నేను...శైలజ దర్శకునికి డబుల్ ధమాకా | Big Hero Confirmed for Sailaja Director | Sakshi
Sakshi News home page

నేను...శైలజ దర్శకునికి డబుల్ ధమాకా

Published Sun, Feb 7 2016 10:22 PM | Last Updated on Thu, Sep 27 2018 8:48 PM

నేను...శైలజ దర్శకునికి డబుల్ ధమాకా - Sakshi

నేను...శైలజ దర్శకునికి డబుల్ ధమాకా

హీరో రామ్‌తో ‘నేను...శైలజ’ అంటూ అందమైన ప్రేమకథను తెరకెక్కించి, ఆ చిత్రవిజయంతో ఒక్కసారిగా అందరి దృష్టీ తన మీద పడేలా చేసుకోగలిగారు దర్శకుడు కిశోర్ తిరుమల. ఫలితంగా ఆయన్ను పలు అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం రెండు చిత్రాలు అంగీకరించారు కిశోర్. అగ్ర హీరో వెంకటేశ్‌తో ఓ సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. మల్టీ డెమైన్షన్ రామ్మోహన్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. కిశోర్ తిరుమల మాట్లాడుతూ- ‘‘వెంకటేశ్‌గారికి కథ చెప్పాను. ఆయనకు నచ్చింది.

స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాను. ఆయన  శైలిలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది’’ అని తెలిపారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వెంకీ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత కిశోర్ తిరుమలతో చేసే సినిమా ఆరంభమయ్యే అవకాశం ఉంది.
 
నితిన్‌తో సినిమా!
ఒకవైపు సీనియర్ హీరో చిత్రానికి అవకాశం దక్కించుకున్న కిశోర్ మరోవైపు యువహీరో నితిన్‌తో ఓ చిత్రం తెరకెక్కించడానికి  సన్నాహాలు చేసుకుంటున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని నితిన్ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. వెంకీతో సినిమా పూర్తయ్యాక నితిన్ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని ఊహించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement