AP: YSRCP Central Office Gives Clarity on Letter Spread in Social Media - Sakshi
Sakshi News home page

YSRCP Central Office: ఆ లేఖ భారతమ్మ రాసినది కాదు

Published Wed, Mar 23 2022 9:13 AM | Last Updated on Wed, Mar 23 2022 11:14 AM

YSRCP Central Office Gives Clarity on Letter Spread in Social Media - Sakshi

సాక్షి, అమరావతి: ‘సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి ఓ లెటర్‌ రాశారంటూ సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూప్‌లలో సర్క్యులేట్‌ అవుతోంది. ఆ లెటర్‌ వైఎస్‌ భారతి రాసినది కాదు. అది నకిలీది’ అని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆంధ్రరాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్‌సీపీ అభిమానులకు, తన మనసులోని భావాలు, ఆందోళనలు, భయాలు చెప్పడానికి మీడియా ముందుకు వచ్చినట్లు లేఖను సృష్టించారని, వైఎస్‌ భారతి ఎలాంటి లెటర్‌ రాయలేదని, ఎవరో కావాలని అలాంటి లేఖలు సర్క్యులేట్‌ చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అటువంటి తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు అని సూచించారు. ఆమెకు అటువంటి లెటర్‌ రాయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయం అందరూ గమనించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement