double dhamaka
-
కమల్, ప్రభాస్, చరణ్ డబుల్ ధమాకా.. సమంత, ఎన్టీఆర్ ట్రీట్ కూడా ఉందా?
హీరోలు స్క్రీన్‌పై సింగిల్‌గా కనిపించినా అభిమానులు పండగ చేసుకుంటారు. ఇక డబుల్ రోల్స్‌లో కనబడితే పండగే పండగ. ఒకే సినిమాలో డ్యూయల్ రోల్ అంటే స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకానే. ఇలా ఫ్యాన్స్‌ను, ఆడియన్స్‌ను అలరించేందుకు రెండు పాత్రల్లో కనిపించే చిత్రాల్లో నటిస్తున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► కమల్‌హాసన్ కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ఇండియన్’ ఒకటి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సేనాపతిగా, ఆయన కొడుకు చంద్రబోస్‌గా రెండు పాత్రల్లో మెప్పించారు కమల్‌హాసన్. ప్రస్తుతం కమల్, శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కూడా కమల్ రెండు పాత్రలు చేస్తున్నట్లుగా తెలిసింది. ‘ఇండియన్’లో మాదిరిగానే ‘ఇండియన్ 2’లోనూ కమల్ తండ్రీకొడుకుగా కనిపించనున్నారని టాక్. ఈ సినిమా కథ స్వాతంత్య్రానికి పూర్వం ఉంటుందట. ► ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా నుంచి ప్రభాస్‌కు చెందిన రెండు లుక్స్ రిలీజయ్యాయి. దీంతో ‘సలార్’లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. ► శంకర్ దర్శకత్వంలోని ‘గేమ్ చేంజర్’ చిత్రంలో డబుల్ రోల్లో కనిపించనున్నారు హీరో రామ్‌చరణ్. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. ఐఏఎస్ ఆఫీసర్ల బ్యాక్‌డ్రాప్‌లో పొలిటికల్ టచ్ ఉన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ తండ్రీకొడుకుగా నటిస్తున్నారని తెలిసింది. 1920 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఓ రాజకీయ పార్టీ ప్రతినిధిగా, సమకాలీన పరిస్థితుల్లో ఐఏఎస్ ఆఫీసర్‌గా రామ్‌చరణ్ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ ఖబర్. అలాగే రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్ అన్నదమ్ముల పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ట్రీట్ ఉందా? అధికారిక ప్రకటన రాలేదు కానీ ఓ సినిమాలో ఎన్టీఆర్, ఒక హిందీ చిత్రంలో సమంత రెండు పాత్రల్లో కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. మరి.. ఈ ఇద్దరి నుంచి డబుల్ ట్రీట్ ఉందా? అనేది త్వరలో తెలుస్తుంది. ► దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం విడుదలైన ‘ఆంధ్రావాలా’ సినిమాలో తండ్రీకొడుకుగా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. మరోసారి తండ్రీకొడుకుగా ఎన్టీఆర్ డబుల్ రోల్ చేయనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లోనే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ► ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్‌తో హిందీ ఆడియన్స్‌లో క్రేజ్ దక్కించుకున్నారు సమంత. ఇప్పుడు ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారామె. ఇక సమంత నటించనున్న తొలి హిందీ చిత్రంపై ఇప్పటికే పలు వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా హిందీ హిట్ ‘స్త్రీ ’(2018) ఫేమ్ అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఓ హారర్ ఫిల్మ్ తెరకెక్కనుందని, ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్’ టైటిల్‌తో తెరపైకి వెళ్లనున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తారని టాక్. ఈ ఏడాది చివర్లో సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రంలో సమంత డ్యూయల్ రోల్ చేయనున్నారని సమాచారం. ఓ పాత్రలో సమంత ప్రేతాత్మగా కనిపిస్తారట. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. -
సీఎం జగన్ దంపతుల చేతుల మీదుగా 'డబుల్ ధమాకా'
సాక్షి, తాడేపల్లి: 'సాక్షి' దినపత్రిక 'ఫ్యామిలీ' పేజీలో 100 వారాల పాటు ఏకధాటిగా సాగిన పాపులర్ ఇంటర్వ్యూల శీర్షిక 'డబుల్ ధమాకా' పుస్తకరూపంలో వెలువడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో 'డబుల్ ధమాకా' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దంపతులు, ఇతర ప్రముఖులు జర్నలిస్ట్ ఇందిర పరిమి ప్రయత్నాన్ని అభినందించారు. సినిమా, సాహిత్యం, రాజకీయం, నృత్యం, సంగీతం, క్రీడలు, టీవీ, సమాజం.. ఇలా వివిధ రంగాలలోని ఇద్దరేసి ప్రముఖులను కూర్చోబెట్టి జర్నలిస్టు ఇందిర పరిమి చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూల సమాహారమే ఈ పుస్తకం. అప్పట్లో సంచలనం సృష్టించిన ఆ ఇంటర్వ్యూలను ఎమెస్కో పబ్లికేషన్స్ వారు పుస్తక రూపంలో ప్రచురించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సతీమణి లక్ష్మీ సజ్జల, 'ఎమెస్కో' విజయ్ కుమార్, జర్నలిస్ట్ ఇందిరపరిమి, సీనియర్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ, తదితరులు పాల్గొన్నారు. -
డబుల్ ధమాకా
‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అన్నది సామెత. అయితే కొందరు నటీనటులు మాత్రం ముందు రచ్చ గెలిచి తర్వాత ఇంట గెలుస్తుంటారు. ఈ కోవలోనే తాజాగా తెలుగమ్మాయి అమ్రిన్ ఖురేషి చేరారు. పక్కా హైదరాబాదీ అయిన అమ్రిన్ ఇప్పటివరకూ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ బాలీవుడ్లో మాత్రం ఒకేసారి రెండు సినిమాల్లో కథానాయికగా డబుల్ ధమాకా దక్కించుకున్నారు. ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సాజిద్ ఖురేషి కుమార్తె, రాయల్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అధినేత ఎమ్.ఐ. ఖురేషి మనవరాలు అమ్రిన్ ఖురేషి. తెలుగు సూపర్ హిట్స్ ‘జులాయి’, ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాల హిందీ రీమేక్స్‌లో ఆమె హీరోయిన్గా నటించనున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి హీరో కావడం మరో విశేషం. ‘బ్యాడ్ బాయ్’ టైటిల్‌తో ‘సినిమా చూపిస్త మావ’ని రాజ్‌కుమార్ సంతోషి తెరకెక్కిస్తున్నారు. సాజిద్ ఖురేషి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే వేసవిలో విడుదల కానుంది. ‘జులాయి’ రీమేక్‌కి టోనీ డిసౌజా దర్శకుడు. -
సూర్య @ డబుల్ ధమాకా
ఒకవైపు రొమాంటిక్, మరోవైపు రఫ్... ఇలా రెండు రకాల పోస్టర్లతో గురువారం అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చారు సూర్య. బర్త్ డే (జూలై 23) సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’లోని ‘కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఈ పాటలో సూర్య, అపర్ణా బాలమురళిల పోస్టర్ రొమాంటిక్‌గా ఉంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సమకూర్చిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, సింగర్ ధీ పాడారు. ఈ చిత్రానికి ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకురాలు. ఇక మరో లుక్ విషయానికొస్తే, సూర్య ఇటీవల సైన్ చేసిన ‘వాడీవాసల్’ అనే తమిళ సినిమా పోస్టర్ కూడా విడుదలైంది. ఇందులో సూర్య చాలా రఫ్‌గా కనిపించారు. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. -
జియో డబుల్ ధమాకా ఆఫర్
టెలికాం ప్రత్యర్థుల గుండెల్లో ఎప్పడికప్పుడూ రైళ్లు పరిగెత్తించే రిలయన్స్ జియో తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. కంపెనీ తన ప్రీపెయిడ్ యూజర్లకు కొత్తగా డబుల్ ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద అదనంగా తన యూజర్లకు 1.5 జీబీ డేటా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో ఈ ఆఫర్‌ను మంగళవారం ప్రకటించింది. ఎయిర్టెల్ ఇటీవలే తన రూ.149, రూ.399 ప్లాన్లపై అదనంగా 1 జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది. దీనికి కౌంటర్‌గా జియో తన ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లపై అదనంగా 1.5 జీబీ డేటా ఇవ్వనున్నట్టు పేర్కొంది. అయితే ఎయిర్టెల్ ఈ అదనపు డేటాను ఎంపిక చేసిన యూజర్లకు ఇస్తే, జియో తన యూజర్లందరికీ ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. నేటి నుంచి జూన్ 30 వరకు ఈ ఆఫర్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. డబుల్ ధమాకా ఆఫర్‌తో పాటు, ఈ ఆపరేటర్ కొత్తగా రూ.499 రీఛార్జ్ ప్యాక్‌ను కూడా 3 నెలల వాలిడిటీతో లాంచ్ చేసింది. ఈ కొత్త ప్యాక్‌పై రోజుకు 3.5 జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది. కొత్త జియో డబుల్ ధమాకా ఆఫర్.. రోజుకు 1.5 జీబీ డేటా పొందే రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్యాక్ యూజర్లు ఇక నుంచి రోజుకు 3జీబీ డేటా పొందనున్నారు. రోజుకు 2 జీబీ డేటా పొందే రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్యాక్ యూజర్లకు ఇక నుంచి రోజుకు 3.5 జీబీ డేటా లభ్యం. రోజుకు 3 జీబీ డేటా పొందే రూ.299 ప్యాక్ యూజర్లు ఇక నుంచి రోజుకు 4.5 జీబీ డేటా పొందనున్నారు. రోజుకు 4 జీబీ డేటా పొందే రూ.509 ప్యాక్ యూజర్లకు ఇక నుంచి రోజుకు 5.5 జీబీ డేటా లభ్యం. రోజుకు 5 జీబీ డేటా పొందే రూ.799 ప్యాక్ యూజర్లు ఇక నుంచి రోజుకు 6.5 జీబీ డేటా పొందనున్నారు. దీంతో పాటు 300 రూపాయలు, ఆపై మొత్తాల అన్ని రీఛార్జ్‌లపై జియో 100 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ చేయనుంది. 300 రూపాయల కంటే తక్కువ మొత్తాల రీఛార్జ్‌లపై 20 శాతం తగ్గింపు ఇస్తోంది. అయితే ఈ డిస్కౌంట్ల కోసం మైజియో యాప్, పేటీఎం వాడుతూ ఫోన్‌పే వాలెట్ ద్వారానే రీఛార్జ్ చేయించుకోవాలి. పైన పేర్కొన్న ప్యాక్‌ల వాలిడిటీలను మాత్రం కంపెనీ మార్చలేదు. డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఉచిత ఎస్ఎంఎస్లు, జియో యాప్స్ యాక్సస్‌ను పొందవచ్చు. మరోవైపు తాజాగా తీసుకొచ్చిన రూ.499 రీఛార్జ్ ప్యాక్, 91 రోజుల వాలిడిటీలో అందుబాటులో ఉండనుంది. దీనిపై రోజుకు 3.5 జీబీ డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. మొత్తంగా ఈ ప్యాక్‌పై 318 జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. ఈ ఆపరేటర్ గతేడాది డిసెంబర్లో రూ.499 రీఛార్జ్ ప్యాక్‌ను లాంచ్ చేసింది కానీ ఆ అనంతరం ఈ ప్యాక్ ధరను రూ.449కు తగ్గించింది. -
గాయత్రి డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సబ్‌జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పుల్లెల గాయత్రి సత్తాచాటింది. కోయంబత్తూరులో జరిగిన ఈ టోర్నీలో అండర్-15 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి టైటిల్స్‌ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో గాయత్రి 20- 22, 21- 17, 21-11తో సామియా ఇమాద్ ఫరూఖీ (తెలంగాణ)పై విజయం సాధించింది. డబుల్స్ విభాగంలో గాయత్రి-సామియా ద్వయం 21- 13, 21-16తో త్రిష జోలీ-మెహరీన్ రిజా జంటను ఓడించి విజేతగా నిలిచింది. -
సైబర్ నేరగాళ్ల ‘డబుల్ ధమాకా’!
► లక్కీ డ్రా పేరుతో కొంత మొత్తం స్వాహా ► అది తిరిగి ఇస్తామంటూ మరికొంత కాజేత ► నిందితుడిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ కాప్స్ సాక్షి, సిటీబ్యూరో: ఈ–మెయిల్స్, ఎస్సెమ్మెస్, ఫోన్‌కాల్సే పెట్టుబడిగా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. లక్కీ డ్రాల పేరుతో కొందరు అందినకాడికి దండుకొని టోకరా వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి భిన్నంగా ‘డబుల్ ధమాకా’ ఇస్తున్నారు మరికొందరు సైబర్ క్రిమినల్స్. మొదట కొంత డబ్బు దండకోవడం, దాన్ని తిరిగి ఇస్తామంటూ మరికొంత కాజేస్తున్న ఘరానా నేరగాడిని సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి సోమవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సందీప్ సహోతా ఆ రాష్ట్రంలోని వైశాలి ప్రాంతంలో స్థిరపడ్డాడు. పెరల్ పార్క్ సమీపంలో సాండ్స్ ఇన్ఫోసిస్టమ్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి కొత్త మోసానికి తెరలేపాడు. ‘లక్కీ’లోనూ వెరైటీ... వివిధ మార్గాల్లో సెల్‌ఫోన్ వినియోగదారుల డేటా సేకరించే ఇతగాడు లక్కీ డ్రా పేరుతో ఫోన్లు చేస్తుంటాడు. సాధారణంగా ఈ తరహాలో ఫోన్లు చేసే నేరగాళ్లు లక్కీ డ్రా తలిగిలిందని, దాన్ని పొండానికి పన్నులు చెల్లించాలని చెప్పి కాజేస్తుంటారు. అయితే సందీప్ రూటే సెపరేటు. వినియోగదారులకు ఫోన్ చేసి ఆన్లైన్లో సాండ్స్ షాపింగ్ హబ్.కామ్ పేరుతో వెబ్సైట్ నిర్వహిస్తున్నామని చెప్తాడు. లక్కీ డ్రాలో మీ నెంబర్ ఎంపికైందంటూనే... ఎలాంటి పన్నుల మాట ఎత్తడు. ‘లక్కీ’ అయిన నేపథ్యంలో మా వెబ్సైట్లో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువుల్ని 60 నుంచి 70 శాతం డిస్కౌంట్‌కు ఇస్తామంటాడు. ఎలాంటి వడ్డీ లేకుండా నెలసరి వాయిదాలకూ అవకాశం అంటూ నమ్మబలుకుతాడు. దీంతో కొందరు వినియోగదాడులు అతడి బుట్టలో పడతారు. సందీప్ ఇదే పంథాలో దేశ వ్యాప్తంగా మోసాలు చేస్తున్నాడు. రెండు దఫాల్లో అందినంత... నగరంలోని బేగంబజార్ ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర తివారీకి కాల్ చేసిన సందీప్ ఇదే పంథాలో ఎర వేశాడు. తివారీ ఆసక్తి చూపడంతో డెబిట్‌కార్డ్ వివరాలు తెలపాలని కోరి రూ.13,999 అప్పటికప్పుడే కాజేశాడు. కొద్దిసేపటికి మళ్లీ కాల్ చేసిన సందీప్... మొదటి బుకింగ్ రద్దు చేసి, నగదు తిరిగి జమ చేస్తామన్నాడు. దీనికోసం మీ సెల్ ఫోన్‌కు వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ చెప్పాలనడంతో ఆయన అలానే చేశారు. దీంతో రెండోసారి ఏకంగా రూ.54,996 కాజేశాడు. మోసపోయినట్లు గుర్తించిన తివారీ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు చేసి నిందితుడు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. ఇతడి నుంచి రూ.1.5 లక్షల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. సందీప్‌ను పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. -
నేను...శైలజ దర్శకునికి డబుల్ ధమాకా
హీరో రామ్‌తో ‘నేను...శైలజ’ అంటూ అందమైన ప్రేమకథను తెరకెక్కించి, ఆ చిత్రవిజయంతో ఒక్కసారిగా అందరి దృష్టీ తన మీద పడేలా చేసుకోగలిగారు దర్శకుడు కిశోర్ తిరుమల. ఫలితంగా ఆయన్ను పలు అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం రెండు చిత్రాలు అంగీకరించారు కిశోర్. అగ్ర హీరో వెంకటేశ్‌తో ఓ సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. మల్టీ డెమైన్షన్ రామ్మోహన్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. కిశోర్ తిరుమల మాట్లాడుతూ- ‘‘వెంకటేశ్‌గారికి కథ చెప్పాను. ఆయనకు నచ్చింది. స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాను. ఆయన శైలిలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది’’ అని తెలిపారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వెంకీ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత కిశోర్ తిరుమలతో చేసే సినిమా ఆరంభమయ్యే అవకాశం ఉంది. నితిన్‌తో సినిమా! ఒకవైపు సీనియర్ హీరో చిత్రానికి అవకాశం దక్కించుకున్న కిశోర్ మరోవైపు యువహీరో నితిన్‌తో ఓ చిత్రం తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని నితిన్ తన ట్విటర్లో పేర్కొన్నారు. వెంకీతో సినిమా పూర్తయ్యాక నితిన్ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని ఊహించవచ్చు. -
ఉద్యోగులకు డబుల్ ధమాకా..!
*43 శాతం ఫిట్మెంట్తో రెట్టింపు కానున్న మూలవేతనం *మొత్తం ఆర్థిక భారం రూ. 6,500 కోట్లు * ప్రస్తుత మధ్యంతర భృతి రూ. 4,081 కోట్లు *అదనంగా వెచ్చించాల్సిన మొత్తం రూ. 2,419 కోట్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇచ్చిన మొదటి పీఆర్సీతో రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు అందే జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. దాదాపు అన్ని కేటగిరీల్లో మూల వేతనం రెట్టింపు కానుంది. 9వ పీఆర్సీ 2009 సంవత్సరంలో 27 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రతిపాదించగా... అప్పటి ప్రభుత్వం 2010లో 39% ఫిట్మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం పదో పీఆర్సీ (తెలంగాణలో మొదటిది) 29% ఫిట్‌మెంట్‌ను ప్రతిపాదించగా... ప్రభుత్వం 43% ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనితో ప్రభుత్వంపై రూ. 6,500 కోట్లు భారం పడుతుందని ఆర్థికశాఖ అంచనా. ఇదే పీఆర్సీ సూచించినట్లుగా 29% ఇస్తే పడే భారం రూ. 4,383 కోట్లే. కానీ ప్రభుత్వం మాత్రం 43% ఫిట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే 9వ పీఆర్సీ కాలం 2013 జూన్ 30తో ముగిసిన నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 27% మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రకటించింది. ఇందుకు ఆర్థిక శాఖ ఇప్పటికే ఏటా రూ. 4,081 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ఐఆర్ (27%)కు అదనంగా 16% పెంచడం ద్వారా... ఇప్పుడు ప్రభుత్వంపై అదనంగా రూ. 2,419 కోట్ల భారం పడనుంది. 2013 జూలై 1 వరకు డీఏ కొత్త వేతనంలో విలీనం.. కొత్త పీఆర్సీని 2014 జూన్ 2వ తేదీ నుంచి నగదు రూపంలో వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో... 2013 జూలై 1 నుంచి 2014 జూన్ 1 వరకు ఇచ్చిన ఐఆర్ 2014 జూన్ 2 తరువాత రద్దవుతుంది. అలాగే 2013 జూలై 1 వరకు ఉన్న కరువు భత్యం (డీఏ) 63.344 శాతం కూడా కొత్త వేతనంలో విలీనం అవుతుంది. ప్రస్తుతం ఉద్యోగులకు 77.896 శాతం డీఏ వస్తోంది. ఇందులోనుంచి 2013 జూలై 1 వరకున్న డీఏ 63.344 శాతాన్ని తీసేస్తే.. 14.552 శాతం డీఏ మిగులుతుంది. అయితే కేంద్రం జారీ చేసిన డీఏ సూత్రం ప్రకారం కేంద్రం ఒక శాతం డీఏ ఇస్తే రాష్ట్రంలో 0.524 శాతం ఇస్తారు. ఈ లెక్కన రాష్ట్ర ఉద్యోగుల వేతనంలో ఇకపై 8.908 శాతం డీఏ మాత్రమే కలుస్తుంది. ఫిట్మెంట్ అంటే.. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరల పెరుగుదల సూచీని వెల్లడిస్తుంటుంది. దాని ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు మూల వేతనంలో ఇచ్చే పెంపునే ఫిట్మెంట్ అంటారు. ఈ సూచీల ఆధారంగా కేంద్రం పదేళ్లకోసారి వేతన స్థిరీకరణ చేస్తుండగా... రాష్ట్రం ఐదేళ్లకోసారి వేతన స్థిరీకరణ చేస్తోంది. ఇందులో ఒక ఉద్యోగి ప్రస్తుతం పొందుతున్న మూల వేతనానికి... పీఆర్సీ అమలు చేయాల్సిన సమయంలో ఉన్న డీఏను+ప్రభుత్వం ఇవ్వదలచుకున్న ఫిట్‌మెంట్‌ను కలిపి కొత్త మూలవేతనాన్ని నిర్ధారిస్తారు. ఉదాహరణకు ఒక సీనియర్ లెక్చరర్ ప్రస్తుత మూలవేతనం రూ. 25,600గా ఉంది. ఆయనకు 2013 జూలై 1 నాటికి ఉన్న 63.344% డీఏ అంటే రూ. 16,216+ ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న 43% ఫిట్మెంట్ అంటే రూ. 11,008 కలిపి... మొత్తంగా (25,600+16,216+11,008) రూ. 52,824 మూలవేతనంగా నిర్ణయిస్తారు. ఈ లెక్కన ఆ లెక్చరర్ మాస్టర్ స్కేల్లో ఉన్న 82 దశల్లోని రూ. 53,950 మూల వేతనంలో (పై దశలో) ఉంటారు. ఇక దీనిపై పీఆర్సీ అమల్లోకి వచ్చే నాటికి మిగిలిన డీఏ (8.908%) +హెచ్ఆర్ఏ+సీసీఏ వంటి ఇతర అలవెన్సులు కలిపి పూర్తి వేతనాన్ని నిర్ధారిస్తారు. -
డబల్ ధమాకా
-
డబుల్ ధమాకా.
-
ఢబుల్ ధమాకా
-
ఈసీడీజీ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: ఎమర్జింగ్ ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్లో నగరానికి చెందిన ఈసీడీజీ జట్లు డబుల్ ధమాకా సాధించాయి. చెన్నైలో జరిగిన ఈ టోర్నీలో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో టైటిల్స్ సాధించాయి. సీనియర్స్ ఫైనల్లో ఎమర్జింగ్ క్రికెట్ డెవలప్మెంట్ గ్రూప్ (ఈసీడీజీ) జట్టు 4 వికెట్ల తేడాతో కేదార్ అకాడమీపై గెలుపొందింది. మొదట కేదార్ అకాడమీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఈసీడీజీ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నౌమాన్ (64), జగదీశ్ రెడ్డి (53) అర్ధసెంచరీలు చేశారు. యూసుఫ్ 47 పరుగులు చేయగా, కేదార్ బౌలర్ దినేశ్ 4 వికెట్లు తీశాడు. జూనియర్స్ ఫైనల్లో ఈసీడీజీ జట్టు 5 వికెట్ల తేడాతో ఆసియాటిక్ సీఏ విజయం సాధించింది.