నితిన్ ప్లేస్‌లో...! | Nithin out of Puri Jagannadh's film | Sakshi
Sakshi News home page

నితిన్ ప్లేస్‌లో...!

Published Thu, Jun 11 2015 10:57 PM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

నితిన్ ప్లేస్‌లో...! - Sakshi

నితిన్ ప్లేస్‌లో...!

 ‘హార్ట్ ఎటాక్’తో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో నితిన్‌లది విజయవంతమైన కాంబినేషన్ అని నిరూపితమైంది. అందుకే, ఈ ఇద్దరూ మరో చిత్రం ప్రకటించగానే మళ్లీ ఓ సూపర్ హిట్ ఇచ్చేస్తారని చాలామంది అనుకున్నారు. మరో మూడు రోజుల్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, హఠాత్తుగా ఓ సంచలన వార్త బయటికొచ్చింది. ‘‘విస్మరించడానికి వీలు లేని కొన్ని పరిస్థితుల కారణంగా పూరీగారితో నా సినిమా లేదు.

 భవిష్యత్తులో ఆయనతో మళ్లీ సినిమా చేస్తాననే నమ్మకం ఉంది’’ అని నితిన్ ట్విట్టర్ ద్వారా అసలు విషయాన్ని బయటపెట్టారు. ఆ కాసేపటికి, ‘‘నితిన్‌తో చేయాలనుకున్న చిత్రాన్ని వేరే హీరోతో చేయనున్నా. ముందు ప్రకటించిన ప్రకారం ఈ 15నే షూటింగ్ ప్రారంభిస్తా’’ అని ట్విట్టర్ ద్వారానే పూరీ పేర్కొన్నారు. ఈ మార్పుకి కారణాలేంటి? అనేది పక్కన పెట్టి, ఈ చిత్రంలో నటించబోయే హీరో ఎవరు? అనే విషయానికొస్తే... వరుణ్ తేజ్ అని తెలిసింది. ఈ చిత్రాన్ని సి. కల్యాణ్ నిర్మిస్తారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement