానిపైనే నీ సర్వశక్తియుక్తులు కేంద్రీకరించు. మిగిలినవన్నీ మినహాయించు’’ అంటూ ప్రవచించిన వివేకానందుడి సూక్తి ప్రతీ ఒక్కరికీ అనుసరణీయమన్నారు. అనంతరం పలు రంగాలకు చెందినవారికి గవర్నర్, సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతిరెడ్డిల చేతుల మీదుగా సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ వి.మురళి స్వాగతోపన్యాసం చేయగా.. కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి వందన సమర్పణ చేశారు. పురస్కారాలకు విజేతలను ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతల జ్యూరీకి చైర్‌పర్సన్‌గా రెయిన్బో ఆస్పత్రి డైరెక్టర్ ప్రణతిరెడ్డి, సభ్యులుగా పద్మశ్రీ శాంతాసిన్హా, రాజకీయ విశ్లేషకుడు బండారు శ్రీనివాసరావు, క్రెడాయ్ నేషనల్ జనరల్ సెక్రెటరీ జి.రామిరెడ్డి, ఎన్డీ టీవీ రెసిడెంట్ ఎడిటర్ ఉమా సుధీర్, తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినోద్ కె అగర్వాల్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ సభ్యులుగా వ్యవహరించారు. -
ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడతారా?
సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడతారా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తూ వ్యక్తులు, వ్యవస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు పోస్టులు పెడుతున్నారని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారానికి ఆ పార్టీ ఐటీ విభాగమైన ఐటీడీపీ బాధ్యతలు చూస్తున్న చింతకాయల విజయ్‌ని బాధ్యుడిగా చేస్తూ సీఐడీ నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో సీఐడీ దర్యాప్తుపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. విజయ్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది. సీఐడీ దర్యాప్తునకు సహకరించాలని విజయ్ను ఆదేశించింది. సీఐడీ కౌంటర్ దాఖలు చేసిన తరువాత మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయాన్ని పరిశీలిస్తామంది. ఇలాంటి కేసులో దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులను అడ్డుకునేందుకు నిర్దిష్ట యంత్రాంగం లేదన్న కారణంతో ఇష్టమొచ్చిన పోస్టులు పెడుతూ కొందరు చెలరేగిపోతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇందుకు హైకోర్టు న్యాయమూర్తులు సైతం బాధితులుగా మారారని తెలిపింది. ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని, వీటిపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ విజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే సీఐడీ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ జయసూర్య మంగళవారం విచారణ జరిపారు. విజయ్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ.. ఐటీడీపీ ట్విట్టర్ అకౌంట్‌తో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సీఐడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. 41ఏ నోటీసు ఇవ్వడానికి పిటిషనర్ ఇంటికి వచ్చిన సీఐడీ అధికారులు భయానక వాతావరణం సృష్టించారన్నారు. పిటిషనర్‌కు మాత్రం నోటీసు ఇవ్వలేదన్నారు. సీఐడీ తరపు న్యాయవాది వై.శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున, ఎలాంటి స్టే ఇవ్వొద్దని కోరారు. నోటీసు ఇచ్చేందుకే పోలీసులు పిటిషనర్ ఇంటికి వెళ్లారని చెప్పారు. పిటిషనర్‌పై పెట్టిన సెక్షన్లు ఏడేళ్ల లోపు శిక్ష పడేవేనని, అందువల్ల అరెస్ట్ చేసే అవకాశం లేదని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
సీఎం సతీమణిపై తప్పుడు ప్రచారం ఐటీడీపీ పనే
సాక్షి, అమరావతి/బంజారాహిల్స్ (హైదరాబాద్) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న తప్పుడు ప్రచారం వెనుక పాత్రధారులు, సూత్రధారులను సీఐడీ గుర్తించింది. ‘భారతీపే’ అంటూ ఒక తప్పుడు వార్తను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేస్తున్నది ఐటీడీపీ పనేనని సీఐడీ ప్రాథమిక విచారణలో నిర్ధారించింది. చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో ఐటీడీపీ నిర్వహిస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో క్రైం నెంబర్ 14/2022 ఐపీసీ సెక్షన్ 419, 469, 153–ఎ, 505(2), 120–బి రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్–2000 సెక్షన్ 66(సి) ప్రకారం సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తునకు సహకరించాలంటూ చింతకాయల విజయ్‌కు సీఐడీ అధికారులు సెక్షన్ 41–ఎ నోటీసు ఇచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని ట్రెండ్‌సెట్ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఆయన నివాసంలో శనివారం ఉదయం సీఐడీ అధికారులు నోటీసును అందజేశారు. విజయ్ టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు. నా మీద 14 కేసులు పెట్టి ఏం పీకారు : అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం: నా మీద 14 కేసులు పెట్టి ఏం పీకారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. తన కుమారుడు విజయ్ ఇంటికి సీఐడీ అధికారులు మఫ్టీలో వెళ్లి దౌర్జన్యం చేయటం సరికాదని శనివారం విడుదల చేసిన ఒక వీడియోలో చెప్పారు. ఆ వీడియోలో ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. సీఎం ఆలోచన మారాలన్నారు. ఏదో ఒక కేసు పెట్టి తమను జైల్లో పెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తోందని అన్నారు. -
మహిళల్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నీచ రాజకీయాలు
సాక్షి, అమరావతి: మహిళలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం తగదని ప్రతిపక్ష టీడీపీకి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతిపై సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా వాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె బుధవారం డీజీపీని కలిసి లేఖను అందజేయడం తెలిసిందే. ఇదే విషయమై గురువారం రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల ప్రతినిధులు వాసిరెడ్డి పద్మను కలిసి వినతులు అందించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు అనేక ప్రాంతాలకు చెందిన మహిళా సంఘాలు ఎవరికి వారు విడివిడిగా సంతకాలతో వినతిపత్రాలు ఇచ్చారు. వాటిని ఆమె డీజీపీ కార్యాలయానికి పంపించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ గత ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి మాట్లాడిన మాటలను వక్రీకరించి ఒక వర్గం సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన ఆధారాలను డీజీపీకి సమర్పించినట్టు తెలిపారు.