AP Elections 2024: CM Jagan Wife YS Bharati Talks About Interesting Topics In Interview, Details Inside | Sakshi
Sakshi News home page

పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్‌ భారతి

Published Fri, May 3 2024 10:27 AM | Last Updated on Fri, May 3 2024 11:04 AM

AP Elections 2024: CM Jagan Wife YS Bharati Interview Details

ప్రజా క్షేత్రంలో ఒక్కడిని.. ఒకేఒక్కడిని ఎదుర్కొనే దమ్ము లేని పార్టీలు ఏకం అయ్యాయి. కూటమిగా కుట్రలు చేస్తూ.. అసత్య ప్రచారాలతో, మోసపూరిత హామీలతో ప్రజల్ని మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నాయి. కానీ, ఆ జననేత ఈ 58 నెలల పాలనలో ప్రజలకు చేసిన మంచిని నమ్ముకున్నారు. సంక్షేమం తోపాటు అభివృద్ధి, సామాజిక న్యాయం.. ఇవే ఈ ఎన్నికల్లో సీఎం జగన్‌కు మరోసారి అధికారం కట్టబెడుతాయి అని వైఎస్‌ భారతి అంటున్నారు . 

పులివెందులలో సీఎం జగన్‌ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి.. ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాల్ని పంచుకున్నారు..

పులివెందుల నా సొంతగడ్డ.  నెలకు రెండు రోజులు ఇక్కడికి వస్తుంటా. పులివెందుల ఎమ్మెల్యే సీఎం జగన్‌కు, ఇక్కడి ప్రజలకు మధ్య నేనొక వారధిని. ఇక్కడి ప్రజల బాగోగుల్ని వీళ్ల ఎమ్మెల్యే తరఫున నేనే చూస్తుంటా. ఎప్పుడు, ఎవరు, ఏ సమయంలో అయినా సరే తమకు ఫలానా కష్టం వచ్చింది అంటే చాలూ.. అప్పటికప్పుడే  పరిష్కారం చూపిస్తుంటాం. ఇప్పుడు.. ఈ ప్రచారంలోనూ కొందరు విజ్ఞప్తులు ఇస్తున్నారు. కానీ, కోడ్‌ అమలులో ఉంది కాబట్టి ఎన్నికలయ్యాక పరిష్కరిస్తామని భరోసా ఇస్తూ  ముందుకెళ్తున్నాం.  

తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచే..
సీఎం వైఎస్‌ జగన్‌ తన 58 నెలల పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృష్టి చేశారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ కనబర్చారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందించేందుకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకం మొదలు.. బడికి వెళ్తే ప్రత్యేక మెనూతో నాణ్యమైన భోజనం అందించేందుకు జగనన్న గోరుముద్ద లాంటి పథకాలు అమలు చేస్తున్నారు. పేదపిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదువును అందిస్తున్నారు. ఎనిమిదో తరగతి నుంచే విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌ అందిస్తూ..  డిగ్రీ కోర్సులతో పాట టోఫెల్‌ వంటి కోర్సుల శిక్షణ  అందించటం కోసం ఎడెక్స్‌ లాంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు.

లక్షల మంది యువతకు ఉపాధి
సీఎం జగన్‌ పాలనలో గత ఐదేళ్ల పాలనలో ప్రైవేటు, ప్రభుత్వ ఒ‍ప్పంద ఉద్యోగాలు కలిపితే.. సుమారు 30.32 లక్షల మంది యువతకు ఉపాధి దక్కింది.  గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలను గాలికి వదిలేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం ఎంఎస్‌ఎంఈలకు భారీ ఇన్‌సెంటీవ్స్‌  అందించింది.  సీఎం జగన్‌  ప్రభుత్వం ఇచ్చిన  మద్దతుతో రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలు యువతకు కొత్త ఉద్యోగాలను కల్పిస్తున్నాయి.

మరోవైపు ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయం, మత్య్స రంగాలను అభివృద్ధి చేసి ఉపాధి కల్పనపై దృష్టి పెట్టింది. నూతనంగా నాలుగు పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. తద్వారా మత్స్య పరిశ్రమ ఆదాయాన్ని పెంచటంతో పాటు ఉపాధిని కల్పిస్తుందన్నారు.  ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌, బెంగళూరు వంటి పెద్ద నగరాలు లేవు. అయినా.. రాష్ట్రంలో ఉన్న వనరులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వినియోగించుకొని అభివృద్ధి చేయటంతో పాటు.. యువతకు ఉద్యోగాలు కల్పించింది.

కరోనా కాలంలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని ఆపలేదు. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకుంది. ఆ సమయంలోనూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్లు ఏర్పాటు చేసింది. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలో రాగానే.. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుంది.

ఈ మేనిఫెస్టో సంక్షేమం కొనసాగింపే..
ఈ మధ్యే వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ప్రకటించింది.  గత  ఐదేళ్ల ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కొనసాగిస్తామని.. ఆ పథకాలకు అదనపు సంక్షేమం ఉంటుందని సీఎం జగన్‌  హామీ ఇచ్చారు. అంటే సంక్షేమం విషయంలో అడుగులు ముందుకే ఉంటాయని ఆయన అన్నారు. గిగ్‌ వర్కర్లకు కూడా ఇన్స్‌రెన్స్‌ సదుపాయం కల్పించడం హర్షనీయమైన విషయం.

ఇద్దరిలో ఎవరిపైన పులివెందుల ప్రజలకు ఎక్కువ ప్రేమ? 
పులివెందులలో మూడు తరాల ప్రజలకు వైఎస్సార్‌ కుటుంబంతో  మంచి సంబంధాలు ఉ​న్నాయి. దివంగత మహానేత వైఎస్సార్ తొలిసారి 1978లో ఎమ్మెల్యే గెలిచారు. ఆస్పత్రులు, కాలేజీలు నిర్మించారు. అప్పటి నుంచి 45 ఏళ్లుగా ఇక్కడి ప్రజలకు వైఎస్సార్‌ కుటుంబం సేవ చేస్తోంది. సీఎం జగన్‌కు కూడా పులివెందుల ప్రజలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వైఎస్సార్‌ చేసిన అభివృద్ధిని సీఎం జగన్‌ కొనసాగిస్తున్నారు. మా కుటుంబం కూడా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోంది.  వైఎస్సార్‌, సీఎం జగన్‌కు పులివెందుల ప్రజల ప్రేమ ఎప్పుడూ ఉంటుంది.  

పులివెందులలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి. అన్ని మండలాల్లో ఇంటింటికి ప్రచారం చేసి.. సీఎం జగన్‌కు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరుతున్నా. వెళ్లిన ప్రతీ చోట్లా అంతా ఆప్యాయంగా పలకరించడం సంతోషంగా ఉంది.  ఆ స్పందనే సీఎం జగన్‌ గెలుపును తెలియజేస్తోందని వైఎస్‌ భారతి అన్నారు

👉:​​​​​​​  ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement