ఇంతటి గొప్ప పాలన మళ్లీ కావాలన్నా.. సంక్షేమాభివృద్ధి కొనసాగాలన్నా..
ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి
వైఎస్సార్ జిల్లా బీటీపల్లెలో సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
చక్రాయపేట: ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిన మీ అందరివాడు సీఎం వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతమ్మ ప్రజలను కోరారు. ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, మండల ఇన్‌చార్జి వైఎస్ కొండారెడ్డితో కలసి సురభి గ్రామం బీటీపల్లెలో ఇంటింటి ప్రచారం, రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా భారతమ్మ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘వైఎస్ జగన్ ప్రభుత్వం ఎలాంటి బేధాలు లేకుండా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టనన్ని పథకాలను అమలు చేసి.. అందరినీ ఆ రి్థకంగా బలోపేతం చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. అమ్మ ఒడి, చేయూత, పింఛన్లు, ఆసరా, సున్నా వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన.. ఇలా దేశంలో ఎక్కడా లేని పథకాలను మన రాష్ట్రంలో అందించి ఆదర్శంగా నిలిచారు.
పేదల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఇంతటి గొప్ప పాలన మళ్లీ కావాలన్నా.. సంక్షేమాభివృద్ధి కొనసాగాలన్నా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వైఎస్ జగన్‌ను, అవి నాష్ రెడ్డిని గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించండి’ అని ప్రజలకు భారతమ్మ విజ్ఞప్తి చేశారు.
గడప గడపకూ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ..
ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీటీపల్లెలో గడప గడపకూ వెళ్లారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరిస్తూ మళ్లీ ప్యాన్ గుర్తుకు ఓట్లేయాలని కోరారు. లక్షుమమ్మ అనే వృద్ధురాలు తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పడంతో భారతమ్మ ధైర్యం చెప్పారు. పులివెందులలోని ఆస్పత్రిలో చూపించుకోవాలని సూచిస్తూ.. అక్కడి వైద్యుడికి లేఖ రాసి ఇచ్చారు.
అలాగే శారదమ్మ అనే మహిళ తన సమస్య చెప్పుకోగా.. న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రీ, కొడుకులు ఓబుళశెట్టి శ్రీరాములు, అయ్యప్ప ప్రసాద్‌ను భారతమ్మ ఆప్యాయంగా పలకరించారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. చెన్నకేశవులు అనే వృద్ధుడిని ‘ఆరోగ్యంగా ఉన్నావా తాతా’ అంటూ పలకరించారు. మందులు సకాలంలో వేసుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు.
అలాగే చిన్నారులను, విద్యార్థులను పలకరించిన భారతమ్మ.. బాగా చదువుకోవాలని చెప్పారు. మీ కోసం అమ్మ ఒడి, గోరుముద్ద, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని వివరించారు. కాగా, భారతమ్మతో సెల్ఫీలు దిగేందుకు యువతీయువకులు పోటీ పడగా.. మహిళలు హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో చక్రాయపేట, తొండూరు మండల ఇన్‌చార్జ్‌లు వైఎస్ కొండారెడ్డి, వైఎస్ మధురెడ్డిల సతీమణులు ధనలక్ష్మి, మాధవీలత, కొండారెడ్డి, సతీ‹Ùరెడ్డిల తనయులు రాహుల్‌రెడ్డి, రోహన్ నాగిరెడ్డి, ఎంపీపీ మాధవీ బాలకృష్ణ, జెడ్పీటీసీ శివప్రసాదరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు రామాంజనేయరెడ్డి, ప్రసాదరావు, సభాపతి నాయుడు, వెంకట సుబ్బయ్య, వేదమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment