
ఇసీ పెద్ద గంగిరెడ్డి భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ
వేముల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దమామ, సీఎం సతీమణి వైఎస్ భారతిరెడ్డి పెద్దనాన్న ఇసీ పెద్ద గంగిరెడ్డి (78) శనివారం కన్నుమూశారు. ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. పులివెందులలోని ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవల స్వగ్రామం గొల్లలగూడూరులోని తన ఇంటికి చేరుకున్నారు. అయితే శనివారం ఉదయం 5 గంటల సమయంలో పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం పులివెందులకు తరలిస్తుండగా మార్గంమధ్యలో తుదిశ్వాస విడిచారు. ఇసీ పెద్ద గంగిరెడ్డి భౌతికకాయాన్ని స్వగ్రామమైన గొల్లలగూడూరు గ్రామానికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే సీఎం వైఎస్ జగన్ తల్లి, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సీఎం సతీమణి వైఎస్ భారతిరెడ్డి గొల్లలగూడూరు చేరుకుని నివాళులర్పించారు.
సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి
అనంతరం పెద్ద గంగిరెడ్డి భార్య సుబ్బమ్మ, కుమార్తె విజయ, కుమారులను పరామర్శించారు. ఇసీ పెద్ద గంగిరెడ్డి భౌతికకాయానికి సోదరుడు, సీఎం వైఎస్ జగన్ మామ డా. ఇసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి ఇసీ సుగుణమ్మ, డా. ఇసీ దినేష్‌రెడ్డి, డా. వైఎస్ అభిషేక్‌రెడ్డి, సాక్షి డైరెక్టర్ ఎ.లక్ష్మీనారాయణరెడి, ఇంకా పలువురు స్థానిక నాయకులతో పాటు బంధువులు, గ్రామస్తులు నివాళులర్పించారు. గ్రామ సమీపంలోని సొంత తోట వద్ద ఇసీ పెద్ద గంగిరెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment