నేడు భాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకోనున్న ముఖ్యమంత్రి
పులివెందుల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా పులివెందులకు చేరుకున్నారు. తన సతీమణి వైఎస్ భారతమ్మతో కలిసి సాయంత్రం 6.15 గంటలకు భాకరాపురంలోని స్వగృహానికి ఆయన చేరుకున్నారు.
అనంతరం స్థానిక నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు. సోమవారం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య భాకరాపురంలోని 138 పోలింగ్ బూత్‌లో వారు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం సీఎం జగన్ తాడేపల్లికి బయలుదేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment