సాక్షి, హైదరాబాద్: ఎమర్జింగ్ ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో నగరానికి చెందిన ఈసీడీజీ జట్లు డబుల్ ధమాకా సాధించాయి. చెన్నైలో జరిగిన ఈ టోర్నీలో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో టైటిల్స్ సాధించాయి. సీనియర్స్ ఫైనల్లో ఎమర్జింగ్ క్రికెట్ డెవలప్‌మెంట్ గ్రూప్ (ఈసీడీజీ) జట్టు 4 వికెట్ల తేడాతో కేదార్ అకాడమీపై గెలుపొందింది.
మొదట కేదార్ అకాడమీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఈసీడీజీ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నౌమాన్ (64), జగదీశ్ రెడ్డి (53) అర్ధసెంచరీలు చేశారు. యూసుఫ్ 47 పరుగులు చేయగా, కేదార్ బౌలర్ దినేశ్ 4 వికెట్లు తీశాడు. జూనియర్స్ ఫైనల్లో ఈసీడీజీ జట్టు 5 వికెట్ల తేడాతో ఆసియాటిక్ సీఏ విజయం సాధించింది.
ఈసీడీజీ డబుల్ ధమాకా
Published Thu, Jan 16 2014 12:15 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement