ప్రశ్నించే స్వరం వినిపించకూడదా?: వైఎస్‌ జగన్‌ | YS Jaganmohan Reddy Fires On CM Chandrababu | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే స్వరం వినిపించకూడదా?: వైఎస్‌ జగన్‌

Published Fri, Nov 8 2024 4:40 AM | Last Updated on Fri, Nov 8 2024 6:34 AM

YS Jaganmohan Reddy Fires On CM Chandrababu

మీ మోసాలు, అక్రమాలు, వైఫల్యాలపై నిలదీస్తే అక్రమ కేసులా? 

సీఎం చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వారం రోజుల్లో 101 మంది సోషల్‌ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తారా? 

రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి 

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు 

పోలీసు సోదరులారా మీ టోపీపై కనిపించే మూడు సింహాలకే సెల్యూట్‌ చేయండి.. న్యాయం, ధర్మం వైపు నిలబడండి 

చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయకండి 

తప్పుడు కేసులు బనాయించిన పోలీసులను సప్త సముద్రాల అవతల ఉన్నా రప్పిస్తాం.. చట్టం ముందు దోషులుగా నిలబెడతాం 

ఎల్లకాలం ఈ ప్రభుత్వమే అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి.. బాధితులకు పార్టీ తరపున అండగా నిలిచి న్యాయ సహాయం అందిస్తాం 

సూపర్‌ సిక్స్‌లు, సెవెన్‌లు ఏమయ్యాయని ప్రశ్నిస్తే కేసులా? 

రాష్ట్రంలో ఎక్కడ చూసినా చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?  

రాష్ట్రంలో నెలకొన్న ఇంత అన్యాయమైన పరిస్థితులు బహుశా స్వాతంత్య్రం వచ్చాక ఎక్కడా చూసి ఉండం  

డీజీపీ చట్టం, న్యాయం వైపు నిలబడాలి. ఇప్పుడున్న డీజీపీ మా హయాంలో ఆర్టీసీ సీఎండీ స్థానంలో పని చేశారు. మంచి పదవి ఇచ్చి బాగా చూసుకున్నాం. కానీ ఈరోజు ఏ స్థాయికి దిగజారిపో­యారంటే.. లా అండ్‌ ఆర్డర్‌ దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తుంటే.. ఆయన అధికార పార్టీ కార్యకర్తలా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో పోలీసులు సరిగా పనిచేయలేదని చెబుతున్నాడు. మరి ఆయన కూడా ఆ ప్రభుత్వంలో పనిచేశాడు కదా? మరి ఇప్పటి ప్రభుత్వం సవ్యంగా, బ్రహ్మాండంగా పని చేస్తోందా? ఆయన డీజీపీగా ఉన్న ప్రభుత్వం సవ్యంగా పని చేస్తే.. ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు దొంగ కేసులు పెడుతున్నారు? ఐదు నెలలు తిరగక ముందే 91 మంది అక్క చెల్లెమ్మల మీద ఎందుకు అత్యాచారాలు జరిగాయి? ఎందుకు ఏడుగురు మహిళలు చనిపోయారు? చివరకు ప్రజల తరపున గొంతు విప్పుతున్న సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లను ఎందుకు అక్రమ నిర్భంధాలు చేస్తున్నారు?

సాక్షి, అమరావతి: కూటమి సర్కారు అక్రమాలు, మో­సాలు, వైఫల్యాలపై ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తుండటం.. సామాజిక స్పృహ ఉన్నవారు, సోషల్‌ మీడియా కా­ర్యకర్తలు నిలదీస్తుండటంతో సీఎం చంద్ర­బాబు త­ట్టుకోలేక ప్రశ్నించే స్వరం వినిపిస్తే చాలు అక్రమ కేసులు బనాయించి నిర్బంధిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌­సీపీ కార్యకర్తలను, సోషల్‌ మీ­డియా కార్యకర్తలను హింసిస్తే మూల్యం చెల్లించు­కోక తప్పదన్నారు. 

రాష్ట్రంలో చీకటి రోజులు నడు­స్తు­న్నా­యని, ప్రజా­స్వా­మ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమె­త్తారు. పోలీసు సోదరులారా.. న్యాయం, ధర్మం వైపు నిల­బడాలని సూచించారు. పోలీసులు టోపీపై కన్పించే 3 సింహా­లకు సెల్యూట్‌ చేయాలేగానీ రాజ­కీయ నేతల చెప్పినట్టు తప్పుడు కేసులు బనా­యిస్తే వది­లిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వ­మే అధి­కారంలో ఉండదనే విషయాన్ని పోలీ­సు­లు గుర్తించుకోవాలన్నారు. 

రిటైర్‌ అయిన తర్వాత వెళ్లిపోతాం అని అనుకుంటున్నారేమో..! సప్త సముద్రాల అవ­తల ఉన్నా రప్పించి చట్టం ముందు దోç­Ùులుగా నిలబెడతా­మన్నారు. దొంగ కేసులు పెడు­తున్న ప్రతి పోలీస్‌ అధికారిపై ప్రైవేటు కంప్లైంట్లు ఫైల్‌ చేస్తామ­న్నారు. ప్రతి బాధితు­డికి వైఎస్సార్‌ సీపీ న్యాయ సహాయం అందిస్తుందని చెప్పారు. ఎన్ని­కల్లో మీరు చెప్పిన సూపర్‌ సిక్స్‌లు ఏమ­య్యా­యని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి పోలీస్‌ స్టేషన్ల చు­ట్టూ తిప్పుతున్నార­న్నారు. 

వారం రోజుల్లో 101 మంది సోషల్‌ మీడియా కార్య­కర్తలను అక్రమంగా అరెస్టు చేశారని.. సుప్రీం తీర్పు­ల­నూ అవహేళన చేస్తున్నా­ర­న్నా­రు. తన కుటుంబ సభ్యు­లపై దు­ష్ప్రచా­రానికి పా­ల్పడు­తు­న్నా­రన్నారు. రా­ష్ట్రం­లో ఎక్క­డ చూ­సి­నా చి­న్నా­రులు, మహి­ళలపై లైంగిక దాడులు, అత్యా­చా­రాలు, హత్య­లు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చే­స్తున్నట్లు? ప్ర­శ్నించే స్వరాలు ఉండ­కూడదా? అ­ని ని­లదీశారు. గురు­వారం తాడే­పల్లిలోని పార్టీ కేంద్ర కా­ర్యాల­యంలో జగన్‌ మీడియాతో మాట్లాడారు. 

ఈ రోజు బాధితులంతా.. రేపు రెడ్‌ బుక్‌ పెట్టుకుంటారు...
పోలీసు అంటే గౌరవం ఉండాలి. వ్యవస్థలు బత­కా­లి కానీ నీరుగారిపోకూడదు. రాజ­కీయ నేతలు చెబు­తున్నారని తెలిసి కూడా తప్పులు చేయడం పో­లీ­సులకు మంచిది కాదు. తిరుపతిలో సుబ్బరా­యు­డు ఉన్నాడు. చంద్రబాబు తెలంగాణ నుంచి డి­ప్యూ­టేషన్‌పై తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తెలంగాణ వెళ్లి­పోతామని అనుకుంటున్నారేమో? తెలంగాణ నుంచి మళ్లీ పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా రప్పిస్తాం. రెడ్‌ బుక్‌ పెట్టుకోవడం పెద్ద పని­కాదు. ఈ రోజు నష్టపోయిన బాధిత కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ రెడ్‌ బుక్‌ పెట్టుకుంటారు. వాళ్లందరూ నా దగ్గరకు వచ్చి గ్రీవెన్స్‌ చెబుతారు. అప్పుడు నేను చూస్తూ ఊరుకోను.

వారిని ఎందుకు అరెస్టు చేయరు?
రెండేళ్ల క్రితం మా అమ్మ కారు టైర్‌ బరస్ట్‌ అ­యితే.. ఇది ఈరోజు కొత్తగా జరిగినట్లుగా చిత్రీ­కరించి.. తల్లిని చంపడానికి జగన్‌ ప్రయత్నించాడని టీడీపీ అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో వికృత ప్రచారం చేశారు. ఇది ఫేక్‌ న్యూస్‌ కాదా..? అది తప్పుడు కథనం అని మా అమ్మ విజయమ్మ లేఖ విడుదల చేస్తే.. ఆ లేఖను కూడా ఫేక్‌ లెటర్‌గా చిత్రీకరిస్తూ టీడీపీ అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో దుష్ఫ్రచారం చేయడం వాస్తవం కాదా? చివరకు మా అమ్మ వీడియో ద్వారా టీడీపీ దుష్ఫ్రచారాన్ని ఖండించారు. 

నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీడీ­పీ అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయ­డం లేదు? లోకేష్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదు? కడప ఎస్పీకి నా భార్య ఫోన్‌ చేసిందని ఆంధ్రజ్యోతిలో వార్త రాశారు. అది తప్పుడు వార్త కాదా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను ఎందుకు లోప­ల వేయరు? ‘డీజీపీ..! పోలీసు సో­దరులారా..! మీ అందరికీ ఒకటే చెబుతున్నా. 

సీఎం చంద్ర­బాబు, లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజాస్వామ్యాన్ని అవ­హేళన చేయడం మీ వృత్తిని మీరే కించపరిచినట్లు అవుతుంది. ఎల్లకాలం ఈ ప్రభు­త్వమే ఉండదు.. జమిలి ఎన్నికలు వచ్చి­నా.. నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు జరిగినా అధి­కారంలోకి వచ్చేది మేమే.. తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా నిర్భందించిన పోలీసు అధికారులు ఎక్కడున్నా వదలిపెట్టం.

మహానంది మండలం యు.బొల్లవరం గ్రా­మా­నికి చెందిన తిరుమల కృష్ణను సీపీఎస్‌ పో­లీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్ట్‌ చేసి కర్నూలు తీసుకెళ్లారు. కృష్ణ దివ్యాంగుడని తెలిసీ అరెస్ట్‌ చేసి ఇబ్బందులు పెట్టారు. 
⇒ అన్నమయ్య జిల్లా రాయచోటిలో కె.హను­మంతరెడ్డిని రెండ్రోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లారు. అరెస్ట్‌ చూపలేదు. ఎక్కడకు తీసుకెళ్లారో ఇప్పటివరకూ తెలియదు. 

⇒ తెలంగాణలో ఉన్న వారినీ తీసుకొచ్చి వేధిస్తున్నారు. నల్గొండకు చెందిన అశోక్‌రెడ్డిని విజయవాడ సైబర్‌ పోలీ­సు­లు తీసుకొ­చ్చా­రు. కుటుంబీకులకూ సమాచా­రం ఇవ్వలేదు. రాజశేఖరరెడ్డి అనే వ్యకినీ హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చారు. ఈ ఇద్దరినీ వేధిస్తున్నారు. 
⇒ ఇప్పటివరకు 101 మందిపై కేసులు పెట్టారు. చట్టప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాత వాటిని ఆన్‌లైన్‌లో ఉంచాలి. కానీ ఆన్‌లైన్‌లో పెట్టడం లేదు. కోర్టులకు అప్‌లోడ్‌ చేయడం లేదు. దేశంలో ఇంత అరాచక వ్యవస్థ ఎక్కడైనా ఉందా?

వారం రోజుల్లో.. 101 మంది అరెస్టు
వారం రోజులుగా దాదాపు 101 మంది సోషల్‌ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పోలీసులు ఇష్టం వచ్చినట్లు ఇంటికొచ్చి అరెస్ట్‌లు చేయకూడదు. ముందు 41 ఏ నోటీసు ఇచ్చి విచారణ చేయాలి. ఒకవేళ నిజంగా అరెస్ట్‌ చేయాల్సి వస్తే వారంట్‌ జారీ చేయాలి. తర్వాత మెజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోవాలి. 



ఇది సుప్రీంకోర్టు తీర్పు సారాంశం (అమేష్‌కుమార్‌ వర్సస్‌ బిహార్‌ కేసులో 2014 జూలై 2న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును చదివి వినిపించారు). కానీ మన రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతోంది? తప్పుడు కేసులు.. అక్రమ నిర్బంధాలు.. అరెస్ట్‌ చేసే అధికారం లేదని పోలీసులకు తెలుసు. 41 ఏ నోటీసు మాత్రమే ఇవ్వాలని తెలుసు. ఒక వేళ అరెస్ట్‌ చేయాల్సి వస్తే వారంట్‌ జారీ చేయాలి. మేజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోవాలి. ఇదీ పద్ధతి. కానీ.. ఎవరైనా ప్రభుత్వంపై గొంతు విప్పితే చాలు.. రాత్రికి రాత్రే.. తెల్లవారుఝామున వారి ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు. 

గంటల తరబడి.. కొన్ని సమయాల్లో రెండు మూడు రోజులు పోలీస్‌ స్టేషన్‌లలో నిర్బంధిస్తున్నారు. కొట్టడం, తిట్టడం, అవమానించడం చేస్తున్నారు. ఒక వ్యక్తిపై ఏకకాలంలో పలు స్టేషన్‌లలో టీడీపీ సానుభూతిపరులతో కేసులు పెట్టిస్తూ అరెస్టు చేస్తున్నారు. రెండు మూడు స్టేషన్లు తిప్పుతున్నారు. పోలీసుల తీరుపై స్థానికులు తిరగబడితే మరో కేసు పెట్టి అరెస్ట్‌ చేస్తున్నారు. ఎవరైనా అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తీసుకొస్తున్నారు. 

కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తీసుకొచ్చే అధికారం ఏ పోలీస్‌కూ లేదు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటలు గమనిస్తే డీజీపీపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు స్పష్టమవుతోంది. దాంతో డీజీపీ దగ్గరుండి కేసులు పెట్టించి.. అక్రమ నిర్భంధాలు చేయిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న స్వరాలపై కేసులు పెట్టించే స్థాయికి, తట్టుకోలేని స్థాయికి వెళ్లిపోయారు.

ప్రశ్నిస్తే.. కేసులు, అక్రమ నిర్బంధాలా?
⇒ విజయవాడలో వరదల నియంత్రణ, సహా­య చర్యల్లో ముఖ్యమంత్రి సహా యంత్రాంగం దారుణ వైఫల్యం చెందడంపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు. వరద సహాయం పేరుతో కోట్లాది రూపాయలు మింగేసే చంద్రబాబు ప్రభు­త్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు. 1.50 కోట్ల మందికి ఆహారం అందించడానికి రూ.534 కోట్లు..! కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్‌ జనరేటర్లపై రూ.23 కోట్లు కొట్టేశారు అని అందరూ మాట్లాడారు. నీళ్లు ఉన్నప్పుడు అక్కడకు ఎలా వెళ్లారు? కరెంట్‌ ఇచ్చారో లేదో అందరికీ తెలుసు. కానీ.. ఈ అక్రమా­లపై ప్రశ్నిస్తే చాలు అక్రమ నిర్భందాలు. మహిళలు, బాలికలు, చిన్నా­రులపై లైంగిక వేధింపులు, దాడులు, హత్య­లు, అత్యాచా­రాలు జరుగుతుంటే.. వాటిపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు. ఎమ్మెల్యేలు, వారి మనుషులు రౌడీల్లా దౌర్జన్యం చేస్తుండటంపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు. 

⇒ ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు.. ఇప్పుడు ఇసుక ధరలు చూస్తే రెట్టింపు అయ్యాయి. ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయని ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు. రేట్లు తగ్గిస్తామని చెప్పిన మద్యంపై ఒక్కపైసా కూడా తగ్గించకుండా, పైపెచ్చు సిండికేట్లుగా మారి ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతుండటంపై ప్రశ్నిస్తుంటే కేసులు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులను ప్రైవేటు వారికి ఎందుకు అప్పగించారయ్యా? అని ప్రశ్నిస్తే కేసులు. అధికారంలోకి వస్తే కరెంట్‌ చార్జీలు తగ్గిస్తామని చెప్పారు కదా..!కానీ ఐదు నెలలు కాకమునుపే ప్రజలపై దాదాపు రూ.6 వేల కోట్ల భారం మోపారు. మరో రూ.11 వేల కోట్లు అదనంగా బాదేందుకు సిద్ధం కావడంపై ప్రశ్నిస్తే.. మళ్లీ అక్రమ నిర్బంధాలు.

⇒ మీరు వస్తే సంపద సృష్టిస్తామన్నారు కదా..?  ప్రజల కోసం జగన్‌ సృష్టించిన సంపదను ఎందుకు అమ్మేస్తున్నారు? మీ స్కామ్‌ల కోసం కొత్తగా కడుతున్న మెడికల్‌ కళాశాల­లను అమ్మేస్తున్నారు. మూడు ప్రైవేటు పోర్టులు..అందులో ఒకటి 80 శాతం, రెండు 50 శాతం పూర్తయ్యాయి.. వాటి నిర్మాణానికి నిధుల కొరత కూడా లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. ఇవన్నీ వస్తే కదా ప్రభుత్వా­దాయాలు పెరుగుతాయి. ప్రభుత్వ సంపద పెరుగుతుంది. ఇటువంటివి ఎందుకు అమ్ము­తున్నారని ప్రశ్నిస్తే.. అక్రమ నిర్భందాలు.

ఇవేంటి.. తప్పుడు  కేసులు కాదా?
⇒ (సోషల్‌ మీడియా కార్యకర్తలపై పోలీసులు నమోదు చేసిన కొన్ని ఎఫ్‌ఐఆర్‌లను వైఎస్‌ జగన్‌ చదివి వినిపించారు..) ⇒ ‘విద్య వద్దు.. మద్యం ముద్దు’ సోషల్‌ మీడియా కార్యకర్త రాసిన మాటలు నిజమే కదా..? అమ్మ ఒడి ఇవ్వడం లేదు. విద్యాదీవెన ఇవ్వడం లేదు. వసతి దీవెన ఇవ్వడం లేదు.. నాన్నకు ఫుల్‌..అమ్మకు నిల్‌..! అని అన్నాడు. ఏం తప్పు అన్నాడు? ఈ మాట అన్నందుకు అక్రమంగా నిర్భందిస్తారా? చంద్రబాబు అభిమానుల మనో­భావాలు దెబ్బతీసే విధంగా ఉందని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసు పెట్టారు. 

⇒ ఇది మరో ఎఫ్‌ఐఆర్‌.. పోస్ట్‌లను ఫార్వర్డ్‌ చేసినా కేసులే! జనసేన నాయకులతో కాళ్లు పట్టించుకుంటున్న టీడీపీ నేతలు.. అనే వార్త అన్ని టీవీల్లో వచ్చింది. ఆ పోస్టును ఫార్వర్డ్‌ చేసిన కార్యకర్తపై కేసు పెట్టారు.
⇒ ఇది మరో కేసు.. చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం విజయవాడ వరదల్లో రూ.534 కోట్లు ప్రజాధనం లూటీ చేశారు! 23 కోట్లు అగ్గిపెట్టెలు, క్యాండిల్స్‌ కోసమే లూటీ చేశారు..! ఇవి అందరూ అన్న మాటలే. వీటిని సోషల్‌ మీడియాలో పెట్టినందుకు కేసులు పెట్టారు.

⇒ ఇంకో కేసు... తిరుపతి లడ్డూ విష­యంలో చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలు దేవుడికి నచ్చడం లేదని ఓ సోషల్‌ మీడియా కార్యకర్త పోస్టు పెట్టారు.. అంతకన్నా ఏమీ అనలేదు. ఆ కార్యకర్తపై కూడా కేసు పెట్టారు.
⇒ గాజువాకకు చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ బోడి వెంకటేష్‌ను దువ్వాడ పోలీసులు మధ్యాహ్నం 3.30 గంటలకు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారో తల్లిదండ్రులకు చెప్పలేదు. 41 ఏ నోటీసు ఇవ్వలేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కాదా?

⇒ తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన సోషల్‌ మీడియా కార్యకర్త, రైతు ఆళ్ల జగదీష్‌రెడ్డి 2018లో పెట్టిన పోస్ట్‌కు సంబంధించి విజయవాడ క్రైమ్‌ సిటీ పోలీసులు ఇప్పుడు అరెస్ట్‌ చేశారు. ఇంట్లో సభ్యులకు కూడా చెప్పకుండా తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు వెళ్లి అడిగితే మేం తీసుకెళ్లలేదు.. మాకు సంబంధం లేదని చెప్పారు. ఇంట్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తే పోలీసులే దగ్గరుండి తీసుకెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇది అక్రమ అరెస్టు కాదా?

⇒ చిలకలూరిపేటకు చెందిన పెద్దింటి సుధారాణి ఎన్నికల తర్వాత అరాచకాలు భరించలేక కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఐదు నెలల తర్వాత ఆమెను కుటుంబ సభ్యులతో సహా హైదరాబాద్‌ నుంచి బలవంతంగా తీసుకొచ్చారు. పోలీస్‌ స్టేషన్లన్నీ తిప్పుతున్నారు. పిల్లలను తల్లికి దూరం చేశారు. ఎక్కడకు తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదు. నిన్న చిలకలూరిపేట పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న ఆమెను ఒంగోలు పోలీస్‌లు అరెస్ట్‌ చేశారు. ఇది అక్రమ నిర్భంధం కాదా?

⇒ తాడేపల్లిలో అయ్యప్పమాల ధరించిన నాని అనే సోషల్‌ యాక్టివిస్ట్‌ను మొదట వినుకొండ అని చెప్పి మార్కాపురం తరలించారు.
⇒ నందిగామ నియోజకవర్గం పెండ్యాలలో వాట్సప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ను అరెస్ట్‌ చేసి కొట్టారు. గ్రూపులో ఉన్న వాళ్లకు నోటీసులిచ్చారు. వీళ్లంతా ఒకే గ్రామానికి చెందినవారు. 

⇒ గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన వెంకట్రామిరెడ్డి హైదరాబాద్‌లో ఉంటారు. మాచర్లలో తన బావ ఇంటికి రావడంతో ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు అక్కడకు వెళ్లారు. వెంక్రటామిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన బావను అరెస్ట్‌ చేశారు. వి«ధి నిర్వహణలో ఆటంకం కలిగించారని కేసు పెట్టారు.

⇒ ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెంకు చెందిన సన్నీ అనే కార్యకర్తను తిరువూరు పోలీసులు ఉదయం తీసుకెళ్లి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. 36 గంటల పాటు భోజనం కూడా లేకుండా చేశారు. గ్రామంలోని పెద్దలు వెళ్తే విడుదల చేస్తామని చెప్పి మళ్లీ గంపలగూడెం పోలీస్‌ స్టేషన్‌లోనే పెట్టారు.

బాధితులకు తోడుగా న్యాయ పోరాటం
ప్రభుత్వం తరఫున అన్యాయంగా బాధలకు గురైన సోషల్‌ మీడియా కార్యకర్తలకు ప్రత్యేకంగా న్యాయ సహాయం అందించేందుకు ఫోన్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చాం. మీ తరఫున పోరాటం చేయడానికి వైఎస్సార్‌ సీపీ సిద్ధంగా ఉంది. సోషల్‌ మీడియా పరంగా మా మాజీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ సుధాకర్‌ అండగా ఉండి కోర్టులో పోరాటం చేస్తారు. పూర్తిగా ప్రైవేటు కంప్లైంట్లు వేసే కార్యక్రమంలో తోడుగా ఉంటారు. వైఎస్సార్‌ సీపీ ‘వియ్‌ స్టాండ్‌ ఫర్‌ ట్రూత్‌’ నినాదంతో ఎక్స్‌లో యాస్‌ ట్యాగ్‌తో ముందుకెళ్తోంది.     

జె.సుదర్శన్‌ రెడ్డి (సీనియర్‌ న్యాయవాది) 9440284455
కొమ్మూరి కనకారావు (మాజీ చైర్మన్, మాదిగ కార్పొరేషన్‌) 9963425526
దొడ్డా అంజిరెడ్డి (రాష్ట్ర సోషల్‌ మీడియా వింగ్‌ ఆర్గనైజింగ్‌ ప్రెసిడెంట్‌) 9912205535 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement