
సీఎం సతీమణి వైఎస్ భారతీరెడ్డి
పులివెందుల: ఎన్ని పా ర్టీలు ఏకమైనా, ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా రాష్ట్ర ప్రజలంతా వైఎస్ జగన్‌వైపే ఉన్నారని ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతీరెడ్డి చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఇస్లాంపురం, జెండామానువీధుల్లో ఆమె శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్ భారతీరెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమ సారథి అయిన వైఎస్ జగన్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకురావాలని.. ఆయనను ఆశీర్వదించాలని కోరారు. టీడీపీ మోసపూరిత హామీలతో మేనిఫెస్టో విడుదల చేసినా.. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. చంద్రబాబు కుయుక్తులను రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు.
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి సోదరీమణులు శ్వేత, తేజారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్‌లు వైఎస్ ప్రమీలమ్మ, రుక్మిణి, మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, చైర్మన్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment