
సాక్షి, తాడేపల్లి: 'సాక్షి' దినపత్రిక 'ఫ్యామిలీ' పేజీలో 100 వారాల పాటు ఏకధాటిగా సాగిన పాపులర్ ఇంటర్వ్యూల శీర్షిక 'డబుల్ ధమాకా' పుస్తకరూపంలో వెలువడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో 'డబుల్ ధమాకా' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దంపతులు, ఇతర ప్రముఖులు జర్నలిస్ట్ ఇందిర పరిమి ప్రయత్నాన్ని అభినందించారు.
సినిమా, సాహిత్యం, రాజకీయం, నృత్యం, సంగీతం, క్రీడలు, టీవీ, సమాజం.. ఇలా వివిధ రంగాలలోని ఇద్దరేసి ప్రముఖులను కూర్చోబెట్టి జర్నలిస్టు ఇందిర పరిమి చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూల సమాహారమే ఈ పుస్తకం. అప్పట్లో సంచలనం సృష్టించిన ఆ ఇంటర్వ్యూలను ఎమెస్కో పబ్లికేషన్స్ వారు పుస్తక రూపంలో ప్రచురించారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సతీమణి లక్ష్మీ సజ్జల, 'ఎమెస్కో' విజయ్ కుమార్, జర్నలిస్ట్ ఇందిరపరిమి, సీనియర్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment