నా సినిమా విజయం కంటే ఎక్కువ సంతోషపడ్డా | Varun Tej Speech About Bheesma Movie Success Meet | Sakshi
Sakshi News home page

నా సినిమా విజయం కంటే ఎక్కువ సంతోషపడ్డా

Published Mon, Mar 2 2020 12:24 AM | Last Updated on Mon, Mar 2 2020 12:24 AM

Varun Tej Speech About Bheesma Movie Success Meet - Sakshi

నాగవంశీ, వరుణ్‌ తేజ్, రష్మికా మందన్నా, నితిన్, వెంకీ కుడుముల

‘‘ఈ వేడుకకు అతిథిలా రాలేదు. నితిన్‌ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేయడానికి తన ఫ్రెండ్‌లా వచ్చాను. నా సినిమా సక్సెస్‌ అయితే ఎంత హ్యాపీగా ఫీల్‌ అవుతానో నితిన్‌ సక్సెస్‌ను ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్‌ అవుతున్నాను’’ అన్నారు వరుణ్‌ తేజ్‌. నితిన్, రష్మికా మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ను వైజాగ్‌లో నిర్వహించారు.

ఈ వేడుకకు హీరో వరుణ్‌ తేజ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో రెండో సినిమా కూడా హిట్‌ కొట్టడం కష్టమంటారు. వెంకీ పాసయ్యాడు. రష్మిక నటించిన సినిమాలన్నీ విజయం సాధిస్తున్నాయి. తనతో కలసి త్వరలోనే యాక్ట్‌ చేయాలనుంది. మణిశర్మగారి అబ్బాయి సాగర్‌ మహతి మంచి సాంగ్స్‌ ఇచ్చారు. నితిన్‌ నేను ఈ మధ్య మంచి ఫ్రెండ్స్‌ అయ్యాం. అతనితో ఈ స్నేహం కొనసాగాలనుకుంటున్నాను. సింగిల్‌ అని చెప్పి రిలీజ్‌ కంటే ముందే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. అందర్నీ మోసం చేశాడు’’అన్నారు.

నితిన్‌ మాట్లాడుతూ – ‘‘ఈ నిర్మాణసంస్థతో ‘అ ఆ’ చేశాను. పెద్ద హిట్‌ అయింది. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్‌ వచ్చింది. దీనికి కారణమైనన దర్శక–నిర్మాతలకు «థ్యాంక్స్‌. రష్మికతో నటన, డ్యాన్సులు నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌’’ అన్నారు. రష్మిక మాట్లాడుతూ – ‘‘భీష్మ’ మంచి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. నితిన్‌గారు, వెంకీ గారు అంటే నాకు చాలా ఇష్టం’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన నితిన్‌గారికి, నిర్మాత వంశీగారికి థ్యాంక్స్‌’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement